
ఒట్టావా: కెనడా నూతన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అనిత ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేరాలు ఇకపై కెనడా మంత్రులుగా కొనసాగారు. కెనడా పార్లమెంట్‌కు ఎన్నికైన అతి పిన్న వయస్సులైన మహిళల్లో కమల్ ఖేరా సైతం ఉన్నారు. 58 ఏళ్ల అనితా ఆనంద్‌కు ఆవిష్కరణలు, శాస్త్ర, వాణిజ్య శాఖలకు మంత్రిగా బాధ్యతలు కట్టబెట్టారు. 36 ఏళ్ల కమల్ ఖేరాను ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.
కాగా, ఢిల్లీలో పాఠశాల విద్యనభ్యసిస్తున్న కాలంలో కమల్ కుటుంబం కెనడాకు తరలిపోయారు. టొరంటోలో యార్క్ వర్సిటీలో కమల్ సైన్స్ డిగ్రీ సాధించారు. నర్సుగా, కమ్యూనిటీ వలంటీర్‌గా, రాజకీయ కార్యకర్తగా మొదలెట్టి చివరకు మంత్రిస్థాయికి కమల్ ఎదిగారు. నోవా స్కాటియాలో పుట్టిన అనిత 1985లో ఒంటారియోకు వలసవచ్చారు. లాయర్, పరిశోధకురాలు, అధ్యాపకురాలు అయిన అనిత 2019లో తొలిసారిగా ఎంపీ అయ్యారు. గతంలో ట్రెజరీ బోర్డ్ అధ్యక్షురాలిగా, రక్షణ మంత్రిగా, ప్రజాసేవలు, సేకరణ మంత్రిగా సేవలందించారు.
Diversity in leadership! Indo-Canadian Anita Anand and Delhi-born Kamal Khera have joined Canadian Prime Minister Mark Carney's cabinet. It is a proud moment for representation and inclusion in Canadian politics. 🇨🇦 #Canada #Cabinet #AnitaAnand #KamalKhera #MarkCarney pic.twitter.com/PU3KOU0WaW
— Dr. Prosenjit Nath (@prosenjitnth) March 15, 2025
Comments
Please login to add a commentAdd a comment