protest against
-
బాబు వచ్చాడు.. జాబ్ తీశాడు.. వెనక్కి నడిచి వాలంటీర్ల నిరసన
-
ఏపీ వ్యాప్తంగా వాలంటీర్ల నిరసన
-
ఆరు రోజుల ఆందోళనలకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ
-
70 వేల మంది విద్యార్థులపై బహిష్కరణ
టోరంటో: కెనడాలో వలసలపై పరిమితి విధించడమే లక్ష్యంగా ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పులు విదేశీ విద్యార్థులోగుబులు రేపుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి 70 వేల మంది విదేశీ విద్యార్థులు కెనడాను వదిలేసి వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారంతా ఆందోళన బాటపట్టారు. తమను బయటకు వెళ్లగొట్టడం సమంజసం కాదంటూ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం వైఖరి మార్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థులు శిబిరాలు ఏర్పాటు చేసుకొని, నిరసన దీక్షలకు దిగుతున్నారు. ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్, ఒంటారియో, మనిటోబా, బ్రిటిష్ కొలంబియా తదితర ప్రావిన్స్‌ల్లో దీక్షలు, ర్యాలీలు జరుగుతున్నాయి. కెనడాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో సింహభాగం భారతీయులే ఉన్నారు. కొత్త జీవితం నిర్మించుకోవాలని ఎన్నో ఆశలతో కెనడాలో అడుగుపెట్టిన వీరంతా ఇప్పుడు దినదినగండంగా బతుకున్నారు.స్పందన శూన్యం స్టడీ పర్మిట్లు, వర్క్ పర్మిట్ల సంఖ్యను భారీగా కుదించాలని, పర్మనెంట్ రెసిడెన్సీ నామినేషన్లను కనీసం 25 శాతం తగ్గించాలని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ విధానాల్లో ఈమేరకు ఇటీవలే మార్పులు చేసింది. 70 వేల మంది విదేశీ విద్యార్థుల వర్క్ పర్మిట్ల గడువు ఈ ఏడాది ఆఖరు నాటికి ముగిసిపోతుంది. వాటిని పొడిగించే అవకాశం కనిపించడం లేదు. దాంతో వారంతా బయటకు వెళ్లక తప్పదు. దాంతో దేశవ్యాప్తంగా విదేశీ విద్యార్థులు ఆందోళన ప్రారంభించారు. వర్క్ పర్మిట్ల గడువు పెంచాలని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. దీనిపై మాట్లాడడానికి ప్రభుత్వ అధికారులు ఇష్టపడడం లేదు.ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ శాసనసభ భవనం ఎదుట గత మూడు నెలలుగా ఆందోళనలు, ర్యాలీలు జరుగుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. విదేశీ కార్మికులపైనా పరిమితి విదేశాల నుంచి విద్యార్థులు భారీగా వచ్చిపడుతుండడంతో కెనడాలో మౌలిక సదుపాయాలపై ఒత్తిడి పెరుగుతోంది. హౌసింగ్, ఆరోగ్య సంరక్షణతోపాటు ఇతర సేవలు అందరికీ అందడం లేదు. అందుబాటులో ఉన్న వనరులు సరిపోని పరిస్థితి. అందుకే విదేశాల నుంచి వలసల తగ్గింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా విద్యార్థుల రాకను చట్టబద్ధంగానే అడ్డుకుంటోంది.రాబోయే రెండేళ్లపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ పర్మిట్ అప్లికేషన్లను పరిమితంగానే జారీ చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది కేవలం 3.60 లక్షల స్టడీ పర్మిట్లకు అనుమతి ఇవ్వనున్నట్లు అంచనా. గత ఏడాది కంటే ఇది 35 శాతం తక్కువ కావడం గమనార్హం. పోస్టుగ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ల కోసం విదేశీ విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోవద్దని కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ సూచించారు. తక్కువ వేతనాలకు తాత్కాలికంగా పనిచేసుకోవడానికి వచ్చే విదేశీ కార్మికుల సంఖ్యపై పరిమితి విధించబోతున్నట్లు కెనడా ప్రధానమంత్రి కెనడా జస్టిన్ ట్రూడో సోమవారం వెల్లడించారు. -
బొగ్గు గనుల వేలంను వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
-
జనసేనకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
-
ఈనాడు కథనాలను ఖండిస్తూ వాలంటీర్లు ధర్నా
-
విద్యాశాఖ మంత్రి సబితకు నిరసన సెగ
-
బాబుకు నిరసన సెగ..
-
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత
-
ఎస్ఐ కాలర్ పట్టుకున్నరేణుకా చౌదరి
-
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
ఖైరతాబాద్ లో కాంగ్రెస్ భారీ నిరసన
-
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్లు ఇవి
-
‘మనూ’కు పాకిన పౌరసత్వం సెగ!
రాయదుర్గం: ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) సెగ హైదరాబాద్‌కూ తాకింది. మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయంలో ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు సాగాయి. విద్యార్థులు క్యాంపస్‌లో బైఠాయించి ఆదివారం అర్ధరాత్రి నుంచి కొనసాగిస్తున్నారు. కేంద్రప్రభుత్వానికి, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మెయిన్ గేటు వద్ద బైఠాయించారు. సోమవారం ఉదయం క్యాంపస్‌లో విధులు నిర్వహించేందుకు ఉదయం 10 గంటలకు వచ్చిన ప్రొఫెసర్లు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బందిని విద్యార్థులు అడ్డుకున్నారు. గేటు తాళం వేసి ఎవరినీ లోపలికి రానివ్వలేదు. అలా మధ్యాహ్నం వరకు సిబ్బంది బయటే వేచి చూడాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు విశ్వవిద్యాలయం వద్ద భారీగా మోహరించారు. కాగా, ఉర్దూ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. సీఏఏ ఉపసంహరించాలి కేంద్ర ప్రభుత్వం వెంటనే సీఏఏను ఉçపసంహరించుకోవాలని ‘మనూ’విద్యార్థి సంఘం అధ్యక్షుడు ఉమర్‌ఫారూఖ్ డిమాండ్ చేశారు. త్వరలో తీసుకురావాలని అనుకుంటున్న ఎన్ఆర్సీ బిల్లు ఆలోచన కూడా విరమించుకోవాలని పేర్కొన్నారు. ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, అలీగఢ్ ముస్లిం వర్సిటీల్లో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్య కాండను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాటం శాంతియుతంగా కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. -
హోరెత్తిన ధర్నాలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలతో హోరెత్తించారు. కుటుంబ సభ్యులతో కలసి డిపోల ఎదుట ధర్నాలు చేపట్టారు. చర్చ లు జరుగుతాయన్న సమాచారం ఉన్నా సమ్మె మాత్రం ఉధృతంగా కొనసాగింది. ఈనెల 30న సరూర్‌నగర్‌లో సకల జనుల సమరభేరి పేరుతో భారీ ఎత్తున సభ నిర్వహించాలని నిర్ణయించినందున అందుకు జనసమీకరణ కసరత్తు కూడా ప్రారంభించారు. సమ్మెలో ఉన్న కార్మికులు కుటుంబసభ్యులతో కలసి ఆ సభకు హాజరు కావాలంటూ ఎవరికివారు ప్రచారం చేస్తున్నారు. స్థానిక విపక్ష నేతలను కలిసి ఆయా పార్టీల కార్యకర్తలు, సాధారణ జనం కూడా సభకు తరలాలని కోరుతున్నారు. ఆదివారం దీపావళి పండుగ కావ టంతో సొంతూళ్లకు వెళ్లేవారితో శనివారం బస్టాండ్లు కిటకిటలాడాయి. తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పినా అవి సరి పోక జనం ఇబ్బంది పడాల్సి వచ్చింది. పండుగకు బస్సు కష్టాలు.. దసరా వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నానా తిప్పలు పడ్డ అనుభవంతో కొందరు ప్రయాణాలు మానుకోవటం విశేషం. పండగ రద్దీ నేపథ్యంలో గత 20 రోజుల్లో తొలిసారి శనివారం 75% బస్సులు తిప్పినట్టు అధికారులంటున్నారు. మొత్తం బస్సులు తిప్పినా పండుగ రద్దీ తాకిడికి సరిపోని పరిస్థితి. అలాంటిది ఉన్న బస్సు ల్లో 75% తిప్పటంతో ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ప్రైవేటు వాహనాలకు గిరాకీ పెరిగింది. అధిక చార్జీలు వసూలు చేయటంతో వారి జేబులకు చిల్లు్ల పడింది. దసరా సమయంలో ప్రైవేటు బస్సులు వచ్చినట్టుగానే శనివారం కూడా చాలా బస్టాండ్లలో వీటి హవా కనిపించింది. మెదక్‌లో ఆర్టీసీ కార్మికులు కొందరు హోటళ్లలో పని చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. హుస్నాబాద్, జహీరాబాద్ డిపోల ముందు ధర్నాలు చేశారు. మెదక్ డిపో ఎదుట మహిళా కండక్టర్లు పెద్ద సంఖ్యలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అరగుండు..అరమీసం.. ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల ఎదుట కార్మికులు పిల్లలతో కలిసి ధర్నాలు చేపట్టారు. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ వారు చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం బస్ డిపో వద్ద కార్మికుల నిరసనకు సంఘీభావంగా అఖిలపక్ష నేతలు చెవిలో పూలతో పాల్గొన్నారు. కార్మి కులకు మద్దతుగా వామపక్ష విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. మెట్పల్లి డిపో వద్ద సమ్మయ్య, జేఆర్‌రావు అనే డ్రైవర్లు అరగుండు, అరమీసంతో నిరసన చేపట్టారు. గోదావరి ఖని డిపో వద్ద నిరసనలు చేపట్టారు.మంథనిలో కార్మికుల కుటుం బీకుల నిరసనలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.శనివారం 4782 ఆర్టీసీ బస్సులు, 1944 అద్దె బస్సులు మొత్తం 6,726 బస్సులు తిప్పినట్టు అధికారులు ప్రకటించారు. 4,782 ప్రైవేటు డ్రైవర్లు, 6,726 మంది కండక్టర్లు విధుల్లో ఉన్నట్టు వెల్లడించారు. 4,961 బస్సుల్లో టికెట్ జారీ యంత్రాలు, 939 బస్సుల్లో సాధార ణంగా టికెట్ల జారీ జరిగిందన్నారు. బస్సుల కోసం 22 వేల దరఖాస్తులు తాజాగా అద్దె బస్సుల కోసం పిలిచిన టెండర్లకు అనూహ్య స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,248 బస్సుల కోసం టెండర్లు పిలిచారు. టెండరు పత్రాల దాఖలు శనివారం సాయంత్రం వరకు సాగింది. 22,300 దరఖాస్తులు రావటం విశేషం. హైదరాబాద్‌లో 248 బస్సులకు టెండర్లు పిలవగా 332 దరఖాస్తులు అందాయి. జిల్లాల్లో వేయి బస్సులకు గాను 22 వేల దరఖాస్తులు వచ్చాయి. వారం క్రితం వేయి బస్సులకు టెండర్లు పిలవగా జిల్లాల్లో 9,700 దరఖాస్తులు రాగా హైదరాబాద్‌లో మాత్రం 18 వచ్చాయి. వచ్చిన దరఖాస్తుల్లో బస్సులు సిద్ధంగా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తూ అనుమతి ఇవ్వనున్నారు. ఆ తర్వాత 48 గంటల్లోనే బస్సు నడుపుకొనేందుకు అనుమతిస్తారు. కానీ రెడీగా బస్సులు ఉన్న టెండర్లు 90 మాత్రమే అందినట్టు తెలిసింది. బస్సులు లేని వారిని లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఎంపికైనవారు 90 రోజుల్లో బస్సులు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. -
అమరావతిలో హైకోర్టు ఏర్పాటుపై నిరసన
లీగల్ (కడప అర్బన్) : రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్ ఒప్పందానికి శాశ్వత సమాధి కడుతూ చివరికి హైకోర్టును కూడా అమరావతిలో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ రాయలసీమ న్యాయవాద జేఏసీ, స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు ఎదురుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరసనకారులు నల్లబ్యాడ్జీలు, నల్లజెండాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయలసీమ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మస్తాన్‌వలి, స్టూడెంట్స్ ఫోరం కన్వీనర్ డాక్టర్ మల్లెల భాస్కర్, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పి.సుబ్రమణ్యంలు మాట్లాడుతూ చరిత్రలో రాయలసీమకు ఎలాంటి ద్రోహం జరిగిందో అలాగే అన్యాయాలు కూడా జరిగాయన్నారు. ఇందుకు నిదర్శనం రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన హైకోర్టును అమరావతికి పోవడమేనన్నారు. సీమ న్యాయవాదులు, విద్యార్థులు, యువకులు చేసిన పోరాటం అనాథ పోరాటంలా రాజకీయ పార్టీలు చూశాయే తప్ప పరిపాలన వికేంద్రీకరణలో భాగమైన డిమాండులాగా చూడలేదన్నారు. సీమ చరిత్రలోనే ఇదొక చీకటిరోజని, చరిత్రలో రాయలసీమ హక్కుల పత్రమైన శ్రీబాగ్కు సమాధి కట్టిన రోజుగా నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నియతృత్వంగా, అహంకార పూరితంగా తీసుకున్న ఈ నిర్ణయానికి బాధ్యవ వహించి తీరాల్సిందేనన్నారు. ప్రభుత్వ చర్య సీమ ప్రజల ఆకాంక్షలను హేళన చేసేవిధంగా, అవమానపరిచే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి ఏ హక్కు లేని విధంగా ఉందన్నారు. ఇక్కడ హైకోర్టు ఏర్పాటు చేయడంలో రాజకీయ పార్టీలన్నీ కూడా ద్రోహం చేసి ఒట్టి కపట ప్రేమను మాత్రమే చూపాయని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. సీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని గత ఏడాది దాదాపు వంద రోజులపాటు న్యాయవాదులు విద్యార్థి ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎంత పోరాటం చేసినా దానిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కనీసం ఒక స్పష్టమైన ప్రకటన చేయకుండా ఏకపక్షంగా వ్యవహారించారన్నారు. అమరావతిలో ఇప్పుడు హైకోర్టు కూడా ఏర్పాటు చేయడాన్ని తామంతా బహిష్కరిస్తున్నామని, ఇది రాయలసీమ ప్రజల హక్కుల పత్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఇన్నిరోజులు కలిసి ఉండటానికి కారణమైన శ్రీబాగ్ ఒప్పం దాన్ని ప్రభుత్వ చర్యలు నేటితో కాలం చెల్లిందని, దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించి ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే గతంలో హైదరాబాదులాగానే ప్రస్తుతం అమరావతిలో కూడా రాజధాని విద్య, వైద్య సంస్థలు, పరిశోధన సంస్థలు కేంద్రీకరించడమే కాకుండా చివరికి కోర్టును కూడా అక్కడే ఏర్పాటు చేయడం ఏమిటని నిలదీశారు. కార్యక్రమంలో ఓటీడీఆర్ జిల్లా అధ్యక్షులు శివా రెడ్డి, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షులు రాజ గోపాల్‌రెడ్డి, హోమియపతి డాక్టర్ శ్రీనివాసులు, ఎరుకల హక్కుల పోరాటసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ద్రాక్షం శ్రీనివాస్, రాయలసీమ స్టూ డెంట్ ఫెడరేషన్ జిల్లా కన్వీనర్ జగదీష్, కార్తీక్, కేశవ, నిఖిల్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు. -
తూత్తుకూడి కాల్పుల్లో నిబంధనల ఉల్లంఘన
తూత్తుకూడి: తమిళనాడులోని తూత్తుకూడిలో వేదాంత స్టెర్లైట్ కాపర్ పరిశ్రమను మూసేయాలంటూ ఈ ఏడాది మే నెలలో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపి 13 మంది అమాయకులను పొట్టనబెట్టుకోవడం తెలిసిందే. చనిపోయిన 13 మందిలో 12 మందికి బుల్లెట్లు ఛాతీ లేదా అంతకన్నా పై భాగంలోనే తగిలాయనీ, సగం మంది శరీరాల్లోకి బుల్లెట్లు వెనుకవైపు నుంచి దూసుకెళ్లాయని పోస్ట్‌మార్టమ్ నివేదికలు తాజాగా స్పష్టం చేస్తున్నాయి. దీనిని బట్టి అక్కడి పోలీసులు నిబంధనలను ఎంత తీవ్రంగా ఉల్లంఘించారో తెలుస్తోంది. భారత్‌లో అమలులో ఉన్న నిబంధనల ప్రకారం నిరసనల్లో పరిస్థితి పూర్తిగా చేయిదాటినప్పుడు మాత్రమే భద్రతా దళాలు కాల్పులు జరిపేందుకు అనుమతి ఉంది. కాల్పులు జరిపినా వాటి లక్ష్యం ఆందోళనలను అణచివేయడమే తప్ప మనుషులను చంపడం అయ్యుండకూడదు. తల, ఛాతీ, గుండె భాగంలో బుల్లెట్ తగలకుండా శరీరంలో వీలైనంత కింద భాగంలో, గరిష్టంగా నడుము వరకు ఉన్న భాగంలో మాత్రమే కాల్చాలి. కానీ ఈ నిబంధనలను ఉల్లంఘించి, ఆందోళనకారుల ప్రాణాలు తీయడానికి అన్నట్లు ఈ ఏడాది మే నెలలో పోలీసులు కాల్పులు జరిపారు. చనిపోయిన వారిలో అత్యంత చిన్న వయస్కురాలు 17 ఏళ్ల బాలిక కాగా, బుల్లెట్ ఆమె తల వెనుక భాగంలో తగిలి నోటి నుంచి బటయకొచ్చిందని పోస్ట్‌మార్టంలో తేలింది. -
గాజా ఘర్షణల్లో 52 మంది మృతి
జెరూసలెం: తీవ్ర ఉద్రిక్తతలు, భారీ హింసాత్మక ఘటనల మధ్య ఇజ్రాయెల్‌లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని సోమవారం టెల్ అవీవ్ నుంచి జెరూసలెంకు మార్చారు. ఈ సందర్భంగా పాలస్తీనాలోని గాజా ప్రాంతంలో పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుంది. జెరూసలెంలో అమెరికా రాయబార కార్యాలయం ప్రారంభాన్ని వ్యతిరేకిస్తూ పాలస్తీయులు జరిపిన నిరసన ప్రదర్శనలు రక్తసిక్తమయ్యాయి. సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన వేలాది మందిపై ఇజ్రాయెల్ బలగాలు జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. 2014లో ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య గాజా యుద్ధం అనంతరం ఈ స్థాయిలో హింస చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. 2,400 మంది గాయపడ్డారని పాలస్తీనాకు చెందిన హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్ భయంకరమైన మారణహోమానికి పాల్పడిందని పాలస్తీనా అధ్యక్షుడు మహమద్ అబ్బాస్ ఆరోపించారు. సరిహద్దుల్లోని కంచెను దాటేందుకు పాలస్తీనా ఆందోళనకారులు టైర్లను తగులబెట్టి, సైనికులపై రాళ్ల వర్షం కురిపించారు. ఈ హింసకు హమాస్‌దే బాధ్యతని, ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడేలా ఆందోళనకారుల్ని రెచ్చగొడుతోందని ఆ దేశ భద్రతా బలగాలు చెప్పాయి. ఇజ్రాయెల్‌లో రాయబార కార్యాలయాన్ని మారుస్తానని గత డిసెంబర్లోనే ట్రంప్ ప్రకటించిన మేరకు జెరూసలెంలో యూఎస్ ఎంబసీ సోమవారం అధికారికంగా ప్రారంభమైంది. -
వివాస్పదంగా మారిన బాహుబలి -2 ప్రి రిలీజ్
-
వైఎస్సార్‌జిల్లాలో YSRCP రైతు ధర్నా
-
బెజవాడలో వైఎస్సార్సీపీ రైతు ధర్నా
-
పాకిస్థాన్ ఎగ్జిబిషన్ ఎదుట నిరసన
సాక్షి, న్యూఢిల్లీ:ప్రగతిమైదాన్‌లో జరుగుతోన్న పాకిస్థాన్ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్ వద్ద వీహెచ్‌పీ నిరసన ప్రదర్శన నిర్వహించింది.. ఓమ్ అని ముద్రించి ఉన్న కాషాయ రంగు జెండాలు ధరించిన సుమారు 300 మంది ఆందోళనకారులు ఎగ్జిబిషన్ వేదిక వద్ద పాకిస్థాన్ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనకారులు ఎవరో తమకు తెలియదని, పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని పోలీసులు వ్యాన్‌లో ఎక్కించి తీసుకెళ్లారని ప్రగతిమైదాన్ వద్దనున్న భద్రతా సిబ్బంది తెలిపారు. నిరసనకారులు ఎలాంటి విధ్వంసం జరపలేదని వారు చెప్పారు. ప్రగతిమైదాన్‌లో ఆలీషాన్ పాకిస్థాన్ పేరిట గురువారం లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనలో పాకిస్థాన్‌కు చెందిన 250 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఫిక్కీ, ట్రేడ్డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ కలిసి ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నాయి. పాకిస్థానీ ప్యాషన్, టైక్స్టైల్స్, జ్యూవెలరీ. యాక్ససరీస్, ఫర్నిచర్, తివాచీలు, గృహోపకరణాలు. వ్యవసాయోత్పత్తులు, ఆహారోత్పత్తులు, మార్బుల్, గ్రానైట్ ఉత్పత్తులతో నిండిన స్టాల్స్‌తో కూడిన ఈ ప్రదర్శన షాపర్లను ఆకట్టుకుంటోంది. ఎగ్జిబిషన్‌ను పురస్కరించుకుని ఆర్ట్ ఇన్ పాకిస్థాన్ టుడే పేరుతో కళాప్రదర్శనను కూడా ప్రగతిమైదాన్‌లో ఏర్పాటుచేశారు. దాంతో పాటు హోటల్ లలిత్‌లో పాకిస్థానీ ఫుడ్ వీక్‌ను కూడా నిర్వహిస్తున్నారు. 2012లో నిర్వహించిన పాకిస్థానీ లైఫ్‌స్టైల్ ఎగ్జిబిషన్‌కు విశేష స్పందన లభించినడంతో మరింత భారీ ఎత్తున ఆలీషాన్ పాకిస్థాన్ ప్రదర్శనను ఏర్పాటుచేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ‘నేను ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంటున్నా.. ఈ ఎగ్జిబిషన్లో కొన్ని అలంకరణ వస్తువులు కొనుక్కునేందుకు వచ్చాను.. ఉదయం 11 గంటలకే వచ్చాను.. అందువల్ల ఆందోళనకారులు నన్ను అడ్డుకోలేదు. అయినా ఇక్కడ ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడు మధ్యలో వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో.. ’ అంటూ మృదుల అనే విద్యార్థిని ప్రశ్నించింది. ఆమె గురువారం ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్న ఉపకరణాలను చూసేందుకు స్నేహితులతో పాటు వచ్చింది. వారం కిందట ఆలీషాన్ పాకిస్థాన్ ప్రదర్శనకు అనుమతి ఇవ్వవొద్దంటూ హిందూత్వ సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఇండియా, పాకిస్థాన్ దేశాల మధ్య వ్యాపార సంబంధాలను మెరుగుపరిచే దిశలోనే ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్ఐసీసీఐ), ట్రేడ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పాకిస్థాన్ సంయుక్త నిర్వహణలో ఈ ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటుచేశాయి. ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాల్సిందే.. ‘ఆలీషాన్ పాకిస్థాన్’ ఎగ్జిబిషన్‌ను వెంటనే నిలిపివేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 12.30 సమయంలో ప్రగతి మైదాన్ గేట్ నం.7 నుంచి లోపలికి దూసుకొచ్చిన ఆందోళనకారులు ఎగ్జిబిషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే ఎగ్జిబిషన్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రగతి మైదాన్‌లో పాకిస్థాన్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నాలుగు రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు పాకిస్థాన్ హై కమిషన్‌కు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం విదితమే. కాగా, ఈ అనుమతి ఇవ్వడం భారత ప్రభుత్వ తెలివితక్కువ తన మని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘పాకిస్థాన్ ఒక టైస్టు దేశం. మన దేశసమగ్రతకు ముప్పు వాటిల్లే విధంగా ఆ దేశం ముష్కరులను పెంచి పోషిస్తోంది.. భారత భూభాగంలో టైజానికి ఊతమిస్తూ, డబ్బు, ఆయుధాలు అందజేస్తూ పరోక్షంగా దేశంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోంది.. అటువంటి దేశానికి మనదేశంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు ఎలా అనుమతి ఇచ్చారు.. ఆ దేశ ఉత్పత్తులను మన దేశంలో అమ్మేందుకు మేం ఒప్పుకోం. దాన్ని అడ్డుకుని తీరుతాం.. మొదటిరోజు మా ఆందోళన విజయవంతమైంది.. దాన్ని మేం మిగిలాన నాలుగురోజులూ కొనసాగిస్తాం..’ అని ఒక ఆందోళనకారుడు చెప్పారు. కాగా, ఆందోళనకారులను పోలీసులు తిలక్‌మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి అనంతరం విడుదల చేశారు. మిగతా రోజుల్లో ఆందోళనకారులు ఎగ్జిబిషన్ వద్ద ఎటువంటి ఆందోళన చేపట్టకుండా చూసేందుకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా, భారీ వర్షం, ఆందోళనల నేపథ్యంలో ఎగ్జిబిషన్ మొదటి రోజు అంతగా స్పందన లభించలేదని పాకిస్థాన్ నుంచి వచ్చిన ఎగ్జిబిటర్ తారిఖ్ అన్వర్ తెలిపాడు. మిగిలిన రోజుల్లో ప్రజల నుంచి స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
నల్ల జెండాలతో వైగో నిరసన!
-
గ్యాస్ ధరల పెంపుపై నిరసన
చింతలపూడి, న్యూస్‌లైన్ : గ్యాస్ ధరల పెంపుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం స్థానిక బోసుబొమ్మ సెంటర్లో వైసీపీ నాయకులు వినూత్న నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మద్దాల రాజేష్ గ్యాస్ బండను నెత్తిన పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి వంటా వార్పు నిర్వహించారు. ఖాళీ గ్యాస్ బండలతో రాస్తారోకో చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గ్యాస్ ధరలను భారీగా పెంచి యూపీఏ ప్రభుత్వం ప్రజలకు నూతన సంవత్సర కానుక అందించిందని విమర్శించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటనలకు ఖర్చు చేస్తున్న కోట్లాది రూపాయలను ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాలని రాజేష్ డిమాండ్ చేశారు. మహానేత వైఎస్ హయాంలో కేంద్ర ప్రభుత్వం రూ.50 గ్యాస్ ధర పెంచితే ఆడపడుచులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని ఆ ధరను రాష్ట్ర ప్రభుత్వం భరించేలా వైఎస్ చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. సామాన్యులపై పెనుభారం మోపిన కాంగ్రెస్‌కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. కార్యక్రమంలో చింతలపూడి సర్పంచ్ మారిశెట్టి జగదీశ్వరరావు, సీతానగరం, యర్రంపల్లి సొసైటీ అధ్యక్షులు కాకర్ల నాగేశ్వరరావు, జంగా చెన్నకేశవరెడ్డి, యర్రంపల్లి సర్పంచ్ బత్తుల వెంకటేశ్వరరావు, జిల్లా కమిటీ సభ్యురాలు జె.జానకిరెడ్డి, పట్టణ వైసీపీ కన్వీనర్ గంధం చంటి, నాయకులు బలువూరి నరసింహరావు, మోటపోతుల శ్రీనివాసగౌడ్, జగ్గవరపు శ్రీహరిరెడ్డి, గోలి చంద్రశేఖర్‌రెడ్డి, తోటకుమార్, నాగిరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ వినూత్న నిరసన భీమవరం అర్బన్: గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ స్థానిక ప్రకాశంచౌక్‌లో గురువారం బీజేపీ నాయకులు గ్యాస్ బండలకు పూలమాలలు వేసి బండకో దండ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ఆధార్ సీడింగ్ చేయని గ్యాస్ కనెక్షన్లకు బండ ధరను అదనంగా రూ.200కు పైగా పెంచారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యున్నత న్యాయస్థానాలు ఆధార్ సీడింగ్‌ను సంక్షేమ పథకాలకు వర్తింపచేయవద్దని సూచించినా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. హాకర్స్ (పుట్‌పాత్ వ్యాపారస్తులు) వినియోగించే కమర్షియల్ సిలిండర్ ధరను కూడా పెంచివేయడం దారుణమన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గ్యాస్ సిలెండర్ ధర పెంపును విరమించుకోవాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పార్టీ పట్టణ కార్యదర్శి అడ్డగర్ల ప్రభాకర గాంధీ, మజ్దూర్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎల్ఎన్ శ్రీనివాస్, దొంగ వెంకటేశ్వరరావు, బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, మర్రి సాంబశివ, అందే త్రిమూర్తులు, కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు. తక్షణం గ్యాస్ ధరలను తగ్గించాలి ఆకివీడు : గ్యాస్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ స్థానిక జాతీయ రహదారిపై అయిభీమవరం మలుపు వద్ద గురువారం మధ్యాహ్నం జేఏసీ నాయకులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెంచిన వంట గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆధార్ కార్డు అ నుసంధానం చేసిన వారికి, చేయని వా రికి మధ్య ధర వ్యత్యాసాన్ని తొల గించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొట్టుముక్కల సత్యనారాయణరాజు, కె.రామకృష్ణం రాజు, వినియోగదారుల ఉద్యమకర్త బొబ్బిలి బంగారయ్య, అల్లూరి సత్యనారాయణరాజు, సర్పంచ్ గొంట్లా గణపతి, ఉప సర్పంచ్ హుస్సేన్, బీహెచ్ తిమ్మరాజు, ఇ.సత్యనారాయణ పాల్గొన్నారు. -
అఖిలేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం
న్యూఢిల్లీ: ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులను శిబిరాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ మానవహక్కుల కార్యకర్తలు గురువారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హద్దులను దాటింది. రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకొని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులపట్ల మొండిగా ప్రవర్తించింది. అఖిలేశ్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా వ్యవహరించింద’ని జేటీఎస్ఏ ప్రతినిధి మనీశ్ సేథీ పేర్కొన్నారు. ‘ఇంత చల్లటి వాతావరణంలో బాధితులను శిబిరాల్లోని గుడారాల నుంచి ఎలా బయటకు పంపుతారు? ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమే’నని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయి, నీమ్ ఖేరీ, భోరా శిబిరాల్లోని గుడారాల నుంచి బాధితులను పోలీసులు బలవంతంగా పంపించివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపడంతో రాజధానిలోని యూపీ భవన్ ముందు జేటీఎస్ఏ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. బాధితుల కళ్లముందే గుడారాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అడ్డుకున్నవారిని చితకబాదారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులకు, అఖిలేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేశ్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు.‘శిబిరాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగానే వెళ్లిపోతున్నారని చెబుతున్న యూపీ సర్కార్ మాటలు పచ్చి అబద్ధమ’ని ఏఎన్హెచ్ఏడీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని, బాధితులకు రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ యూపీ గవర్నర్ బన్వరీలాల్ జోషికి వినతిపత్రం సమర్పించారు. శిబిరాల కూల్చివేతను వెంటనే నిలిపివేయాలని కోరారు.