న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు.
ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష‍్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు.
Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm
— Press Trust of India (@PTI_News) September 21, 2023
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్‌లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది.
కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది.
ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు..
Comments
Please login to add a commentAdd a comment