Indian media
-
ఐరాస వేదికగా ఖలిస్థానీ ప్రశ్నలకు ట్రూడో ఎడముఖం
న్యూయార్క్: ఐరాస వేదికగా ఇండియా-కెనడా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించడానికి జస్టిన్ ట్రూడో నిరాకరించారు. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ పాత్రపై ట్రూడో చేసిన ఆరోపణలపై పీటీఐ అడిగిన ప్రశ్నలను దాటవేశారు. జర్నలిస్టుల ప్రశ్నలకు స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి 78వ సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. వాతావరణ లక్ష్యాలు, ఉక్రెయిన్ అంశాలపై భద్రతా మండలిలో మాట్లాడారు. ఈ క్రమంలో రెండు సందర్భాల్లో ట్రూడోని పీటీఐ ప్రశ్నించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ట్రూడో చేసిన ఆరోపణలను ఇండియా ఖండించిన అంశంపై ప్రశ్నించారు. కానీ ఏ మాత్రం స్పందించకుండా ముందుకు వెళ్లిపోయారు. Visuals of Canadian PM Justin Trudeau at United Nations (UN) headquarters in New York, US. pic.twitter.com/itdbUnI2tm — Press Trust of India (@PTI_News) September 21, 2023 ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వం పాత్ర ఉందని జస్టిన్ ట్రూడో కెనడా పార్లమెంట్లో ఆరోపణలు చేశారు. భారత దౌత్య అధికారిని ఆ దేశం నుంచి బహిష్కరించారు. ఈ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది. నిరాధారమైన ఆరోపణలుగా పేర్కొంటూనే కెనడా దౌత్య అధికారిని ఇండియా కూడా బహిష్కరించింది. కెనడా, భారత్ మధ్య దౌత్య పరమైన సంబంధాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. కెనడా ప్రయాణికులకు ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ఆ దేశానికి వెళ్లదలచినవారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కెనడా వీసాలను కూడా రద్దు చేసింది. ఇదీ చదవండి: ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ పాత్రపై అనుమానాలు.. -
రూ.4 లక్షల కోట్లు: భవిష్యత్ అంతా ఎంటర్టైన్మెంటే!
న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే దేశీ మీడియా, వినోద (ఎంఈ) రంగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఏకంగా రూ. 4 లక్షల కోట్లకు చేరనుంది. అటు ప్రకటనకర్తలు, ఇటు వినియోగదారులు మీడియాపై చేసే వ్యయాలు ఇందుకు తోడ్పడనున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం వచ్చే నాలుగేళ్లలో ఎంఈ రంగం వార్షిక ప్రాతిపదికన 10.75 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 4,12,656 కోట్లకు చేరనుంది. ‘కరోనా వైరస్ మహమ్మారికి కూడా భారత మీడియా, వినోద రంగం దీటుగా ఎదురునిల్చింది‘ అని కన్సల్టెన్సీ పార్ట్నర్ రాజీబ్ బసు తెలిపారు. టెక్నాలజీ పురోగతి, ఇంటర్నెట్ మరింతగా అందుబాటులోకి వస్తుండటం తదితర అంశాలు.. ప్రజలు కంటెంట్‌ను వినియోగించే తీరుతెన్నులను ప్రభావితం చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానిక భాషల్లోని కంటెంట్‌కు మరింతగా డిమాండ్ ఉంటుందని, వ్యాపార విధానాలు సరికొత్తగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుందని వివరించారు. విభాగాలవారీగా చూస్తే.. మహమ్మారిపరమైన పరిస్థితులు నెలకొన్నప్పటికీ 2020లో టీవీ అడ్వర్టైజింగ్ రూ.35,015 కోట్లకు చేరింది. ఇది 7.6 శాతం మేర వృద్ధి చెందనుంది. 2025 నాటికి మొత్తం ఎంఈ రంగంలో సుమారు రూ.50,000 కోట్ల మేర దీని వాటా ఉండనుంది. ఇంటర్నెట్ మాధ్యమంలో ప్రకటనలు 2020-25 మధ్య 18.8 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. రూ.30,000 కోట్లకు చేరనున్నాయి. 2020లో రూ.7,331 కోట్లుగా ఉన్న మొబైల్ ఇంటర్నెట్ అడ్వర్టైజింగ్ విభాగం 25.4 శాతం వృద్ధి రేటుతో 2025 నాటికి రూ. 22,350 కోట్లకు చేరుతుంది. న్యూస్‌పేపర్, కన్జ్యూమర్ మ్యాగజైన్ విభాగం మాత్రం స్వల్పంగా 1.82 శాతం స్థాయిలో మాత్రమే వృద్ధి చెందనుంది. 2025 నాటికి రూ. 26,299 కోట్లకు చేరనుంది. మహమ్మారి నేపథ్యంలో 2020లో ప్రింట్ అడ్వర్టైజింగ్ ఆదాయాలు 12 శాతం, ప్రింట్ సర్క్యులేషన్ ఆదాయం 4 శాతం మేర తగ్గాయి. మహమ్మారి ధాటికి కుదేలైన బాక్సాఫీస్ ఆదాయాలు మళ్లీ కోలుకుని 2025 నాటికి 39.3 శాతం వార్షిక వృద్ధితో రూ.13,857 కోట్లకు చేరవచ్చు. తీవ్రంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ 2023 మధ్య నాటికి.. తిరిగి కోవిడ్ పూర్వ స్థాయికి కోలుకోవచ్చు. 2020లో మ్యూజిక్, రేడియో, పాడ్కాస్ట్ల మార్కెట్ ఆదాయాలు రూ.4,626 కోట్లకు పడిపోయాయి. లైవ్ మ్యూజిక్ విభాగం ఆదాయం సుమా రు రూ. 522 కోట్ల మేర క్షీణించింది. ఇది తిరిగి కోలుకుని 19.1 శాతం వార్షిక వృద్ధి రేటుతో 2025 నాటికి రూ.11,026 కోట్లకు చేరనుంది. వీడియో గేమ్స్, ఈ-స్పోర్ట్స్ విభాగం ఆదాయాలు 2020లో రూ.11,250 కోట్లకు చేరగా .. 2025 నాటికి వార్షికంగా 16.5 శాతం మేర వృద్ధి చెందనున్నాయి. వచ్చే నాలుగేళ్లలో రూ.24,213 కోట్లకు చేరవచ్చు. వివిధ ఇన్నోవేషషన్లు ఇందుకు దోహదపడతాయి. -
దూసుకెళ్తున్న ఓటీటీ.. డబ్బులే డబ్బులు
సాక్షి, అమరావతి: ఓటీటీ (ఓవర్ ద టాప్)... వినోద రంగం జపిస్తున్న మంత్రమిది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలు.. ఇలా అన్నింటికీ ప్రస్తుతం అనువైన వేదిక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లే. ఆధునిక సమాచార సాంకేతిక విప్లవం అరచేతిలోకి తీసుకువచ్చిన ఈ వేదిక ప్రస్తుతం వినోద రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. దేశంలో 30కు పైగా ఉన్న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయం ఏకంగా రూ.4,500 కోట్లకు చేరడం విశేషమని ఈవై ఫిక్కి ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్ తాజా నివేదిక పేర్కొంది. దేశంలో మారుమూల పల్లెల వరకూ విస్తరించిన ఇంటర్నెట్ సౌకర్యం.. స్మార్ట్ఫోన్ల విప్లవం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఎంతగానో కలిసివచ్చింది. కరోనా వల్ల ప్రజలు జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లడం తగ్గించడం కూడా అందుకు మరో కారణం. ఈ నేపథ్యంలో దేశంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఆదరణ అమాంతంగా పెరుగుతోంది. తాజా నివేదికలోని ప్రధాన అంశాలివీ.. ► దేశంలో 30కు పైగా ఉన్న ఓటీటీల ఆదాయం 2020 చివరి నాటికి ఏకంగా రూ.5 వేల కోట్లకు చేరుకుంది. 2017లో రూ.2,019 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ.4,500 కోట్లకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 నాటికి రూ.5,560 కోట్లకు చేరుతుందని అంచనా. ► ఓటీటీల ఆదాయంలో ‘డిమాండ్ ఆన్ వీడియో (ఎస్వీఓడీ)ల ద్వారానే 70 శాతం వస్తోంది. ► దేశంలో 2020 నాటికి ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య దాదాపు 55 కోట్లకు చేరింది. ► 2017లో 25 కోట్లు ఉన్న స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 2020 డిసెంబర్ నాటికి 50 కోట్లకు చేరుకున్నారు. దీంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వీక్షకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2020 డిసెంబర్ నాటికి దేశంలో ఓటీటీ వేదికల వీక్షకుల సంఖ్య 35.50 కోట్లకు చేరింది. ► 2019తో పోలిస్తే 2020లో ఓటీటీ వీక్షకులు 35 శాతం పెరిగారు. వీరిలో 60శాతం మంది 18 ఏళ్ల నుండి 35 ఏళ్లలోపు వారే ఉన్నారు. ► ఓటీటీలలో 40 శాతం ప్రాంతీయ భాషల కార్యక్రమాలను వీక్షిస్తున్నారు. దేశంలో ఓటీటీ వేదికల ద్వారా ఇంగ్లిష్ కార్యక్రమాల వీక్షకులు కంటే హిందీ, ఇతర ప్రాంతీయ భాషల కార్యక్రమాల వీక్షకులు రెండున్నర రెట్లు అధికంగా ఉన్నారు. -
ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్‌లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!
సాక్షి, న్యూఢిల్లీ : ‘జర్నలిస్టులు ద్రోహులు, చెదలు, సూడో సెక్యులరిస్టులు’ అంటూ ఒంటి కాలి మీద లేచి చిందులేసింది ఎవరో కాదు, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె నటించిన తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’ ప్రమోషన్ కార్యక్రమం సందర్భంగా ఆమె అనవసరంగా పీటీఐ విలేకరితో గొడవ పడింది. దీంతో కోపం వచ్చిన ‘ఎంటర్టేన్మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా’లు కంగనా రనౌత్ కార్యక్రమాలన్నింటినీ బహిష్కరించాల్సిందిగా జర్నలిస్టులకు పిలుపునిచ్చాయి. దీంతో మరింత రగిలిపోయిన కంగనా ‘జర్నలిస్టులు ద్రోహులు, చెదలు, సూడో సెక్యులరిస్టులు’ అంటూ విమర్శించారు. తనపై బహష్కరణ పిలుపును ఉపసంహరించుకోకపోతే కోర్టుకు వెళతానని కూడా ఆమె హెచ్చరించారు. అందులో పలు సెక్షన్లను కూడా కోట్ చేశారు. కంగనా రనౌత్, ఆమె మేనేజర్‌గా వ్యవహరిస్తున్న ఆమె సోదరి రంగోలి ఛందెల్లు మీడియాపై చేస్తున్న ఆరోపణలు అసభ్యంగా, అనాగరికంగా ఉన్నాయంటూ ముంబై ప్రెస్‌క్లబ్ ప్రతి విమర్శలు చేసింది. ఇలా అడ్డగోలుగా మాట్లాడడం కంగనా సోదరీమణులకు కొత్త కాదని, పలుసార్లు అర్థంపర్థం లేకుండా విమర్శలు కురిపించారని కూడా ప్రెస్‌క్లబ్ విమర్శించింది. కంగనా నోటీసులు ఏ ముంది? విలేకరుల బహిష్కరణ పిలుపును వ్యతిరేకిస్తూ కంగనా పంపించిన నోటీసులో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి. వర్కింగ్ జర్నలిస్టుల ప్రవర్తనను నియంత్రించే ‘ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ మార్గదర్శకాలను ఉల్లంఘించారనడం మొదటిది. తన కార్యక్రమాలను జర్నలిస్టులు బహిష్కరించడం ద్వారా సినిమా మార్కెట్‌తో తనకున్న అవకాశాలను దెబ్బతీయడం, తద్వారా పోటీ చట్టాన్ని ఉల్లంఘించడం రెండో అంశమైతే, బహిష్కరించడమనేదే నేరపూరితమైన బెదిరింపు, దౌర్జన్యంగా డబ్బులు లాగడం, ఈ మూడో అంశం కింద జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దీనికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా ? జూలై 11వ తేదీన జర్నలిస్టులను తిడుతూ పోస్ట్ చేసినా వీడియోలో తనను బ్యాన్ చేయాల్సిందిగా కంగనానే కోరింది. కాకపోతే కాస్త వ్యంగ్యంగా. ‘దయచేసి నా కార్యక్రమాలను బ్యాన్ చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నా కార్యక్రమాల ద్వారా మీరు సొమ్ము చేసుకోవడం ఇంకేమాత్రం ఇష్టం లేదు. ఇదే నాకు చేయగల గొప్ప మేలు’ అంటూ కోరింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టు సంఘాలు నిజంగానే బహిష్కరించడంతో ఇది అన్యాయమంటూ మరుసటిరోజే కంగనా నోటీసులు జారీ చేసింది. కాంపిటేషన్ చట్టంలోని 4వ సెక్షన్ కింద జర్నలిస్టులకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేయడం విడ్డూరంగా ఉంది. ఒకరు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకోకుండా వారిని ఓ ‘బలమైన గ్రూపు’ అడ్డుకోవడం, లేదా అనవసరమైన ఆంక్షలు విధించడం తప్పని ఈ సెక్షన్ చెబుతోంది. అయితే ఇక్కడ ‘బలమైన గ్రూపు’ పరిధిలోకి జర్నలిస్టులు రారు. చట్టంలో బలమైన గ్రూపు పరిధిలోకి అదే మార్కెట్‌కు సంబంధించిన వ్యాపార సంస్థ వస్తోంది. అది సినిమా మార్కెట్ కనుక ఆ మార్కెట్‌కు సంబంధించిన సంస్థే వస్తోంది. జర్నలిస్ట్ సంఘాలకు సంబంధం లేదు ఎంటర్టేన్మెంట్ జర్నలిస్ట్స్ గిల్డ్కుగానీ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాకుగాని జర్నలిస్టుల నియంత్రణతోగానీ, మీడియా వ్యాపారంతోగానీ సంబంధం లేదు. గిల్డ్ అయితే రిజిస్టర్ సంస్థ కూడా కాదు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, వినోద కార్యక్రమాలతోపాటు వత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగపడే వేదిక మాత్రమే. ఈ రెండింటికీ జర్నలిస్టుల ప్రవర్తతతో నిమిత్తం లేదు. ఇక ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టూకీగా జర్నలిస్టు విలువలు ఎలా ఉండాలో సూచిస్తుంది. యాజమాన్యానికి, జర్నలిస్టులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికే ఎక్కువగా పనిచేస్తుంది. పైగా జర్నలిస్టుల బహిష్కరణ పిలుపును అమలు చేసినట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. ‘జడ్జిమెంటల్ హై క్యా’ సినిమాకు సంబంధించి జూలై 7వ తేదీన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని వివిధ మీడియాలు విస్తతంగానే కవర్ చేశాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిగానీ, కంగనా రనౌత్‌కు సంబంధించిగానీ ఎలాంటి విలేకరుల కార్యక్రమాలు చోటు చేసుకోలేదు. జర్నలిస్టుల బహిష్కరణ పిలుపును ‘నేర పూరిత బెదిరింపులు’ అని నోటీసులో పేర్కొనడం మరీ అన్యాయం. వారిచ్చిన బహిష్కరణ పిలుపు అనేది ఓ నిరసన. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో అది వారి హక్కు. కంగనా నుంచి ఇక్కడ జర్నలిస్ట్స్ గిల్డ్ కోరుతున్నది ఆర్థిక సహాయం కాదు, కేవలం క్షమాపణలు. వాస్తవానికి జర్నలిస్టుల కారణంగానే కంగనా రనౌత్‌కు ఈ రోజు మార్కెట్లో మంచి పేరు వచ్చింది. ఆమె నటించిన ప్రయోజనాత్మక చిత్రాలను కొంత మంది జర్నలిస్టులు పనిగట్టుకొని ప్రోత్సహించడం వల్ల ఆమెకు కూడా మంచి నటిగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు అదే జర్నలిస్టులను ఆమె ఆడిపోసుకోవడం చూసి ఆమెకేమైనా ‘మెంటల్’ వచ్చిందా ? అంటూ ఆశ్చర్యపడుతున్నారు. -
మోదీ ఫస్ట్, కేజ్రివాల్ సెకండ్..
సాక్షి, న్యూఢిల్లీ : ఆధునిక కాలంలో మీడియా ప్రభావం అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా వార్తల కోసం మీడియాపై ఆధారపడుతున్న వారి సంఖ్య గడచిన నాలుగేళ్ల కాలంలో బాగా పెరిగింది. రేడియో వార్తల శ్రోతలు తగ్గుతుండగా, ఇంటర్నెట్లో వార్తలు చూసే వారి సంఖ్య పెరగకుండా, తగ్గకుండా ఓ మోస్తారులోనే ఉంది. ఇక వార్తల కోసం పత్రికలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగి ఓ స్థాయిలో నిలిచిపోయింది. టీవీ ఛానళ్లలో వార్తలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక వార్తల్లో ఎక్కువగా బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ అగ్ర స్థానంలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వ్యక్తిగతంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న వారిలో ప్రధాని నరేంద్ర మోదీ మొదటి స్థానంలో, అరవింద్ కేజ్రివాల్ రెండోస్థానంలో, రాహుల్ గాంధీ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఎన్నికల సమయాల్లో మీడియా ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న అంశంపై ‘లోక్‌నీతి– సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్’ (1994 నుంచి 2014 మధ్యకాలంపై) నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వార్తల కోసం 46 శాతం మంది టీవీ ఛానళ్లను వీక్షిస్తుండగా, 26 శాతం మంది వార్తా పత్రికలపై ఆధారపడుతున్నారు. దాదాపు ఐదు శాతం మంది మాత్రమే వార్తల కోసం ఇంటర్నెట్పై ఆధారపడ్డారు. ఇంటర్నెట్లో వార్తలు చూసే వారి సంఖ్య 2017లో 16 శాతం మంది ఉన్నట్లు ‘ప్యూ గ్లోబల్ ఆటిట్యూడ్’ నిర్వహించిన సర్వేలో తేలింది. ఉన్నత విద్యావంతులు, పట్టణ ప్రాంతాల్లోనే వార్తల కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా మహిళలకన్నా పురుషులే ఈ రెండు మీడియాలను ఎక్కువగా చూస్తున్నారు. మీడియాలో ఎక్కువగా బీజేపీనే ప్రాచుర్యం పొందగా, ఎక్కువగా ఉపయోగించుకుంటున్నది కూడా బీజేపీనే. మీడియాలో బీజేపీ ప్రాచుర్యం 39 శాతం ఉండగా, కాంగ్రెస్ ప్రాచుర్యం 27 శాతం ఉంది. 2014 ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతానికి నరేంద్ర మోదీ ప్రభావం, ప్రాచుర్యం బాగా తగ్గింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీకి, ఆయన పార్టీకే ఓటేస్తామని టీవీల్లో హిందీ వార్తలు చూసే ప్రజలు తెలియజేస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో వార్తలు చూసేవారు కచ్చితంగా ఈసారి కాంగ్రెస్‌కు ఓటేస్తామని చెబుతున్నారు. బీజేపీతో పోలిస్తే మీడియాలో కాంగ్రెస్ పార్టీకి తక్కువ ప్రాచుర్యం ఉన్నా ఓటింగ్ శాతం మాత్రం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. -
‘కథువా’ కేసు: మీడియా అత్యుత్సాహం
సాక్షి, న్యూఢిల్లీ : 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ రేప్, హత్య కేసులో బాధితురాలు అసలు పేరు వెల్లడించకుండా, ఆమె ఫొటోను ప్రచురించకుండా మీడియా ఎంతో సంయమనం పాటించింది. తమ కూతురు తప్పు చేయనప్పుడు పేరు వెల్లడిస్తే తప్పేమిటంటూ నిర్భయం తల్లిదండ్రులు ఆంగ్ల మీడియాకు అసలు పేరు వెల్లడించినప్పటికీ మీడియా ఆ పేరును బహిర్గతం చేయకుండా సంయమనం చూపింది. అదే కశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహికంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన సంఘటనలో మీడియా ఆ పాప ఫొటోతో సహా ఆమె పేరును బహిర్గతం చేసింది. ఈ విషయంపై దేశంలోని పలు దినపత్రికలు, టీవీ ఛానళ్లను వివరణ ఇవ్వాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గీతామిట్టల్, హరి శంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఎవరు ఫిర్యాదు చేయకపోయినా ఆ బెంచీ ఈ విషయాన్ని ‘సూమోటా’గా విచారణకు స్వీకరించింది. బాధితుల పేర్లను ముఖ్యంగా మైనర్ల పేర్లను వెల్లడించకుండా భారతీయ శిక్షాస్మృతిలోని 228ఏ ఆంక్షలు విధించింది. బాధితుల పేర్లను వెల్లడించాలంటే వారి అతి దగ్గరి రక్త సంబంధికుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవాలి. అలాంటి అవకాశం లేనప్పుడు ఏదైనా రిజస్టర్డ్ ప్రజా సంక్షేమ సంస్థ లేదా సంఘం ప్రధాన కార్యదర్శి లేదా చైర్మన్ల నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. కథువా దారుణ, రేప్ హత్య కేసులో బాధితురాలి ఫొటోను ఇచ్చి పేరు వెల్లడించిందీ ఆ పాప తండ్రే. అయితే ఆయన నుంచి ఎవరు కూడా లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకున్నట్లు దాఖలాలు లేవు. నీలిరంగు సెల్వార్ కమీజ్ దుస్తుల్లో కెమేరావైపే చూస్తున్న కథువా బాధితురాలి ఫొటోను వివరాలను ముందుగా ‘రైజింగ్ కశ్మీర్, గ్రేటర్ కశ్మీర్’ అనే స్థానిక ఆంగ్ల పత్రికలు ప్రచురించాయి. ఆ తర్వాత రెండు నెలలకు జాతీయ మీడియా స్పందించి ఆ పాప ఫొటోను, జరిగిన ఘటనపై ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. బాధితురాలి పేరు వెల్లడించకుండా కశ్మీర్ మీడియా సంయమనం పాటించక పోవడానికి కారణం ‘మతం’ దృష్టితో సంఘటనను చూడడమేనని స్పష్టం అవుతుంది. బాధితుల పేర్లను వెల్లడించినందుకు గతంలో ఒక్క జర్నలిస్టులపైనే కాకుండా పోలీసులు, ఇతరులపై కూడా కేసులు నమోదయ్యాయి. బాధితురాలి పేరును వెల్లడించినందుకు 2016లో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతిమలివాల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు పంపించిన నోటీసులోనే ఆమె 14 ఏళ్ల బాధితురాలి పేరును బహిర్గతం చేశారు. ఓ రేప్ కేసులో బాధితురాలి పేరు వెల్లడించినందుకు గతేడాది ఢిల్లీ కోర్టు, ఢిల్లీ పోలీసులను తీవ్రంగా మందలించింది. 2017 సంవత్సరంలో జరిగిన రేప్ సంఘటనల్లో 34 కేసుల్లో జాతీయ పత్రికలు పేర్లు, వివరాలను వెల్లడించాయని ఓ నివేదిక తెలియజేస్తోంది. వాటిల్లో దళితులపై జరిగిన రేప్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. కథువా కేసులో పాప ఫొటోను ప్రచురించడం వల్లనే ఆ వార్త ఎక్కువ సంచలనం సృష్టించిందనే వాదన కూడా ఉంది. అయితే మరి, ఢిల్లీ నిర్భయ కేసు కూడా ఇంతకన్నా ఎక్కువ సంచలనమే సృష్టించిందికదా! ఇక్కడ సంచలనానికి పేర్లు, ఫొటోలకన్నా జరిగిన దారుణం తీరు కారణంగానే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. -
‘ఐ లవ్ ఇండియన్ మీడియా’
న్యూఢిల్లీ : అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుకు ట్రంప్ జూనియర్ దేశీయ మీడియాపై పొగడ్తల వర్షం కురిపించారు. భారత మీడియాను తాను చాలా ప్రేమిస్తానని... కఠినంగా, క్రూరంగా ఉండే అమెరికా మీడియతో పోల్చుకుంటే, భారత మీడియా చాలా మృదువుగా ఉంటుందన్నారు. ఒక్కడ జరుగుతున్న గ్లోబల్ బిజినెస్ సమిట్‌లో ట్రంప్ జూనియర్ పాల్గొన్నారు. ‘భారత మీడియాను ప్రేమిస్తున్నట్టు చెబుతున్న భారత చరిత్రలో మొదటి వ్యక్తిని నేనే. వీరు చాలా మృదువుగా ఉంటారు’ అని తెలిపారు. ఎన్ని ఆటంకాలు, ఆటుపోట్లు వచ్చినప్పటికీ భారతీయుల ముఖంపై చిరునవ్వు చెదరదని చెప్పారు. ‘నేను తొలిసారి ఇక్కడికి రాలేదని, కానీ 10 ఏళ్లతో తర్వాత భారత పర్యటనకు’ వచ్చినట్టు తెలిపారు. రాజకీయాలపై మాట్లాడటానికి నిరాకరించిన జూనియర్ ట్రంప్, తాను ఇక్కడి ఒక వ్యాపారవేత్తలాగే వచ్చానన్నారు. ఇండో-పసిఫిక్ సంబంధాలు : కోఆపరేషన్‌పై కొత్త శకం అనే అంశంపై మాట్లాడతారని ముందస్తుగా షెడ్యూల్ సన్నద్ధం చేయగా.. చివరి నిమిషంలో జూనియర్ ట్రంప్ తన ప్రసంగాన్ని మార్చేశారు. భారత్‌లో వ్యాపార పరిస్థితుల మార్పులపై ఆయన ప్రసంగించారు. గత కొన్నేళ్లుగా మంచి మంచి డీల్స్ కుదిరాయని, ప్రస్తుతం 10 టైమ్స్ కంటే ఎక్కువగా పెట్టుబడి పెట్టే సామర్థ్యం వచ్చిందన్నారు. ట్రంప్ జూనియర్ తన వ్యాపారానికి సంబంధించిన పనుల నిమిత్తం భారత్‌లో పర్యటిస్తున్నారు. ట్రంప్ టవర్స్ పేరిట ట్రంప్ జూనియర్ ఇక్కడ తన వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. అమెరికా తర్వాత ట్రంప్ భారీ ప్రాజెక్టులు ఉన్నది భారత్‌లోనే. అయితే అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌పై అక్కడి మీడియా పెద్ద ఎత్తున్నే విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడి మీడియాను ఉద్దేశిస్తూ.. భారత మీడియాపై పొగడ్తలు కురిపించారు ట్రంప్ జూనియర్. -
యుద్ధోన్మాదుల శాంతి జపం
జాతిహితం చైనా మనతో నిజమైన యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇది 1962 కాదు కాబట్టి అది దానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. అది నిజానికి మనతో బలవంతపు దౌత్యాన్ని సాగిస్తోంది. దాడికి, రెచ్చగొట్టడానికి అది తన సొంత మీడియానే సాధనంగా వాడుతోంది. ఆగ్రహావేశపూరితమైన మన చానళ్లు చైనాపై స్టూడియో యుద్ధాన్ని ప్రారంభించాలని నా వాదన కాదు. వాస్తవానికి వారలా చేయకపోవడం వల్ల అంతా మంచే జరుగుతోంది. కాబట్టే పాకిస్తాన్ విషయంలో వలే ప్రజాభిప్రాయం ఇంకా అదుపు తప్పిపోలేదు. డోక్లామ్ వివాదంపై భారత మీడియా ఆచితూచి స్పందిస్తుండటం వల్ల అంతా మంచే జరుగుతుంది. కాకపోతే అది అలవాటులో పొరపాటు కాకుండా ఉండాలి. ముందుగా కాస్త దారితప్పి ఓ విషయాన్ని చెప్పనివ్వండి, ఎందుకైనా మంచిది దానితో పాటే క్షమాభిక్ష లేదా ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోనివ్వండి. నాకూ, నా కుటుంబానికి బతికున్న మరే జీవులకంటే పిల్లులు, కుక్కలంటేనే ఎక్కువ ప్రేమ. కాబట్టి అద్భుతమైన ఆ కుటుంబ సభ్యుల నుంచి మేం ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకున్నాం. క్రికెట్ క్రీడ లాగే అవి కూడా నా రాజకీయ రచనలలోకి తొంగి చూస్తుంటాయి. డోక్లాం వివా దం మోదీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న మొట్టమొదటి నిజమైన వ్యూహాత్మక సంక్షోభం. ఇంత సుదీర్ఘమైన ఉపోద్ఘాతమంతా, సిక్కిం సరిహద్దుల్లోని ఆ పరిస్థితి పట్ల నా సొంత వృత్తిౖయెన వార్తా మీడియా వైఖరిని మా మొదటి మూడు కుక్కల తీరుతో పోల్చి చూపి... ఒక ముఖ్య విషయాన్ని చెప్పడానికే. ఎనభైల మొదట్లో, మేం షిల్లాంగ్‌లో ఉండగా మా మూడు లాసా కుక్కలు మూడూ మిగతా ప్రపంచంతో సంబంధం లేనట్టుగా మా చిన్న తోటలో దర్పం ఒలకబోస్తూ బద్ధకంగా తిరుగుతుండేవి. ఎవరైనా మనిషి లేదా జంతువు ఆ దారంట పోతుంటే మహోగ్రంగా దాడికి దిగుతున్నట్టు నటిస్తూ మొరుగుతుండేవి. ఒక రోజున మా పొరుగున ఉండే ఆదివాసీ కుటుంబం వారి కోళ్లను ఆరు బయటకు వదిలింది. ఉండీ లేనట్టుండే మా గొలుసు కంచె దగ్గరకు సహజమైన రంగురంగుల దుస్తులను ధరించిన రెండు కోడిపుంజులు వచ్చాయి. విడ్డూరాల్లోకెల్లా విడ్డూరమనిపించేలా మా కుక్కలు అలవాటుగా ఆగ్రహంతో మొరగడానికి బదులు... ఆ పుంజుల పట్ల పూర్తి ఉదాసీనతను చూపాయి. వేరే వైపుకు చూడ్డం మొదలెట్టి, దారిన పొయ్యేవారిని చూసి మొరగడం ప్రారంభించాయి. అవి అంతకు ముందె న్నడూ అలాంటి ‘‘ముప్పు’’ ఎదుర్కోలేదు మరి. ఎందుకైనా మంచిదని జంకాయి. అది చూసిన మేం వాటిని ఎంతగా బుజ్జగించినా, రెచ్చగొట్టినా అవి మాత్రం ఆ కోడి పుంజులు లేనే లేవన్నట్టుగా వాటిని పట్టించుకోలేదు. చెడిపోయిన ఆ ఇంటి కుక్కలు చిన్నవే అయినా, వాటికి మనుగడను కాపా డుకోవాలనే స్పృహ మాత్రం బాగా ఉంది. చైనా అంటే భయమా? ఆ పాత కథ ఇప్పుడు ఎందుకో ముందే చెప్పాను. అయినా తెలియదనేట్ట యితే లేదా తెలియనట్టు నటించేట్టయితే... మీరు భయం గొలిపే మన అతి దేశభక్తియుత కమాండో చానళ్లను గుర్తుకు తెచ్చుకోండి. ప్రతిరోజూ సాయంత్రం మూడు గంటలపాటూ అవి మన దేశానికి నిజమైన లేదా ఊహాత్మకమైన విదేశీ లేదా దేశీయ శత్రువులనందరినీ చీల్చి చెండాడటాన్నీ, ఆగ్రహంతో రంకెలువేస్తూ, ఊహకు అందే ప్రతి కాల్పనికమైన ముప్పు మీదకూ మళ్లడాన్ని గుర్తుచేసుకోండి. డోక్లామ్‌లో చైనా చొరబాటు, కంచెకు అవతలి ఆ కోడిపుంజుల లాంటిదేనని అనుకుని ఆలోచించండి. మన యోధులు వారిని పట్టించుకోలేదనేది స్పష్టమే. కాకపోతే, తెలియని శత్రువు పట్ల భయంతో అవి అలా చేయలేదనేదే ఉన్న తేడా. దురాక్రమణ చేయగల శత్రువు ముంగిట ఉంటే అవి బెంబేలెత్తి పోయాయని అనడం పూర్తి అమర్యా దకరం. వాటికి అలా సూచించారు కాబట్టే అవి అలా ప్రవర్తిస్తున్నాయి. దీనిని ముఖ్య వ్యూహాత్మక వాదనగా పరిగణించాలని కోరుతున్నా. చైనా వాళ్లు ఈ విడ్డూరాన్ని గమనిస్తున్నారు, దీని నుంచి వారు తమ సొంత నిర్ధార ణలను చేస్తున్నారు. చూడబోతే ఈ నిర్ధారణ తార్కికమైనదిగా తోస్తోంది: ప్రతి సాయంత్రం పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ప్రకటించే భారత మీడి యాలోని అతి యుద్ధోన్మాద విభాగాలు చైనా నుంచి సవాలు అసలు లేనే లేదన్నట్టుగా నటిస్తున్నాయి. అంటే వారి ప్రభుత్వం వాటికి అలా చేయమని సలహా (ఆదేశం?) ఇచ్చి ఉండాలనేది స్పష్టం. మన మీడియాకు చెడ్డపేరు అదే జరిగితే, భారత ప్రభుత్వం చైనా అంటే భయపడుతోందనే అర్థానికి చేరుతాం. చిన్న శత్రువు పాకిస్తాన్‌ను నిరంతరం దునుమాడేయడం అంటే మహా మక్కువ చూపే అది, ఎక్కువ బలీయమైన శత్రువు దగ్గరికి వచ్చేసరికి దాక్కుంటుంది. తన నోటి దురుసుతనాన్ని అదుపులో ఉంచుకోవడమే కాదు, తదనుగుణంగా మీడియా కూడా నడుచుకోవడానికి హామీని కల్పిస్తుంది. చివరగా, మన మీడియాకే కాదు భారత జాతీయ ప్రయోజనానికి సైతం అత్యంత ప్రమాదకరంగా... తమలాగే భారత ప్రభుత్వం కూడా మీడియాను నియంత్రిస్తుందని చైనా భావిస్తుంది. అందువల్ల మన ప్రభుత్వం కూడా తన అంతరంగాన్ని బయటకు వెల్లడించాలన్నా లేక వెల్లడించరాదన్నా చైనా లాగే ‘‘తన’’ మీడియా ద్వారానే చేస్తుందని నిర్ధారిస్తుంది. అలాగే భారత ప్రభుత్వం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, పాకిస్తాన్ సహా ఏ ఇతర శత్రువుతోనైనా ఘర్షణలను నిలిపి వేయమని మీడియాను ఆదేశించగలదని కూడా నిర్ధారిస్తుంది. మన మీడియా పట్ల చైనాకు చిన్న చూపు ఏర్పడటం దీని చిన్న పర్యవసా నమే. కానీ ఈ కొత్త సవాలును చేపట్టే విషయంలో అతి జాగ్రత్తగా వ్యవహ రించేంతగా లేదా ప్రజాభిప్రాయం మరింత ఆగ్రహావేశపూరితం కాకుండటం కోసం తమ వేట కుక్కలను తూర్పునకు చూడొద్దని చెప్పేంతగా భారత్, చైనా అంటే భయపడుతోందని భావించవచ్చు. ఇది మనకు మరింత నష్టం కలిగించే నిర్ధారణ. ఈలోగా మన మీడియా యోధులు పాకిస్తాన్‌ను, మన సొంత కశ్మీరీలను, ముస్లింలను, చనిపోయినవారిని, భోఫోర్స్ కుంభ కోణంతో సంబంధం ఉందని ఆరోపించినవారిని మాటలతో దునుమాడే యడం కొనసాగుతూనే ఉంటుంది. ఈ చానళ్లలో ఒకటి డోక్లామ్ ప్రతిష్టం భనపై ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేసేంత వరకు వచ్చింది. అయితే ప్రత్యేకించి దాన్ని లక్ష్యించడంతో అది సైతం దిగ్భ్రాంతికరంగా మౌనంగా మారిపో యింది. అది చైనాను ఉల్లాసరపచడమే కాదు, మరిన్ని కుహకాలకు దిగడానికి ప్రేరేపించేది కూడా. చైనీయులు దీన్ని ఎలా చూసినాగానీ, ఇది వారు తప్పుడు అంచనాలకు రావడానికి, భారత్ పిరికిదనే ముందస్తు భావనకు రావడానికి దారి తీసే అవ కాశం ఉంది. భారత మీడియాలో ఆధిపత్యపూరితమైన, విజయవంతమైన విభాగాలు ఈ ముప్పును కూడా మిగతా వాటితో, ప్రత్యేకించి పాకిస్తాన్ ముప్పుతో సమానంగా లెక్కగడితే చైనా ఇలాంటి తప్పుడు అంచనాలకు రావడం జరగదు. కానీ అవి అలా చేయకపోవడం వల్ల, పాకిస్తాన్–కశ్మీర్– ముస్లింలను దునుమాడే కార్యక్రమాలకు అధికార పార్టీ అధికారిక ప్రతిని ధులు టీవీ స్టూడియోలకు తరచుగా వస్తుండటంవల్ల.. ప్రపంచ శక్తిగా పెంపొందు తున్న దేశానికి ఉండాల్సిన బుర్ర భారత్‌కు లేదని చైనా భావించవచ్చు. మీరు చైనాను పైపైనే అయినా గమనిస్తుంటే, లేదా కాలేజీ రోజుల యవ్వనంలో మీరు మావో అంటే ఉత్తేజితులై ఉంటే మీకు ‘పోరాటం పోరాటం, మాటలు మాటలు’ అనే మావోయిస్టు సూత్రం తెలిసి ఉంటుంది. దశాబ్దాల తరబడి చైనీయులు విదేశీ వ్యవహారాలలో ఈ సూత్రాన్ని విజయ వంతంగా అమలు చేస్తున్నారు. తమ మాటలు, పోరాటంలో చాలా భాగాన్ని వారు తమ మీడియాగా చెప్పేదాన్లోనే చేస్తుంటారు. చైనా ఆర్థిక సంస్కరణ లను చేపట్టిన తర్వాత మూడు దశాబ్దాలకు కూడా వారి ప్రభుత్వం ఇంకా ఆ మూడు పత్రికల ద్వారానే మాట్లాడుతున్నదనడంలో ప్రపంచంలో ఎవరికీ సందేహం లేదు. మన వైఖరి సమంజసం ఇంకా పూర్తి ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్న వ్యవస్థలో అవే చైనా గురించి తెలుసుకోడానికి ఉన్న ఏకైక వనరుగా ఉంటున్నాయి. వెల్లడించడానికి ఉద్దే శించినది తప్ప మరే విషయమూ బయటివారికి ఎవరికీ అందే దారే లేదు. సరిగ్గా మన మీడియాలోని కొందరు పాకిస్తాన్‌పైన, మరింత దురదృష్టక రంగా తరచుగా మన సొంత ముస్లిం పౌరులపైన సైతం విరుచుకుపడే ధోర ణిలోనే... చైనా మీడియా ఇప్పుడు భారత్‌పై దాడిని సాగిస్తోంది. చైనా సూత్రంలోని పోరాటం–పోరాటం భాగాన్ని వారి అధికారిక మీడియా అమలు చేస్తోంది. మన మీడియాలో గణనీయమైన భాగం పూర్తి మౌనం వహిస్తుండగా, ప్రభుత్వం చైనా సూత్రంలోని మాటలు–మాటలు అనే భాగాన్ని ఆశావాదంతో పట్టుదలగా అమలు చేస్తోంది. పోరాడటమో లేదా ఉపసంహరించుకోవడమో తేల్చుకోమనేలా చైనీయులు మనకు సవాలు విసురుతున్నారు. మాటల్లోనైనా మనం దాన్ని తిప్పికొట్టకుండా, వాళ్లు మాట్లా డుతారని వేచి చూడటాన్ని కొనసాగిస్తున్నాం. ఆగ్రహావేశపూరితమైన మన చానళ్లను చైనాపై స్టూడియో యుద్ధాన్ని ప్రారంభించమని భారత ప్రభుత్వం ఆదేశించాలని నా వాదన కాదు. వాస్తవా నికి వారలా చేయకపోవడం మంచి విషయం. కాబట్టే పాకిస్తాన్ విషయంలో వలే గాక ప్రజాభిప్రాయం ఇంకా అదుపు తప్పిపోలేదు. ప్రభుత్వం దౌత్య పరమైన పరిష్కారం కోసం దారి వెతకడం మంచి విషయమే. దౌత్యపరమైన ప్రయత్నాలకు ఉండే అవకాశాలను ప్రజాగ్రహం కుదించి వేయకుండా చూసు కోవడమూ మంచిదే. మనకు వ్యతిరేకంగా తెరచుకున్న కొత్త యుద్ధరంగం విషయంపై ప్రశాంత చిత్తంతో కూడిన ఇలాంటి దృక్ప«థం... మరో యుద్ధరం గంలో కూడా అలాంటి విజ్ఞతనే కనబరిస్తే... మరింత విశ్వసనీయమైనదిగా కనిపిస్తుంది కూడా. చైనీయులు నిజమైన యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఇది 1962 కాదు కాబట్టి క్షేత్ర స్థాయిలో అది వారికి చాలా ఇబ్బందికరం అవుతుంది. అది మొదటి తూటా పేల్చిన వెంటనే ఆస్ట్రేలియా నుంచి జపాన్ వరకు భారత్‌కు పశ్చిమానికి చూస్తాయి. ఉప అగ్రరాజ్యంగా ఉన్న చైనా కోరుకోని ఈ పరి ణామాన్ని హఠాత్తుగా కొని తెచ్చుకుంటుంది. చైనా మనతో బలవంతపు దౌత్యాన్ని సాగిస్తోంది. దాడికి, రెచ్చగొట్టడానికి అది తన సొంత మీడియానే సాధనంగా వాడుతోంది. ఆగ్రహావేశపరులైన మన తెల్ల మీసాలను ఉసిగొలిపి భయపెట్టడం అందుకు సమాధానం కాదనేది నిస్సందేహం. కాకపోతే, వారి ముప్పు పట్ల ప్రభుత్వ నిర్దేశితమైన ఈ పట్టింపులేనితనం వల్ల మనకు, డొక్లామ్ సమస్యకు పరస్పరం గౌరవప్రదమైన శాంతియుత పరిష్కారమనే లక్ష్యానికి నష్టదాయకమైన కొన్ని నిర్ధారణలను చైనా చేస్తుంది. శేఖర్ గుప్తా twitter@shekargupta