ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు, భారత ప్రభుత్వ ఏజెంట్లకు మధ్య సంబంధం ఉందని ఆరోపించిన వ్యవహారంలో భారత్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు.
’’భారత ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఈ అంశాన్ని తీసుకుంది.. కానీ ఇండియాను రెచ్చగొట్టడం మా ఉద్దేశం కాదు. కానీ కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు కావాలి" ఖలిస్థానీ అంశంలో కెనడా ప్రధాని ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యల అనంతరం భారత ప్రభుత్వం చాలా సీరియస్ కామెంట్లు చేసింది. అందుకే కెనడా ప్రధాని మళ్లీ స్పందించినట్లు స్పష్టం అవుతోంది.
కెనడియన్ పౌరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద ఆరోపణలు చేశారు. ఇంతేకాకుండా కెనడాలో ఉన్న ఇండియన్ దౌత్య అధికారిని బహిష్కరించారు. ఈ పరిణామాలను భారత్ సీరియస్‌గా తీసుకుంది. భారత్‌లో ఉన్న కెనడా దౌత్య అధికారిని కూడా బహిష్కరించింది. దేశం విడిచి వెళ్లాలని గడువు విధించింది.
ఇదీ చదవండి: భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment