ఒట్టావా: కెనడా పార్లమెంట్ సాక్షిగా ప్రధాని జస్టిన్ ట్రూడో చేష్టలపై నెటిజన్లు ఫైరవుతున్నారు. దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ప్రదర్శించాల్సిన తీరుకాదని విమర్శలు గుప్పిస్తున్నారు. మంగళవారం కెనడా పార్లమెంట్‌లో నూతన స్పీకర్ కొలువుదీరిన నేపథ్యంలో జస్టిన్ ట్రూడో నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కెనడా పార్లమెంట్‌లో నూతన స్పీకర్ గ్రెగ్ ఫెర్గస్.. ప్రధాని జస్టిన్ ట్రూడోను సభకు పరిచయం చేస్తూ..'గౌరవనీయులైన ప్రధాని' అని సంబోధించారు. ఇంతలోనే ట్రూడో మధ్యలో కలగజేసుకుని 'చాలా గౌరవనీయులైన ప్రధాని' అని సరిచేశారు. ఈ క్రమంలోనే స్పీకర్ గ్రెగ్ వైపు చూస్తూ నాలుకతో సంజ్ఞలు చేస్తూ.. కన్నుగీటారు.
The rig is in. Canadian Prime Minister Justin Trudeau gives a wink and bites his tongue at new Speaker of the House of Commons, Greg Fergus.
— illuminatibot (@iluminatibot) October 4, 2023
What is going on in Canada?
Fergus, who is a liberal, was elected after the previous speaker was forced to resign for praising a Nazi on… pic.twitter.com/WjuaaVuLIu
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రధాని స్థానంలో ఉండి ట్రూడో వైకరి చిన్నపిల్లల వలె ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కన్నగీటడం, నాలుకతో సంజ్ఞలు సాధారణ పౌరులకే ఇబ్బందికరంగా ఉంటాయి. అలాంటిది పార్లమెంట్ సాక్షిగా ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్లు పెట్టారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షనాయకులు విమర్శలు సందించారు.
నాజీ సైన్యంలో పనిచేసిన ప్రముఖునికి పార్లమెంట్‌లో గౌరవసన్మానం చేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ ఆంటోని రోటా తన పదవికి రాజీనామా చేశారు.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పర్యటన సందర్భంగా ఈ ఘటన జరిగింది. యూదులను ఊచకోత కోసిన హిట్లర్ తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తికి సన్మానం చేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో మాజీ స్పీకర్ రాజీనామా చేయడంతో కొత్త స్పీకర్‌ను నియమించాల్సిన అవసరం ఏర్పడింది.
ఇదీ చదవండి: మోదీ చాలా తెలివైన వ్యక్తి: పుతిన్
Comments
Please login to add a commentAdd a comment