న్యూఢిల్లీ: రేషన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. "మీ పేరు కేజ్రీవాల్, నాట్వర్లాల్ కాదు, దయచేసి కేంద్రానికి నిరంతరం లేఖలు రాయడం ద్వారా ప్రజలను అంధకారంలో ఉంచడం ఆపండి." అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. "మీరు ఐదేళ్ళకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రేషన్ షాపుల లైసెన్సులను రద్దు చేసారు. ఎంత మందిని జైలుకు పంపారు. ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. వీటిపై మీరు తీసుకున్న చర్యలేంటి? ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోనే మీరు కాలం వెళ్లదీస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమేనని స్పష్టమవుతుంది" అంటూ బీజేపీ ఎంపీ విమర్షలు గుప్పించారు.
"రేషన్ డోర్ డెలివరీ చేసే సమయం నుంచి ఈ రేషన్‌ను ఎక్కడ నుండి కొన్నారో.. బడ్జెట్‌లో కేటాయించిన వాటి వివరాలు కూడా మాకు చెప్పండి. మీరు లబ్ధిదారులుగా గుర్తించిన గృహాలన్నీంటికీ రేషన్ అందించాలనుకుంటే దాన్ని మేం స్వాగతిస్తున్నాం. మీ స్వంతంగా రేషన్ పథకం ద్వారా దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే మీ వద్ద ఉన్న రేషన్‌ను ఆహార భద్రతా చట్టం ప్రకారం ఢిల్లీకి ఇస్తారు.” అని ఎంపీ మీనాక్షీ లేఖి తెలిపారు. ఇక రేషన్‌ను ఇంటికి పంపిణీ చేయడానికి మార్పులు తేవాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే.
(చదవండి: 4 భారీ టవర్లు.. 5 దశాబ్దాల సేవ.. 10 సెకన్లలోనే!)
BJP MP: మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమే!
Published Wed, Jun 9 2021 12:32 PM | Last Updated on Wed, Jun 9 2021 12:36 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment