ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కష్టసమయంలో ఢిల్లీ ప్రజలకు ఉపయోగపడే డోర్ డెలివరీ రేషన్ విధానాన్ని కేంద్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ పథకం వల్ల ఢిల్లీలో 72 లక్షల మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కేంద్రం దీనిని ఆమోదించలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైలును తిరస్కరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. తమిళనాడు ఎన్నికల సమయంలో రేషన్ డోర్ డెలివరీ వంటి ఉచిత పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేమో ఢిల్లీలో ఆ పథకానికి అడ్డు పడుతున్నారు. ఢిల్లీ అంటే మీకు ఎందుకంత ద్వేషం అంటే ట్విటర్‌లో పేర్కొంది.
కోవిడ్-19 మహమ్మారి విసురుతున్న సవాలును దీటుగా తిప్పికొట్టేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడో ప్రభంజనం వస్తుందని, ఈ వైరస్ కొత్త వేరియంట్లు ప్రజలను బాధిస్తాయని హెచ్చరికలు వస్తుండటంతో కొత్త వేరియంట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా థర్డ్ వేవ్ ప్రభావం బాలలపై ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతుండటంతో బాలలకు చికిత్స చేయడానికి తగిన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అష్ట దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ, కొన్ని అదనపు సడలింపులను ఇచ్చింది.
చదవండి: 'ఇదీ కాంగ్రెస్ సంస్కృతి'.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్
In March, BJP promised Home Delivery of Ration in Tamil Nadu.
— AAP (@AamAadmiParty) June 5, 2021
Today, BJP has stopped Home Delivery of Ration in Delhi.
Dear @BJP4India, we once again ask you - Why do you hate Delhi?#ModiProtectsRationMafia https://t.co/WVYu7IyKVh
Comments
Please login to add a commentAdd a comment