ration door delivery
-
Fact Check: గడప చెంతనే రేషన్
సాక్షి, అమరావతి: గతంలో రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే పెద్ద ప్రహసనం. చౌక ధరల దుకాణాల దగ్గర క్యూ లైన్లతోపాటు సర్వర్లు ఎప్పుడు మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. రోజంతా పనులు మానుకోవాల్సి రావడంతో రేషన్‌దారులు నానా అగచాట్లు పడేవారు. ఒక్కోసారి రేషన్ తీసుకోకుండానే ఉసూరుమంటూ వెనుతిరిగేవారు. ఇవన్నీ అందరికీ తెలిసిన వాస్తవాలే అయినా రామోజీ మాత్రం కళ్లకు గంతలు కట్టుకున్నారు!! ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ సరుకులను డోర్ డెలివరీ చేస్తుంటే అబ్బే.. పాత రోజులే బాగున్నాయంటున్నారు!! దేశంలో ఎక్కడా లేని విధంగా 9,260 మొబైల్ వాహనాలతో ప్రతి నెలా రేషన్ సరుకులను సరఫరా చేస్తూ బడుగు, బలహీన వర్గాల యువత ఉపాధి పొందుతుంటే ‘గడప చేరని రేషన్’ అంటూ ఈనాడు దుష్ప్రచారానికి దిగింది. నాడు తినేవారేరి? చంద్రబాబు హయాంలో రేషన్ బియ్యాన్ని తింటే ఒట్టే! ముక్కిన బియ్యం, పురుగులు పట్టినవి, రాళ్లు, నూకలతోపాటు రంగు మారిన బియ్యాన్ని రేషన్‌దారులకు అంటగట్టడంతో వాటిని శుభ్రం చేసుకోలేక అవస్థలు పడేవారు. మరి ఇప్పుడిస్తున్నది నాణ్యమైన సార్టెక్స్ బియ్యం. కరోనా సమయంలో ప్రభుత్వం అందించిన నాణ్యమైన రేషన్ బియ్యం లక్షల మంది ఆకలిని తీర్చింది. కార్డుదారుల సమక్షంలో ఇంటి దగ్గరే సంచులు తెరిచి కచ్చితమైన తూకంతో ఇస్తుండటంతో కొలతలపై ఫిర్యాదులు లేవు. ఈ–పోస్ యంత్రాలకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడంతో అక్రమ రవాణాకు తావులేదు. దీంతో ఇప్పుడు రేషన్ తీసుకునే వారు 90 శాతానికి పైగా ఉన్నారు. ఈ లెక్కలు వెల్లడించే సాహసం రామోజీ చేయగలరా? అర్హులందరికీ రేషన్ చంద్రబాబు హయాంలో తమకు నచ్చని వారి రేషన్ కార్డులను నిర్దాక్షిణ్యంగా తొలగించారు. ఆయన దిగిపోయే నాటికి 1.39 కోట్ల కార్డులు మిగిలాయి. సీఎం జగన్ ఇంటింటికీ వలంటీర్లను పంపి పార్టీలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి చేకూర్చడంతో రేషన్ కార్డుల సంఖ్య 1.47 కోట్లకు పెరిగింది. నెలకు 2.31 లక్షల టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఎండీయూ వాహనాలు క్రమం తప్పకుండా నిర్దేశించిన ప్రాంతాలకు వెళ్లేలా సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. అధికారులు నిత్యం తనిఖీలు చేయడంతో పాటు 1967 టోల్ ఫ్రీ నంబర్‌ను ఎండీయూలపై ముద్రించి లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గత ఆర్నెల్లలో 128 ఫిర్యాదులు రాగా వెంటనే పరిష్కరించారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో విజిలెన్సు కమిటీలను ఏర్పాటు చేసి నిత్యం రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఆయా గ్రామాల్లోని నాయకులతో పాటు వివిధ రంగాల సభ్యులుంటారు. ఇంటింటికీ రేషన్ చేరకుంటే ప్రజలే ప్రశ్నించే వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇంత పారదర్శకంగా రేషన్ అందుతోంది కాబట్టే ఐవీఆర్ సర్వేలో డోర్ డెలివరీ విధానంపై సంతృప్తి వ్యక్తమైంది. ఆపరేటర్ ఆగినా.. పంపిణీ ఆగట్లేదు ఎక్కడైనా ఎండీయూ ఆపరేటర్ సెలవులో ఉన్నా, అనివార్య కారణాలతో రాకపోయినా వీఆర్వో ద్వారా లబ్దిదారుల ఇంటి వద్దే సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అంతేగానీ ఏ చౌక ధరల దుకాణదారుడికీ రేషన్ ఇచ్చే అథారిటీ లేదు. అలాంటప్పుడు ఈనాడు చెబుతున్నట్లుగా లబ్ధిదారులు రేషన్ దుకాణాల్లోకి వెళ్లి సరుకులు ఎలా తెచ్చుకుంటారు? ఎండీయూ వాహన ఆపరేటర్ల ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడంతో పాటు లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక ప్రాతిపదికపైన నియమించి నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. ఎండీయూ వాహనం ఎప్పుడు ఏ వీధికి రానుందో ముందుగానే వలంటీర్ల ద్వారా సమాచారాన్ని చేరవేస్తున్నారు. కార్డుదారుడి కుటుంబ సభ్యుల్లో ఎవరు అందుబాటులో ఉన్నా వేలిముద్ర ద్వారా రేషన్ తీసుకునే సౌకర్యాన్ని కల్పించారు. గత ఆర్నెల్లలో 126 ఎండీయూ ఆపరేటర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించగా మరో 284 చోట్ల తాత్కాలిక విధానంలో తీసుకుని సరుకులు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, కొండ కోనల్లో ఎండీయూ వాహనాలు వెళ్లడం కష్టంతో కూడుకున్నది కావడంతో అదనపు ఖర్చు చేసి ఇతర వాహనాల్లో లబ్దిదారుల ఇళ్లకు రేషన్ చేరవేస్తున్నారు. తాత్కాలికంగా ఆగిన ఓ ఎండీయూ వాహనాన్ని చూపిస్తూ అసలు ఎక్కడా ఇంటింటికీ రేషన్ అందడం లేదని రామోజీ బుకాయించడం నిజంగా విడ్డూరమే! ఎండీయూ ఆపరేటర్లకు అదనపు ఆదాయం ప్రతి నెలా 17లోగా రేషన్ పంపిణీ పూర్తవుతుంది. అనంతరం అవసరాన్ని బట్టి పాఠశాల విద్యాశాఖ పుస్తకాలను సరఫరా చేయడం, మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన నిత్యావసరాలను నేరుగా పాఠశాలలు, అంగన్వాడీ సెంటర్లకు చేరవేయడం లాంటి వాటి ద్వారా ఎండీయూ వాహనదారులకు అదనపు ఆదాయం లభించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఏటా వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఇన్సూరెన్స్ భారాన్ని తగ్గిస్తున్నాం. ఎండీయూ ఆపరేటర్లకు సమానంగా రేషన్ కార్డులను కేటాయించి ప్రతి నెలా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. సమస్యలుంటే పరిష్కరిస్తున్నాం. వైఎస్సార్‌లో 35, అన్నమయ్యలో 39, నెల్లూరు జిల్లాలో 32 ఎండీయూ ఆపరేటర్ల ఖాళీలను భర్తీ చేశాం. ఎండీయూలో రేషన్ సరఫరా ఎక్కడా నిలిచిపోలేదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
మరింత సమర్ధంగా ఇంటింటికీ బియ్యం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ చర్యలు చేపడుతోంది. ఇంటింటికీ రేషన్ అందించే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ (ఎండీయూ వాహనాలు) క్రమం తప్పకుండా లబ్ధిదారుల ప్రాంతాలకు వెళ్లేలా పక్కాగా పర్యవేక్షించనుంది. ఇందులో భాగంగా రూట్ మ్యాపింగ్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతిక సేవలను వినియోగించనుంది. ఎండీయూ పరిధిలోని లబ్ధిదారులు తమ ఇళ్ల నుంచి ఎక్కువ దూరం వెళ్లకుండా సమీపంలోకే వాహనం వచ్చేలా అధికారులు ప్రత్యేక పాయింట్లను గుర్తిస్తున్నారు. ఈ కొత్త విధానం ద్వారా ఐదారు ఇళ్లకు ఒకచోట ప్రతి నెలా ఎండీయూలో రేషన్ అందించేలా సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. వాహనాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా బియ్యం లబ్ధిదారులకు అందుతుంది. తొలుత పైలెట్ ప్రాజెక్టు కింద వచ్చె నెలలో మండలానికి ఒక ఎండీయూ పరిధిలో దీనిని అమలు చేస్తారు. జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొనసాగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రభుత్వ విప్లవాత్మక చర్యలతో పెరిగిన రేషన్ పంపిణీ శాతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగింది. లబ్ధిదారులకు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం ఇవ్వడంతో పాటు 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే తీసుకెళ్లి అందించడం మంచి ఫలితాలను ఇస్తోంది. ప్రతి నెలా 1.45 కోట్ల కార్డుదారులకు 2.30 లక్షల టన్నుల బియ్యం అవసరం అవుతుంది. గతంలో నెలకు 80 నుంచి 85 శాతం మాత్రమే రేషన్ పంపిణీ జరిగితే.. ఇప్పుడు 90 శాతానికి చేరుకొంది. మరోవైపు అనివార్య కారణాలతో ఎండీయూ వాహనదారులు ఎవరైనా తప్పుకుంటే వారి స్థానాన్ని భర్తీ చేసేంత వరకు గరిష్టంగా మూడు నెలల పాటు ఇన్చార్జి ఎండీయూకు (వేరే ఎండీయూ వాహనదారుడు పని చేస్తే) బాధ్యతలు అప్పగిస్తోంది. వీరికి నెలకు రూ.18,000 చొప్పున అదనంగా అందిస్తూ ఎక్కడా రేషన్ పంపిణీలో జాప్యం జరగకుండా చర్యలు చేపడుతోంది. 2 నుంచి 3 నెలలు నిల్వ చేసిన తర్వాతే రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన వెంటనే పీడీఎస్‌లోకి తీసుకురావడంతో సమస్యలు వస్తున్నాయి. కొత్త బియ్యం వండితే అన్నం బాగోలేదని, ముద్దగా అవుతుందనే ఫిర్యాదులున్నాయి. దీనిని అధిగమించేందుకు కస్టమ్ మిల్లింగ్ అనంతరం 2 నుంచి 3 నెలలు బఫర్ గోడౌన్లలో నిల్వ ఉంచిన తర్వాతే పంపిణీ చేసేలా పౌరసరఫరాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. -
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ భేష్
మదనపల్లె: జాతీయ ఆహార భద్రత చట్టం అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో పౌర సరఫరాల వ్యవస్థ పనితీరు, రేషన్ డోర్ డెలివరీ, వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నాయని కేంద్ర బృందం సభ్యులు ప్రశంసించారు. జాతీయ ఆహారభద్రత చట్టం అమలు, పీడీఎస్ పంపిణీని క్షేత్ర స్థాయిలో అధ్యయనం చేసేందుకు నియమించిన కేంద్ర పరిశీలకుల బృందం మంగళవారం అన్నమయ్య జిల్లాలో పర్యటించింది. గాలివీడు, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, మదనపల్లె తదితర ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీచేసి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జాతీయ ఆహారభద్రత చట్టం సలహా సంఘం సభ్యులు జీఎన్ శర్మ, ఎంసీ చింపా మీడియాతో మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆహార భద్రత చట్టం అమలు ఏపీలో బాగా జరుగుతోందని కితాబిచ్చారు. పౌరసరఫరాల పంపిణీకి ఎండీయూ వాహనాలు, వలంటీర్ల వ్యవస్థ, రేషన్ డోర్ డెలివరీ సత్ఫలితాన్నిస్తున్నాయని ప్రశంసించారు. 100కి 98శాతం మంది ప్రజలు రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పొందుతున్నట్టు గుర్తించినట్టు తెలిపారు. రేషన్ సరుకుల పంపిణీపై లబ్ధిదారులను విచారిస్తే.. సేవలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. -
ఏపీలో ‘రేషన్ డోర్ డెలివరీ’ పై కర్ణాటక అధ్యయనం
పటమట (విజయవాడ తూర్పు): ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రేషన్‌డోర్ డెలివరీ విధానాన్ని కర్ణాటక పౌర సరఫరాల కమిషనర్ అధికారి కనకవల్లి అధ్యయనం చేశారు. శుక్రవారం ఆమె విజయవాడలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రేషన్ డోర్ డెలివరీ విధానాన్ని పరిశీలించారు. చదవండి: పా‘పాల’ పుట్ట హెరిటేజ్! పటమట భాగయ్య వీధిలో ఉన్న డిపో నం 272కు చెందిన ఎండీయూ ఆపరేటర్ వాహనం వద్ద డీలర్ నుంచి స్టాకు ఎండీయూ ఆపరేటర్‌కు బదలాయింపు, ఆపరేటర్ నుంచి కార్డుదారులకు రేషన్ ఎలా ఇస్తున్నారనేది పరిశీలించారు. ఈ విధానంపై స్థానికుల నుంచి అభిప్రాయసేకరణ చేశారు. డోర్ డెలివరీపై ఆమెకు ఏఎస్వో సర్కిల్–2 కోమలి పద్మ, ఏపీ పౌర సరఫరాల కమిషనరేట్ అధికారులు పలు వివరాలు చెప్పారు. -
కర్ణాటకలోనూ ఇంటికే రేషన్!
‘అధికారం కేవలం విధానసౌథకే పరిమితం కాకుండా పంచాయతీల పరిధిలోనే ప్రజలకు అన్ని సేవలు లభ్యమయ్యేలా చర్యలు తీసుకుంటాం. అభివృద్ధే ప్రజల వద్దకు వచ్చేలా పాలన సాగాలి. జనవరి 26 తరువాత రేషన్ సరుకులను ఇంటివద్దే అందించే యోచన చేస్తున్నాం. అతి త్వరలో కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తాం. ఇదే కాకుండా పింఛన్లు లాంటి సామాజిక భద్రత సేవలు కూడా ఇంటివద్దే అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం’ – ఇటీవల దావణగెరె జిల్లా సభలో కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై సాక్షి, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న తరహాలోనే పలు పథకాలను ఇంటివద్దే లబ్ధిదారులకు అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం కూడా సన్నద్ధమవుతోంది. ప్రధానంగా రేషన్ సరుకులను ఇంటివద్దే డోర్ డెలివరీ చేయడంపై కర్ణాటక ప్రభుత్వం దృష్టి సారించింది. ‘అన్నభాగ్య’ పథకం కింద లబ్ధిదారులకు ఇంటివద్దే రేషన్ సరుకులను అందించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి వద్దే రేషన్ సరుకులను అందచేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో అమలవుతున్న ఈ విధానంపై కర్ణాటక పౌర సరఫరాల శాఖ అధికారులు నిశితంగా అధ్యయనం చేశారు. ఇంటి వద్దకే రేషన్ విధానాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో తదనుగుణంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తైన కంప్యూటరైజేషన్.. కర్ణాటకలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో కంప్యూటరైజేషన్ చేశారు. ప్రస్తుతం అక్కడ 10,89,445 అంత్యోదయ, 1,15,02,798 బీపీఎల్, 21,44,006 ఏపీఎల్ కార్డులతో కలిపి మొత్తం 1,47,36,249 రేషన్ కార్డులున్నాయి. 19,963 రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల బీపీఎల్, ఏపీఎల్ కార్డుదారులకు ఉచితంగా రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఏపీఎల్ కార్డుదారులకు కేజీ రూ.15 చొప్పున 10 కిలోల బియ్యాన్ని అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విధానాన్ని అనుసరించడం ద్వారా వీరందరికి ఇంటి వద్దే రేషన్ సరుకులు అందనున్నాయి. కొత్త విధానం ఇలా.. ఆయా రేషన్ దుకాణాల నుంచి లగేజ్ ఆటో ద్వారా సరుకులు తరలిస్తారు. ఇంటింటికి వెళ్లి రేషన్ పంపిణీ చేసేందుకు ఇద్దరు సిబ్బందిని నియమిస్తారు. సరుకుల బరువు తూచే తూకం యంత్రం తదితరాలు ఆటోలో ఉంటాయి. -
ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇంటి వద్దకే రేషన్
తిరువళ్లూరు (తమిళనాడు): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ విధానాన్ని తమిళనాడులో అమలు చేసే అంశంపై త్వరలో తమ ముఖ్యమంత్రి స్టాలిన్‌తో చర్చించి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తామని ఆ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి చక్రపాణి తెలిపారు. ఆయన గురువారం మంత్రి నాసర్, కలెక్టర్ అల్బీజాన్ వర్గీష్‌తో కలిసి తిరువళ్లూరు కలెక్టర్ కార్యాలయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పంపిణీ, వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం మంత్రి చక్రపాణి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల వద్దే రేషన్ వస్తువులు అందజేస్తోందన్నారు. తిరువళ్లూరు ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడి నుంచి కొందరు రైతులు తాము పండించిన వరి ధాన్యాన్ని ఇక్కడికి తీసుకువచ్చి కొనుగోలు కేంద్రాల్లో భద్రపరిచి విక్రయిస్తున్నట్టు తమకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. -
BJP MP: మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమే!
న్యూఢిల్లీ: రేషన్ పంపిణీ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖీ మంగళవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. "మీ పేరు కేజ్రీవాల్, నాట్వర్లాల్ కాదు, దయచేసి కేంద్రానికి నిరంతరం లేఖలు రాయడం ద్వారా ప్రజలను అంధకారంలో ఉంచడం ఆపండి." అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. "మీరు ఐదేళ్ళకు పైగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్ని రేషన్ షాపుల లైసెన్సులను రద్దు చేసారు. ఎంత మందిని జైలుకు పంపారు. ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. వీటిపై మీరు తీసుకున్న చర్యలేంటి? ప్రధానమంత్రికి లేఖలు రాయడంతోనే మీరు కాలం వెళ్లదీస్తున్నారు. మీ ఎమ్మెల్యేలు, మీరు ఈ మాఫియాలో భాగమేనని స్పష్టమవుతుంది" అంటూ బీజేపీ ఎంపీ విమర్షలు గుప్పించారు. "రేషన్ డోర్ డెలివరీ చేసే సమయం నుంచి ఈ రేషన్‌ను ఎక్కడ నుండి కొన్నారో.. బడ్జెట్లో కేటాయించిన వాటి వివరాలు కూడా మాకు చెప్పండి. మీరు లబ్ధిదారులుగా గుర్తించిన గృహాలన్నీంటికీ రేషన్ అందించాలనుకుంటే దాన్ని మేం స్వాగతిస్తున్నాం. మీ స్వంతంగా రేషన్ పథకం ద్వారా దాని కోసం ఏర్పాట్లు చేసుకోండి. ఎందుకంటే మీ వద్ద ఉన్న రేషన్‌ను ఆహార భద్రతా చట్టం ప్రకారం ఢిల్లీకి ఇస్తారు.” అని ఎంపీ మీనాక్షీ లేఖి తెలిపారు. ఇక రేషన్‌ను ఇంటికి పంపిణీ చేయడానికి మార్పులు తేవాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. (చదవండి: 4 భారీ టవర్లు.. 5 దశాబ్దాల సేవ.. 10 సెకన్లలోనే!) -
పిజ్జా డెలివరీ ఓకే.. రేషన్ నాట్ ఓకేనా?
న్యూఢిల్లీ: ఇంటింటికి రేషన్ డెలివరీ పథకానికి కేంద్రం మోకాళ్లు అడ్డుపెడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ‘‘ఢిల్లీ అంటే ఎందుకంత ద్వేషం’’ అంటూ శనివారం ఆయన ఘాటుగానే కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తాజాగా ఈ ఉదయం ఆయన మరోసారి ఆరోపణలకు దిగారు. రేషన్ మాఫియా కోసమే కేంద్రం తమ ప్రభుత్వ నిర్ణయానికి అడ్డుపడుతుందని కామెంట్లు చేశారాయన. ‘‘ఇదొక విప్లవాత్మకమైన పథకం. డెబ్భై రెండు లక్షల మంది రేషన్‌దారులకు లబ్ధి చేకూర్చే విధానం. కానీ, సరిగ్గా రెండు రోజుల అమలుకు ముందే కేంద్రం అడ్డుతగిలింది. కరోనా టైంలో ఇంటింటికి పిజ్జా డెలివరీకి అనుమతులు ఉన్నప్పుడు.. రేషన్‌ను ఎందుకు డెలివరీ చేయనివ్వరు?’’ అని ఆయన కేంద్రానికి ప్రశ్న సంధించారు. దీనిని బట్టే రేషన్ మాఫియా ఎంత బలంగా ఉందో, అది కేంద్ర ప్రభుత్వాన్ని ఎంత ప్రభావితం చేస్తోందో అర్థం చేసుకోవచ్చు అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం డిజిటల్ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ప్రసగించిన ఆయన.. ఈ పథకం అమలుకు తమ దగ్గర అనుమతులు తీసుకోలేదని కేంద్రం చెబుతోందని, కానీ, చట్టపరంగా ఆ అవసరం లేకున్నా.. ఐదుసార్లు అననుమతులు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశాడు. ‘‘కరోనా టైంలో సాయం అందించకుండా రాష్ట్రాలతో కేంద్రం రాజకీయాలుచేస్తోంది. రేషన్ అనేది ఓ పార్టీకో, ఏ నేతకో చెందింది కాదు. సాధారణ ప్రజానీకానికి ఉన్న హక్కు అది. చేతులెత్తి మొక్కుతున్నా.. దయచేసి ఈ పథకాన్ని ప్రారంభించనివ్వండి. కావాలంటే క్రెడిట్ మొత్తం మీకే ఇస్తా’’ అని పరోక్షంగా ప్రధాని మోదీని ఉద్దేశించి కేజ్రీవాల్ కామెంట్లు చేశారు. కేసు ఉందనేనా? కాగా, ప్రైవేట్ డీలర్లలతో ఇంటింటికి రేషన్ సరఫరా పథకం అమలు చేయడం వద్దంటూ శనివారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైల్‌ను తిరిగి పంపించాడని ఢిల్లీ ప్రభుత్వం అంటోంది. అయితే ఈ విషయంలో ఆప్ సర్కార్ ఆరోపణలను కేంద్రం నిరాధారమైనవని చెబుతోంది. ఆ ఫైల్‌ను కేంద్రం ఆమోదించకపోవడం ఒక్కటే కారణం కాదని, కోర్టులో కేసు నడుస్తుండడం కూడా మరో కారణమని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పథకానికి సంబంధించిన ఫైల్‌ను పున:పరిశీలన కోసమే ఢిల్లీ సీఎంకు పంపారని తెలుస్తోంది. ఎన్నికల హామీలో భాగంగానే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంటిక ఇంటికి రేషన్ సరఫరా పథకాన్ని అమలు చేయాలనుకుంటోంది. మరోవైపు బీజేపీ మాత్రం కేజ్రీవాల్ సానుభూతి నాటకాలు ఆడుతున్నాడని ఆరోపిస్తోంది. చదవండి: ఇంటికి రేషన్.. ఇక్కడ తొలగిన అడ్డంకి -
ఢిల్లీ అంటే మీకు ఎందుకంత ద్వేషం: కేజ్రీవాల్
ఢిల్లీ: ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. కరోనా కష్టసమయంలో ఢిల్లీ ప్రజలకు ఉపయోగపడే డోర్ డెలివరీ రేషన్ విధానాన్ని కేంద్రం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ పథకం వల్ల ఢిల్లీలో 72 లక్షల మందికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కేంద్రం దీనిని ఆమోదించలేదని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఫైలును తిరస్కరించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి కేజ్రీవాల్ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల అయింది. తమిళనాడు ఎన్నికల సమయంలో రేషన్ డోర్ డెలివరీ వంటి ఉచిత పథకాలు ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేమో ఢిల్లీలో ఆ పథకానికి అడ్డు పడుతున్నారు. ఢిల్లీ అంటే మీకు ఎందుకంత ద్వేషం అంటే ట్విటర్లో పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి విసురుతున్న సవాలును దీటుగా తిప్పికొట్టేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. మూడో ప్రభంజనం వస్తుందని, ఈ వైరస్ కొత్త వేరియంట్లు ప్రజలను బాధిస్తాయని హెచ్చరికలు వస్తుండటంతో కొత్త వేరియంట్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ప్రయోగశాలలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా థర్డ్ వేవ్ ప్రభావం బాలలపై ఎక్కువగా ఉంటుందనే ఆందోళన వ్యక్తమవుతుండటంతో బాలలకు చికిత్స చేయడానికి తగిన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. అష్ట దిగ్బంధనాన్ని కొనసాగిస్తూ, కొన్ని అదనపు సడలింపులను ఇచ్చింది. చదవండి: 'ఇదీ కాంగ్రెస్ సంస్కృతి'.. రాహుల్‌పై కేంద్ర మంత్రి ఫైర్ In March, BJP promised Home Delivery of Ration in Tamil Nadu. Today, BJP has stopped Home Delivery of Ration in Delhi. Dear @BJP4India, we once again ask you - Why do you hate Delhi?#ModiProtectsRationMafia https://t.co/WVYu7IyKVh — AAP (@AamAadmiParty) June 5, 2021 -
ఇంటింటికీ రేషన్ తరహాలోనే..
సాక్షి, అమరావతి: ఇంటింటికీ రేషన్ బియ్యం, ఇతర సరుకుల పంపిణీ కార్యక్రమం ద్వారా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించిన విధానంలోనే.. వివిధ కార్పొరేషన్ల సంక్షేమ పథకాల అమలుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరుద్యోగ యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఐడీసీ)ను తిరిగి క్రియాశీలకం చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సందర్భంలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు బాధ్యతను సైతం ఏపీఐడీసీకే అప్పగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ జీవో జారీ చేశారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా 1960లో ఏపీఐడీసీ ఏర్పాటైంది. ఆ తర్వా త సంస్థ నామమాత్రంగా తయారైంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుని వాటాగా నిరుద్యోగులకు వాహనాలను సమకూర్చి ఇంటింటికీ బియ్యం పంపిణీ కార్యక్రమం బాధ్యతలను వారికి అప్పగించిన విషయం తెలిసింది. ఈ తరహాలోనే ఇతర ప్రభుత్వ పథకాల అమలులో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు చేపట్టే బాధ్యతను ఏపీఐడీసీకే ప్రభుత్వం అప్పగించింది. సంబంధిత శాఖలు, ఏపీఐడీసీ కలిపి ఎప్పటికప్పుడు వేర్వేరుగా విధివిధానాలు ఖరారు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే సమయంలో కొత్తగా సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటులోనూ నిరుద్యోగ యువతకు తగిన తోడ్పాటు అందించే బాధ్యతను ప్రభుత్వం ఏపీఐడీసీకి అప్పగించింది. -
ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై సీఎం జగన్ సమీక్ష
-
ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయం వద్దు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలని, అన్ని అంశాలపై వ్యవసాయ సలహా కమిటీలకు పూర్తి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. క్రాప్ ప్లానింగ్ మొదలు రైతులకు అండగా ఆ కమిటీలు ఉండాలన్నారు. ఈ ప్రక్రియలో మహిళా రైతులకు కూడా భాగస్వామ్యం కల్పించాలని చెప్పారు. ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండొద్దని స్పష్టం చేశారు. ధాన్యం ఏ మిల్లుకు పంపాలన్నది అధికారులే నిర్ణయించాలన్నారు. ఎక్కడా రైతులకు ఏ విధంగానూ నష్టం కలగకూడదని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా పక్కాగా ధాన్యం సేకరణ జరగాలని, రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం ఉండొద్దని అధికారులను హెచ్చరించారు. ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో ధాన్యం సేకరణ, రేషన్ బియ్యం డోర్ డెలివరీపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయం వద్దు: ధాన్యం సేకరణలో ఎక్కడా మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు. ఏ ఊరి పంట ఏ మిల్లర్ దగ్గరకు వెళ్తోంది అన్న విషయం అధికారులకు మాత్రమే తెలియాలి. అందుకు అవసరమైతే జిల్లాల కలెక్టర్లు సొంతంగా గోనె సంచులు సేకరించాలి. ధాన్యం కొనుగోలులో తేమ చూడడం కోసం, ఆర్బీకేల వద్ద ఆ మీటర్లు కూడా ఉన్నాయి. మిల్లుల వద్దకు ధాన్యం రవాణా చేయడంలో వ్యయ నియంత్రణ కోసం ఊరికి దగ్గరలోని మిల్లర్ వద్దకు పంపించవద్దు. అందుకోసం జిల్లా యూనిట్‌గా తీసుకుని, ధాన్యాన్ని మిల్లుల దగ్గరకు పంపించాలి. మనం కొనుగోలు చేస్తామని చెప్పిన టైంకు మనమే కొనుగోలు చేయాలి. మొత్తం ప్రక్రియ అంతా కూడా ప్రభుత్వమే చేపట్టాలి. రెండు శాఖలు ఓన్ చేసుకోవాలి: ఆర్బీకేకు సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత బాధ్యత ఉందో, పౌర సరఫరాల శాఖకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి రైతు కోరిన విత్తనాలు పౌర సరఫరాల శాఖ ఇవ్వాలి. అందుకోసం పౌర సరఫరాల శాఖ కూడా ఆర్బీకేను ఓన్ చేసుకోవాలి. రైతులు బయట విత్తనాలు కొని మోసపోకుండా వ్యవసాయ శాఖ చూడాలి. వారికి అవసరమైన విత్తనాలు ఆర్బీకేల ద్వారా సరఫరా చేయాలి. ఈ క్రాపింగ్ నుంచి మార్కెటింగ్ వరకూ రెండూ కలిసి పనిచేయాలి వ్యవసాయ సలహా కమిటీలు: వ్యవసాయ సలహా కమిటీలను యాక్టివేట్ చేయాలి. ఆ మేరకు ఆ కమిటీలకు అన్ని అంశాలపై అవగాహన కల్పించాలి. క్రాప్ ప్లానింగ్ మొదలు ఆ కమిటీలు రైతులకు అండగా నిలవాలి. వ్యవసాయ సలహా కమిటీలు గ్రామాల్లో ఆర్బీకేలతో కలిసి పని చేయాలి. అన్నింటిలోనూ మహిళా రైతుల ప్రమేయం కూడా ఉండాలి. ఆ కమిటీల బాధ్యతలు. వాటి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలి. రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియను పౌర సరఫరాల శాఖ మంత్రి పర్యవేక్షిస్తారు. ఎక్కడా రైతు ఇబ్బంది పడకూడదు. రైతులకు ప్రత్యామ్నాయం చూపాలి: ఏ విత్తనం వేస్తే బాగుంటుంది? ఏది సాగు చేస్తే పంట కొనుగోలు చేస్తారన్నది రైతులకు ఆ కమిటీలు ముందే చెప్పాలి. అలాగే రైతులకు ధాన్యంతో తగిన ఆదాయం రాకపోతే (ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గడం వంటి కారణాల వల్ల), ఏ పంట వేస్తే తగిన ఆదాయం వస్తుందన్న విషయాన్ని రైతులకు చెప్పాలి. ఆ మేరకు వారికి ప్రత్యామ్నాయం చూపాలి. అంతే తప్ప రైతుల ఆదాయం మాత్రం తగ్గకూడదు. రేషన్ బియ్యం డోర్ డెలివరీ: రేషన్ బియ్యం డోర్ డెలివరీలో ఎక్కడా ఏ లోపం లేకుండా చూడాలి. బియ్యం తీసుకోవడంలో ఎవరూ మిస్ కాకుండా చూడాలి. ఆ మేరకు ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్)లు పని చేయాలి. ప్రతి నెలా నిర్ణీత వ్యవధిలోగా తప్పనిసరిగా బియ్యం పంపిణీ జరగాలి. కావాల్సినన్ని వేయింగ్ స్కేల్స్ (తూకం యంత్రాలు) కొనుగోలు చేయండి. బియ్యం క్వాలిటీలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వద్దు, ఎవరైనా ఇంటి వద్ద రేషన్ మిస్ అయితే గ్రామ, వార్డు సచివాలయంలో తీసుకునేలా చర్యలు తీసుకోవాలి. దీనికి అవసరమైన కార్యాచరణ సిద్దం చేయండి. చదవండి: ‘సీఎం జగన్ అత్యంత బాధ్యతగా వ్యవహరించారు’ ఏలూరు కార్పొరేషన్ ఎలక్షన్: కౌంటింగ్‌కు హైకోర్టు అనుమతి -
ఇంటింటికీ 'ఆనందం'
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పంపిణీ విధానం అమల్లోకి రావడంతో పేదలకు శ్రమ తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం గత నెల నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుండటంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలు వెచ్చించి బియ్యాన్ని కొనుక్కోవాల్సిన అవసరం తప్పింది. దీనివల్ల కుటుంబ ఖర్చులు ఎంతో ఆదా అవుతున్నాయని లబ్ధిదారులు ఆనందంగా చెబుతున్నారు. నిత్యావసర సరుకుల కోసం గతంలో రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. సర్వర్ సక్రమంగా పని చేయకపోయినా.. ఏదైనా సమస్య తలెత్తినా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఒక్కోసారి పనులకు వెళ్లకుండా రెండు, మూడు రోజులపాటు రేషన్ షాపులకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. రోజూ కూలి పనులకు వెళితే గాని కడుపు నిండని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వారంతా రేషన్ షాపుల వద్ద పడిగాపులు పడాల్సి వచ్చినప్పుడు ఆదాయం కోల్పోయేవారు. అలాంటి ఇబ్బందుల నుంచి గట్టెక్కించే సంకల్పంతో మొబైల్ వాహనాల పేదల ఇంటికే వెళ్లి రేషన్ సరుకుల్ని పంపించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తప్పిన ఇబ్బందులు ఇంటింటికీ రేషన్ విధానం అమలు చేయడం వల్ల లబ్ధిదారులకు సరుకులు అందేవరకు మొబైల్ వాహనం అక్కడి నుంచి వెళ్లే అవకాశం లేదు. రేషన్ వాహనం ఎప్పుడు వస్తుందనే సమాచారం కూడా ముందుగానే ఇస్తుండటం వల్ల ఎంతో ప్రయోజనం కల్గుతోంది. గతంలో పంపిణీ చేసిన బియ్యంలో రాళ్లు, నూకలు ఎక్కువగా ఉండేవి. ఆ బియ్యం ముక్కిపోయిన వాసన రావడంతో చాలామంది వండుకుని తినేందుకు ఉపయోగించేవారు కాదు. తప్పనిసరి పరిస్థితుల్లో కిలో రూ.45 చొప్పున మార్కెట్లో కొనుగోలు చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం రాళ్లు, నూకలు, ముక్కిపోయినవి కాకుండా ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తుండటంతో పేదలు వాటినే వండుకుని తింటున్నారు. దీంతో ప్రతి నెలా బియ్యం కోసం ఖర్చు చేసే మొత్తం కూడా తగ్గిపోయింది. ముఖ్యంగా ఉపాధి నిమిత్తం గ్రామాల నుంచి పట్టణాలకు వలస వచ్చిన లబి్ధదారులు నాణ్యమైన బియ్యం పంపిణీని వరంగా భావిస్తున్నారు. పట్టణాల్లో రోజుకు రెండు లక్షల కుటుంబాలకు.. పట్టణాల్లో మార్చి నెల కోటా సరుకులు ఈ నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేస్తున్నారు. మొబైల్ వాహనాల ద్వారా రోజుకు 2 లక్షల కుటుంబాలకు సరుకులు అందుతున్నాయి. మూడు రోజుల్లో దాదాపు 6 లక్షల కుటుంబాలకు 95.24 లక్షల కిలోల బియ్యం అందాయి. గురువారం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఖర్చు బాగా తగ్గింది ప్రభుత్వం నాణ్యమైన బియ్యం పంపిణీ చేయడంతో మా కుటుంబానికి బియ్యం ఖర్చు బాగా తగ్గింది. గతంలో ఇచ్చే బియ్యం నాసిరకంగా ఉండటంతో బయట మార్కెట్లో కొనేవాళ్లం. ఇప్పుడ ఆ బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్నే వండుకుని తింటున్నాం. – ఎస్.షేక్ షావలి, ఇందిరా నగర్, కర్నూలు బిర్యానీకీ రేషన్ బియ్యాన్నే వాడుతున్నాం బిర్యానీ చేసినప్పుడు కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాణ్యమైన బియ్యాన్నే వాడుతున్నాం. గతంలో రేషన్ బియ్యం వండుకునే వీలులేక తప్పని పరిస్థితుల్లో విక్రయించేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. – బచ్చు దాలమ్మ, ముడియా వీధి, ఇచ్చాపురం, శ్రీకాకుళం జిల్లా క్యూలో నిలబడే బాధ తప్పింది గతంలో మూడు వీధులు దాటుకుని వెళ్లి రేషన్ షాపు వద్ద గంటల కొద్దీ క్యూలో నిలబడే వాళ్లం. ఇప్పుడు ఏమాత్రం శ్రమ పడకుండానే సరుకులు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. – నేరెడుమిల్లి జయలక్ష్మి, జగన్నాథపురం, కాకినాడ పిలిచి మరీ ఇస్తున్నారు ఇంటి గుమ్మం వద్దకే వచ్చి అక్కా.. రేషన్ సరుకులు వచ్చాయని మరీ చెప్పి ఇస్తున్నారు. రేషన్ షాపు వద్దకు వెళ్లి సరుకులు తెచ్చుకునే బాధ తప్పింది. నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తున్నందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. – ఎన్.సువేద, కల్లూరు, కర్నూలు -
రేషన్ లబ్ధిదారులకు కూపన్లు
సాక్షి, అమరావతి: ఇంటింటా రేషన్ పంపిణీ చేసేందుకు మొబైల్ వాహనం ఎప్పుడు వస్తుందో ముందుగానే సమాచారం ఇచ్చేందుకు ఈ నెల నుంచి కూపన్లు జారీ చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ ఎక్స్అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అదేవిధంగా లబ్ధిదారుల ఫోన్ నంబర్లకు ఒక రోజు ముందుగానే సమాచారం పంపేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల లబ్ధిదారులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఇంటింటా సరుకుల పంపిణీకి సంబంధించి లోటుపాట్లను తెలుసుకునేందుకు ఆయన సోమవారం విశాఖపట్నంలో పర్యటించారు. వలస కూలీలు పోర్టబిలిటీ ద్వారా ఇప్పటివరకు రేషన్ షాపు నుంచి ఉదయం 8 గంటలలోపు, సాయంత్రం 7 గంటల తర్వాత సరుకులు తీసుకునే సౌకర్యం ఉందన్నారు. అయితే దీనివల్ల కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించి మంగళవారం నుంచి ఏ మొబైల్ వాహనం వద్దనైనా సరుకులు తీసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల వద్ద మ్యాపింగ్ కాని కార్డుదారులు కూడా వాహనాల వద్ద సరుకులు తీసుకోవచ్చన్నారు. కొన్ని చోట్ల ఇంటింటా వాహనాలు వెళ్లలేని పరిస్థితులు ఉన్నాయని, అలాంటి చోట్ల లబ్ధిదారులు ఒకేసారి కాకుండా ఒక్కొక్కరు వచ్చి సరుకులు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి తగు సూచనలు జారీ చేశామన్నారు. పట్టణాల్లో పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. -
ఇంటింటికీ మార్చి నెల ‘రేషన్’
సాక్షి, అమరావతి: పట్టణాల్లో మార్చి నెలకు సంబంధించి ఇంటింటా రేషన్ సరుకుల పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఫిబ్రవరి నెల కోటా సరుకుల్ని ఈ నెల 3వ తేదీ వరకు పంపిణీ చేయాలని, మార్చి నెల కోటాను 4వ తేదీ నుంచి అందించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నూరు శాతం రేషన్ పంపిణీ పూర్తయిన గ్రామాల్లోని లబ్ధిదారులకు సోమవారం నుంచే సరుకుల్ని అందిస్తారు. పేదలకు ప్రతి నెలా 1 నుంచి 15 వరకు రేషన్ సరుకుల్ని వారి ఇళ్లవద్దే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. ఫిబ్రవరి నెల కోటాను పట్టణాల్లో 1వ తేదీ నుంచి పంపిణీ చేయగా.. గ్రామీణ ప్రాంతాల్లో 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. రేషన్ పంపిణీ కోసం 9,260 మొబైల్ వాహనాలను వినియోగిస్తుండగా.. వాహనదారులకు మరింత ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెలా వారికిచ్చే మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు ప్రభుత్వం పెంచింది. వాహనం అద్దె నిమిత్తం రూ.13 వేలు, వాహన సహాయకుడికి చెల్లించే హెల్పర్ చార్జీలు రూ.5 వేలు, పెట్రోల్ కోసం రూ.3 వేల చొప్పున పౌర సరఫరాల శాఖ ప్రతినెలా చెల్లించనుంది. -
ఇంటికే రేషన్..
సాక్షి, అమరావతి/గుడివాడ రూరల్: గిరిజన ప్రాంతాల్లో మినహా రాష్ట్రంలోని అన్నిచోట్లా పేదలకు ఇంటింటా సరుకులు పంపిణీ చేశారు. బుధవారం నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వాహనాల ద్వారా సరుకుల పంపిణీని ప్రారంభించలేమని ఆయా ప్రాంతాలకు మండలస్థాయి అధికారులు ఉన్నతాధికారులకు తెలియజేశారు. గిరిజన గ్రామాల్లోనూ గురువారం నుంచి ఇంటింటికీ రేషన్ అందించేలా చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎక్స్–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. పల్లెల్లోనూ ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పౌర సరఫరాల విభాగం సోమవారం రేషన్ వాహనాలను పల్లెలకు పంపడం ప్రారంభించింది. రాష్ట్రంలో 9,260 మొబైల్ వాహనాలుండగా మంగళవారం వరకు దాదాపు 8,533 వాహనాలు రోడ్డెక్కాయి. ఇప్పటివరకు 27 లక్షల కుటుంబాలకు ఇళ్ల వద్దే సరుకులు అందించారు. రేషన్ పంపిణీలో ఈ–పాస్ వినియోగంపై వాహనదారులకు డీలర్లు సహకరించాలని కోన శశిధర్ కోరారు. వారంలోగా లబ్ధిదారులందరికీ సరుకులు అందించేలా చర్యలు చేపట్టాలని పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వంపై అదనంగా ఆర్థిక భారం పడుతున్నా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ కార్పొరేషన్ల ద్వారా 9,260 మందికి సబ్సిడీపై మొబైల్ వాహనాలు పంపిణీ సమకూర్చారని చెప్పారు. మొబైల్ వాహనం తీసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, లబ్ధిదారుల ప్రశంసలు పొందేలా సరుకులు పంపిణీ చేయాలని కోరారు. -
ఇంటింటికీ రేషన్.. తొలగిన అడ్డంకి
ఇంటింటికీ రేషన్ పథకం వెనుక పెద్ద సదుద్దేశం ఉంది. ఈ పథకం కొత్తది కాదు. దీన్ని ప్రభుత్వం ఇప్పటికే పట్టణాల్లో అమలు చేస్తోంది. ఈ పథకం కోసం ఆపరేటర్లు బ్యాంకుల రుణాలు పొంది వాహనాలు కొన్నారు. ఎన్నికల కమిషన్ చెప్పినట్టు వాహనాలకు మళ్లీ తటస్థ రంగులు వేయాలంటే భారీ ఖర్చు అవుతుంది. వాహనాలపై సీఎం ఫొటోలు ఉండటంపై ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెబుతోంది. సీఎం ఫొటో ఉండరాదన్న నిషేధం ఏదీ లేదు. ఆ వాహనాలపై రంగులను ఓ రాజకీయ పార్టీకి ఆపాదించడం సరికాదు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు సరికాదు. – హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఈ పథకం అమలుకు బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మార్చి 15వ తేదీ వరకు నిలిపేస్తూ సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటివరకు సంచార వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని అడ్డుకోవద్దని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా ‘ఇంటింటికీ రేషన్’ పథకానికి బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు మధ్యంతర ఉత్తర్వుల జారీపై నిర్ణయాన్ని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన తన నిర్ణయాన్ని వెలువరించారు. సీఎం ఫొటో వాడటంపై నిషేధం లేదు ‘ఇంటింటికీ రేషన్ పథకం వెనుక పేదలకు, అవసరం ఉన్న ప్రజలకు ఆహార ధాన్యాలు అందచేయాలన్న భారీ సదుద్దేశం, ప్రయోజనం దాగి ఉంది. ప్రజల సంక్షేమం, ఆరోగ్యమే సుప్రీం లా. అదే ఈ మధ్యంతర ఉత్తర్వుల జారీకి కారణం. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే ఈ పథకం అమలవుతోంది. 3.25 కోట్ల మంది లబ్ధిదారులకు ఆహార ధాన్యాలను అందించేందుకు వేల వాహనాలను ఆపరేటర్లు కొనుగోలు చేశారు. దీని కోసం వారు డబ్బు పెట్టుబడిగా పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకున్నారు. వాహనాలకు రీ పెయింటింగ్ నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే సమయానికి గ్రామీణ ప్రాంతాల్లో రెండు దశల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సంచార వాహనాలకు తటస్థ రంగులు వేసేంత వరకు ఈ పథకం అమలును నిలిపేయడం సరికాదన్నది ఈ కోర్టు ప్రాథమిక అభిప్రాయం. ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ న్యాయస్థానం ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతోంది’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాహనాలపై రంగులు, ఫొటోల విషయమై దాఖలైన ఓ కేసులో విచారణ జరిపిన సుప్రీం కోర్టు చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ ప్రకటనల్లో రాజకీయ నాయకులు, ప్రభుత్వ పెద్దల ఫొటోలను ఉపయోగించడంపై సుప్రీం కోర్టు ఎలాంటి నిషేధం విధించలేదని, ముఖ్యమంత్రి ఫొటో కూడా ఉండొచ్చని తెలిపిందన్నారు. వాహనాలపై ఉపయోగించినవన్నీ సాధారణ రంగులేనని, అధికార పార్టీ రంగులను పోలి ఉన్నాయంటూ ఎన్నికల కమిషన్ అంతిమ నిర్ణయానికి రావడం ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే ఎంతమాత్రం సరికాదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. పల్లెల్లో కదిలిన వాహనాలు ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. పల్లెల్లోనూ ఇంటింటికీ సరుకులు పంపిణీ చేసేందుకు వీలుగా మొబైల్ వాహనాలు సోమవారం మధ్యాహ్నం నుంచి ఒక్కొక్కటిగా ముందుకు కదిలాయి. ఇంటింటా సరుకులు పంపిణీకి రాష్ట్ర వ్యాప్తంగా 9,260 వాహనాలను మంగళవారం నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులకు పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 22 లక్షల కార్డుదారులకు ఇంటివద్దే సరుకులు పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్–అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ వెల్లడించారు. రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి పలకడం.. తూకంలో అక్రమాలు, మోసాలకు తావు లేకుండా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సబ్సిడీ సరుకులను పేదల గడప వద్దే అందివ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 9,260 మొబైల్ వాహనాలను కొనుగోలు చేసిన విషయం విదితమే. వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలలో ప్రారంభించగా.. ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.45 కోట్లకు పైగా కార్డుదారులకు ఇంటింటింకీ వెళ్లి రేషన్ సరుకులు పంపిణీ చేసేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో ఈ వాహనాను ఆపాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్తర్వులివ్వడంతో గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ కార్యక్రమం నిలిచిపోయింది. ఎస్ఈసీ ఉత్తర్వులను హైకోర్టు కొట్టేయడంతో రేషన్ పంపిణీకి మార్గం సుగమమైంది. -
రేషన్ డోర్ డెలివరీకి ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ డోర్ డెలివరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేషన్ వాహనాల రంగు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది. మార్చి 15 వరకు మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉంటాయని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ మార్చి 15కు వాయిదా వేసింది. ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే. ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పౌర సరఫరాల శాఖ కమిషనర్ వ్యాజ్యం దాఖలు చేశారు. కాగా, హైకోర్టు తాజా ఆదేశాలతో వెంటనే రేషన్ డోర్ డెలివరీకి పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాల్లో ఏర్పాట్లపై ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ రేషన్ డోర్ డెలివరీ జరగనుంది. (చదవండి: ఏపీలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల) టీడీపీ కంచుకోటల్లో వైఎస్సార్సీపీ పాగా -
‘దిక్కుమాలిన టీడీపీకి అది అలవాటే..’
సాక్షి, తాడేపల్లి: రేషన్ డోర్ డెలివరీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటింటికీ రేషన్‌పై కొన్ని పత్రికలు చెత్త రాతలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఇంటింటికీ రేషన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కుట్రలు చేయడం దిక్కుమాలిన టీడీపీకి అలవాటే. ఎన్నికల పేరు చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో 7,200 వాహనాలు నిలిచేలా చేశారు. తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో 83 శాతం సీట్లు గెలిచాం. దేవినేని ఉమా నియోజకవర్గంలో 48 పంచాయతీల్లో 44 గెలిచాం. జూమ్ యాప్ పెట్టి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారని’’ ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి పోటీ చేసి ఓడిపోయిన వారు ఇప్పుడు ఏడుస్తున్నారన్నారు. గ్రామాల్లో గొడవలు సృష్టించాలనేదే చంద్రబాబు కుట్ర అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారని, రెండో దశ ఎన్నికలు వచ్చే సరికి పుతిన్, ఐక్యరాజ్యసమితికి కూడా లేఖ రాస్తారంటూ ఆయన ఎద్దేవా చేశారు. ‘‘మున్సిపల్ ఎన్నికల్లోపు రాష్ట్రంలో టీడీపీకి క్యాడర్ ఉండదు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం నడుస్తుంటే టీడీపీలో కిస్మిస్ నాయుడు రాజ్యాంగం నడుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులివ్వడం ఏ రాజ్యాంగంలో ఉంది?. ప్రజాక్షేత్రంలో గెలవలేని లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదు. చిత్తూరు జిల్లాలో సర్పంచ్ స్థానానికి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుంది. తొలి దశ ఎన్నికల ఫలితాలతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయ్యింది. చంద్రబాబును పార్టీ నుంచి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడతాం. సంక్షోభాన్ని కూడా రాజకీయానికి వాడుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు, పవన్ నా వెనుక వస్తే ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని’’ కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: నిమ్మగడ్డ ‘ఇంటిఅద్దె అలవెన్స్’ నిగ్గుతేల్చండి) ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం! -
మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లాల్సిందే
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ పథకం కోసంవినియోగిస్తున్న మొబైల్ వాహనాలు ఇంటింటికీ వెళ్లి సబ్సిడీ సరుకులను పంపిణీ చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. వాహనదారులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి వారికి ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తాన్ని రూ.16 వేల నుంచి రూ.21 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విదితమే. ప్రస్తుతం పట్టణాల్లో ఈ పథకం అమలవుతోంది. అయితే పట్టణాల్లో కొందరు ఒకేచోట వాహనాన్ని నిలిపేసి సరుకులు పంపిణీ చేస్తున్నట్లు లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు వస్తుండడంతో పౌరసరఫరాల శాఖ అప్రమత్తమైంది. వెంటనే లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకోవడంతోపాటు సరుకుల పంపిణీ స్పీడును మరింత పెంచాలని పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. లోపాలను వెంటనే సరిదిద్దుకునేలా వాహనదారులకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలో 29,783 రేషన్ షాపులుండగా.. వీటిలో పట్టణ ప్రాంతాల్లో ఉన్న 7,426 షాపుల పరిధిలోనే ప్రస్తుతం ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం వరకు 13.08 లక్షల కుటుంబాలకు 2.14 కోట్ల కిలోల నాణ్యమైన బియ్యం, 12.09 లక్షల కిలోల చక్కెర, 7.09 లక్షల కిలోల కందిపప్పు పంపిణీ చేశారు. ‘ఇంటింటికీ రేషన్’పై తీర్పు వాయిదా ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలుకు బ్రేక్ వేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తన తీర్పును వాయిదా వేశారు. అంతకుముందు ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ఇంటింటికీ రేషన్ పథకాన్ని పట్టణ ప్రాంతంలో అడ్డుకోలేదని తెలిపారు. ఈ పథకం కింద నిత్యవసరాల పంపిణీ కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాల రంగులపై ఫిర్యాదు అందాయని, వాటిని పరిశీలించి, తటస్థ రంగులను వేయాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ చెప్పిందన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ స్పందిస్తూ.. పేదలకు నిత్యావసర సరుకులను అందించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉందని, దీనిని కమిషన్ అడ్డుకోవడం సరికాదన్నారు. పేదలకు నిత్యావసరాలు అందించడం చాలా ముఖ్యమని సింగిల్ జడ్జి చాలా స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు. -
‘ఇంటింటికీ రేషన్’పై విచారణ నేటికి వాయిదా
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పథకం అమలును నిలిపివేస్తూ ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనల నిమిత్తం విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుముందు ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ఈ పథకం కొత్తది కాదని, 2019లోనే ప్రభుత్వం దీనిని ప్రారంభించిందన్నారు. పథకం అమలుకు అవసరమైన సంచార వాహనాలను ఎన్నికల నియమావళి అమల్లోకి రాకముందే గత నెల 21న ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ పథకం అమలుపై అన్ని వివరాలను ఎన్నికల కమిషన్‌కు నివేదించినట్టు తెలిపారు. అయితే, ఎన్నికల కమిషనర్ వాహనాలపై ఉన్న రంగులతోపాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ బొమ్మలు ఉండటంపైనా అభ్యంతరం తెలిపారన్నారు. వాహనాలపై ఇతర రాజకీయ పారీ్టలు ఉపయోగిస్తున్న రంగులు కూడా ఉన్నాయని తెలిపారు. ఫొటోలు ఉండొచ్చని ‘సుప్రీం’ చెప్పింది ప్రభుత్వ పథకాల ప్రచారంలో ముఖ్యమంత్రి, దివంగత నేతల ఫొటోలు ఉపయోగించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచి్చందని హైకోర్టుకు నివేదించిన ఏజీ ఆ తీర్పును చదివి వినిపించారు. ఎన్నికల కమిషన్ చెప్పిన విధంగా సంచార వాహనాల రంగులు మార్చాలంటే కొన్ని నెలలు పడుతుందన్నారు. ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఇప్పుడు నిలిపివేయడం అనేక సమస్యలకు దారి తీస్తుందన్నారు. ఏజీ వాదనలు విన్న న్యాయమూర్తి ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనల నిమిత్తం విచారణను బుధవారం మధ్యాహా్ననికి వాయిదా వేశారు. -
‘ఇంటింటికీ రేషన్’ ఆపడమే ఎస్ఈసీ ఉద్దేశం
సాక్షి, అమరావతి: ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో అడ్డుకోకుండా ఎన్నికల కమిషనర్‌ను ఆదేశించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఇంటింటికీ రేషన్ కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాలకు అధికార పార్టీ రంగులు కాకుండా తటస్థ రంగును ఉపయోగించడంతో పాటు ఆ వాహనాలపై సీఎం జగన్మోహన్రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బొమ్మలను తొలగించాలని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ముగిసేంత వరకు తటస్థ రంగులను ఇలాగే ఉంచాలంటూ ఎన్నికల కమిషనర్ ఈ నెల 5న జారీ చేసిన ఉత్తర్వులను రాజ్యాంగ విరుద్ధంగా, ఏకపక్షంగా ప్రకటించాలని కోరుతూ పౌర సరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను ప్రతివాదిగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ డీవీఎస్ సోమయాజులు విచారణ జరపనున్నారు. పిటిషన్లో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి. ఈ పథకం పాతదే.. ‘ఇంటింటికీ రేషన్’పథకాన్ని 2019 జూన్‌లోనే శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించాం. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన నిమిత్తం సంచార వాహనాల ద్వారా సరుకుల పంపిణీకి నిర్ణయించి.. 9,260 వాహనాలను సమకూర్చాం. కోవిడ్ వల్ల ఈ పథకాన్ని 2020లోనే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం సాధ్యం కాలేదు. 2021 జనవరిలో వాహనాలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి. జనవరి 21న ఈ వాహనాలను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే మొదలు పెట్టిన పథకాలను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులిచ్చింది. ఈ విషయాలన్నీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అయినా.. వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులున్నాయంటూ ఇంటింటికీ రేషన్ పంపిణీని నిలిపి వేస్తూ ఎన్నికల కమిషనర్ గత నెల 28న ఉత్తర్వులిచ్చారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. పథకం అమలు ఎందుకు అవసరమో ఆధారాలతో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను 48 గంటల్లో ఆశ్రయించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై 5 రోజుల్లో నిర్ణయం వెలువరించాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషనర్‌కు ఫిబ్రవరి 1న వినతిపత్రం సమర్పించాం. అన్ని వివరాలను తెలియజేసి.. పథకం ఎంత అవసరమో వివరించాం. వాహనాలపై ఉండే రంగులు అధికార పార్టీ రంగులు కాదని, వాటిని ఏ రాజకీయ పార్టీకి ఆపాదించవద్దని వివరించి పథకం అమలుకు అనుమతివ్వాలని కోరాం. అయినప్పటికీ ఎన్నికల కమిషనర్ ఈ పథకం అమలుపై పలు సందేహాలు వ్యక్తం చేస్తూ ఈ నెల 5న ఉత్తర్వులిచ్చారు. దీనిని బట్టి ముందుగానే తీసుకున్న నిర్ణయం ఆధారంగానే కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారనే విషయం స్పష్టమవుతోంది అని కోన శశిధర్ ఆ పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. -
ఇంటికే వచ్చారు.. రేషన్ ఇచ్చారు
సాక్షి, అమరావతి: పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటికీ రేషన్ పంపిణీ’ పథకం పట్టణాల్లో సోమవారం ప్రారంభమైంది. మొన్నటి వరకు సరుకుల కోసం పేదలు రేషన్ షాపుల వద్ద వేచి ఉండే పరిస్థితి. ఒక్కోసారి పేదలు కూలి పనులు మానుకుని రేషన్ సరుకుల కోసం వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఇబ్బందులను గుర్తించి లబ్ధిదారుల ఇంటికే వెళ్లి సరుకుల పంపిణీ చేసేందుకు వీలుగా 9,260 వాహనాలను కొనుగోలు చేయడంతో పాటు వాటిని వెంటనే వినియోగంలోకి తెచ్చారు. రాష్ట్రమంతటా సోమవారం నుంచి లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి రేషన్ సరుకులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టగా.. పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ సరఫరాను నిలిపివేయాలంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో నాణ్యమైన బియ్యం పంపిణీ మొదటి రోజున కేవలం పట్టణాల్లో మాత్రమే ప్రారంభించారు. మొబైల్ వాహనదారులకు ఈ–పాస్ వినియోగం, తూకం వేయడం, ఇళ్ల దగ్గరకు వెళ్లి సరుకులు పంపిణీ కొత్త కావడంతో అక్కడక్కడా కొంత ఆలస్యంగా ప్రారంభమైంది. తొలి రోజు 83,387 మంది కుటుంబాలకు 12.86 లక్షల కిలోల నాణ్యమైన బియ్యం పంపిణీ చేసినట్టు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. గ్రామాల్లో పంపిణీకి అనుమతివ్వండి హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇంటింటికీ సరుకుల పంపిణీకి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రమంతటా అమలు చేయాలని ఎన్నికలకు ముందే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. -
పట్టణాల్లో నేటి నుంచి ఇంటింటికీ రేషన్
సాక్షి, అమరావతి: పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పంపిణీ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ‘ఇంటింటికీ రేషన్’ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్రం అంతటా ఒకేసారి ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం కొనుగోలు చేసిన 9,260 మొబైల్ వాహనాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 21న ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. ఇందుకు ప్రభుత్వం సవివరంగా ఎస్ఈసీకి తిరుగు సమాధానం ఇచ్చింది. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఈ దేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో వివరించింది. వాస్తవంగా ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా అమలవుతోందని, ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు వీలుగా అనుమతించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టులో ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విషయమై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నేటి నుంచి ఇంటింటికీ రేషన్ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. -
ఇంటింటికీ రేషన్ పథకం పేదల కోసమే..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి వినతి అందుకున్న 5 రోజుల్లో దానిపై తగిన నిర్ణయం వెలువరించాలి. అనుమతి విషయంలో అంతిమ నిర్ణయం ఎన్నికల కమిషన్‌దే. నిర్ణయం తీసుకునే ముందు ఇంటింటికీ రేషన్ పథకం వల్ల పెద్ద సంఖ్యలో పేదలు లబ్ధి పొందుతారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. – హైకోర్టు సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన ‘ఇంటింటికీ రేషన్’ పథకం పేద ప్రజల కోసం ఉద్దేశించిందని, అందువల్ల ఈ పథకం అమలు జరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ పథకం ఓ రాజకీయ పార్టీ చేపట్టిన కార్యక్రమం ఎంత మాత్రం కాదని, అది ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమని తెలిపింది. అందువల్ల రాజకీయ నాయకులతో, రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంటింటికీ రేషన్ పథకాన్ని అధికారుల ద్వారా అమలు చేసుకోనివ్వడానికి అనుమతి ఇవ్వడంలో తప్పులేదని అభిప్రాయపడింది. ఈ పథకం అమలు ఎందుకు అవసరమో తగిన ఆధారాలతో వివరిస్తూ ఎన్నికల కమిషన్‌ను 48 గంటల్లో ఆశ్రయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త పథకం కాదు.. జూలైలోనే సీఎం ప్రకటించారు.. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా> సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ పథకం అమలును నిలిపేసే దిశగా ఈ నెల 28న ప్రొసీడింగ్స్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి అత్యవసరంగా హైకోర్టులో హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ బాగ్చీ తన ఇంటి వద్ద నుంచి విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ, ఇంటింటికీ రేషన్ పథకం కొత్త పథకం ఎంత మాత్రం కాదని వివరించారు. 2019 జూలైలోనే ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటన చేశారని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని, సంచులను, సంచార వాహనాలను సైతం సమకూర్చుకుందని తెలిపారు. లబ్ధిదారుల జాబితా కూడా సిద్ధమైందని కోర్టుకు నివేదించారు. పార్టీల రహితంగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్టీ రంగులపై ఎన్నికల కమిషన్ లేవనెత్తున్న అభ్యంతరాల్లో అర్థం లేదన్నారు. ఎన్నికల నియమావళిలో ఓ పథకంపై పూర్తిగా నిషేధం విధించాలని ఎక్కడా లేదని తెలిపారు. సంచార వాహనాల రంగులపైనే కమిషన్ అభ్యంతరం ఈ సమయంలో జస్టిస్ బాగ్చీ జోక్యం చేసుకుంటూ.. ‘ఈ పథకం అమలు కన్నా, ఈ పథకం కోసం ఉపయోగిస్తున్న వాహనాలపైనే ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరం ఉన్నట్లు కనిపిస్తోంది. వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులు ఉండటంపై ఎన్నికల కమిషన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వివరణ కోరింది. అంతే తప్ప ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అందువల్ల మీ వాదన విని, తగిన నిర్ణయం తీసుకునేందుకు ఇరుపక్షాలకు కొంత గడువునిస్తాం’ అని తెలిపారు. తర్వాత ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, ఇంటింటికీ రేషన్ పథకం ఉపయోగాలను, పేదలకు ఆ పథకం అవసరాన్ని ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుందని తెలిపారు. అయితే ఈ పథకం అమలు కోసం ఉపయోగిస్తున్న సంచార వాహనాలపై అధికార పార్టీ రంగులను పోలిన రంగులు ఉన్నాయంటూ కమిషన్‌కు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. అందువల్ల తుది నిర్ణయం తీసుకునేంత వరకు పథకం అమలును వాయిదా వేయాలని కమిషన్ తెలిపిందన్నారు. అధికారుల ద్వారా అమలు మేలు.. ప్రవర్తనా నియమావళి నిబంధనలను పరిశీలిస్తే.. కొత్త పథకాలపై, ఇప్పటికే కొనసాగుతున్న పథకాలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడాన్ని తప్పుపట్టలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇదే సమయంలో కమిషన్ ఓ పథకంపై నిషేధం విధించేటప్పుడు, ఆ పథకం స్వభావం ఏంటి.. పథకం అమలు ఏ దశలో ఉంది.. పథకం కొనసాగింపు అవసరం ఎంత వరకు ఉంది.. పథకం అమలు లేదా వాయిదా ప్రజా ప్రయోజనాలకు విరుద్ధం అవుతుందా.. ఇలా పలు అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం అలాంటి పథకాలపై పూర్తి నిషేధం విధించడం కన్నా, ఆ పథకాలను ఎలాంటి రాజకీయ ప్రమేయం, రాజకీయ నేతల ప్రమేయం, అభిమానుల ఉత్సవాలు వంటివి లేకుండా, అధికారుల ద్వారా అమలు చేయించడంపై కమిషన్ నిర్ణయం తీసుకోవడం మేలన్నారు. ఈ పథకం ప్రజల ప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకమన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రభుత్వ ఆందోళనను విస్మరించడానికి వీల్లేదు.. ‘ఆహార హక్కు, పౌష్టికాహార హక్కును ఈ దేశంలో ప్రతీ పౌరునికి రాజ్యాంగం ప్రసాదించింది. ఇదే సమయంలో ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా, నిష్పాక్షికంగా నిర్వహించాల్సిన బాధ్యతను కూడా ఎన్నికల కమిషన్‌కు రాజ్యాంగం కట్టబెట్టింది. ఈ రెండింటి మధ్య సమతుల్యం ఎలా చేయాలన్నది ఎన్నికల కమిషన్ మొదటగా నిర్ణయం తీసుకోవాలి. కమిషన్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే, ఇంటింటికీ రేషన్ పథకం అమలును నిలిపేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని పరిధి దాటి తీసుకున్న నిర్ణయంగా, పక్షపాత నిర్ణయంగా, దురుద్దేశపూరిత నిర్ణయంగా చెప్పలేం. అయితే కమిషన్ నిర్ణయం వల్ల నిత్యావసరాలను ఆకలితో అలమటిస్తున్న వారికి అందచేయకపోవడంపై ప్రభుత్వం వ్యక్తం చేస్తున్న ఆందోళనను ఎంత మాత్రం విస్మరించడానికి వీల్లేదు’ అని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి పొందడానికి ఈ పథకాన్ని తీసుకురాలేదన్న అడ్వొకేట్ జనరల్ వాదనను న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. నోటిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియకు ఎన్నికల కమిషన్ రథసారథి అవుతుందని, ప్రస్తుతం అమలవుతున్న పథకాలు, కొత్త çపథకాల అమలుతో సహా ప్రతీ ప్రభుత్వ చర్యను పర్యవేక్షించవచ్చని జస్టిస్ బాగ్చీ తెలిపారు. ఆ పథకాలు రాజకీయ లబ్ధి కోసం కాకుండా పేదల ప్రయోజనం కోసం అమలయ్యేలా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేయవచ్చన్నారు.