ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Grain Collection And Ration Door Delivery | Sakshi
Sakshi News home page

ఫిబ్రవరి 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ: సీఎం జగన్‌

Published Mon, Jan 4 2021 4:29 PM | Last Updated on Mon, Jan 4 2021 6:34 PM

CM YS Jagan Review On Grain Collection And Ration Door Delivery - Sakshi

సాక్షి, తాడేపల్లి: ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్‌ కోన శశిధర్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు సీనియర్‌ అధికారులు హాజరయ్యారు.(చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్‌)

ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని, ఈ ఖరీఫ్‌కు సంబంధించి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరపాలని సీఎం సూచించారు.

ఈ నెల 3వ వారంలో డోర్‌ డెలివరీ వాహనాలు:
ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు.

అదే రోజున 10 కిలోల రైస్‌ బ్యాగ్స్‌ ఆవిష్కరణ
వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ.
ఇందు కోసం 9260 మొబైల్‌ యూనిట్లు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలు.
 2.19 కోట్ల నాన్‌ ఓవెన్‌ క్యారీ బ్యాగులు రెడీ.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్‌ మైనారిటీలకు నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలు.
లక్ష్యానికి మించి ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాహనాలు కేటాయింపు.
ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, బీసీలకు 3875, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్‌ మైనారిటీలకు 85 వాహనాలు.
వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటా.
సంక్షేమ కార్యక్రమంలో భాగంగా, ఆయా కార్పొరేషన్ల ద్వారా వారికి రుణాలు. 
అందుకోసం ప్రతి జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా లోన్‌ ఫెసిలిటేషన్‌ క్యాంప్‌ల నిర్వహణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement