Grain collection
-
సన్నాల్లో గోల్మాల్ జరిగితే కలెక్టర్లే బాధ్యులు
సాక్షి, హైదరాబాద్: రైతులకు ఇచ్చిన మాట ప్రకా రం రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచే సన్నాలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వటం ఇదే మొదటిసారి కావటంతో తగిన జాగ్ర త్తలు తీసుకోవాలని, ఎక్కడా ఎలాంటి తప్పు జరగ కుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందని హెచ్చరించారు. సన్న వడ్ల కొనుగోలుకు ప్రత్యే క ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్ట ర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించా రు. ధాన్యం సేకరణ, డీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, టీచర్ల నియామక ప్రక్రియను దసరా లోపు పూర్తి చేసే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి ఉత్తమ్‌కు మార్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు వెంకటేశం, రఘునందన్‌రావు, పౌరసరఫరాల కమిషనర్ డీఎస్,చౌహాన్ జిల్లాల నుంచి మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ సన్నాల సేకరణకు వీలుగా వేర్వేరు కొనుగోలు కేంద్రాలు, లేదా వేర్వేరు కాంటాలు ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సన్న రకాలను ధ్రువీకరించే యంత్రాలు, సిబ్బందిని అన్ని కేంద్రాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. సన్నవడ్ల సేకరణలో అప్రమత్తంగా లేకపోతే గోల్మాల్ జరిగే ప్రమాదముందని సీఎం అప్రమత్తం చేశారు. అటువంటి తప్పులు, అవకత వకలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. రాష్ట్రంలో ఈ వానాకాలంలో 66.73 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, ఈసారి రికార్డు స్థాయిలో 140 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసిందని సీఎం చెప్పారు. ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 7,000 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు చేరాలన్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు సరిపోని పక్షంలో కలెక్టర్లు నిర్ణయం తీసుకొని అదనంగా కొత్త కేంద్రాలను తెరవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతీ కేంద్రానికి ఓ నంబర్..ప్రతీ కొనుగోలు కేంద్రానికి ఒక నంబర్ కేటాయించాలని, ఆ కేంద్రంలో కొనుగోలు చేసిన వడ్ల సంచులపైన ఆ నంబర్ తప్పకుండా వేయాలని సీఎం సూచించారు. దీంతో ఏ తప్పు జరిగినా, ఏ దశలో గోల్మాల్ జరిగినా సులభంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా కట్టడి చేయాలని ముఖ్యమంత్రి పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. అన్ని మార్గాల్లోనూ నిఘా ఉంచాలని, చెక్ పోస్టుల వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని చెప్పారు రైతులను వేధించొద్దు...తాలు ,తరుగు, తేమ పేరుతో రైతులను మోసం చేసే వారిని సహించొద్దని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టాలని సీఎం చెప్పారు. రైతులు ఎక్కడ కూడా దోపిడీకి గురి కాకూడదని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును కలెక్టర్లు బాధ్యతగా స్వీకరించాలని కోరారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో సరిపడే సంఖ్యలో గోనె సంచులు, టార్ఫాలిన్లు, మాయిశ్చర్ మెషీన్లు, డ్రైయర్లు, ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రతి గంటకోసారి కొనుగోలు కేంద్రాలకు వాతావరణ శాఖ సూచనలను చేరవేయాలని, దానికి అనుగుణంగా కేంద్రాల్లో ధాన్యం తడవకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. కలెక్టర్లు తమ జిల్లాలో జరుగుతున్న కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించాలని, ప్రతి రోజు ఉదయం నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి కేంద్రాలను పరిశీలించాలని ఆదేశించారు. పాత పది జిల్లాలకు నియమించిన ప్రత్యేకాధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియను పర్యవేక్షించాలని సీఎం సూచించారు. సమస్యల పరిష్కారానికి పౌరసరఫరాల విభాగంలో 24 గంటల కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. జనవరి నుంచి రేషన్‌షాపుల్లోనూ సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు. డిఫాల్ట్ మిల్లర్లకు ధాన్యం ఇవ్వొద్దని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన 5వ తేదీలోగా పూర్తి చేయండిఅన్ని జిల్లాల్లో డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనను 5వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మొత్తం 11,062 మంది ఎంపికైన అభ్యర్థులకు దసరా పండగలోపు నియామక పత్రాలను అందిస్తామని ప్రకటించారు. అక్టోబర్ 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందించేందుకు వీలుగా జిల్లాల్లో వేగంగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే 9,090 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిందని విద్యాశాఖ అధికారులు సీఎంకు వివరించారు. -
ధాన్యం సేకరణ పూర్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం సేకరణ దాదాపు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా గన్నీ, హమాలీ, రవాణా (జీఎలీ్ట) చార్జీల కింద టన్నుకు రూ.2,523 అదనంగా చెల్లిస్తూ రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఫలితంగా రైతులు ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపే మొగ్గు చూపారు. దీంతో దళారులు, కొంతమంది మిల్లర్ల దోపిడీకి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడింది. ప్రైవేటు వ్యాపారులు తమకు గతంలో మాదిరిగా ధాన్యం అమ్మకానికి రాకపోవడంతో చేసేదేమీ లేక రైతులకు పూర్తి మద్దతు ధర ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2023–24 రబీలో 25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే.. మార్కెట్లో డిమాండ్ బాగుండటంతో ఎక్కువ భాగం వ్యాపారులే రైతులకు మంచి ధర చెల్లించి కొనుగోలు చేయడంతో ఆర్బీకేల్లో అనుకున్న స్థాయి కంటే ధాన్యం సేకరణ తక్కువగా ఉంది. డబ్బుల కోసం ఎదురుచూపు: రబీ సీజన్లో ఇప్పటివరకు 1.32 లక్షల మంది రైతుల నుంచి రూ.2,767.90 కోట్ల విలువైన 12.63 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బుల కోసం అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లో తప్పనిసరిగా చెల్లింపుల చేసేలా వ్యవస్థను తీసుకొచ్చి0ది. చాలా సందర్భాల్లో ఒకట్రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు జమయ్యాయి కూడా. ఈ రబీలో ఎన్నికల హడావుడిలోనూ రైతులకు సకాలంలో చెల్లింపులు చేసింది. మే 12న 45,468 మంది రైతుల ఖాతాల్లో రూ.1,008.93 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత చెల్లింపులు నెమ్మదించాయి. ఇప్పటివరకు 49,894 మంది రైతులకు రూ.1,104.46 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా 82,825 మంది రైతులకు రూ.1,657.44 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ధాన్యం సేకరణ తర్వాత నిర్ణీత గడువు ముగిసిన రైతులు చాలామంది ఉండటం.. ఖరీఫ్ సాగు కోసం సమాయత్తం కావడానికి చేతిలో డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. -
ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక
సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు -
సీఎం జగన్ ఆదేశాలు.. సాయం శరవేగం
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: తుపాను ప్రభావానికి గురైన జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం వేగంగా సహాయక చర్యలు చేపట్టింది. తుపాను ప్రారంభం కాక ముందు నుంచే కట్టుదిట్టంగా ముందస్తు ఏర్పాట్లు చేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగారు. ఎనిమిది జిల్లాల్లో 320 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి.. 20,572 మందిని తరలించారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 124 శిబిరాల్లో 6,077 మందికి ఆశ్రయం కల్పించారు. తిరుపతి జిల్లాలో 36 కేంద్రాల్లో 3,386 మందికి, పశ్చిమగోదావరి జిల్లాలో పన్నెండు కేంద్రాల్లో 5,113, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 37 కేంద్రాల్లో 910, బాపట్ల జిల్లాలో 74 కేంద్రాల్లో 3,888, గుంటూరులో 14 శిబిరాల్లో 1,111, కోనసీమ జిల్లాలో 36 శిబిరాల్లో 910, పశ్చిమ గోదావరిలో 32 శిబిరాల్లో 5,113, తూర్పు గోదావరిలో 3 కేంద్రాల్లో 87 మందికి పునరావాసం కల్పించారు. బాధితులందరికీ భోజనం, మంచి నీటి సౌకర్యం కల్పించారు. వారికి అక్కడే నిత్యావసరాలు అందిస్తున్నారు. బాధిత కుటుంబాలు ఇళ్లకు వెళ్లే ముందు ఆర్థిక సాయంగా రూ.1000 నుంచి రూ.2500 అందిస్తున్నారు. తుఫాను ప్రభావిత గ్రామాల్లో 6 ఎస్డీఆర్ఎఫ్, 6 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ, మచిలీపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, ఉలవపాడు, బాపట్ల, నాయుడుపేటలో ఈ బృందాలు సేవలు అందిస్తున్నాయి. అధికార యంత్రాంగం దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరించడంతో రాకపోకలు యధాతథంగా కొనసాగుతున్నాయి. వర్షం తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు ఆర్బీకే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరోవైపు రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యలతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఆపదలో ఉన్న రైతులను గుర్తించడమే కాకుండా, వారి వద్ద నుంచి ధాన్యం కొనుగోలు వెంటనే కొనుగోలు చేయడంలో వలంటీర్లు కీలక పాత్ర పోషించారు. సీఎం ఆదేశాల మేరకు తేమ శాతంతో సంబంధం లేకుండా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. బాపట్ల జిల్లా రావికంపాడులో రైతులతో కలసి వర్షపు నీటిని పొలం నుంచి బయటకు మళ్లిస్తున్న ఆర్బీకే సిబ్బంది.. యుద్ధ ప్రాతిపదికన కదిలిన యంత్రాంగం ► ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాత్రింబవళ్లు 3 వేల మందికి పైగా విద్యుత్ అధికారులు, సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ సరఫరాను పునరుద్ధరించారు. బాపట్ల జిల్లాలో అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు బాధితులకు సహాయం అందించే పనుల్లో నిమగ్నమయ్యారు. 353 విద్యుత్ స్తంభాలను శాఖ అధికారులు తిరిగి పునరుద్ధరించారు. కూలిపోయిన 282 చెట్లను రోడ్లపై నుంచి తొలగించారు. 261 గ్రామాలలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. 74 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి, 3,888 మందికి పునరావాసం కల్పించారు. బుధవారం ఉదయం నుంచే ఉపాధి హామీ కూలీలతో వరి పంట పొలాల్లోని నీటిని బయటకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. 93 చోట్ల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశారు. పశువులకు సైతం వైద్య సేవలు అందిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు వచ్చిన ఒక్కో కుటుంబానికి రూ.2,500 పంపిణీ చేశారు. 25 కేజీల బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. దెబ్బతిన్న ఇళ్లకు రూ.10 వేలు పరిహారం పంపిణీ చేస్తున్నారు. మంత్రి మేరుగ నాగార్జున, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి తదితరులు బాధితులకు ధైర్యం చెప్పారు. తిరుపతి జిల్లా కోట మండలం రొయ్యలగుంతల వద్ద చిక్కుకున్న వారిని తీసుకువస్తున్న రెస్క్యూ టీం ► తిరుపతి జిల్లాలో నిర్వాసితుల కోసం 80 పునరావాస కేంద్రాలు, 80 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 25 వేల కుటుంబాలకు ప్రభుత్వ సాయం పంపిణీ చేస్తున్నారు. రూ.వెయ్యి నుంచి రూ.2,500 నగదుతో పాటు ఐదు రకాల వస్తువులు పంపిణీ చేస్తున్నారు. దైవాలదిబ్బ సమీపంలో రొయ్యలగుంతల వద్ద కాపలాదారులుగా పని చేస్తున్న 18 మంది వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. గూడూరు ఆర్డీఓ కిరణ్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది సాయంతో 18 మందిని ఒడ్డుకు చేర్చారు. నగరి నియోజకవర్గంలో మంత్రి ఆర్కేరోజా తన చారిటబుల్ ట్రస్టు ద్వారా తన సోదరుడు రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ట్యాంకర్ల ద్వారా తాగు నీరు సరఫరా చేశారు. ► కాకినాడ జిల్లాలో సుడిగాలికి దెబ్బతిన్న పిఠాపురం మండలం పి.దొంతమూరు, కొత్తపల్లి మండలం కొండెవరంలలో 100 కుటుంబాల వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన వసతి సదుపాయాలు కల్పించారు. కోనసీమ జిల్లాలో సహాయ, పునరావస చర్యలు వేగమందుకున్నాయి.అమలాపురం మున్సిపాలిటీతోపాటు పలు గ్రామాల్లో రోడ్డుకు అడ్డుగా పడిన చెట్లను తొలగిస్తున్నారు. వరి చేలల్లో మంపు నీరు దిగేందుకు ఉపాధి హామీ పథకం కూలీలు డ్రెయిన్లలో పూడిక తొలగింపు పనులు చేపట్టారు. కూనవరం డ్రెయిన్ మొగ వద్ద ముంపునీరు దిగేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. తద్వారా సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు పరిధిలోని ముంపు నీరు వేగంగా సముద్రంలోకి దిగనుంది. అయినవిల్లి మండలం మాగాంలో దెబ్బతిన్న వరిచేలను కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ప్రత్యేకాధికారి జయలక్ష్మిలు బుధవారం పరిశీలించారు. అమలాపురం పట్టణంలో 28,29,14,11 వార్డులలో ముంపు బాధితులకు వార్డు సచివాలయ సిబ్బంది, వలంటీర్లు భోజనాలు అందించారు. మరోవైపు ధాన్యం కొనుగోలును కొనసాగించారు. 17 శాతం తేమ అధికంగా ఉన్నా, రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 3వ తేదీ నుంచి బుధవారం వరకు 14,278 మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు. -
ధర వరించేలా!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం కోతలు ప్రారంభమయ్యాయి. దిగుబడులు సైతం ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో నవంబర్ మొదటి వారం నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో రైతులకు సంపూర్ణ మద్దతు ధర కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం 3,500 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్బీకేల్లో ఈ–క్రాప్ సోషల్ ఆడిట్ పూర్తయిన వెంటనే షెడ్యూల్ ఇచ్చి రైతుల నుంచి ధాన్యం సేకరించనుంది. ఏ–గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 చొప్పున మద్దతు ధర చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి జిల్లాలకు ఎటువంటి లక్ష్యం నిర్ధేశించకుండా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేలా ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్లోనూ మంచి ధర ఖరీఫ్‌లో 67.43 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఇందులో 50 శాతం వరకు ఏ–గ్రేడ్ (ఫైన్ వెరైటీలు) ఉండటం విశేషం. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పంజాబ్ రైస్–126 రకాన్ని ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొత్తం దిగుబడుల్లో విత్తనాలకు, గృహ అవసరాలతోపాటు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుండగా.. 50–60 శాతం ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. కాగా.. అంతర్జాతీయ మార్కెట్లో బియ్యానికి డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఫైన్ వెరైటీలతోపాటు సాధారణ ధాన్యం రకాలను కూడా వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం రైతులకు పారదర్శకంగా సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు ఆరి్థక భారాన్ని తగ్గిస్తూ రవాణా, హమాలీ, గన్నీ చార్జీల కింద టన్నుకు రూ.2,523 అందిస్తోంది. తద్వారా బయటి వ్యాపారులు తమకు కావాల్సిన ధాన్యాన్ని మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పకడ్బందీగా రవాణా ఏర్పాట్లు రవాణా శాఖ, లారీ ఓనర్స్ అసోసియేషన్ల సమన్వయంతో జాప్యం లేకుండా కళ్లాల్లోని ధాన్యాన్ని తరలించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి ఆర్బీకే పరిధిలో 10–15 వాహనాలకు జీపీఎస్ పరికరాలను అమర్చి ధాన్యం రవాణాను పర్యవేక్షించనున్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో నవంబర్ తొలి రెండు వారాల్లో ధాన్యం అధికంగా వచ్చే అవకాశం ఉంది. మూడవ వారంలో ఎన్టీఆర్, నాలుగో వారంలో పార్వతీపురం మన్యం, చివరి వారంలో శ్రీకాకుళం, విజయనగరంలో పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో విశాఖపట్నం, అనకాపల్లితో పాటు డిసెంబర్ నెలాఖరు నుంచి పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, కడప జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. చాలా ప్రాంతాల్లో లేట్ ఖరీఫ్‌తో కోతలు ఆలస్యం అవుతున్నాయి. దళారులతో పని లేకుండా.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థను రూపుమాపి చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మిల్లర్ల ప్రమేయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపడుతోంది. 21 రోజుల్లోనే మద్దతు ధర జమ చేసేలా ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోళ్లలో నిబంధనలను వివరిస్తూ రైతుల్లో చైతన్యం తీసుకొస్తోంది. రైతులు ఆర్బీకేలో ధాన్యం ఇచ్చిన తర్వాత ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్‌టీవో) వచ్చేలా ఏర్పాట్లు చేసింది. అందులో ధాన్యం వివరాలు, ప్రభుత్వం నుంచి వచ్చే మద్దతు ధర నమోదై ఉంటాయి. ఎఫ్‌టీవో జనరేట్ అయితే రైతుకు, ధాన్యానికి సంబంధం ఉండదు. పూర్తి మద్దతు ధర ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రవాణా, దిగుమతి, మిల్లర్‌కు సరుకు వచ్చినట్టు ఇచ్చే క్లియరెన్స్‌ను మిల్లుల వద్ద ప్రభుత్వం నియమించే కస్టోడియన్ (డిప్యూటీ తహసీల్దార్ స్థాయి) అధికారులు చూసుకుంటారు. తేమ, ఇతర నాణ్యత విషయంలో ఆర్బీకేలో ధ్రువీకరించిన ప్రమాణాలను మిల్లరు ఫైనల్‌గా పరిగణించాల్సిందే. రైతులకు మిల్లర్ నుంచి ఎటువంటి ఒత్తిడి/డిమాండ్ వచ్చినా ప్రభుత్వ కాల్‌సెంటర్ 1967కు సంప్రదిస్తే వెంటనే చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. కొనుగోళ్లకు సిద్ధం గోదావరి జిల్లాల్లో కోతలు మొదలయ్యాయి. వచ్చే వారంలో 150 ఆర్బీకేల్లో పంట కొనుగోళ్లు ప్రారంభమవుతాయి. ఇప్పటికే కోతలు పూర్తయిన చోట రైతులు పంటను ఆరబెడుతున్నారు. మార్కెట్లో ధాన్యానికి గిరాకీ పెరుగుతోంది. అందుకే గోదావరి జిల్లాల్లో ఫైన్ వెరైటీలతో పాటు సాధారణ రకాలను కూడా ప్రైవేటు వ్యాపారులు మంచి ధరకు కొంటున్నట్టు తెలుస్తోంది. రైతుకు పూర్తి మద్దతు ధర అంటే ఎక్కువ రేటు తీసుకురావడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. పెద్ద మిల్లుల్లో ధాన్యం ఆరబోతకు డ్రయర్లు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాం. తొలుత వంద మిల్లుల్లో పెట్టాలని కోరాం. – జి.వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత పంట ఉత్పత్తులు బాగుండటంతో మార్కెట్లో ధర కూడా బాగా పలుకుతోంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వచ్చినా తీసుకుంటాం. రైతులు ఆర్బీకేల్లో ధాన్యం ఇచ్చిన తర్వాత పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్బీకేల వారీగా అవసరమైన సంచులను అందుబాటులో ఉంచాం. సీఎంఆర్ కేటాయించిన ప్రకారం మిల్లర్లు సంచులు అందిస్తారు. ధాన్యం రవాణా కోసం ముందస్తుగానే వాహనాలను రిజిస్ట్రేషన్ చేశాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ మద్దతు ధరల చెల్లింపు ఇలా.. ఏ–గ్రేడ్ ధాన్యం: రూ.2,203 (క్వింటాల్‌కు) రవాణా, హమాలీ, గన్నీ చార్జీలు:రూ.2,523 (టన్నుకు) సాధారణ రకాలకురూ.2,183 (క్వింటాల్‌కు) -
అక్టోబర్ చివరి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతన్నకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ క్షేత్రం (ఫామ్ గేట్) నుంచే అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించి మార్చి నెలాఖరులోగా సేకరణ పూర్తి చేయనుంది. ఇటీవల ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను రూ.163 మేర పెంచి రూ.2,203 గా ఖరారు చేసింది. సాధారణ వరి రకానికి రూ.143 పెంచి రూ.2,183గా నిర్ణయించింది. రాష్ట్రంలో వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో సుమారు 5 లక్షల టన్నులు బాయిల్డ్ వెరైటీలు కొనుగోలు చేయనుంది. ఈ ఖరీఫ్‌లో 3,500 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా 10,500 మంది సిబ్బంది భాగస్వామ్యంతో ధాన్యం సేకరిస్తారు. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని 1,670 మిల్లుల్లో మర ఆడిస్తారు. ఇందులో 53 బాయిల్డ్, 550 డ్రయర్ సౌకర్యాలున్న మిల్లులు ఉన్నాయి. వర్షాలకు ఎక్కడైనా ధాన్యం తడిస్తే రైతుకు నష్టం కలగకుండా దానిని కూడా కొని డ్రయర్ ఉన్న మిల్లులకు తరలిస్తారు. గోనె సంచులతోపాటు హమాలీలు, రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వమే అందిస్తుంది. రైతులే గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే వాటికయ్యే ఖర్చును రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ధాన్యం తరలింపునకు 5 వేల ట్రక్కులను సిద్ధం చేస్తున్నారు. అవి నిర్దేశిత మిల్లులకు వెళ్లేలా జీపీఎస్, మొబైల్ ట్రాకర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో బయట మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు తగ్గి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇలా లక్ష్యానికి మించి ధాన్యం వచ్చినా కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంకంటే ముందే.. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి బయోమెట్రిక్ ఆధారిత కొనుగోళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 ఖరీఫ్‌లోనే పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా చేసిన ఈ క్రాప్ నమోదు ప్రకారమే కొనుగోళ్లు చేపడుతున్నారు. తద్వారా దళారులు, మిల్లర్ల మోసాలను అరికట్టి రైతులకు మద్దతు దక్కేలా చేస్తున్నారు. గతంలో దళారులు రైతుల నుంచి తక్కువ రేటుకు ధాన్యం కొని తిరిగి అదే రైతుల పేరుతో ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధరను కొట్టేసేవారు. ఇటువంటివి జరగకుండా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుకు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీఓ) సమయంలో ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ధాన్యం నగదు చెల్లింపులను సైతం ఆధార్ సీడింగ్ కలిగిన రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతులను మిల్లర్లు ఇబ్బందిపెట్టకుండా చర్యలు ధాన్యం కొనుగోళ్ల సమయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకే పరిధి నుంచి ధాన్యాన్ని దూరంగా తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఆ మండలంలోని మిల్లులను ట్యాగ్ చేస్తాం. ఇప్పటికే జిల్లాలవారీగా సేకరణ అంచనాలను రూపొందిస్తున్నాం. గోనె సంచుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. రైతులకు నగదు చెల్లింపు సమయంలో బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసఫరాల సంస్థ కస్టమ్ మిల్లింగ్‌పై పర్యవేక్షణ ఇప్పటికే 1,474 మిల్లుల్లో సీసీ కెమెరాల ద్వారా కస్టమ్ మిల్లింగ్‌ను పర్యవేక్షిస్తున్నాం. మిల్లుల సామర్థ్యం ఆధారంగా సీఎంఆర్ కేటాయిస్తున్నాం. మిల్లుల్లో విద్యుత్ వినియోగం లెక్కలనుబట్టి కస్టమ్ మిల్లింగ్ జరిగిందా లేదా అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 49, మార్చిలో 33, ఏప్రిల్‌లో 118, మే – జూన్‌లో 53 మిల్లుల్లో డీవియేషన్‌ను గుర్తించాం. ఇందులో 31 మిల్లులపై చర్యలు తీసుకున్నాం. మిగిలిన వాటిపై విచారణ జరుగుతోంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశాం. గతేడాది ఖరీఫ్‌లో 6.39 లక్షల మంది రైతుల నుంచి రూ.7,222 కోట్లు విలువైన 35.36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నాం. ప్రస్తుత ఖరీఫ్‌లో 15.25 లక్షల హెక్టార్లలో వరి సాగవగా 80 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు. ఇందులో 40 లక్షల వరకు సేకరణకు ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు. దీనిని కస్టమ్ మిల్లింగ్ చేస్తే 28 లక్షల టన్నులకు పైగా బియ్యం వస్తుందని ఆశిస్తున్నాం. రైతులు మద్దతు ధరలో పైసా కూడా నష్టపోకుండా, ఆర్బీకేల్లోనే ధాన్యం విక్రయించేలా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి -
రైతులకు ఒకేరోజు రూ.3 వేలకోట్లు
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని.. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విడుదల ప్రక్రియ దాదాపుగా ముగిసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రూ.3,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ఈ నెల 20వ తేదీలోగా ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు సొమ్ము అందే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈసారి యాసంగిలో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65.10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ ఈ యాసంగిలో గురువారం నాటికి 11 లక్షల మంది రైతుల నుంచి రూ.13,383 కోట్ల విలువైన 65.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి తెలిపారు. ఇందు లో ఓపీఎంఎస్లో రూ. 10,439 కోట్ల రసీదులు అప్లోడ్కాగా.. ఇప్పటి వ రకు రూ.9,168 కోట్లు వి డుదల చేశామన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి.. సాధారణం కంటే పదిరోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యం సేకరణ మొదలుపెట్టామని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,037 కొనుగోలు కేంద్రాలను తెరిచామని.. ఇప్పటికే 90శాతానికి పైగా సేకరణ çపూర్తవడంతో 6,366 కేంద్రాలను మూసేశామన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని, మిగతా జిల్లాల్లోనూ ఆది వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎక్కడైనా ఆలస్యంగా వరి కో తలు జరిగిన ప్రాంతాల్లో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. కొనుగోళ్లు చేపట్టేందు కు కలెక్టర్లకు అధికారం ఇచ్చామని వివరించారు. గత యాసంగి సీజన్ కన్నా ఈసారి ఇప్పటికే 16లక్షల టన్నులు అధికంగా సేకరించామన్నారు. కేసీఆర్ రైతు అనుకూల విధానాలతోనే.. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలైన రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, అందుబాటులో సాగునీరు, మద్దతు ధరతో కొనుగోళ్లు వంటి కారణాలతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కేవలం తొమ్మిదేళ్లలో ధాన్యం సేకరణలో దేశం గరి్వంచే స్థితికి తెలంగాణ చేరుకుందని వివరించారు. ఓవైపు పంటను సేకరిస్తూనే, మరోవైపు అకాల వర్షాల నుంచి కాపాడేందుకు పౌరసరఫరాల యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. -
మిల్లర్లు సహకరించకుంటే ఇంటర్మీడియట్ గోడౌన్లకు ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ వేగంగా జరుగుతోందని, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధాన్యం అన్లోడింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం విక్రయాల కోసం రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలని, మిల్లుల వద్ద స్టోరేజీ లేని చోట, మిల్లులు సహకరించని చోట తక్షణమే ఇంటర్మీడియట్ గోడౌన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాల వారీగా అవసరమైన చోట ఇంటర్మీడియట్ గోడౌన్లలో మిల్లర్లతో సంబంధం లేకుండా అన్లోడింగ్ చేసి రైతులకు సకాలంలో డబ్బులు అందేలా చూడాలని స్పష్టం చేశారు. రైతులు కేంద్రం నిర్దేశించిన ఎఫ్ఏక్యూ ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తెచ్చేలా అవగాహన పెంపొందించాలని కలెక్టర్లకు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎఫ్ఏక్యూ ప్రకారమే ధాన్యం సేకరణ చేయాలని, తాలు, తరుగు సమస్య ఉత్పన్నం కాకూడదన్నారు. పక్క రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లు లేనందున అక్కడి ధాన్యం తెలంగాణలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాన్స్ పోర్ట్ కోసం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఎంచుకొని, అవసరమైన చోట స్థానిక ట్రాక్టర్లను సైతం వాడుకోవాలని మంత్రి కలెక్టర్లకు సూచించారు. రాష్ట్ర సరిహద్దులకు సమీపంలోని జగ్గయ్యపేట, రాయ్ చూర్, బీదర్ తదితర ప్రాంతాల్లో సైతం ఇంటర్మీడియట్ గోదాంలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజారెడ్డి, శ్రీనివాసరావులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. -
తడిసినా కొంటాం
సాక్షి, హైదరాబాద్: అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఒక్క గింజ కూడా పోకుండా వీలైనంత త్వరగా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భరోసా ఇచ్చారు. మామూలు ధాన్యం ధరనే తడిసిన ధాన్యానికీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. రైతన్నల ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుంటోందని, ఆపత్కాలంలో వారి దుఃఖాన్ని, కష్టాన్ని పంచుకునేందుకు మరోసారి సిద్ధమైందని చెప్పారు. రైతుల కష్టాల్లో భాగస్వామ్యం కావడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, అన్నదాతలు ఏమాత్రం ఆందోళన చెందవద్దని కోరారు. యాసంగి ధాన్యంతో పాటు అకాల వర్షాల్లో తడిసిన ధాన్యం సేకరణపై మంగళవారం ఆయన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ జరుగుతోందని, అయితే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ధాన్యం సేకరణ త్వరలోనే పూర్తి చేస్తామని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్ చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. వరి కోతలు వాయిదా వేసుకోవాలి.. మరో మూడు, నాలుగురోజులు వానలు కొనసాగనున్నాయని, అప్పటిదాకా వరి కోతలను వాయిదా వేసుకోవాలని కేసీఆర్ రైతులకు సూచించారు. పంట కోతలకు వెళ్లకుండా సంయమనం పాటించాలని, ధాన్యం తడవకుండా జాగ్రత్త పడాలని కోరారు. ‘రైతుల కోసం చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో కార్యాచరణ అమలు చేస్తున్నది ఈ దేశంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. ఊహించని అకాల వర్షాలు ఎడతెరిపి లేకుండా కొనసాగుతుండడం బాధాకరం. ప్రకృతి వైపరీత్యానికి ఎవరం ఏమీ చేయలేం. కానీ మనకేం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదు. పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేలను అందిస్తూ ఇప్పటికే ఆదుకుంటోంది. రాష్ట్ర ఖజానాకు ఎంత భారమైనా వెనుకంజ వేయకుండా రైతన్నలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది..’ అని సీఎం స్పష్టం చేశారు. ఇక మార్చిలోనే వరి కోతలు.. గతానికి భిన్నంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలను గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో యాసంగి వరి కోతలు మార్చిలోపే జరిపేందుకు ఎలాంటి విధానాలను అవలంభించాలో శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని వ్యవసాయ శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ దిశగా రాష్ట్ర రైతాంగాన్ని చైతన్యం చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఏటా మార్చిలోగా వరి కోతలు పూర్తయ్యేలా ముందస్తుగానే పంట నాటుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. మార్చి తర్వాత అకాల వర్షాలకు అవకాశాలున్నందున ఆ లోపే కోతలు పూర్తి చేసుకోవడం మంచిదన్నారు. ఏప్రిల్, మే వచ్చేదాకా పంట నూర్పకుంటే ఎండలు పెరిగి ధాన్యంలో నూక శాతం కూడా పెరిగిపోతుందని పేర్కొన్నారు. రైతులకు అవగాహన కల్పించాలి ఎరువుల వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రకృతి వైపరీత్యాలు, మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో తలెత్తే మార్పులపై ఎప్పటికప్పుడు రైతాంగానికి అర్థమయ్యే రీతిలో కరపత్రాలు, పోస్టర్లు, వాణిజ్య ప్రకటనలు తదితర ప్రచార మార్గాల ద్వారా అవగాహన, చైతన్యం కల్పించాలని సూచించారు. ఏఈఓలు నిరంతరం రైతులకు అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు తగు సూచనలందించాలని ఆదేశించారు. రైతు వేదికల్లో వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు. అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయన్నారు. ఈ దిశగా పనితీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని సీఎం ఆదేశించారు. -
ధాన్యం సేకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: వచ్చే యాసంగి సీజన్లో తెలంగాణలో పండే పంటలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని జాతీయ అవసరాల కోసం సేకరించేందుకు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. బుధవారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ అధికారులు, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో వచ్చే రబీలో ఏయే రాష్ట్రం నుంచి ఎంత మేర ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేయాలనే దానిపై స్పష్టత ఇచ్చారు. 80 ఎల్ఎంటీ ధాన్యాన్ని మిల్లింగ్ చేయగా వచ్చే 54 లక్షల మెట్రిక్ టన్నుల ముడిబియ్యాన్ని ఈ యాసంగి సీజన్లో కేంద్రం సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. దీనికి సంబంధించి రైతులకు మద్ధతుధరను కేంద్ర ప్రభుత్వం చెల్లించేందుకు అంగీకరించింది. 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడికి అవకాశం యాసంగిలో సాగైన పంట విస్తీర్ణం ఆధారంగా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 1.28 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇందులో బహిరంగ మార్కెట్లో విక్రయాలు, మిల్లర్ల కొనుగోళ్లు , రైతుల సొంత అవసరాలు పోగా 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నట్లు పౌరసరఫరాల శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగానే కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖకు నివేదికలు పంపింది. ఇక ఈ ఏప్రిల్ నుంచి ప్రభుత్వ పథకాలన్నింటికీ బలవర్ధక బియ్యం (ఫోరి్టఫైడ్ రైస్) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ముడి బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్ (ఎఫ్ఆర్కే)తో 1:100 నిష్పత్తిలో కలిపి పంపిణీ చేయనున్నారు. కాగా యాసంగిలో ముడిబియ్యంగా కాకుండా బాయిల్డ్ రైస్‌గా తెలంగాణ నుంచి సేకరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. సమావేశంలో తెలంగాణ ప్రతినిధులుగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ బి.అనిల్‌కుమార్, పౌర సరఫరాల కార్పొరేషన్ జీఎం రాజిరెడ్డి హాజరయ్యారు. -
12 శాతం పెరిగిన ధాన్యం సేకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ధాన్యం సేకరణలో గణనీయమైన వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది సీజన్లో సేకరించిన ధాన్యంతో పోలిస్తే ఈసారి 12 శాతం అధికంగా సేకరించడం విశేషం. గత ఏడాది జనవరి మూడో వారానికి 5.50 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించగా, ఈ ఏడాది ఏకంగా 6.20 కోట్ల మెట్రిక్ టన్నులు సేకరించారు. మద్దతు ధరకు అనుగుణంగా రూ.1.28 లక్షల కోట్ల మేర చెల్లింపులు సైతం చేసినట్లు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజన్ మొత్తం ముగిసే నాటికి 9 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించే అవకాశం ఉన్నట్లు తెలియజేసింది. నిజానికి గత ఏడాది ఖరీఫ్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.1.42 లక్షల కోట్ల విలువైన 7.25 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈసారి విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో భారీగా ధాన్యం సేకరణ జరుగుతోంది. పంజాబ్‌లో 1.81 కోట్ల మెట్రిక్ టన్నులు, ఛత్తీస్‌గఢ్‌లో 92 లక్షలు, హరియాణాలో 58.97 లక్షలు, తెలంగాణలో 59 లక్షల మెట్రిక్ టన్నుల మేర సేకరణ జరిగింది. -
ధాన్యం సేకరణలో ఫలిస్తున్న విప్లవాత్మక మార్పులు
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం ఐదేళ్లలో సేకరించిన ధాన్యం కన్నా ఎక్కువ మొత్తాన్ని ఈ ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే సేకరించింది. అప్పట్లో 2014 నుంచి 2019 వరకు రూ.40,236 కోట్లు వెచ్చించి 2.65 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే... రైతులకు వేలుపట్టి నడిపించటం తన ప్రధాన బాధ్యతగా భావిస్తున్న వై.ఎస్.జగన్ సర్కారు ఈ మూడున్నరేళ్లలోనే ఏకంగా రూ.54,279 కోట్లు ఖర్చుచేసి 2.88 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. రైతుల కష్టం దళారుల పాలు కాకూడదన్న లక్ష్యంతో ఏకంగా 3,725 రైతు భరోసా కేంద్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం కొంటోంది సర్కారు. చెప్పిన గడువు ప్రకారం వాళ్లకు చెల్లింపులు సైతం జరిగిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఐదారు లక్షల మంది రైతుల నుంచి ధాన్యం సేకరిస్తున్నపుడు.. 3,725 ఆర్బీకేల్లో కొనుగోళ్లు జరుగుతున్నపుడు.. ఎక్కడో ఒకరో ఇద్దరో రైతులకు ఇబ్బందులు ఎదురయ్యి ఉండొచ్చు. అయితే ఇన్ని లక్షల మందికి మేలు జరుగుతున్న విషయాన్ని పక్కనబెట్టి.. ఆ ఒకటి రెండు ఘటనలను చూపుతూ ప్రతిపక్షాలు, వాళ్ల ప్రయోజనాల కోసం పనిచేస్తున్న ఓ వర్గం మీడియా మొత్తం ధాన్యం సేకరణ ప్రక్రియనే తప్పుబడుతోంది. ఆ ఒకటి రెండు ఘటనల్ని మాత్రమే పతాక శీర్షికల్లో ప్రచురిస్తూ దు్రష్పచారానికి దిగుతుండటంపై రాష్ట్ర రైతాంగం మండిపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా మిల్లర్లు, మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వమే తమ వద్ద ధాన్యాన్ని కొంటోందని, రవాణా, కూలీ, గన్నీ బ్యాగుల వంటి అంశాలను ఆర్బీకేలే చూసుకుంటున్నాయని, షెడ్యూలు ప్రకారం చెల్లింపులు సైతం జరిగిపోతున్నాయని, మద్దతు ధర చెల్లించటంతో రైతులుగా తమకు పూర్తి న్యాయం జరుగుతోందని వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రైతులే కాదు... ‘ఈనాడు’ పత్రిక పనిగట్టుకుని చేస్తున్న దుష్ప్రచారాన్ని పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్ కూడా ఖండించారు. దళారులను తొలగించటమే ఓ చరిత్ర... రైతుకు, ప్రభుత్వానికి మధ్య దళారులను తొలగించటమనేదే ఓ చరిత్ర. అంతేకాకుండా తన పంటను విక్రయించుకోవాలనుకున్న ప్రతి రైతు నుంచీ.. మద్దతు ధర చెల్లించి ఈ–క్రాప్ డేటా ఆధారంగా పంటను కొనుగోలు చేయటం మరో చరిత్ర. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడి హయాంలో గన్నీ బ్యాగులు, కూలీ, రవాణా రైతుల నెత్తిమీదే పడేది. పైపెచ్చు సకాలంలో రైతులకు చెల్లింపులూ జరిగేవి కావు. ఆయన ఓడిపోయి వెళ్లిపోతూ రైతులకు చెల్లించకుండా వదిలేసిన రూ.980 కోట్ల బకాయిలే ఇందుకు సాక్ష్యం. ఇలాంటివన్నిటినీ సమూలంగా ప్రక్షాళన చేసి.. రైతులను ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా... అక్కడక్కడ ఒకరిద్దరు తెలుగుదేశం కార్యకర్తలను రైతులుగా నిలబెట్టి వారివద్ద మైకు పెట్టి మొత్తం ప్రక్రియనే విమర్శించటమనేది ‘ఈనాడు’, ప్రతిపక్షాలు అమలు చేస్తున్న వ్యూహం. నిజానికి గ్రామస్థాయిలో ఆర్బీకేలు వచ్చాక... ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఏటికేడాది ఇంకా మెరుగుపడుతోంది. వేగం అందుకుంటోంది. ఈ సానుకూలతను ప్రతిపక్ష మీడియా మరుగునపరుస్తున్నా... రైతులు మాత్రం క్షేత్ర స్థాయిలో ప్రశంసిస్తూనే ఉన్నారు. కలెక్టర్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ వరకు.. దశాబ్దాలుగా రైతుల గిట్టుబాటు ధరను దోచుకుంటున్న మిల్లర్లు, దళారులకు తొలిసారిగా ప్రభుత్వం చెక్‌పెట్టింది. కల్లంలో ఆర్బీకే సిబ్బంది ధాన్యం తూకం వేసి, ఎఫ్‌టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) జనరేట్ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా రైతుల ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు ధాన్యాన్ని చేర్చడంతో పాటు మిల్లరు అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. రైతులతో సబంధం లేకుండానే వాటిని పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని నెలకొలి్పంది. ఫలితంగా ఆర్బీకేలో ఖరారైన తేమ శాతానికి, తూకానికి మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితి వచి్చంది. ప్రతి జిల్లాలో కలెక్టర్లు, జేసీలు, రెవెన్యూ, పౌరసఫరాలు, టెన్నికల్ అసిస్టెంట్లు, పీఏసీఎస్ సిబ్బంది వరకు ధాన్యం సేకరణలో భాగస్వాములయ్యారు. ధాన్యం అమ్మటానికి వచ్చిన రైతుకు ఏ స్థాయిలో ఇబ్బంది కలిగినా సర్కారు వేగంగా స్పందిస్తోంది. కొంత మంది మిల్లర్లు తేమ శాతం ఎక్కువ ఉందని రైతుల నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్బులను సైతం ఆయా జిల్లా కలెక్టర్లు తిరిగి వెనక్కి ఇప్పించిన దాఖలాలున్నాయంటే ప్రభుత్వ చిత్తశుద్ధిని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆర్బీకే ద్వారా ఎఫ్‌టీవో పొందాక రైతు మిల్లుకు వెళ్లాల్సిన అవసరం లేదని వారికి అవగాహన కలి్పస్తున్నారు. మిల్లర్లు తరుగు కింద ధాన్యం తగ్గించినా, రైతు నుంచి డబ్బు డిమాండ్ చేసినా, ఇతర విషయాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా టోల్ ఫ్రీ నెంబర్ 1967 వివరాలను ఎఫ్‌టీవో రశీదుపై ప్రభుత్వం ముద్రిస్తోంది కూడా. పక్కాగా నిబంధనలు అమలు.. మిల్లర్ల దందాను అరికట్టే క్రమంలో ప్రభుత్వం లక్ష్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న మిల్లర్లెవ్వరినీ ఉపేక్షించట్లేదు. ఈ క్రమంలోనే రైతులను మిల్లులకు పిలిచి ఇబ్బంది పెడుతున్న మిల్లర్లపై పౌరసరఫరాల శాఖ కొరఢా ఝుళిపించింది. విజయనగరం, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, పశి్చమగోదావరి జిల్లాల్లో 23 మిల్లులపై కఠిన చర్యలకు ఆదేశించింది. మరోవైపు ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 8 మంది టెన్నికల్ అసిస్టెంట్స్, 7 మంది పీఏసీఎస్ సిబ్బందిలో పౌరసరఫరాల శాఖ ఒకరిని తొలగించడంతో పాటు, మిగిలిన వారిని సస్పెండ్ చేయటం, షోకాజ్ నోటీసులివ్వటం వంటివి చేసింది. 23 మిల్లులపై చర్యలు ఇలా.. – పశ్చిమగోదావరిలో ఒక మిల్లును బ్లాక్ లిస్టు చేశారు. మూడు మిల్లులకు షోకాజ్ నోటీలు ఇచ్చారు. – విజయనగరంలో మూడు మిల్లులను కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)నుంచి తప్పించారు. – తూర్పుగోదావరిలో మూడు రైస్ మిల్లులను హెచ్చరికలో భాగంగా ఐదు రోజుల పాటు డిటాగ్ చేశారు. – కృష్ణా జిల్లాలో పది మిల్లులను షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. – ఎన్టీఆర్ జిల్లాలో మూడు మిల్లులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. రైతులకు సమాచారం ఇచ్చాకే... కృష్ణా, విజయనగరం, శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలో ఇప్పుడే కోతలు చేపట్టడం, సంక్రాంతి కావడంతో కొనుగోళ్లు నెమ్మదించాయి. ఈ జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయితే మొత్తం లక్ష్యం 35 లక్షల టన్నులు ముగుస్తుంది. ప్రభుత్వం ఎక్కడైతే పూర్తి స్థాయిలో కొనుగోళ్లు ముగిశాయో అక్కడ క్షేత్ర స్థాయిలో రైతుల నుంచి ధాన్యం లేదని నిర్ధారించుకున్న తర్వాతే ప్రక్రియను ముగించేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో ఆర్బీకే సిబ్బంది, తహసీల్దార్, వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారుల ద్వారా ఆమోదం పొందిన తర్వాతే.. రైతులకు సమాచారం ఇచ్చాకే ధాన్యం సేకరణ కేంద్రాన్ని మూసివేస్తారు. రైతులకు పూర్తి మద్దతు ధర వస్తుండటంతో దాదాపు అంతా ప్రభుత్వం ద్వారా విక్రయించేందుకే ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్ జిల్లాలకు బ్యాంకు గ్యారెంటీల శాతాన్ని పెంచడంతో జిల్లాలకు ధాన్యం సేకరణ కేటాయింపు కూడా పెరిగింది. దళారులను అడ్డుకుంటున్నందుకే టీడీపీ యాగీ... ప్రభుత్వం ఈ–క్రాప్ డేటా ఆధారంగా నేరుగా రైతుల నుంచే ధాన్యం సేకరిస్తోంది. దీంతో కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశం అండతో చెలరేగిపోయిన ఆ పార్టీ మిల్లర్లకు, దళారులకు పరిస్థితులు ఏమాత్రం రుచించటం లేదు. రైతులు తాము చెప్పిన రేటుకే గతంలో అమ్మేవారని, దానివల్ల తమకు భారీగా వచ్చే ఆదాయం మొత్తానికి ఇపుడు గండిపడిందని రగిలిపోతున్నారు. అందుకే రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కొందరైతే ప్రభుత్వం కొనుగోలు చేయదని, ధాన్యం పాడైపోతుందని, అకాల వర్షాలు దెబ్బతీస్తాయని రకరకాలుగా భయపెట్టి రైతుల నుంచి ముందుగానే తక్కువ రేటుకు ధాన్యం కొనేశారు. ఆ దళారులే ఇప్పుడు రైతుల పేరుతో ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించి పూర్తి మద్దతు ధరతో పాటు హామాలీ, రవాణా ఖర్చులను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. వారిని ప్రభుత్వం సమర్థంగా అడ్డుకోవటంతో పచ్చపత్రికలు రంగంలోకి దిగి తమ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నాయనేది రైతుల మాట.. జియో లొకేషన్ ట్యాగింగ్‌తో.. ‘‘రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం కొనుగోలు మూసి వేయట్లేదు. తాత్కాలిక అంచనాలు ప్రకారం ఆర్బీకేలకు ధాన్యం కొనుగోళ్లకు అనుమతులు ఇచ్చాం. చాలా వరకు ఆర్బీకేలు ఈ లక్ష్యాన్ని చేరుకున్నాయి. ఇప్పుడు ఇంకా క్షేత్ర స్థాయిలో కొనుగోలుకు సిద్ధంగా ఉన్న ధాన్యం డేటాను సేకరిస్తున్నాం. ఇందులో అక్రమంగా బయటి ధాన్యం చొరబకుండా జియో లొకేషన్ ట్యాగ్ చేస్తూ సేకరించాల్సిన ధాన్యం వివరాలను ఫొటోల రూపంలో ప్రత్యేక యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నాం. కొందరు దళారులు రైతుల నుంచి ముందుగానే తక్కువ రేటుకు ధాన్యం కొని ఇప్పుడు అదే రైతుల పేరుతో అమ్మాలని చూస్తున్నారు. దీనిని అరికట్టేందుకే జియో ట్యాగ్ చేస్తున్నాం. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో పండుగ సందర్భంగా కొనుగోళ్లు నెమ్మదించాయి తప్ప.. నిలిపివేయలేదు. జనవరి 13 నుంచి 19వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.17లక్షల టన్నులు సేకరించాం. – జి.వీరపాండియన్, పౌరసరఫరాల సంస్థ ఎండీ ఈ సారి కొనుగోళ్లు బాగున్నాయి.. నేను ధాన్యం విక్రయించిన ఇన్నేళ్లలో ఇంత త్వరగా ఎప్పుడూ డబ్బులు పడలేదు. ఎవరి చుట్టూ తిరగకుండానే ప్రభుత్వం మా దగ్గరకు వచ్చి ధాన్యం కొనుగోలు చేసింది. మూడున్నర ఎకరాల్లో పంట వేశారు. సుమారు ఎనిమిది టన్నుల వరకు ధాన్యాన్ని అమ్మాను. నేను డిసెంబర్ 15వ తేదీ ధాన్యం ఇస్తే జనవరి మొదటి వారం మొత్తం రూ.1.30 లక్షలు జమయ్యాయి. గతంలో మాదిరిగా మిల్లర దగ్గరకు వెళ్లి బతిమలాడుకోలేదు. తేమ శాతంలో కోత కూడా పెట్టలేదు. నిబంధనలు ప్రకారం నాకు దక్కాల్సిన మద్దతు ధర ప్రతి పైసా వచి్చంది. మా దగ్గర ఈ సారి కొనుగోళ్లు బాగున్నాయి. – ఎం.అప్పలనాయుడు, వంగర మండలం, కేసీహెచ్ పల్లె గ్రామం, విజయనగరం జిల్లా ఐదు రోజుల్లో నగదు జమ అయింది నేను ఖరీఫ్‌లో ఐదు ఎకరాలల్లో వరి సాగు చేశాను. 110 క్వింటాలను రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వం కోనుగోలు చేసింది. డిసెంబర్ 9న ధాన్యం ఇస్తే.. డిసెంబర్ 14న రూ.2,24,400 నా ఖాతాలో పడ్డాయి. 5 రోజుల్లో ధాన్యం డబ్బు జమ కావడం గతంలో ఎప్పుడూ చూడలేదు. వరి పంట సాగు చేస్తున్న రైతుకి ప్రతి సంవత్సరం ఏదో కారణంగా తీవ్ర నష్టం వచ్చేది. ఈ సారి ఆ కష్టాలను అధిగమించాం. మంచి మద్దతు ధర కూడా దక్కింది. – కుమరాపు శ్రీనివాసరావు, డీఆర్‌వలస, జి.సిగడాం మండలం, శ్రీకాకుళం జిల్లా రవాణా ఖర్చులు కూడా దక్కాయి నాకు మూడు ఎకరాలు, నా కుమారుడికి ఒక ఎకరా చొప్పున పల్లం భూమి ఉంది. ఈ ఏడాది ఎకరాకు 30 బస్తాలు చొప్పున పంట దిగుబడి వచ్చింది. డిసెంబర్ 25వ తేదీన కొప్పర వలస రైతు భరోసా కేంద్రం ద్వారా 120 బస్తాల ధాన్యం విక్రయించాను. మూడు రోజులు కిందట మా ఖాతాలకు రూ.1.95 లక్షలు జమ అయ్యింది. దీనికి తోడు లోడింగ్, రవాణా ఖర్చులు కూడా పడ్డాయి. – యలకల జనార్ధన నాయుడు, వంగర మండలం, రుషింగి గ్రామం, విజయనగరం జిల్లా అంచనా దాటినా కొంటున్నాం.. ఈ ఖరీఫ్‌లో కాకినాడ జిల్లాలో 263 కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం సేకరిస్తున్నాం. ఇప్పటి వరకు 2.44 లక్షల టన్నులు కొనుగోలు చేశాం. ఇది తాత్కాలిక అంచనాను దాటింది. మిగిలిన ధాన్యాన్ని కూడా కొంటాం. ఎక్కడా ధాన్యం కేంద్రాలను మూసివేయలేదు. జిల్లాలో 51,519 మంది రైతుల నుంచి ధాన్యం కొంటే రూ.466.61 కోట్లు చెల్లించేశాం. –ఎస్.ఇలక్కియ, జేసీ, కాకినాడ జిల్లా రైతులు ఆందోళన చెందొద్దు రాష్ట్రంలో రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రైతులు అధైర్య పడొద్దు. ఎక్కడా కొనుగోలు కేంద్రాలు మూసివేయట్లేదు. ఒకవేళ తాత్కాలిక లక్ష్యం పూర్తయినా కూడా కొనుగోలు చేస్తాం. ఎవరూ కూడా మిల్లర్లు దగ్గరకు వెళ్లొద్దు. వారు తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కోత పెట్టడం, డబ్బులు వసూలు చేయడం, ధాన్యాన్ని ఆన్లోడ్ చేయకపోయినా కఠినంగా వ్యవహరిస్తాం. అవసరమైతే మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టి జైలుకు కూడా పంపించేందుకు వెనుకాడం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి -
Andhra Pradesh: దళారులకు తావేలేదు
గత ప్రభుత్వంతో పోలిస్తే ధాన్యం సేకరణలో మనం రైతులకు ఎంతో మేలు చేస్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే చెల్లించాం. గతంలో ఏటా ధాన్యం సేకరణకు సుమారు రూ.8 వేల కోట్లు వెచ్చిస్తే, మన ప్రభుత్వంలో ఏకంగా రూ.15 వేల కోట్లు ఇస్తున్నాం. 2016–17లో 55 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తే, 2020–21లో మనం దాదాపు 85 లక్షల టన్నులు సేకరించాం. చంద్రబాబు ఐదేళ్ల హయాంలో 2.65 కోట్ల టన్నుల ధాన్యం సేకరిస్తే, ఈ మూడున్నరేళ్లలోనే మనం 2.87 కోట్ల టన్నులు కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. ప్రతి గ్రామంలో సాయిల్ టెస్టింగ్ అయ్యాక కచ్చితంగా మ్యాపింగ్ చేయాలి. తద్వారా ఎరువులు, రసాయనాల వినియోగం అవసరాల మేరకే జరుగుతుంది. దీంతో రైతులకు పెట్టుబడి ఆదాతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుంది. రబీలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు ఆర్బీకేల్లో అందుబాటులో ఉండేలా ముందస్తుగా సమకూర్చుకోవాలి. ఫిబ్రవరి 20 నుంచి ఈ క్రాప్ నమోదు ప్రారంభిస్తే.. మార్చి మొదటి వారంలోగా తుది జాబితా వెల్లడించేలా పని చేయాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఇదివరకెన్నడూ లేని విధంగా ఎటువంటి వివక్ష, అవినీతి, దళారుల బెడద లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని, వారికి దక్కాల్సిన మద్దతు ధరను ప్రతిపైసాతో సహా అనుకున్న సమయానికే చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఇంతకు ముందు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భమే లేదన్నారు. ఇప్పుడు అలాంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామని చెప్పారు. పది శాతం రంగు మారిన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేయాలని, ఇంకా ఎక్కువ శాతం రంగు మారి ఉంటే మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేసేలా చూడాలన్నారు. ఇప్పుడు హమాలి, రవాణా, గోనె సంచుల ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తూ రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని తెలిపారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అనుబంధ రంగాలు, పౌర సరఫరాల శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ–క్రాప్ డేటా ఆధారంగా మాత్రమే ధాన్యం కొనుగోలు చేయాలని.. మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే ఖరీఫ్‌లో మిగిలిన సేకరణనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పుడున్న ప్రక్రియను మరింత బలోపేతం చేయాలన్నారు. ఆర్బీకేల్లో ధాన్యం సేకరించగానే రైతుల పని ముగుస్తుందని, ఆ తర్వాత అంతా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. ఏమైనా సమస్యలు, మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఒక నంబర్‌ను ఏర్పాటు చేయాలని, రైతులు ఫిర్యాదు చేయగానే వెంటనే అధికారులు స్పందించాలని ఆదేశించారు. ఈ వివరాలు అన్నింటినీ రైతులకు ఇచ్చే రశీదులో ముద్రించాలని చెప్పారు. ఇలా అన్ని విధాలా రైతులకు మంచి చేయడంలోనే సంతోషం ఉంటుందన్నారు. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉత్తరాంధ్రలోనూ డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రం రైతులకు 50 శాతం సబ్సిడీతో వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలను అందించడంపై దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఆర్బీకేల స్థాయిలో కిసాన్ డ్రోన్లకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీ)ను లక్ష్యం మేరకు నిర్ణీత వ్యవధిలోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీలో మాదిరిగానే ఉత్తరాంధ్రలోనూ డ్రోన్ పైలెట్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను సైతం అందించాలని చెప్పారు. మాండస్ తుపానుతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సిద్ధం కావాలన్నారు. రాష్ట్రంలో ప్లాంట్ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు కార్యాచరణ రూపొందించాలని, ఏటా ఏప్రిల్‌లో మట్టి నమూనా పరీక్షలు నిర్వహించి రైతులకు టెస్టు రిపోర్టులు ఇవ్వాలని ఆదేశించారు. ఆ ఫలితాల ఆధారంగా భూమిలో ఎటువంటి పంటలు వేయాలో రైతులకు మార్గనిర్దేశం చేయాలని, ఆ పంటకు అవసరమైన పోషకాలపై అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్‌లలో మట్టి నమూనా పరీక్షలు వేగంగా చేసేలా చర్యలు చేపట్టాలని, భవిష్యత్తులో ప్రతి ఆర్బీకేలోనూ పరీక్షలు చేసేలా పరికరాలను సమకూర్చుకోవాలన్నారు. ఇందు కోసం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద నిధులు విడుదల చేసే సమయంలోనే రాష్ట్రంలో మనం రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలి విడత 500 డ్రోన్లు.. రైతులకు ఈ ఏడాది మార్చి, మే, జూన్ నెలల్లో డ్రోన్లను అందుబాటులోకి తెస్తామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. 2 వేల డ్రోన్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా తొలి విడతగా 500 డ్రోన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గత డిసెంబర్ నుంచే డ్రోన్ల వినియోగంపై శిక్షణ ప్రారంభించామని, ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు అందజేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాల్లో మరింత వేగం పెంచాలని సీఎం ఆదేశించారు. పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 2014–19 మధ్య ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 153.95 లక్షల టన్నులు ఉంటే.. 2019–20 నుంచి 2022–23 ఖరీఫ్ వరకు 166.09 లక్షల టన్నులు నమోదైందన్నారు. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు వాటి వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని, రేషన్‌లో కోరుకున్న వారికి చిరు ధాన్యాలు అందించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ధాన్యం సేకరణ కొనసాగింపు ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఇప్పటి వరకు 89 శాతం మంది రైతులకు మద్దతు ధరను వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారులు సీఎంకు చెప్పారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని 21 రోజుల కంటే ముందుగానే చాలా వరకు రైతులకు చెల్లింపులు చేశామన్నారు. ఇప్పటి వరకు రూ.5,373 కోట్ల విలువైన ధాన్యాన్ని సేకరించామని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో పంటల సీజన్లను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి రెండో వారం వరకూ సేకరణ కొనసాగిస్తామన్నారు. స్థానిక వీఏఓ నుంచి డీఆర్ఓ నుంచి సర్టిఫై చేసిన తర్వాతే సేకరణ ముగిస్తామని తెలిపారు.తొలిసారిగా మిల్లర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ధాన్యం సేకరణ జరిగిందని, రైతులకు సంపూర్ణ మద్దతు ధరను అందించగలిగామన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు ఐ.తిరుపాల్‌రెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ వై.మధుసూదన్‌రెడ్డి, మార్కెటింగ్, సహకారం ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, పౌర సరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ఎం.విజయ సునీత, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ జి.శేఖర్ బాబు, ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వీసీ డాక్టర్ ఎ.విష్టువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ: సంక్రాంతి వేళ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన ప్రభుత్వం
-
ఏపీ: రైతుల ఖాతాల్లో ఇవాళ ఒక్కరోజే రూ. 1,500 కోట్ల జమ
తాడేపల్లి: సంక్రాంతి వేళ ఏపీ రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటివరకూ రూ. 4,813 కోట్లు జమ చేసింది. ఇవాళ ఒక్కరోజు రూ, 1,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు పక్షపాతి ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది. కాగా, ఇప్పటివరకూ 25.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించింది ఏపీ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళారి, మిల్లర పాత్ర లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేసింది. అదే సమయంలో 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేసింది. మరొకవైపు హమాలీ, గన్నీ, రవాణా చార్జీలను సైతం రైతుల ఖాతాల్లో జమ చేసింది. -
Andhra Pradesh: రైతుకు సంపూర్ణ ‘మద్దతు’
దళారుల దోపిడీ నుంచి విముక్తి గతంలో ధాన్యం అమ్ముకోవాలంటే ఇబ్బంది పడేవాడిని. ఆర్బీకేల ద్వారా కల్లాల్లోనే ధాన్యం కొనుగోలు చేసి రైతుల ప్రమేయం లేకుండా మిల్లుకు పంపడం ఆనందంగా ఉంది. నేను రూ.3.75 లక్షల విలువైన 245 బస్తాల ధాన్యం ఆర్బీకే ద్వారా విక్రయించాను. కొందరు రైతులు బయటి వ్యక్తులకు అమ్మి బస్తాకు రూ.300 నష్టపోయారు. ఇప్పుడు బాధ పడుతున్నారు. ప్రతి ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో సకాలంలో పంటను అమ్ముకోగలుగుతున్నాం. – సత్తి జగదీశ్వరరెడ్డి, రైతు, కృష్ణంపాలెం, తూర్పుగోదావరి జిల్లా పూర్తి మద్దతు ధర దక్కింది ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ ధాన్యం సేకరణ విధానంతో రైతుగా నాకు ఎంతో మేలు జరిగింది. నేను తొలిసారి పూర్తి మద్దతు ధర పొందాను. గతంలో ఎప్పుడూ బస్తాకు రూ.100– 200 తక్కువకు అమ్ముకునేవాడిని. ఈ సారి 3.5 ఎకరాల్లో పంట సాగు చేస్తే 95 క్వింటాళ్ల పంటను ఆర్బీకేలో విక్రయించాను. రూ.1.96 లక్షలు వచ్చింది.ఐదు రోజులు తిరక్కుండానే నా ఖాతాలో నగదు జమైంది. హమాలీ, ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కూడా ప్రభుత్వం ఇచ్చింది. వచ్చే పంటకు ముందుగానే డబ్బులు చేతిలోకి వచ్చాయి. గతంలో ఇంత వ్యవస్థ లేదు. ఎవరూ పట్టించుకునేవారు కాదు. అందుకే దళారులకు అమ్ముకునే వాళ్లం. – డి.సాయి ప్రసాద్, రైతు, కొత్తపేట, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో రైతులకు దక్కాల్సిన మద్దతు ధరను కాజేస్తే.. ప్రస్తుత ప్రభుత్వం రైతు ఒక్క గింజ కూడా నష్టపోకుండా కాపు కాస్తోంది. రైతు కల్లంలో ధాన్యం ఆరబోసిన దగ్గర నుంచి మిల్లుకు తరలించేంత వరకు ప్రభుత్వమే అన్నీతానై అండగా నిలుస్తోంది. ధాన్యం సేకరణలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు రైతు చెంతకే మద్దతు ధరను తీసుకెళ్లాయి. సాగుదారుల్లో ఎక్కువగా ఉండే చిన్న, సన్నకారు రైతులకు మరింత మేలు చేస్తూ గోనె సంచుల వినియోగ చార్జీల నుంచి హమాలీల కూలి, రవాణా ఖర్చుల వరకు ప్రభుత్వమే భరిస్తోంది. వీటి కింద ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు రూ.14.80 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసి వారికి ఖర్చుల భారాన్ని తగ్గించింది. 35 లక్షల టన్నుల సేకరణ అంచనా ఈ ఖరీఫ్‌లో 85.58 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి అంచనా వేశారు. ఈ మొత్తం దిగుబడిలో రైతులు తమ కుటుంబ, విత్తన అవసరాల కోసం 20–30 శాతం వరకు ధాన్యాన్ని నిల్వ చేసుకుంటారు. మిగిలిన 70 శాతం మార్కెట్‌కు వస్తుంది. ఇందులో 20–30 శాతం వరకు ఫైన్ వెరైటీలు (సన్నరకాలు) ఉంటాయి. వీటికి బహిరంగ మార్కెట్లో మంచి రేటు దొరుకుతుంది. మిగిలిన 40–50 శాతం సాధారణ రకాలను ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. ఈ క్రమంలోనే 3,216 ఆర్బీకేల ద్వారా 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ అంచనాగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 1.93 లక్షల మంది రైతుల నుంచి రూ.2,303 కోట్ల విలువైన 10.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇందులో 83 వేల మంది రైతులకు 21 రోజుల్లోపే రూ.752 కోట్లు చెల్లింపు చేసింది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాలోనూ 75 శాతం వరకు ధాన్యం సేకరణ పూర్తయింది. ఇప్పుడిప్పుడే శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో కోతలు, నూర్పిడులు వేగం పుంజుకున్నాయి. గతంలో కంటే మిన్నగా.. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుత ప్రభుత్వం మూడున్నరేళ్లలోనే 26.63 లక్షల మంది రైతుల నుంచి రూ.50,825 కోట్ల విలువైన 2.71 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇక్కడ గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం మద్దతు ధర పొందుతున్న రైతులు అధికంగా ఉండటం విశేషం. ప్రభుత్వ పారదర్శక విధానాలు, మిల్లర్లు, దళారుల దోపిడీకి పూర్తిగా అడ్డుకట్ట వేయడంతో రైతులు సంతోషంగా మద్దతు ధరకు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి ఇన్నేళ్ల ధాన్యం సేకరణ చరిత్రలో ప్రభుత్వం తొలిసారిగా మిల్లర్ల ప్రమేయానికి స్వస్తి పలికింది. ఆర్బీకే సిబ్బంది ఆధ్వర్యంలో ధాన్యం తూకం వేసి, ఎఫ్‌టీవో (ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్) జనరేట్ చేసిన తర్వాత మద్దతు ధర ఒక్క రూపాయి కూడా తగ్గకుండా జమయ్యేలా చర్యలు చేపడుతోంది. మిల్లుకు చేరిన ధాన్యంపై మిల్లరు అభ్యంతరం వ్యక్తం చేస్తే పరిష్కరించేలా ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఆర్బీకే ఫైనల్ చేసిన తేమ శాతానికి, బరువుకు మిల్లరు కట్టుబడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చి రైతులకు పూర్తి మద్దతు ధరను అందిస్తోంది. ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు, కృష్ణాలోనూ కొన్ని చోట్ల మిలర్లు రైతులను నేరుగా పిలిపించి తేమ శాతం పేరుతో ధాన్యం కోత పెట్టే ప్రయత్నం చేయడంతో పౌర సరఫరాల సంస్థ అధికారులు వారిని కస్టమ్ మిల్లింగ్ రైస్ నుంచి బ్లాక్ లిస్టులో పెడతామని గట్టిగా హెచ్చరించారు. ధాన్యం సేకరణతో పాటు రైతులకు పూర్తి మద్దతు కల్పనను ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా తీసుకున్న నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లు, జేసీలు సైతం ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. చాలా వరకు ధాన్యం కోతలు యంత్రాలపై చేస్తుండటంతో పంట వేగంగా బయటకు వస్తోంది. తేమ శాతం నిర్దిష్ట ప్రమాణం 17 కంటే ఎక్కువగా ఉంటే రెండు, మూడు రోజులు ఆరబెట్టాక ఆర్బీకే సిబ్బంది ధాన్యాన్ని మిల్లుకు తరలించి రైతులకు మేలు చేసేలా పని చేస్తున్నారు. 2014–15లో అప్పటి ప్రభుత్వం రెండు సీజన్లలో కలిపి 1.18 లక్షల మంది రైతుల నుంచి 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. ఇందు కోసం రూ.5,583 కోట్లు చెల్లింపులు చేసింది. ఇక్కడ సగటున ఒక్కో రైతు నుంచి సేకరించిన ధాన్యం 34.42 టన్నులు. చిన్న, సన్నకారు రైతులు అధికంగా ఉన్న రాష్ట్రంలో ఒక్కో రైతు నుంచి ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయడం ఎలా సాధ్యం? అంటే ఇక్కడ దళారులే రైతుల పేరిట ప్రభుత్వానికి ధాన్యం విక్రయించి మద్దతు ధరను కొట్టేశారన్నది సుస్పష్టం. 2015–16లోనూ అంతే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో రైతుల పేరుతో దోపిడీ గతంలో పేరుకే ప్రభుత్వం ధాన్యం సేకరణ జరిపేది. రైతులకు మద్దతు ధర పేరుతో దళారులకు, కొందరు మిల్లర్లకు దోచిపెట్టేవారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని బస్తాకు (75 కేజీల) మద్దతు ధర కంటే రూ.200 వరకు తగ్గించి ఇచ్చేవారు. ఇలా ఎకరానికి తక్కువలో తక్కువ 30 నుంచి 33 బస్తాల దిగుబడి వేసుకున్నా.. రూ.6వేలకు పైగా ప్రత్యేక్షంగా రైతులు నష్టపోయేవారు. తేమ శాతం పేరుతో ఇష్టమొచ్చినట్టు కోత పెట్టేవారు. ఇలా రైతుల నుంచి దళారులు కొన్న ధాన్యం తిరిగి ప్రభుత్వం దగ్గరకు వచ్చేది. మద్దతు ధరను రైతుల పేరుతో దళారులు బొక్కేసేవారు. మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ధాన్యం సేకరణలో మిల్లర్లు నిబంధనలు అతిక్రమిస్తే బ్లాక్ లిస్టులో పెడుతున్నాం. క్షేత్ర స్థాయిలో కలెక్టర్లు, జేసీలు కూడా ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారు. మిల్లరు దగ్గర తేమ శాతంలో తేడా వచ్చే అవకాశం లేదు. ఆర్బీకే ఫైనల్ చేసిందే మిల్లరు తీసుకోవాలి. – వీరపాండియన్, ఎండీ, పౌర సరఫరాల సంస్థ రైతులు మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు రైతులు ఆర్బీకేల్లో ధాన్యం విక్రయించిన తర్వాత మిల్లరు దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏమైనా సమస్యలు వస్తే ఆర్బీకే సిబ్బంది, కస్టోడియన్ అధికారి చూసుకుంటారు. రైతులకు ఎఫ్‌టీవో జనరేట్ అయిన తర్వాత అందులో చూపించిన మొత్తం ఎట్టి పరిస్థితుల్లో రైతు ఖాతాలో జమవుతుంది. నిబంధనల ప్రకారం ధాన్యం ఉంటే ఎక్కడా ఒక్క రూపాయి కూడా మద్దతు ధర తగ్గనివ్వం. – హెచ్.అరుణ్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ -
పైసా తగ్గకుండా ‘మద్దతు’ధర
సాక్షి, అమరావతి: ధాన్యం రైతులకు ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. కళ్లాల నుంచి ధాన్యం తరలించేందుకు అయ్యే రవాణా, హమాలీ చార్జీలను ప్రభుత్వం అదనంగా ఇస్తోందన్న విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్ల ప్రమేయాన్ని పూర్తిగా తొలగిస్తూ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. ధాన్యం సేకరణలో కొత్త విధానాలపై ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో పాటు రైతుల ఫోన్లకు ఆడియో, వీడియోల రూపంలో సందేశాలను పంపాలని సూచించారు. రైతులకు జరిపే చెల్లింపులన్నీ అత్యంత పారదర్శకంగా ఉండాలని, పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతి(డీబీటీ)లో పూర్తి మద్దతు ధరను జమ చేయాలని నిర్దేశించారు. ధాన్యం సేకరణ, ప్రత్యామ్నాయ పంటల సాగుపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్, రవాణా శాఖల అధికారులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఆ వివరాలివీ.. ధాన్యం సేకరణ యాప్.. ధాన్యం సేకరణలో కొత్త విధానం అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. చిన్నచిన్న సమస్యలు ఎదురైతే అక్కడికక్కడే పరిష్కరిస్తూ రైతులకు మరింత మెరుగ్గా సేవలందించేలా చర్యలు తీసుకోవాలి. కొనుగోళ్ల లక్ష్యానికి అనుగుణంగా గోనె సంచులను సమకూర్చుకోవాలి. పంట ఉత్పత్తులను తరలించుకునేందుకు రైతులు ఎక్కడా ఇబ్బంది పడకూడదు. ధాన్యం సేకరణ యాప్‌లో సిగ్నల్స్ సమస్యలు తలెత్తితే ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి. సిగ్నల్స్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలు ఆటోమేటిక్‌గా యాప్‌లో అప్లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నారు. అవసరమైతే వారి నుంచి సాంకేతిక సహకారాన్ని పొందాలి. ధాన్యాన్ని ఆరబెట్టుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారంగా వచ్చే ఖరీఫ్ నుంచి సీఎంఆర్ రైస్ మిల్లుల్లో డ్రయర్లు ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాలి. కొనుగోళ్ల సమయంలో ఇబ్బంది లేకుండా ఇతర శాఖల నుంచి అవసరమైన మేరకు సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించుకోవాలి. జవాబుదారీతనం పెరిగేలా.. పౌరసరఫరాల శాఖలో ఎక్కడా అవినీతి, అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలి. జిల్లా పౌరసరఫరా అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేలా వారి విధివిధానాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) రూపొందించాలి. వీటిని కచ్చితంగా పాటించేలా సమర్థంగా పర్యవేక్షించాలి. ప్రత్యామ్నాయ పంటలపై ప్రత్యేక దృష్టి ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. ఆసక్తి ఉన్న వారిని గుర్తించి అన్ని విధాలా తోడ్పాటు అందించాలి. మన ప్రభుత్వం వచ్చాక చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. పుష్కలమైన పోషకాలను అందించే చిరుధాన్యాలు కావాలని ప్రజలు కోరితే ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)ద్వారా సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలి. హాజరైన మంత్రులు, అధికారులు.. సమీక్షలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్‌చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, సీఎస్ డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రవాణా శాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్ æశాఖ కమిషనర్ రాహుల్ పాండే, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
మన ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నాం: సీఎం జగన్
-
ధాన్యం కొనుగోళ్లపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఖరీప్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. మిల్లర్ల ప్రమేయంలేకుండా సేకరిస్తున్న కొత్త విధానం అమలు తీరును సీఎం సమగ్రంగా సమీక్షించారు. ఈ మేరకు అధికారులకు సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. చదవండి: ప్రభుత్వంపై ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఎందుకంత అక్కసు: మంత్రి బొత్స ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, రైతులకు కనీస మద్దతు ధర కన్నా.. ఒక్కపైసా తగ్గకుండా రేటు రావాలనే ఉద్దేశంతో కొత్త విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. దీని కోసం ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయాన్ని తీసివేశాం. ఈ కొత్త విధానం ఎలా అమలవుతున్నదీ గమనించుకుంటూ ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను ఎక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. చేయాల్సిన ధాన్యం సేకరణపై ముందస్తు అంచనాలు వేసుకుని, ఆ మేరకు ముందస్తుగానే గోనెసంచులు అందుబాటులోకి తీసుకురావాలి. వెంటనే దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. ‘‘రవాణా, లేబర్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌లో జవాబుదారీతనం ఉండాలి. అత్యంత పారదర్శకంగా ఈ చెల్లింపులు ఉండాలి. ఈ విధానాన్ని ఒకసారి పరిశీలించి.. రైతులకు మేలు చేసేలా మరింత మెరుగ్గా దీన్ని తీర్చిదిద్దాలి. రవాణా ఖర్చులు, గన్నీ బ్యాగుల ఖర్చులను ప్రభుత్వం చెల్లిస్తోందన్న విషయం రైతులకు తెలియాలి. రైతులకు చేస్తున్న చెల్లింపులన్నీ కూడా అత్యంత పారదర్శకంగా ఉండాలి. ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో కార్పొరేషన్ నుంచి వారికి డబ్బు చేరేలా చర్యలు తీసుకోవాలి. దీనివల్ల చెల్లింపుల్లో అత్యంత పారదర్శకత తీసుకు వచ్చినట్టు అవుతుంది’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ధాన్యం సేకరణ కోసం తయారు చేసిన యాప్‌లో.. సిగ్నల్స్ సమస్యల వల్ల అక్కడడక్కగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆఫ్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకుని.. సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లోకి వెళ్లగానే ఆ వివరాలన్నీ ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌లోకి లోడ్ అయ్యేలా మార్పులు చేసుకోవాలి. అనేక ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికే ఇలాంటి పద్ధతులు పాటిస్తున్నాం. ఆ శాఖల నుంచి తగిన సాంకేతిక సహకారాన్ని తీసుకోవాలి’’ అని సీఎం సూచించారు. ధాన్యం సేకరణ, కొనుగోళ్లపై సమాచారాన్ని సమగ్రంగా తెలియజేసేలా ఆర్బీకేల్లో పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టాలని, దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుందన్న సీఎం. రైతుల ఫోన్లకూ ఈ సమాచారాన్ని ఆడియో, వీడియో రూపంలో పంపించాలన్నారు. ధాన్యం సేకరణకోసం అనుసరిస్తున్న సరికొత్త విధానం, ఈ ప్రక్రియలో ఏమేం చేస్తున్నామన్న దానిపై సంపూర్ణంగా సమాచారం వారికి చేరవేయాలి. దీనివల్ల రైతుల్లో అవగాహన కలుగుతుందని సీఎం అన్నారు. పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ల విధులపై ఎస్ఓపీలను తయారుచేయాలి. ఈ ఎస్ఓపీలను పాటించేలా సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండేలా చూడాలి. అవకతవకలకు, అవినీతికి ఆస్కారం లేకుండా ఈ ఎస్ఓపీలు ఉండాలి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగుమీదకూడా రైతులకు అవగాహన కలిగించాలన్న సీఎం. అలాంటి రైతులను ప్రోత్సహించాలన్నారు. మన ప్రభుత్వం వచ్చాక మిల్లెట్స్ సాగును ప్రోత్సహిస్తున్నాం. ఎవరైనా మిల్లెట్స్ కావాలి అని అడిగితే, వాటిని వినియోగిస్తామని కోరితే పౌర సరఫరాల శాఖ ద్వారా వారికి అందించడంపైన కూడా దృష్టిపెట్టాలి. కోరుకున్న వారికి వాటిని సరఫరా చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఏపీ అగ్రిమిషన్ వైస్ చైర్మన్ ఎంవియస్ నాగిరెడ్డి, సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్థికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రవాణాశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల శాఖ కార్యదర్శి హెచ్ అరుణ్‌కుమార్, వ్యవసాయశాఖ కమిషనర్ సి.హరికిరణ్, మార్కెటింగ్‌శాఖ కమిషనర్ రాహుల్ పాండే, పౌర సరఫరాల డైరక్టర్ విజయ సునీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సజావుగా ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: ధాన్యం సేకరణలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ధాన్యం సేకరణలో ఈసారి నుంచి సరికొత్త విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ విషయంలో అక్కడక్కడా తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల ఉన్నతాధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తున్నామని చెప్పారు. కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచుల డబ్బులు, హమాలీ చార్జీలు నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వ ఆదేశాలు ధిక్కరిస్తే క్రిమినల్ చర్యలు ఈ క్రాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులు తమ పంటను నేరుగా ఆర్బీకేల వద్దకు తీసుకుని రావాలని మంత్రి కారుమూరి సూచించారు. రైస్ మిల్లర్ల వద్దకు వెళ్లవద్దని చెప్పారు. ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్ల జోక్యం తగదని.. ఈ మేరకు ఇప్పటికే వారికి ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తే మిల్లర్లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాంటి వారిని బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. ఆర్బీకేల ద్వారా సేకరించిన ధాన్యాన్ని మాత్రమే మిల్లింగ్ చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్బీకేల్లో అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట ఆర్బీకేల సంఖ్యను పెంచాలన్నారు. గత ముఖ్యమంత్రుల కన్నా సీఎం జగన్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ధాన్యం సేకరణ విషయంలో రాజకీయం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండ్యన్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఆ మాట ఎక్కడా రాకూడదు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వ్యవసాయ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిచారు. ఈ సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్థన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎంఎస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందనే మాట ఎక్కడా రాకూడదని, దీన్ని అధికారులు సవాల్‌గా తీసుకోవాలన్నారు. చదవండి: రామోజీరావుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు ‘‘ధాన్యం కొనుగోలులో మిల్లర్ల పాత్ర తీసివేస్తున్నాం. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ధాన్యం సేకరణ కొనసాగాలి. ఇ-క్రాపింగ్ డేటాను వాడుకుని అత్యంత పటిష్ట విధానంలో సేకరణ కొనసాగాలి. వ్యవసాయ శాఖతో పౌరసరఫాల శాఖ అనుసంధానమై రైతులకు మంచి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. రబీకి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎరువులు, విత్తనాలు, ఇలా అన్నిరకాలుగా రైతులకు కావాల్సివన్నీ సిద్ధం చేసుకోవాలన్న సీఎం.. ప్రతి ఆర్బీకేలో ఒక డ్రోన్‌ను ఉంచేలా కార్యాచరణ సిద్ధంచేయాలన్నారు. వచ్చే రెండేళ్లలో అన్ని ఆర్బీకేల్లోనూ డ్రోన్స్ ఉండేలా చూడాలని సీఎం అన్నారు. ప్లాంట్ డాక్టర్స్ కాన్సెప్ట్‌పై సీఎం సమీక్ష భూసార పరీక్షలు చేసే పరికరాలను ప్రతి ఆర్బీకేలో ఉంచాలని సీఎం ఆదేశించారు. ఈ పరికరాలను అన్ని ఆర్బీకేలకు అందుబాటులో ఉంచాలన్నారు. మార్చిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. భూసార పరీక్షలు కారణంగా ఏ ఎరువులు వాడాలి? ఎంతమేర వాడాలన్నదానిపై స్పష్టత వస్తుందన్న సీఎం.. దీని వల్ల పెట్టుబడి తగ్గుతుందని, దిగుబడులు కూడా పెరుగుతాయన్నారు. భూసారాన్ని కూడా పరిరక్షించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
ధాన్యం సేకరణకు చురుగ్గా ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చురుగ్గా ఏర్పాట్లుచేస్తోంది. ఇందుకు నవంబర్ మొదటి వారంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కసరత్తు చేస్తోంది. ఇటీవల ప్రభుత్వం వరికి మద్దతు ధరను క్వింటాకు రూ.100 పెంచింది. దీంతో క్వింటా ఏ–గ్రేడ్ రకం రూ.2,060, సాధారణ రకం రూ.2,040కు చేరింది. వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. ఈసారి కొనుగోళ్లు పారదర్శకంగా చేపట్టేందుకు ప్రభుత్వం 10,300 మంది వలంటీర్ల సేవలను వినియోగించుకోనుంది. వీరికి కొనుగోళ్ల సమయంలో నెలకు రూ.1,500 ప్రోత్సాహకం అందించనున్నారు. 3,423 ఆర్బీకే క్లస్టర్లలో ధాన్యం సేకరణ ఈ ఖరీఫ్‌లో 3,423 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా ధాన్యం సేకరణకు పౌర సరఫరాల సంస్థ సమాయత్తమవుతోంది. ధాన్యం సేకరణ సామర్థ్యాన్ని బట్టి రెండు, మూడు ఆర్బీకేలను కలిపి ఒక క్లస్టర్‌గా గుర్తిస్తోంది. ఇందులో రెండువేల టన్నులకు పైగా సేకరణ ఉండే క్లస్టర్లను ఏ, 1,000–2,000లోపు ఉంటే బీ.. 1,000లోపు ఉంటే సీ కేటగిరీలుగా విభజించింది. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంటసాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా పక్కాగా 100 శాతం ఈ–క్రాప్ నమోదును పూర్తిచేశారు. వచ్చే 16 నుంచి ఈ–క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరిస్తారు. ఇక పంట ఉత్పత్తులను తరలించేందుకు అవసరమైన గోనె సంచులు, హమాలీలు, రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే అందిస్తోంది. రైతులే స్వయంగా గోనె సంచులు ఏర్పాటుచేసుకుంటే క్వింటాకు రూ.12.66 ఇవ్వనున్నారు. సొంతంగా ధాన్యాన్ని తరలించే వెసులుబాటునూ కల్పించారు. ఇందుకైన రవాణా, హమాలీ ఖర్చులు మొత్తాన్ని ధాన్యం విక్రయించిన సొమ్ముతో కలిపి 21 రోజుల్లో రైతు ఖాతాలో జమచేస్తారు. ఆర్బీకే నుంచి మిల్లుకు చేరే ధాన్యం తూకంలో వ్యత్యాసం, ఇతర సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా మిల్లు వద్ద్ద ఒక కస్టోడియన్ అధికారిని కూడా నియమించారు. దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ అలాగే, ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు ఆయా ఆర్బీకేలకు మిల్లులను మ్యాపింగ్ చేసేవారు. దీంతో కొనుగోలు చేసిన ధాన్యం ఏ మిల్లుకు వెళ్తుందో ముందుగానే తెలిసిపోయేది. ఈ క్రమంలో కొందరు దళారులు, మిల్లర్లు అక్రమాలకు పాల్పడేవారు. దీనిని అధిగమించేందుకు మిల్లులను జోన్లుగా విభజించారు. చివరి నిమిషంలో మాత్రమే ధాన్యాన్ని ఏ మిల్లుకు తరలించాలో చెప్పేలా ఆటోమేటిక్ సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టారు. పారదర్శకంగా కొనుగోళ్లు ధాన్యం సేకరణలో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. రైతులకు వంద శాతం మద్దతు ధరను అందించేలా పారదర్శక విధానాన్ని పక్కాగా అమలు చేయనున్నాం. గోనె సంచులు, హమాలీలు, రవాణా వాహనాలను ముందుగా ఏర్పాటుచేయాలని జేసీలకు సూచించాం. ఒకవేళ రైతులే వాటిని ఏర్పాటుచేసుకుంటే ఖర్చులను వారి ఖాతాల్లో జమచేస్తాం. – హెచ్. అరుణ్‌కుమార్, కమిషనర్, ఏపీ పౌరసరఫరాల శాఖ మిల్లుల వద్ద కస్టోడియన్ అధికారులు ఆర్బీకేల్లో సజావుగా ధాన్యం విక్రయించినప్పటికీ మిల్లర్ల కొర్రీలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తేమ శాతం ఎక్కువగా ఉందని, తూకంలో వ్యత్యాసం పేరుతో రైతుల మద్దతు ధరకు కోత పెడుతున్నారు. దీనిని అరికట్టేందుకు ప్రభుత్వం మిల్లుల వద్ద ఒక కస్టోడియన్ అధికారిని సైతం నియమించింది. అవకతవకలకు తావులేకుండా ధాన్యం సేకరణలో ప్రతి ప్రక్రియను ఫొటోతీసి అప్లోడ్ చేస్తారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసరఫరాల సంస్థ -
‘యంత్రసేవ’ పరికరాలు రైతులకు అందుబాటులో ఉండాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో అగ్రి ఇన్ఫ్రా, ధాన్యం సేకరణ, సీఎం యాప్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆర్బీకేల పరిధిలో యంత్రసేవ కింద ఇస్తున్న పరికరాలు, యంత్రాలు అన్నీకూడా రైతులకు అందుబాటులో ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఆర్బీకేల పరిధిలో ఉన్న యంత్రాలు ఏంటి? పరికరాలు ఏంటి? వాటిద్వారా ఎలాంటి సేవలు లభిస్తాయన్న వివరాలు ఆర్బీకేల్లో ఉంచాలన్నారు. ఈ వివరాలతో సమగ్రమైన పోస్టర్లను ఆర్బీకేల్లో డిస్ప్లే చేయాలని ఆదేశించారు. అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవల వివరాలను సమగ్రంగా రైతులకు తెలియజేసేలా ఈ పోస్టర్లను రూపొందించాలని పేర్కొన్నారు. వైయస్సార్ యంత్రసేవ కింద పంపిణీ చేసిన వ్యవసాయ ఉపకరణాల వివరాలను అధికారులు సీఎం జగన్‌కు అందించారు. 10,750 ఆర్బీకేల పరిధిలో ఇప్పటికే 6525 ఆర్బీకేల్లో యంత్రసేవ కింద వ్యవసాయ ఉపకరణాల పంపిణీ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలిపారు. 1615 క్లస్టర్ లెవల్ సీహెచ్‌సీల్లో 391 చోట్ల ఇప్పటికే యంత్రసేవ కింద హార్వెస్టర్లతో పాటు పలు రకాల యంత్రాలు ఆర్బీకేలకు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. రూ. 690.87 కోట్ల విలువైన పరికరాలు ప్రభుత్వం అందించగా.. ఇందులో 240.67కోట్ల సబ్సిడీ అందించినట్లు చెప్పారు. మిగిలిన ఆర్బీకేల్లో కూడా 2022–23కు సంబంధించి యంత్ర సేవకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ► సుమారు 7 లక్షల మందికి యంత్రాలు, పరికరాలు ఇచ్చేందుకు సిద్దంగా కార్యాచరణ. ►80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు యంత్రసేవకింద పరికరాలు, మిగిలిన 20శాతం మిగిలిన వారికి. ►షెడ్యూల్డ్ ఏరియాల్లో 80శాతం ఎస్టీ రైతులకు ఇవ్వాలని నిర్ణయం. ►ఆర్బీకే యూనిట్‌గా వీటి పంపిణీ జరగాలన్న సీఎం. ► దీనికోసం రూ.1325 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం. ఇందులో ప్రభుత్వ సబ్సిడీ రూ.1014 కోట్లు. ►ఆర్బీకేల పరిధిలో కలెక్షన్ సెంటర్లు, కోల్డ్‌రూమ్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి అధికారులకు సీఎం ఆదేశం ►వీలైనంత త్వరగా వీటి నిర్మాణాలు పూర్తిచేయాలన్న సీఎం. ►అలాగే ఆర్బీకేల్లో గోదాముల నిర్మాణాన్ని కూడా వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. ►చేయూత ద్వారా సుస్థిర ఆర్థిక ప్రగతికి స్వయం ఉపాధి పథకాలు కొనసాగించాలన్న సీఎం. ►వారికి పశువులను పంపిణీచేయడం ద్వారా పాల ఉత్పత్తి, విక్రయం తదితర వ్యాపారాల ప్రక్రియ కొనసాగాలన్న సీఎం. ►దీనివల్ల మహిళల్లో ఆర్థిక స్వావలంబన జరుగుతుందన్న సీఎం. ► అమూల్, అలానా లాంటి కంపెనీలతో భాగస్వామ్యం వల్ల లబ్ధిదారులైన మహిళలకు ఆర్థికంగా ప్రయోజనం పొందేలా చూడాలన్న సీఎం. అమూల్ పాలసేకరణపైనా సీఎం సమీక్ష. ► 2,34,548 మహిళా రైతుల నుంచి అమూల్ పాల సేకరణ. ► ఇప్పటివరకూ 419.51 లక్షల లీటర్ల పాల సేకరణ. ► పాలసేకరణ వల్ల ఇప్పటివరకూ రూ.179.65 కోట్ల చెల్లింపు, రైతులకు అదనంగా రూ.20.66కోట్ల లబ్ధి. ►అమూల్ ప్రాజెక్టు వల్ల ఇతర డెయిరీలు పాల సేకరణ ధరలు పెంచాల్సిన పరిస్థితి. ► ఆయా డైరీలు ధరలు పెంచడంవల్ల రాష్ట్రంలో రైతులకు అదనంగా రూ.2,020.46 కోట్ల లబ్ధి. ►వచ్చే రెండు నెలల్లో మరో 1,359 గ్రామాలకు విస్తరించనున్న అమూల్ పాలసేకరణ ►అమూల్‌తో ప్రాజెక్టు ద్వారా ప్రతిరోజూ 1.03 లక్షల లీటర్ల పాలసేకరణ. ►చిత్తూరు డెయిరీని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని సీఎం ఆదేశం. ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ ప్రగతిని సమీక్షించిన సీఎం ►ఫేజ్–1లో చేపట్టిన జువ్వలదిన్నె, మచిలీపట్నం, నిజాంపట్నం పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్న అధికారులు. ధాన్యం సేకరణపై సీఎం సమీక్ష ►మిల్లర్ల పాత్రను పూర్తిగా తీసివేసేలా, పారదర్శకంగా జరిగేలా, రైతుల ప్రయోజనాలకు ఏ దశలోనూ భంగం రాకుండా ధాన్యం సేకరణ చేయాలని ఇప్పటికే సీఎం ఆదేశాలు. ► సీఎం ఆదేశాల నేపథ్యంలో పలు విధానాలకు కసరత్తు చేసిన పౌరసరఫరాల శాఖ. వీటిని సీఎంకు వివరించిన అధికారులు. ► దీనికోసం విధి విధానాలు రూపొందించిన పౌరసరఫరాల సంస్థ. ►ధాన్యం సేకరణలో భాగస్వామ్యం కానున్న వాలంటీర్లు. ►వారి సేవలను వినియోగించుకున్నందుకు ఇన్సెంటివ్‌లు. ►ఎస్ఓపీలను పకడ్బందీగా తయారు చేయాలన్న సీఎం. ఈ సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పశుసంవర్ధక, పాడిపరిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: (లోన్‌యాప్ ఆగడాలపై ఏపీ ప్రభుత్వం సీరియస్) -
‘ఉప్పుడు’ నిప్పు.. పీయూష్, రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్యుద్ధం
యాసంగి ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య గురువారం హస్తినలో జరిగిన భేటీ ‘దారి’తప్పింది! ఉప్పుడు బియ్యంపై రాజకీయ నిప్పు రాజుకుంది!! పరస్పర విమర్శలు, వాగ్వాదానికి దారితీసింది!! ‘కేవలం ముడి బియ్యం ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి? మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలా కాదు.. ఉప్పుడు బియ్యం ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి... మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి’ అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సూటిగా ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందుకు రాష్ట్ర మంత్రి నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనాలని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్రం సేకరణ విధానం మార్చుకోవాలి’ అని సూచించగా ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’ అంటూ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీనిపై మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందిస్తూ ‘మాకూ సమయం వస్తుంది’ అని అన్నట్లు తెలిసింది. సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ధాన్యం సేకరణకు సంబంధించి చర్చించేందుకు భేటీ అయిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర మంత్రులు తప్పుపడితే, డిమాండ్ లేని సరుకును మార్కెట్లో ఎలా అమ్ముతారంటూ కేంద్రమంత్రి ప్రశ్నించడంతో సమావేశంలో వేడి రాజుకుంది. ఓ దశలో ధాన్యం సేకరణ అంశం పక్కకు వెళ్లి, రాజకీయ ప్రకటనలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకున్నట్లు తెలుస్తోంది. ధాన్యం సేకరణపై జాతీయ విధానం ఉండాలని రాష్ట్ర మంత్రులంటే, మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండంటూ పీయూష్ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలతో భేటీ మరింత వేడెక్కింది. ధాన్యం సేకరణ అంశంపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్.. ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేకేలతో కూడిన బృందం.. గురువారం మధ్యాహ్నం కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యింది. సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ఎక్కువ సమయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించినట్లు తెలిసింది. 20 లక్షల ఎకరాల్లో వరి తగ్గించాం: నిరంజన్‌రెడ్డి తొలుత ధాన్యం సేకరణ అంశాన్ని ప్రస్తావించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. యాసంగిలో పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. కేంద్రం సూచనల మేరకే 20 లక్షల ఎకరాల మేర వరి సాగును తగ్గించామని, సాగైన మేరకు ధాన్యాన్ని కేంద్రం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యాసంగిలో బాయిల్డ్ రైస్ ఎక్కువగా ఉంటుందని, బాయిల్డ్ రైస్‌ను తీసుకునేలా కేంద్రం విధానపరమైన నిర్ణ యం చేయాలని కోరారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రమంత్రి.. రాష్ట్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని రాసిచ్చిన లేఖ గురించి ప్రస్తావించారు. ‘కేవలం రారైస్ ఇస్తామని చెప్పాక ఇప్పుడు కొత్త డిమాండ్లు ఏమిటి?, మార్కెట్లో ఏది డిమాండ్ ఉంటే అదే కొంటాం. అలాకాదు బాయిల్డ్ ఉత్పత్తే ఎక్కువగా ఉంటుందంటే మీరే కొనండి. మీరే తినండి. లేదంటే బఫర్ స్టాక్‌గా పెట్టుకోండి. దీనికి అయ్యే వ్యయాన్ని మీరే భరించండి. డిమాండ్ లేని సరుకును తీసుకొని మేమేం చేయాలి..’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు.. పీయూష్‌కు గట్టిగా బదులిచ్చిన నిరంజన్‌రెడ్డి.. ‘మీరు వ్యాపార ధోరణిలో మాట్లాడొద్దు. రైతుల కోణంలో దీన్ని చూడాలి. ధాన్యం ఉత్పత్తి పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కొనమని అంటున్నాం. దీనికి అనుగుణంగా కేంద్ర విధానం మార్చుకోవాలి..’అని అన్నారు. కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘మీరు అధికారంలోకి వచ్చాక కొత్త విధానం తీసుకురండి’అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీంతో మాకూ సమయం వస్తుందంటూ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఘాటుగా ప్రతిస్పందించారు. పరస్పరం వీడియోలు, క్లిప్పింగ్‌ల ప్రదర్శన ఇదే సమయంలో వ్యవసాయం, రైతులకు మద్దతుగా 2013లో ప్రధాని అభ్యర్థిగా ఖరారయ్యాక గుజరాత్ అగ్రికల్చర్ సమ్మిట్‌లో మోదీ చేసిన వ్యాఖ్యల వీడియోను కేంద్రమంత్రికి రాష్ట్ర మంత్రులు చూపించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై ఆలోచనలు చేస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేసేలా చర్యలు తీసుకుంటామన్న మోదీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ప్రస్తు తం తెలంగాణలో వ్యవసాయానికి సంబంధించి ఓ సమస్య ఉత్పన్నమైనప్పుడు పరిష్కారం చూపాలి కదా?, సానుకూల నిర్ణయాలు చేయాలి కదా? అని అన్నారు. పీయూష్ మాట్లాడుతూ ఇది తన పరిధి కాదని, ప్రధాని స్థాయిలో నిర్ణయం చేయాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతల వ్యాఖ్యలను మంత్రులు భేటీలో ప్రస్తావిస్తే, సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ.. ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సహా ఇతర రాష్ట్ర నేతలు ధాన్యం పండించండి. వంద శాతం కొంటామని ప్రకటనలు గుప్పిస్తున్నారు..’ అని చెప్పారు. ఆయా వ్యాఖ్యల వీడియోలు చూపించారు. కాగా ప్రధాని మోదీపై ఇటీవల సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్‌లను కేంద్ర అధికారి ఒకరు చూపించినట్టు తెలిసింది. -
ధాన్యం సేకరణలో తెలంగాణ 3
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మూడోస్థానంలో నిలిచింది. మద్దతు ధరతో రైతుల నుంచి 70.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి తెలంగాణ ఈ ఘనత సాధించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 70.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. తాజా వివరాలు కేంద్రానికి అందలేదు. కాగా అత్యధికంగా ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పంజాబ్ నిలవగా, రెండోస్థానంలో ఛత్తీస్‌గఢ్ నిలిచాయి. ఫిబ్రవరి 20 నాటికి దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను కేంద్రం వెల్లడించింది. వానాకాలం సీజన్లో దేశంలో 94.15 లక్షల మంది రైతులు రూ.1.36 లక్షల కోట్ల విలువైన 6.95 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. రాష్ట్రంలో 32 జిల్లాల్లో 6,872 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 12.86 లక్షల మంది రైతుల నుంచి 70.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. దీని విలువ రూ. 13,775 కోట్లు. -
AP: కొనుగోళ్లకు ప్రా'ధాన్యం'
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణ వడివడిగా కొనసాగుతోంది. ఇప్పటికే ఉభయ గోదావరితో పాటు కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఆయా జిల్లాల్లోని 123 మండలాల పరిధిలోని 774 రైతుభరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రూ.189.62 కోట్ల విలువైన 98 వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే రైతులకు చెల్లింపు చేస్తున్నారు. ఈ–క్రాప్ ఆధారంగా పంట కొనుగోళ్లకు శ్రీకారం చుట్టడంతో క్షేత్రస్థాయిలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తడంలేదు. ఇప్పట వరకు 8,277 మంది రైతులు ధాన్యం విక్రయించగా 1,977 మందికి తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా నగదు జమచేశారు. గతేడాది రూ.8,868 కోట్లతో 47.33 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ప్రస్తుతం 50 లక్షల టన్నులు కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించారు. నిబంధనలు సడలింపు కోరుతూ.. వర్షాల కారణంగా కోస్తాలోని కొన్ని మండలాల్లో కోతలు నిలిపివేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు వారాల కిందటే కోతలు ప్రారంభించాల్సి ఉండగా తుపాను హెచ్చరిక నేపథ్యంలో రైతులు సాహసించడంలేదు. ఇక రాయలసీమ జిల్లాల్లో అకాల వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. అయితే.. రైతులెవ్వరూ ఆందోళన చెందక్కర్లేదని.. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం 17లోపు ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే.. వర్షాలతో కోతకొచ్చిన పంటతో పాటు కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. ఆర్బీకేల వద్ద శాంపిళ్లను పరీక్షిస్తే తేమ శాతం 23కు పైగా ఉంటోంది. దీంతో తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా నిబంధనలను సడలించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. 84.60 లక్షల గోతాలు అందుబాటులో.. రైతులకు గిట్టబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం 13 జిల్లాల్లోని 6,884 ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లు నిర్వహిస్తోంది. తేమ శాతం పేరుతో మధ్యవర్తులు, దళారీల చేతుల్లో రైతులు మోసపోకుండా కల్లాల్లోనే నమూనాలు సేకరించి ఆర్బీకేల్లో పరిశీలించేలా ఏర్పాట్లుచేసింది. గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.1,960, సాధారణ రకం క్వింటాకు రూ.1,940 అందిస్తోంది. అలాగే.. ఆధార్ అనుసంధానంతో ధాన్యం విక్రయించిన 72 గంటల నుంచి 21 రోజుల్లో చెల్లింపులు పూర్తిచేస్తోంది. రైతులకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. అలాగే, ధాన్యం రవాణాకు 84.60 లక్షల గోతాలు అందబాటులో ఉంచారు. ఆధార్ నంబర్‌తో చెల్లింపులు రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో తొలిసారిగా ఆధార్ నంబర్ ద్వారా చెల్లింపులు చేస్తున్నాం. రైతులపై భారం పడకుండా కల్లాల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మిల్లులకు తరలిస్తోంది. అలాగే, భారీ వర్షాలవల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నిబంధనలను సడలించాలని కేంద్రానికి లేఖరాశాం. రైతులు అధైర్యపడాల్సినఅవసరంలేదు. – వీరపాండియన్, ఎండీ, ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ హమాలీ ఖర్చులు వెంటనే ఇచ్చేశారు నా పేరు గొలుగూరి ఈశ్వర్‌రెడ్డి. మాది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక గ్రామం. మా ఊరి ఆర్బీకేలో బుధవారమే 202.8 క్వింటాళ్ల ధాన్యాన్ని విక్రయించాను. అక్కడి సిబ్బంది కల్లం వద్దకు వచ్చి శాంపిళ్లు తీసుకున్నారు. వారే వాహనంలో ధాన్యాన్ని తరలించారు. లోడింగ్‌కు హమాలీలను నేను ఏర్పాటుచేసుకున్నా. ఆ ఖర్చును కూడా క్వింటాకు రూ.25 చొప్పున నాకు రూ.5వేల చెక్కును వెంటనే ఇచ్చేశారు. ఇక ధాన్యానికి రూ.3.93 లక్షలను 21 రోజుల్లోనే జమచేస్తామని చెప్పారు. -
Andhra Pradesh: దరికి రారు దళారులు
‘పంట చేతికందింది.. కొనుగోలుకు ఎవరైనా వస్తారో రారో.. మనమే మార్కెట్‌కు ఎలా తీసుకెళ్లాలో.. అక్కడ మనకేమీ తెలీదు.. వాళ్లు (దళారులు) చెప్పిన మాటే శాసనం.. కాదు కూడదంటే పంట కొనుగోలు చేయరు.. గట్టిగా మాట్లాడితే దిక్కున్న చోట చెప్పుకోమంటారు.. వారు చెప్పిన ధరకే తెగనమ్మినా, డబ్బులెప్పుడిస్తారో చెప్పరు.. చేతికందినప్పుడు హమ్మయ్యా.. అనుకోవాలి’ అని రాష్ట్రంలోని రైతులు ఇకపై దిగులు పడాల్సిన పని లేదు. దళారుల ఆటలకు చెక్ పెడుతూ నేరుగా ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేస్తుంది. సాక్షి, అమరావతి: పంటను విక్రయించేందుకు ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదన్న గట్టి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పంటల కొనుగోలుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. దళారులు, మధ్యవర్తులకు ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా వాస్తవ సాగుదారుల నుంచే ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను నేరుగా సేకరించేలా చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ క్రాప్‌లో నమోదైన వివరాలను సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా కేంద్రాల్లో శనివారం నుంచి ప్రదర్శనకు ఉంచబోతోంది. (చదవండి: జన్యుమార్పిడి బియ్యం కలకలం) రైతులు లేవనెత్తే అభ్యంతరాలను అక్కడికక్కడే పరిష్కరించి పంట వివరాలను అప్‌గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంది. ‘మీ పేర్లు ఈ క్రాప్‌లో నమోదు కాలేదు.. అందువల్ల మీ పంటను కొనుగోలు చేయలేం’ అంటూ కొన్ని సందర్భాల్లో శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీలు (పంటను సేకరించేవి) ఇబ్బంది పెట్టకుండా కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆరు గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే దారి లేక రైతులు పడుతున్న ఇక్కట్లను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వం.. నేరుగా పంటల కొనుగోలుకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. ఈ విధానాన్ని మరింత ఆధునికీకరిస్తూ తాజాగా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ ఫాం రైతు భరోసా (యూడీపీఆర్బీ) యాప్ సాయంతో పక్కాగా పంట నమోదు చేస్తూ కొనుగోలు వేళ రైతులకు మరింత మేలు జరిగేలా చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన ఈకేవైసీ యూడీపీఆర్బీ యాప్ ద్వారా ఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణంలో.. ఏ రైతు.. ఏ రకం పంట సాగు చేశారు.. ఎప్పుడు కోత కొస్తుంది.. ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందనే వివరాలను ప్రభుత్వం ఇప్పటికే నమోదు చేయించింది. రైతులకు వారు సాగు చేసిన పంట వివరాలతో కూడిన రసీదు (డిజిటల్ ఎక్నాలెడ్జ్మెంట్)లను కూడా అందజేసింది. ఆర్బీకేల్లో పంట వివరాలు నూరు శాతం నమోదు కాగా, 10–20 శాతం మేర మిగిలి ఉన్న క్షేత్ర స్థాయి పరిశీలనతో పాటు ఈ కేవైసీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈ క్రాప్‌లో నమోదైన పంట వివరాలను తొలిసారిగా ధాన్యం సేకరణ కోసం పౌర సరఫరాల సంస్థ రూపొందించిన యాప్‌తో అనుసంధానిస్తోంది. తద్వారా రైతుల వివరాలన్నీ ఈ యాప్‌లోనూ కనిపిస్తాయి. గతంలో శాఖల వారీగా ఎవరి జాబితాలు వాళ్ల దగ్గరుండేవి. అందువల్ల సాంకేతిక సమస్య కారణంగా ఈ క్రాప్ వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, పంట నమోదులో దొర్లిన పొరపాట్లు రైతులకు నష్టం కలిగించేవి. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల ఇక నుంచి ఈ పరిస్థితి ఉండదు. 50 లక్షల టన్నుల కొనుగోలుకు ఏర్పాట్లు సామాజిక తనిఖీలో భాగంగా ఈ–పంట వివరాలను శనివారం నుంచి ఆర్బీకేల్లో ప్రదర్శించబోతున్నారు. రైతులు వీటిని పరిశీలించి పంట వివరాల నమోదులో తప్పులు చోటుచేసుకుని ఉంటే వీఏఏల దృష్టికి తీసుకెళ్తే మార్పులు, చేర్పులు చేస్తారు. అనంతరం కొనుగోలు కేంద్రాలు తెరిచే సమయానికి ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీల వద్ద సమాచారం పక్కాగా ఉంటుంది. కాగా, ఖరీఫ్ సీజన్లో సాగైన 39,35,798 ఎకరాల్లో వరి పంట వివరాలను నమోదు చేయగా, 37,43,649 ఎకరాల్లో క్షేత్ర స్థాయి పరిశీలన పూర్తి చేశారు. వరి సాగు చేసిన 21,71,708 మంది రైతుల్లో ఇప్పటి వరకు 15,37,269 మంది వివరాలను ఈ కేవైసీ పూర్తి చేశారు. రికార్డు స్థాయిలో గడిచిన ఖరీఫ్ సీజన్లో 2,500 కేంద్రాల ద్వారా 5.15 లక్షల మంది రైతుల నుంచి రూ.8,868 కోట్ల విలువైన 47.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఈసారి ఆర్బీకే స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ రెండో వారం నుంచి 8,774 ఆర్బీకేల్లో పంటల కొనుగోలుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మార్పులన్నింటి వల్ల రైతులకు ఒక్క పంటల కోనుగోలులో మాత్రమే కాకుండా పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ విషయంలోనూ మేలు జరుగుతుంది. (చదవండి: అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా యువతి.. బిక్కుబిక్కుమంటూ..) అభ్యంతరాలుంటే మార్పులు తథ్యం వాస్తవ సాగుదారుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించాలన్న ఆలోచనతో ఆర్బీకేల్లో పంట నమోదు వివరాలను ప్రదర్శిస్తున్నాం. వాటిని పరిశీలించి.. రైతులకు అభ్యంతరాలుంటే వీఏఏలకు చెబితే పక్కాగా నమోదు చేస్తారు. అవసరమైతే మరోసారి క్షేత్ర స్థాయి పరిశీలన చేస్తారు. తొలిసారిగా ఈ పంట వివరాలను పౌరసరఫరాల సంస్థ యాప్‌తో అనుసంధానం చేస్తుండటం వల్ల సాగుతో సంబంధం లేని వారు, మధ్యవర్తులు, దళారులు వేరే ప్రాంతాల నుంచి ధాన్యం తీసుకొచ్చి ఆర్బీకేల్లో విక్రయించేందుకు ఆస్కారం ఉండదు. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
దాన్యం సేకరణను వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని ఆదేశించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని సూచించారు. అలాగే రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా సాఫీగా జరిగేలా చూడాలని సీఎస్ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్లతో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఉన్నతాధికారులతో 21న సీఎస్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఈ నెల 21వ తేదీన అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలకు చెందిన సమాచారాన్ని వీలైనంత త్వరగా సీఎస్ కార్యాలయానికి పంపించాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక సీఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. -
ఇంకా ఎదురుచూపులే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం అవుతుందనుకున్నా.. మొదలు కాలేదు. దీంతో రైతులకు ఇంకా ఎదురుచూపులు తప్పడం లేదు. వరికోతలు ప్రారంభమై పదిరోజులు కావడంతో కొను గోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఆ మోదం తెలిపింది. కొనుగోళ్ల ప్రక్రియను వెంటనే మొదలుపెట్టాలని, రైతులకు ఇబ్బందులు కలగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులను ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆమోదం లభించి మూడు రోజులు అవుతున్నా జిల్లాల్లో కొనుగోళ్లకు సం బంధించిన ఏర్పాట్లపై అధికారులు కసరత్తు చేస్తూ నే ఉన్నారు. సోమవారమే సమీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో కొనుగోళ్లు ప్రారంభించేందుకు మరో ఐదారు రోజుల సమయం పట్టేలా ఉంది. 4 జిల్లాల నుంచే 40% కంటే ఎక్కువ దిగుబడి నల్లగొండ, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరి కోతలు ప్రారంభమై కల్లాలకు ధాన్యం పది రోజుల నుంచే వస్తుండటంతో, ఆయా జిల్లాల్లో సోమవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కానీ యంత్రాంగం అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కాకపోవడంతో ధాన్యం సేకరణ ప్రక్రియ ప్రారంభించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 1.35 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అందులో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 6,500కు పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఒక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే 26 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. నిజామాబాద్‌లో 9,63,652 మెట్రిక్ టన్నులు, కామారెడ్డిలో 6.5 లక్షల మెట్రిక్ టన్నులు, ఉమ్మడి మెదక్ జిల్లాలో మరో 11 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం దిగుబడి రానుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ధాన్యంలో 40 శాతం కంటే ఎక్కువ దిగుబడి ఈ నాలుగు జిల్లాల నుంచే రానుంది. పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి సేకరణ జిల్లాల్లో పరిస్థితులు, ఏర్పాట్లను బట్టి ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు ధాన్యం సేకరణ ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వారం చివరలో సేకరణను ప్రారంభించి వచ్చే నెల మొదటి వారం వరకు అన్ని జిల్లాల్లో ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. సోమవారం నల్లగొండ, నిజామాబాద్, యాదాద్రి, సూర్యాపేట జిల్లాల్లో ధాన్యం సేకరణపై అ«ధికారులు సమీక్షలు నిర్వహించారు. నల్లగొండ జిల్లాలో ఈ నెల 25వ తేదీ నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఈ వారం చివరలో, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో నెలాఖరులో ధాన్యం కొనుగోలు ప్రారంభించే అవకాశం ఉంది. 6,545 కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు గతేడాది తరహాలోనే ఈ వర్షాకాలంలో పండిన ధాన్యాన్ని సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ధాన్యం సేకరణపై సీఎం సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. గత సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 6,545 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశారని, ఈ ఏడాది కూడా ఈ కేంద్రాలన్నింటి ద్వారా యధావిధిగా ధాన్యం సేకరణ జరపాలని పౌర సరఫరాల శాఖాధికారులను సీఎం ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. ధాన్యాన్ని శుభ్రపరచుకుని తేమ లేకుండా ఎండపోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. మద్దతు ధర ప్రకారం ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎస్ సోమేశ్‌కుమార్, సీఎంఓ అధి కారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు. -
గోనె సంచుల కొరత తీరేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొద్దీ ధాన్యం సేకరణకు అవసరమైన గోనె సంచుల అవసరం భారీగా పెరుగుతోంది. అటు రైతుల నుంచి ధాన్యం సేకరణ, ఇటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం పంపిణీకి ఏటా 27 కోట్లకు పైగా గోనె సంచులు అవసరమవుతున్నాయి. రాష్ట్రంలో జనుము సాగు లేకపోవడం, గోనె సంచుల తయారీ పరిశ్రమలు లేకపోవడంతో వీటి కొనుగోలుకు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని జనపనార పరిశ్రమలు తెలంగాణలో 80 శాతానికి పైగా గోనె సంచుల అవసరాలను తీరుస్తున్నాయి. జనుము సాగుకు పేరొందిన పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా రాష్ట్రాల్లో జనపనార దిగుబడి తగ్గినా, అక్కడి పరిశ్రమల్లో సమస్యలు ఏర్పడినా ధాన్యం కొనుగోలు సమయంలో తెలంగాణ తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జనుము సాగును ప్రోత్సహించడం ద్వారా రైతులకు లాభం కలిగేలా చూడటంతో పాటు, రైతులు పండించే జనపనారను కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో జనపనార పరిశ్రమలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. జనపనార పరిశ్రమల ఏర్పాటు ద్వారా ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయని పరిశ్రమల శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు, పౌర సరఫరాలు, వ్యవసాయ శాఖ భాగస్వామ్యంతో ఇటీవల కార్యాచరణ సిద్ధం చేసింది. రూ.887 కోట్లతో మూడు జనపనార పరిశ్రమలు... దేశవ్యాప్తంగా సుమారు 140కి పైగా జనపనార పరిశ్రమలు ఉండగా, తెలంగాణలో ఒక్క పరిశ్రమ కూడా లేదు. మరోవైపు దేశవ్యాప్తంగా 38 వేలకు పైగా హెక్టార్లలో జనుము పంట సాగవుతుండగా పశ్చిమ బెంగాల్, బిహార్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనపనార ఉత్పత్తుల రంగంలో స్వయం స్వావలంబన సాధించేందుకు తొలి దశలో జనపనార పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా గత నెలలో వరంగల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఒక్కో జనపనార పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ఇటీవల పరిశ్రమల శాఖ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రూ.887 కోట్ల పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ మూడు పరిశ్రమల ద్వారా 10,448 మందికి ప్రత్యక్ష ఉపాధి, రెండింతల మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. జనపనార పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రోత్సాహకాలు ఇస్తారు. ఆయా యూనిట్లు తయారు చేసే గోనె సంచులను రాష్ట్ర ప్రభుత్వం 20 ఏళ్లపాటు కొనుగోలు చేస్తుంది. తమకు అవసరమైన ముడి జనపనార కోసం రైతులు జనుము సాగు చేసేలా ఈ కంపెనీలు రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. 15 కోట్ల సంచుల ఉత్పత్తి సామర్థ్ద్యం... రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా ఏర్పడుతున్న మూడు పరిశ్రమలు ఏటా సుమారు 15 కోట్ల గోనె సంచులను తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వీటికి అవసరమైన జనపనారను బిహార్, పశ్చిమ బెంగాల్ నుంచి రవాణా చేసేందుకు అయ్యే మొత్తాన్ని మొదటి ఏడాది వంద శాతం, మరో రెండేళ్లు 50 శాతం, ఆ తర్వాత ఐదేళ్లు 25శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ రూపంలో తిరిగి చెల్లిస్తుంది. అదే విధంగా కంపెనీలు తయారుచేసే గోనె సంచులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాల కోసం వంద శాతం తిరిగి కొనుగోలు చేస్తుంది. ‘రైతులు ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని పదేపదే చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆయా పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కూడా పెంపొందించాలని భావిస్తోంది. అందులో భాగంగానే జనపనార పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని జనపనార కంపెనీలు పెట్టుబడులతో వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. – ‘సాక్షి’తో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ -
తెలంగాణ ఇంట ‘కోటి’ సిరుల పంట..
యాసంగిలో 80 లక్షల టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న పౌర సరఫరాల శాఖ, ఇప్పటికే 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించింది. కృష్ణా బేసిన్‌లోని మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, గద్వాల వంటి జిల్లాల్లో గత ఏడాది యాసంగి కన్నా ఈసారి రెట్టింపునకు పైగా ధాన్యం సేకరించారు. సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో రాష్ట్రం రికార్డులు సృష్టిస్తోంది. 2019-20లో 1.11 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ప్రభుత్వం.. 2020–21 ఏడాది రెండు సీజన్లలో కలిపి ఏకంగా 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి చరిత్ర నెలకొల్పింది. ఒక్క యాసంగి సీజన్లోనే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం విశేషం. గత ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో నీటి సమృద్ధి పెరిగింది. దీంతో యాసంగిలో కేవలం వరి పంటే 53 లక్షల ఎకరాల్లో సాగయ్యింది. ఉత్పత్తికి అనుగుణంగా ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపట్టి దాదాపుగా పూర్తి చేసింది. ఇప్పటికే 90 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును దాటగా, మరో యాభై వేల నుంచి లక్ష టన్నుల మేర ధాన్యం సేకరించి ఈ సీజన్‌కు ముగింపు పలకనుంది. గత సీజన్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. నిండుగా కాల్వలు.. అలుగు దుంకిన చెరువులు రాష్ట్రంలో గతేడాది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాల కారణంగా రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, ఎత్తిపోతల కింది కాల్వలన్నీ నిండుగా పారాయి. ఆరు నుంచి ఏడు తడులుగా నీటిని పారించడంతో పంటలకు కావాల్సినంత నీరు అందింది. దీనికితోడు 46 వేలకు పైగా చెరువులకు గానూ 38 వేలకు పైగా చెరువులు అలుగు దుంకాయి. ఈ నేపథ్యంలో 53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవగా.. 1.30 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తిని అంచనా వేశారు. అందులో స్థానిక అవసరాలకు పోనూ 80 లక్షల టన్నులు సేకరించాలని పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే లక్ష్యానికి మించి 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. దీని విలువ సుమారు రూ.17 వేల కోట్ల మేర ఉండగా, ఇందులో రూ.14 వేల కోట్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు పౌర సరఫరాల సంస్థ వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్లలో ఐదింతలు పెరిగిన సేకరణ రాష్ట్రంలో ధాన్యం సేకరణ ఏడేళ్ల కాలంలో ఐదింతలకు పైగా పెరిగింది. నిరంతర విద్యుత్, రైతుబంధు, కాళేశ్వరం సహా చెరువుల ద్వారా పెరిగిన నీటి లభ్యత కారణంగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా ఉంది. దీనికి తగ్గట్లే గత ఏడాది యాసంగిలో 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. తాజాగా కరోనా, హమాలీల కొరత, లాక్డౌన్ వంటి పరిస్థితులను అధిగమించి సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో 6,967 కేంద్రాల ద్వారా 15 లక్షల మంది రైతుల నుంచి ఇప్పటివరకు 90 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం. - మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ -
ఫిబ్రవరి 1 నుంచి ఇంటింటికి రేషన్: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, పౌర సరఫరాల కమిషనర్ కోన శశిధర్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు హాజరయ్యారు.(చదవండి: వీళ్లు అసలు మనుషులేనా: సీఎం జగన్) ధాన్యం సేకరించిన తర్వాత గతంలో చెప్పినట్లుగా 15 రోజుల్లోగా పేమెంట్లు జరిగేలా చూడాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యానికి సంబంధించి ఈ సంక్రాంతి కల్లా రైతుల బకాయిలు పూర్తిగా చెల్లించాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించిన బిల్లులు పెండింగులో పెట్టకూడదని, ఈ ఖరీఫ్‌కు సంబంధించి నిర్ణీత లక్ష్యం ప్రకారం ధాన్యం సేకరణ జరపాలని సీఎం సూచించారు. ఈ నెల 3వ వారంలో డోర్ డెలివరీ వాహనాలు: ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ కోసం సిద్ధం చేసిన ప్రత్యేక వాహనాలు ఈ నెల 3వ వారంలో ప్రారంభించడానికి సీఎం నిర్ణయించారు. ►అదే రోజున 10 కిలోల రైస్ బ్యాగ్స్ ఆవిష్కరణ ►వచ్చే నెల (ఫిబ్రవరి) 1వ తేదీ నుంచి ఇంటి వద్దనే నిత్యావసర సరుకుల పంపిణీ. ►ఇందు కోసం 9260 మొబైల్ యూనిట్లు. అదే సంఖ్యలో అధునాతన తూకం యంత్రాలు. ► 2.19 కోట్ల నాన్ ఓవెన్ క్యారీ బ్యాగులు రెడీ. ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలు. ►లక్ష్యానికి మించి ఎస్సీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు వాహనాలు కేటాయింపు. ►ఎస్సీలకు 2333, ఎస్టీలకు 700, బీసీలకు 3875, ఈబీసీలకు 1616, ముస్లిం మైనారిటీలకు 567, క్రిస్టియన్ మైనారిటీలకు 85 వాహనాలు. ►వాహనాల లబ్ధిదారులకు 30 శాతం సబ్సిడీ, 60 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటా. ►సంక్షేమ కార్యక్రమంలో భాగంగా, ఆయా కార్పొరేషన్ల ద్వారా వారికి రుణాలు. ►అందుకోసం ప్రతి జిల్లాలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ద్వారా లోన్ ఫెసిలిటేషన్ క్యాంప్‌ల నిర్వహణ -
1న గిట్టుబాటు ధరల ప్రకటన
ఫామ్ గేట్ వద్దే పంటల సేకరణ జరుగుతుంది. అందుకని రైతుల రిజిస్ట్రేషన్ పక్కాగా జరగాలి. కల్లాల వద్దే ధాన్యం సేకరించడం కోసం, ఏరోజు వస్తారన్నది చెబుతూ రైతులకు కూపన్లు జారీ చేయాలి. కలెక్టర్లు, జేసీలు దీనిపై దృష్టి పెట్టాలి. ఎక్కడా మాన్యువల్ సర్టిఫికెట్లు అంగీకరించరు కాబట్టి ఈ–క్రాపింగ్ తప్పనిసరి. రబీకి అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండే విధంగా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. శనగల సాగుకు ప్రత్యామ్నాయ పంటలు చూపాలి. రైతులు నష్టపోతే అందరికీ నష్టం జరుగుతుంది. అది దాదాపు 62 శాతం ప్రజలపై ప్రభావం చూపుతుంది. ఈ విషయం గుర్తు పెట్టుకోండి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయితో పాటు, చివరకు ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ సలహా కమిటీలు ఏర్పాటు కావాలి. అవి తరచూ సమావేశం కావాలి. ఏ పంట వేయాలి? ఏది వద్దు? అన్న దానిపై ఆ కమిటీలు రైతులకు అవగాహన కల్పించాలి. నిజానికి గత ఖరీఫ్‌లో వ్యవసాయ సలహా కమిటీలు చాలా బాగా పని చేశాయి. ఉదాహరణకు ప్రకాశం, కర్నూలు జిల్లాలలో పత్తి సాగును 5.75 లక్షల హెక్టార్లకు పరిమితం చేయగలిగాం. వరిలో వంగడాలు కూడా విజయవంతంగా మార్చగలిగాం. ఆ విధంగా చేయలేకపోతే, పంటల సాగుపై ప్రణాళిక లేకపోతే వాటికి ధర కల్పించలేం. సాక్షి, అమరావతి: ఏ పంటకు ఎంత కనీస గిట్టుబాటు ధర అనేది అక్టోబర్ 1వ తేదీన ప్రకటించబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఆ ధరలతో కూడిన పోస్టర్‌ను అక్టోబర్ 5వ తేదీ నాటికి అన్ని రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకేలు) వద్ద ప్రదర్శించాలని అధికారులను ఆదేశించారు. ఆ ధరల కన్నా ఇంకా ఎక్కువే రైతులకు వచ్చేలా చూడాలని, అలా జరగకపోతే మార్కెట్ జోక్యంతో రైతులకు మేలు చేయాలని సూచించారు. సీఎం–యాప్ (సీఎం–ఏపీపీ) అమలయ్యేలా జేసీలు చూడాలని ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ధాన్యం సేకరణ సన్నద్ధతపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలు ఆదేశాలు, సూచనలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ–క్రాపింగ్ కీలకం ► గ్రామ సచివాలయాల్లోనే ఈ–క్రాపింగ్ జరగాలి. ఖరీఫ్ పంట చేతికి వస్తోంది. అంటే ధాన్యం సేకరణ ప్రక్రియ మొదలు కానుంది. ఈ ప్రక్రియలో ఆర్బీకేలు ప్రధాన పాత్ర పోషించాలి. ► ఈ–క్రాపింగ్ పక్కాగా పూర్తి కావాలి. ఎక్కడా అది పెండింగ్ ఉండకూడదు. కాబట్టి కలెక్టర్లతో పాటు, ఆర్బీకేల ఇన్‌చార్జ్‌లుగా ఉన్న జేసీలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ–క్రాపింగ్ వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించాలి. ఎక్కడైనా రైతులు మిస్ అయితే, వారి పేరు తప్పనిసరిగా నమోదు చేయాలి. ఇది చాలా ముఖ్యం. ► ఈ–క్రాపింగ్ ఉంటేనే, పంటల బీమా ప్రీమియమ్ చెల్లింపు, పంటల అమ్మకం, గిట్టుబాటు ధర కల్పన వంటివి సాధ్యం. అందువల్ల గ్రామ వ్యవసాయ సహాయకులు (వీఏఏ) ప్రత్యేక శ్రద్ధ చూపి, ఈ ప్రక్రియ పూర్తి చేయాలి. ఆర్బీకేల వద్ద ఎంపీఎఫ్సీ ► ప్రతి ఆర్బీకే వద్ద మల్టీపర్పస్ సదుపాయాల కేంద్రం (ఎంపీఎఫ్సీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. పంటల సాగుకు ముందు, ఆ తర్వాత రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆ కేంద్రం పని చేస్తుంది. ► గోదాము, కోల్డ్ రూమ్, కస్టమ్ హైరింగ్ కేంద్రం, ప్రైమరీ ప్రాసెసింగ్ (గ్రేడింగ్ అండ్ సార్టింగ్), ధాన్యం సేకరణ, జనతా బజార్, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఆక్వాకు మౌలిక సదుపాయాల కల్పన, ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ వంటి అన్నింటి కోసం ఆ కేంద్రాలు పని చేస్తాయి. ► ఆ కేంద్రాల కోసం ప్రతి ఆర్బీకే వద్ద భూమిని కలెక్టర్లు వచ్చే 15 రోజుల్లో సేకరించి, వ్యవసాయ శాఖకు అప్పగించాలి. సదుపాయాల కల్పన కోసం వచ్చే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రూ.6,300 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. ► ఆ ప్రక్రియలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సం«ఘాలు (ప్యాక్స్) కూడా భాగస్వామ్యం వహిస్తాయి. కాబట్టి వచ్చే వారం రోజుల్లో అవి (ప్యాక్స్) తమ నివేదికలను ఆప్కాబ్‌కు అందజేయాలి. -
ఆర్బీకేల్లో ధాన్యం సేకరణ!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) మున్ముందు ఆహార ధాన్యాల సేకరణ కేంద్రాలుగా కూడా పనిచేయనున్నాయి. రైతులు తమ పంటలను విక్రయించడానికి మండల కేంద్రాలకు పోవాల్సిన పనిలేకుండా, గ్రామాల్లోని ఆర్బీకేలలోనే విక్రయించవచ్చని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఆర్బీకేలను సమగ్ర వ్యవసాయ కేంద్రాలుగా మార్చాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామాల్లో పండే పంటలను వీటి ద్వారానే సేకరించేలా చూడాలని వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. ఏపీ మార్క్‌ఫెడ్, మార్కెటింగ్ శాఖాధికారులతో చర్చలు నిర్వహించింది. ► ఈ విధానం కోసం ఎలక్ట్రానిక్ పంట (ఇ–పంట) నమోదు రికార్డును ఆధారం చేసుకోనుంది. ఏయే ప్రాంతాల్లో ఏమేమీ పంటలు ఎంతెంత విస్తీర్ణంలో పండిస్తున్నారో, దిగుబడి ఎంత రావొచ్చో మార్కెటింగ్ ఇంటెలిజెన్స్‌తో అంచనా కట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ కార్యక్రమంలో ఎవరెవర్ని భాగస్వాములుగా చేయాలనే దానిపై మార్కెటింగ్ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ చెప్పారు. ► వ్యవసాయ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల్లోనే సేకరించడం వల్ల రైతుకు ప్రధానంగా రవాణా భారం తప్పుతుంది. క్షేత్రస్థాయిలోనే తన ఉత్పత్తులను నిబంధనల ప్రకారం విక్రయించుకోవచ్చు. దళారుల పాలిట పడి నష్టపోవాల్సిన పని ఉండదు. అమ్మిన సరుక్కి నిర్దిష్ట గడువులోగా నేరుగా ఖాతాలకే నగదు జమ అవుతుంది. ► అన్నింటికీ మించి ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు భరోసా లభిస్తుంది. ఒకవేళ ఇ–నామ్ ప్లాట్‌ఫారాల ద్వారా ఇంతకన్నా మంచి ధర వస్తే అలా కూడా విక్రయించుకునే సౌకర్యం ఉంటుంది. ఇందుకు ఆర్బీకేలలోని మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ తోడ్పడుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ► ధాన్యం సేకరణకు సంబంధించి త్వరలో ప్రణాళిక ఖరారవుతుందని, ఆ తర్వాత సీఎం జగన్, మంత్రి కన్నబాబుకు అందజేసి వారితో చర్చించిన అనంతరం ఖరారు చేస్తామని వివరించారు. -
ఎదురుచూపులు
మెదక్‌జోన్: ‘ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోకండి .. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించండి’ అని అధికారులు పదేపదే విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ధాన్యం విక్రయించి నెలరోజులు గడిచిపోతున్నా డబ్బులు రైతుల ఖాతాల్లో జమకావడం లేదు. ఓవైపు ఖరీఫ్ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు పెట్టుబడి ఎలా అంటూ అన్నదాతలు వాపోతున్నారు. జిల్లాలో ఈయేడు రబీ సీజన్లో సాగుచేసిన పంటల్లో సగం ఎండిపోయాయి. చాలామంది రైతుల బోర్లలో నీటిఊటలు అడుగంటిపోయి కనీసం పెట్టిన పెట్టుబడి సైతం రాలేదు. సాగుచేసిన దాంట్లో సగం పంట మాత్రమే చేతికందింది. ఏప్రిల్ 24న జిల్లాలో 114 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి జూన్ 26వ తేదీ వరకు నెలరోజుల పాటు ధాన్యం కొనుగోళ్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 18,686 మంది రైతుల నుంచి 66,629 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. క్వింటాల్ ధాన్యానికి మద్దతు ధర రూ. 1,770 చొప్పున రూ.116.89 కోట్లు అవుతుంది. ఇందులో ఇప్పటి వరకు రైతులకు రూ.76.89 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.40కోట్లు ఇవ్వాల్సి ఉంది. ధాన్యం అమ్మి నెలరోజులు గడిచిపోతుండడంతో రైతులు డబ్బుల కోసం నిత్యం కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 36గంటల్లో డబ్బులేవీ? కొనుగోలు చేసిన 36 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయంటూ అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యం కాలేదు. కొందరు రైతులు ధాన్యం విక్రయించి 20 రోజులు, మరికొంత మంది అమ్మి 15 రోజులు అవుతున్నా నేటికీ ఖతాల్లోకి డబ్బులు రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ పెట్టుబడి ఎలా? ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు, ముందస్తుగా కొంటారు. ధాన్యం డబ్బులు చేతికందకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఏటా ఖరీఫ్ ప్రారంభం కాగానే గ్రామాల్లో సాగుచేసిన పంటల దిగుబడి అధికంగా రావాలనే ఉద్దేశంతో పశువులపేడ, కోడి ఎరువు, చెరువుల్లోని నల్లమట్టి తదితర వాటిని పంటపొలాల్లో చల్లుతారు. వీటికి ఎకరాకు సుమారు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. ఇవి పొలంలో వాడితే అధిక దిగుబడి రావడంతో పాటు సేంద్రియ ఎరువులతో పొలంలో మంచి గ్రోత్ ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటన్నింటినీ ముందస్తుగా సిద్ధం చేసుకుందామంటే రైతులకు డబ్బులు సకాలంలో అందాల్సి ఉంది. ఇప్పటికైనా తమకు రావాల్సిన డబ్బులకు వెంటనే ఖాతాల్లో జమ చేయాలని రైతులు కోరుతున్నారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి.. ఈఏడు రైతులకు డబ్బులు చెల్లించడంలో ఆలస్యం అయిన మాట వాస్తవమే. ధాన్యం కొనుగోళ్లు కాగానే క్రమసంఖ్య పద్ధతిలో ఉన్నతాధికారులకు పంపించడం జరిగింది. ఉన్నతాధికారుల సమాచారం మేరకు మరో వారం రోజు ల్లో డబ్బులు రైతుల ఖాతాల్లోకి రానున్నాయి. – ఈశ్వరయ్య, ఇన్చార్జి డీసీఓ -
ధాన్యం సేకరణలో రాష్ట్రానికి నాలుగో స్థానం
►11 లక్షల మంది రైతుల నుంచి 53.66 లక్షల టన్నుల సేకరణ ► రూ.8 వేల కోట్ల చెల్లింపులు సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది (2016–17) ఖరీఫ్, రబీ సీజన్లలో పౌరస రఫ రాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి 53.66 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఖరీఫ్‌లోనే 37.14 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ తొలి మూడు స్థానాల్లో ఉండగా, తెలంగాణకు నాలుగో స్థానం దక్కింది. ఏపీ 55.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, తెలంగాణ ఇంచుమిం చుగా 11 లక్షల మంది రైతుల నుంచి 53.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 2013–14లో అత్యధికంగా 24.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. దళా రుల ప్రమేయాన్ని నివారించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈసారి ఆన్లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రూ.8,105.34 వేల కోట్లను తొలిసారి ఆన్లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసింది. లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు: సీవీ ఆనంద్ ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, అన్ని స్థాయిల్లో అధికారుల సహకారంతో లక్ష్యం చేరుకున్నా మని సివిల్ సప్లైస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అవసరమైన నిధులను సమకూర్చడం వల్ల ఎలాంటి జ్యాపం లేకుండా రైతులకు చెల్లింపులు పూర్తి చేశామన్నారు. దేశంలో తొలిసారిగా ఆన్లైన్ ద్వారా రూ. 8,105.34 కోట్లు చెల్లించి రికార్డు సృష్టించామన్నారు. -
మరో 34 గోదాములకు నాబార్డు నిధులు
► ఇందుకోసం రూ.73.50 కోట్లు మంజూరు ► ధాన్యం సేకరణ, గోదాములపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 34 గోదాములకు నాబార్డు నిధులు మంజూరు అయ్యాయని మార్కెటింగ్ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఆయన ధాన్యం సేకరణ, గోదాములు, పండ్ల మార్కెట్లు తదితర అంశాలపై సమీక్ష జరిపారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో 330 గోదాముల నిర్మాణానికి రూ.1,024 కోట్లు గతంలో నాబార్డు మంజూరు చేసిందని, వీటిలో 321 గోదాముల నిర్మాణం చేపట్టామని చెప్పారు. వీటికి టెండర్లు 20 శాతానికిపైగా లెస్‌కు దాఖలయ్యాయని, దీంతో మిగిలిన నిధులతో పాటు మరికొన్ని నిధులివ్వాలని నాబార్డును మార్కెటింగ్ శాఖ కోరిందని తెలిపారు. 1.22 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో అదనంగా 34 గోదాములను నిర్మించేందుకు నాబార్డు రూ.73.50 కోట్లు మంజూరు చేసిందన్నారు. 300 గోదాముల నిర్మాణం పూర్తైనట్టు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మిగతా 21 గోదాములను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మంత్రి వారిని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 11 కోల్డ్ స్టోరేజ్‌ల నిర్మాణ పనుల పురోగతిని కూడా మంత్రి సమీక్షించారు. దేవరకొం డలోని దొండకాయల మార్కెట్, పటాన్‌చెరువులో ఉల్లిగడ్డ మార్కెట్ ఇతర పండ్ల మార్కెట్లు 3 నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. గడ్డి అన్నారం మార్కెట్ కోహెడకు తరలింపు.. ఖమ్మం మిర్చి మార్కెట్‌ను రఘునాథపాలెం తరలించే ప్రయత్నాలను మంత్రి సమీక్షించారు. కాగా, జిల్లాలవారీగా నిర్మల్‌లో 2 గోదాములు, సిరిసిల్లలో 1, కామారెడ్డిలో 4, భద్రాద్రి కొత్తగూడెంలో 2, జగిత్యాలలో 2, కరీంనగర్లో 2, జయశంకర్ భూపాలపల్లిలో 2, ఖమ్మంలో 1, నల్లగొండలో 2, సూర్యాపేటలో 6, శంషాబాద్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 6, నిజామాబాద్ జిల్లాలో 2 గోదాములను అదనంగా నిర్మించాలని మార్కెటింగ్ శాఖ సంకల్పించిందన్నారు. టెండర్లలో పారదర్శకత వల్ల రూ.150 కోట్లు మిగిలిందని, ఇందులో రూ.75 కోట్లతో వేబ్రిడ్జి, కాంపౌండ్ గోడల నిర్మాణాలు, కార్యాలయ భవనాలు, విద్యుత్ వసతి కల్పించామని మంత్రి చెప్పారు. మిగిలిన రూ.75 కోట్లతో అదనంగా 34 గోదాములు నిర్మించేందుకు నాబార్డు అనుమతి లభించిందన్నారు. సమీక్షలో మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం సేకరణపై రోజూ సమీక్షించండి
జిల్లా కలెక్టర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణపై ప్రతిరోజూ సమీక్షిం చాలని జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం ఈ మేరకు కొందరు జిల్లా కలెక్టర్లతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ధాన్యం క్రయ విక్రయాలకు సంబంధించి కొన్ని పత్రికల్లో వస్తున్న వార్తలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లా ఉన్నతాధికారులు, పౌర సరఫరాల అధికారులకు ఇదివరకే ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కనీస మద్దతు ధర కల్పించాలని ఆదేశించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఐకేపీల ద్వారా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సరిహద్దు జిల్లాల్లో పొరుగు రాష్ట్రాల వ్యాపారులు కొనుగోలు చేయవచ్చని, అయితే రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను పటిష్టం చేయాలని కోరారు. వర్ష సూచన ఉన్న సందర్భాల్లో వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని, ధాన్యం తడవకుండా చూడాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల తర్వాత 48 గంటలలోనే చెల్లింపులు జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యలు, క్రయవిక్రయాల్లో తలెత్తే ఇతర పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి పరిష్కరించాలని, ధాన్యాన్ని ఏ రోజు కారోజు మార్కెట్ నుంచి మిల్లులకు, గోడౌన్లకు తరలించాలని సూచించారు. ధాన్యాన్ని తరలించేందుకు అవసరమైతే రవాణా శాఖను సంప్రదించాలని ఆదేశించారు. -
ధాన్యం కొనుగోళ్లలో సిద్దిపేట డివిజన్ టాప్
సిద్దిపేట జోన్: ధాన్యం సేకరణలో భాగంగా జిల్లా యంత్రాంగం ప్రవేశపెట్టిన వినూత్న ప్రయోగానికి సత్ఫలితాలు లభించాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు దీటుగా రబీలో ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా అధికారులు వ్యవసాయ పరపతి సంఘాలను (పీఏసీఎస్) రంగంలోకి దింపారు. దీంతో ఈ యేడు రబీలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు పోటీ పడి పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేశాయి. జిల్లా పౌర సరఫరాల శాఖ రికార్డుల ప్రకారం ఈ యేడు సేకరించిన ధాన్యంలో అర్ధభాగం పరపతి సంఘాలదే కావడం విశేషం. దీంతో జిల్లాలోని 105 సొసైటీల్లో అత్యుత్తమంగా కొనుగోలు చే సిన ఐదు పీఏసీఎస్ సొసైటీలను ప్రభుత్వం గుర్తించింది. వాటిలో సిద్దిపేట డివిజన్‌కు చెందిన సిద్దిపేట, దుబ్బాక, నంగునూరు పీఏసీఎస్ సొసైటీలు వరుసగా మూడు నుంచి ఐదు స్థానాలు ఆక్రమించడం విశేషం. సుమారు రూ. 6 కోట్ల విలువైన ధాన్యం లావాదేవీలను కొనసాగించడం విశేషం. ధాన్య సీమగా పేరొందిన మెతుకు సీమలో వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు పుష్కలం. ప్రతి యేటా లక్షలాది క్వింటాళ్ల ధాన్యం దిగుమతి కావడం సహజం. ముఖ్యంగా మధ్యతరహా ప్రాజెక్టుగా గుర్తింపు పొందిన ఘనపూర్, సింగూరు ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాలన్ని వరి సిరులతో కళకళలాడుతుంటాయి. గత సంవత్సరం ఎఫ్‌సీఐ, సివిల్ సప్లై ద్వారా కొనుగోలు ప్రక్రియను నిర్వహించిన జిల్లా అధికారులు సానుకూల ఫలితాలు మరింత మెరుగ్గా వచ్చేందుకు తొలిసారిగా క్షేత్రస్థాయిలో పీఏసీఎస్‌లను రంగంలోకి దించింది. ఎక్కడికక్కడా రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరను అందించేందుకు పీఏసీఎస్ సొసైటీలకు పూర్తి అధికారాలను కట్టబెట్టింది. ఈ క్రమంలో జిల్లాలోని 105 సొసైటీలకు సంబంధిత ఆదేశాలను జారీ చేసింది. ఈ లెక్కన రబీలో పౌరసరఫరాల శాఖ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల నుంచి 69 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా వాటిలో సొసైటీలు 34 వేల టన్నులు సేకరించడం విశేషం. వాటిలో అత్యధికంగా మెదక్ సొసైటీ కొనుగోలు చేయగా ద్వితీయ స్థానంలో కొల్చారం మండలం రంగంపేట సొసైటీ నిలిచింది. వాటి తర్వాత స్థానాలను సిద్దిపేట డివిజన్ పరిధిలోని దుబ్బాక, సిద్దిపేట, గంగాపూర్లు కైవసం చేసుకున్నాయి. జిల్లా సహకార సంఘం రికార్డుల ప్రకారం దుబ్బాక పీఏసీఎస్ సొసైటీ 350 మంది రైతుల నుంచి 18,050 క్వింటాళ్లను సేకరించి 26 రోజుల్లోనే రూ. 2,42,77,250 డబ్బులను రైతులకు చెల్లించింది. అదే విధంగా సిద్దిపేట సొసైటీ 361 రైతుల నుంచి 25 రోజుల్లో 16,186 క్వింటాళ్లను కొనుగోలు చేసి వాటికి సంబంధించి రూ. 2, 17,70,412లు చెల్లించింది. అదే విధంగా చిన్నకోడూరు మండలం గంగాపూర్ సొసైటీ 368 మంది రైతుల నుంచి 45 రోజుల్లో రూ. 14,200 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 1,90,99,000 రైతులకు చెల్లించి రికార్డు స్థాయిలో నిలిచాయి. ఈ యేడు పూర్తి స్థాయిలో సొసైటీలకు కొనుగోలు ప్రక్రియను అప్పగించి మరింత మెరుగైన ఫలితాలు సాధించేం దుకు ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం.