సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని.. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన సొమ్ము విడుదల ప్రక్రియ దాదాపుగా ముగిసిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే రూ.3,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేశామని.. ఈ నెల 20వ తేదీలోగా ధాన్యం విక్రయించిన ప్రతి రైతుకు సొమ్ము అందే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఈసారి యాసంగిలో ప్రకృతి వైపరీత్యాలకు ఎదురెళ్లి విజయవంతంగా ధాన్యం సేకరణ జరిపామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
65.10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఈ యాసంగిలో గురువారం నాటికి 11 లక్షల మంది రైతుల నుంచి రూ.13,383 కోట్ల విలువైన 65.10 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించామని మంత్రి తెలిపారు. ఇందు లో ఓపీఎంఎస్‌లో రూ. 10,439 కోట్ల రసీదులు అప్‌లోడ్‌కాగా.. ఇప్పటి వ రకు రూ.9,168 కోట్లు వి డుదల చేశామన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో విపత్కర పరిస్థితులను ముందుగానే అంచనా వేసి.. సాధారణం కంటే పదిరోజులు ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, ధాన్యం సేకరణ మొదలుపెట్టామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గతంలో కన్నా అధికంగా 7,037 కొనుగోలు కేంద్రాలను తెరిచామని.. ఇప్పటికే 90శాతానికి పైగా సేకరణ çపూర్తవడంతో 6,366 కేంద్రాలను మూసేశామన్నారు. 18 జిల్లాల్లో సంపూర్ణంగా సేకరణ పూర్తయిందని, మిగతా జిల్లాల్లోనూ ఆది వారం నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ఎక్కడైనా ఆలస్యంగా వరి కో తలు జరిగిన ప్రాంతాల్లో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. కొనుగోళ్లు చేపట్టేందు కు కలెక్టర్లకు అధికారం ఇచ్చామని వివరించారు. గత యాసంగి సీజన్ కన్నా ఈసారి ఇప్పటికే 16లక్షల టన్నులు అధికంగా సేకరించామన్నారు.
కేసీఆర్ రైతు అనుకూల విధానాలతోనే..
సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలైన రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, అందుబాటులో సాగునీరు, మద్దతు ధరతో కొనుగోళ్లు వంటి కారణాలతో తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
కేవలం తొమ్మిదేళ్లలో ధాన్యం సేకరణలో దేశం గరి్వంచే స్థితికి తెలంగాణ చేరుకుందని వివరించారు. ఓవైపు పంటను సేకరిస్తూనే, మరోవైపు అకాల వర్షాల నుంచి కాపాడేందుకు పౌరసరఫరాల యంత్రాంగం మొత్తం క్షేత్రస్థాయిలోనే ఉండి రైతులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment