
ధాన్యం సేకరణలో రాష్ట్రానికి నాలుగో స్థానం
►11 లక్షల మంది రైతుల నుంచి 53.66 లక్షల టన్నుల సేకరణ
► రూ.8 వేల కోట్ల చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణలో తెలంగాణ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది (2016–17) ఖరీఫ్, రబీ సీజన్లలో పౌరస రఫ రాల సంస్థ రైతుల నుంచి అంచనాలకు మించి 53.66 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఖరీఫ్‌లోనే 37.14 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లలో పంజాబ్, ఛత్తీస్‌గఢ్, ఏపీ తొలి మూడు స్థానాల్లో ఉండగా, తెలంగాణకు నాలుగో స్థానం దక్కింది.
ఏపీ 55.32 లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, తెలంగాణ ఇంచుమిం చుగా 11 లక్షల మంది రైతుల నుంచి 53.66 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు 2013–14లో అత్యధికంగా 24.82 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా తాజాగా ఆ రికార్డును తిరగరాసింది. దళా రుల ప్రమేయాన్ని నివారించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈసారి ఆన్‌లైన్ చెల్లింపులకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది రూ.8,105.34 వేల కోట్లను తొలిసారి ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో జమ చేసింది.
లక్ష్యాన్ని మించి కొనుగోళ్లు: సీవీ ఆనంద్
ఈ ఏడాది లక్ష్యానికి మించి రికార్డుస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశామని, అన్ని స్థాయిల్లో అధికారుల సహకారంతో లక్ష్యం చేరుకున్నా మని సివిల్ సప్లైస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అవసరమైన నిధులను సమకూర్చడం వల్ల ఎలాంటి జ్యాపం లేకుండా రైతులకు చెల్లింపులు పూర్తి చేశామన్నారు. దేశంలో తొలిసారిగా ఆన్‌లైన్ ద్వారా రూ. 8,105.34 కోట్లు చెల్లించి రికార్డు సృష్టించామన్నారు.