తాడేపల్లి: సంక్రాంతి వేళ ఏపీ రైతుల్లో సంతోషం వెల్లివిరిసింది. రైతుల వద్ద నుంచి రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసిన ఏపీ ప్రభుత్వం.. ఇప్పటివరకూ రూ. 4,813 కోట్లు జమ చేసింది. ఇవాళ ఒక్కరోజు రూ, 1,500 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసి రైతు పక్షపాతి ప్రభుత్వం అని మరోసారి నిరూపించుకుంది.
కాగా, ఇప్పటివరకూ 25.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించింది ఏపీ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళారి, మిల్లర పాత్ర లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేసింది. అదే సమయంలో 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు జమ చేసింది. మరొకవైపు హమాలీ, గన్నీ, రవాణా చార్జీలను సైతం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment