రబీలో 12.63 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
లక్ష్యం25 లక్షల టన్నులుగా నిర్ణయం
మార్కెట్‌లో ధర ఉండటంతో తగ్గిన సేకరణ
1.32 లక్షల మంది రైతుల నుంచి రూ.2,761.90 కోట్లు విలువైన ధాన్యం సేకరణ
49,894 మంది రైతులకు 1,104.46 కోట్ల చెల్లింపు
82 వేల మంది రైతులకు 1,657.44 కోట్ల బకాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రబీ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యం సేకరణ దాదాపు ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ధర అందించడంతో పాటు దేశంలోనే తొలిసారిగా గన్నీ, హమాలీ, రవాణా (జీఎలీ్ట) చార్జీల కింద టన్నుకు రూ.2,523 అదనంగా చెల్లిస్తూ రైతులకు ఆర్థికంగా అండగా నిలిచింది. ఫలితంగా రైతులు ఆర్బీకేల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వైపే మొగ్గు చూపారు. దీంతో దళారులు, కొంతమంది మిల్లర్ల దోపిడీకి పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడింది.
ప్రైవేటు వ్యాపారులు తమకు గతంలో మాదిరిగా ధాన్యం అమ్మకానికి రాకపోవడంతో చేసేదేమీ లేక రైతులకు పూర్తి మద్దతు ధర ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. 2023–24 రబీలో 25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ ప్రాథమికంగా అంచనా వేసింది. అయితే.. మార్కెట్‌లో డిమాండ్ బాగుండటంతో ఎక్కువ భాగం వ్యాపారులే రైతులకు మంచి ధర చెల్లించి కొనుగోలు చేయడంతో ఆర్బీకేల్లో అనుకున్న స్థాయి కంటే ధాన్యం సేకరణ తక్కువగా ఉంది.
డబ్బుల కోసం ఎదురుచూపు: రబీ సీజన్‌లో ఇప్పటివరకు 1.32 లక్షల మంది రైతుల నుంచి రూ.2,767.90 కోట్ల విలువైన 12.63 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత డబ్బుల కోసం అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో 21 రోజుల్లో తప్పనిసరిగా చెల్లింపుల చేసేలా వ్యవస్థను తీసుకొచ్చి0ది. చాలా సందర్భాల్లో ఒకట్రెండు రోజుల్లోనే రైతులకు డబ్బులు జమయ్యాయి కూడా.
ఈ రబీలో ఎన్నికల హడావుడిలోనూ రైతులకు సకాలంలో చెల్లింపులు చేసింది. మే 12న 45,468 మంది రైతుల ఖాతాల్లో రూ.1,008.93 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత చెల్లింపులు నెమ్మదించాయి. ఇప్పటివరకు 49,894 మంది రైతులకు రూ.1,104.46 కోట్లు మాత్రమే అందాయి. ఇంకా 82,825 మంది రైతులకు రూ.1,657.44 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇందులో ధాన్యం సేకరణ తర్వాత నిర్ణీత గడువు ముగిసిన రైతులు చాలామంది ఉండటం.. ఖరీఫ్ సాగు కోసం సమాయత్తం కావడానికి చేతిలో డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment