సాక్షి, విజయవాడ: ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు 2,006 కోట్లు ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు. లక్ష 77 వేల రైతుల ఖాతాల్లోకి నిధులు జమ అయ్యాయి.
ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా, 4 లక్షల 9 వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం రూ.ఐదు వేల కోట్లు ధాన్యం డబ్బులు చెల్లించింది. 21 రోజులు దాటకుండానే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీ ఎన్నికలు 2024: వైఎస్సార్‌సీపీ కీలక సమావేశాలకు ముహూర్తం ఖరారు
Comments
Please login to add a commentAdd a comment