సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేలైన వెంకటగిరిలో నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్లను విడుదల చేశాం’’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘‘బీసీలంటే బ్యాక్‌వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఈ నాలుగేళ్లలో నేతన్నల ఖాతాల్లో ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదు విడతల్లో రూ.1,20,000 జమ చేశాం. ఈ ఒక్క పథకానికే మన ప్రభుత్వం రూ.970 కోట్లను కేటాయించింది. దేవుడి దయతో నేతన్నలకు తోడుగా నిలబడే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు.
చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్
మగ్గాలకే ఉరి వేసుకొనే దుస్థితి నుంచి మగ్గాలను ఆధునికీకరించుకొని, జీవనాన్ని మెరుగుపర్చుకొనే స్థాయికి నేతన్నలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్. మగ్గానికి మహర్దశ తీసుకొచ్చి, దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చి, వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చి, ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.
అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తున్నారు. గత నాలుగేళ్లూ క్రమం తప్పకుండా ఈ సాయాన్ని అందించారు. వరుసగా ఐదో ఏడాది కూడా వైఎస్సార్ నేతన్న నేస్తం’ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేలైన వెంకటగిరిలో నేడు వైయస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్లను విడుదల చేశాం. బీసీలంటే బ్యాక్‌వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్‌బోన్… pic.twitter.com/8yH6yeSYcH
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2023
Comments
Please login to add a commentAdd a comment