YSR Nethanna Nestham
-
నేతన్నలకు ఇచ్చినమాట నిలబెట్టుకున్న మనసున్న నేత
-
చేనేతకు ఇది స్వర్ణయుగం: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: ఆగష్టు 7వ తేదీ.. ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఈ సందర్భంగా.. చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ‘‘చేనేత మన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం. నా పాదయాత్రలో వాగ్దానం చేసినట్లుగా.. వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించాం. నేత కార్మికులకు సంవత్సరానికి రూ. 24,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. చేనేత కార్మికులను ఉద్ధరించాలనే మా నిబద్ధత.. రాష్ట్రంలో చేనేతకు స్వర్ణయుగాన్ని తెచ్చింది. నేతన్నలకు గత వైభవాన్ని పునరుజ్జీవింపజేస్తున్నాము. వారికి సుసంపన్నమైన భవిష్యత్తును అందిస్తున్నాం అంటూ ట్వీట్ చేశారాయన. On #NationalHandloomDay, we celebrate the rich heritage of our weaver community, an integral part of our cultural legacy. As promised during my Padayatra, we launched the YSR Nethanna Nestham scheme, empowering our weavers with their looms and yearly financial assistance of Rs… pic.twitter.com/1Blmd12VF2 — YS Jagan Mohan Reddy (@ysjagan) August 7, 2023 -
వైయస్ఆర్ నేతన్న నేస్తం మా జీవితాలలో వెలుగులు నింపింది
-
‘వైయస్ఆర్ నేతన్న నేస్తం’ పథకంతో ప్రతి చేనేత కుటుంబానికి భరోసా..
-
ఇదీ వీళ్ల సంస్కారం: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన సీఎం జగన్
వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న బాధతో, భవిష్యత్‌పై కలత చెందిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరంతా సంస్కార హీనులని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. వెంకటగిరిలో జరిగిన సభలో జగన్ ఏమన్నారంటే.. బాబుగారి వలంటీర్ ఈ దత్తపుత్రుడు.. మన వలంటీర్లు అమ్మాయిలను లోబర్చుకున్నారంటాడా? ఇతను ఇదే కార్యక్రమంగా పెట్టుకుని అమ్మాయిలను లోబర్చుకుని వారిని పెళ్లి చేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. మరలా వదిలేయడం.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, మళ్లీ వదిలేయడం.. మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం.. ఇదే పని. పైగా ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం. ఈయన మన వలంటీర్ల క్యారెక్టర్ గురించి మాట్లాడతాడు. మరో క్యారెక్టర్ వయస్సు 75 ఏళ్లు. అయినా సిగ్గులేదు. టీవీల్లోకి వచ్చి ఒక షోలో మాట్లాడుతూ.. ఆహా బావా.. నువ్వు సినిమాల్లోనే చేశావు. నేను నిజ జీవితంలోనే చేశాను అంటూ.. చేసిన వెధవ పనులను ఆ ముసలాయన గొప్పగా చెప్పుకుంటాడు. అమ్మాయి కనిపిస్తే చాలు ముద్దన్నా పెట్టాలంట.. లేదా కడుపన్నా చేయాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు. పట్టపగలే మందు తాగుతూ పదిమంది అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్ పక్కనే డ్యాన్స్‌లు చేసేవారు ఇంకొకరు. యూట్యూబ్‌లోకి వెళ్లి చూస్తే.. నిస్సిగ్గుగా డ్యాన్స్‌లు చేస్తూ కనిపిస్తాడు. సాక్షి, తిరుపతి: వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందన్న బాధతో, భవిష్యత్‌పై కలత చెందిన చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, వీరంతా సంస్కార హీనులని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఎండైనా, వానైనా, చలైనా, వరదలొచ్చినా, పండగరోజైనా, సెలవురోజైనా నిక్కచ్చిగా సేవ చేస్తున్న వలంటీర్ల కేరెక్టర్‌పై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు, సొంతపుత్రుడు, బావమరిది కేరెక్టర్ ఏంటో ప్రజలకు బాగా తెలుసన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఆయన వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత నిధుల విడుదల కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కొన్ని విషయాలు మాట్లాడకూడదనుకున్నా పరిస్థితులు చూసినప్పుడు తప్పడం లేదన్నారు. ఎక్కడైనా మంచి చేస్తున్న వ్యవస్థలను, మనుషుల్ని సంస్కారం ఉన్న ఏ ఒక్కరూ అవమానించరని, కానీ మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి ఇటీవల సంస్కారం కోల్పోయి కొందరు మాట్లాడుతున్నందు వల్ల ఈ మాటలు చెప్పాల్సి వస్తోందని చెప్పారు. వలంటీర్లంతా మన ఊళ్లో, మన కళ్లెదుటే నాలుగేళ్లుగా కనిపిస్తున్నారని, మనందరికీ తెలిసినవాళ్లేనన్నారు. ఒకటో తేదీ రాగానే సూర్యోదయానికన్నా ముందే చిక్కటి చిరునవ్వుతో తలుపుతట్టి, గుడ్ మార్నింగ్ చెబుతూ ఇదిగో మీ పెన్షన్ అంటూ అవ్వాతాతలను చిరునవ్వులతో పలరించే కుటుంబ సభ్యులు మన వలంటీర్లు అని చెప్పారు. వెంకటగిరిలో జరిగిన సభకు హాజరైన జనసందోహంలో ఓ భాగం అవినీతికి, వివక్షకు తావు లేకుండా, మనందరి ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రతి గడప వద్దకూ.. కాళ్లకు బలపం కట్టుకుని మరీ వెళ్లి.. కులం, మతం, వర్గం, ప్రాంతం చివరకు వారు ఏ పార్టీ వారు అని కూడా చూడకుండా అవ్వాతాతలకు మేలు చేస్తున్న మనవళ్లు, మనవరాళ్ల వ్యవస్థపై కొందరు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పుడు మాటలకు స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుది అయితే నిర్మాత చంద్రబాబు.. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి అని తెలిపారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. నిస్సిగ్గు రాతలు ► వలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరంటారు. గ్రామ వలంటీర్లు అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు.. ముంబయికో, ఎక్కడికెక్కడికో పంపించేస్తున్నారు అని ఇంకొకరు నిస్సిగ్గుగా అంటారు. దీన్ని తాటికాయంత అక్షరాలతో ఈనాడు పత్రిక, సిగ్గులేని ఆంధ్రజ్యోతి పత్రిక, ఇంకో సిగ్గులేని టీవీ–5 మీడియా రాస్తాయి. ఇటువంటి వారంతా బురద జల్లుతారు. అబద్దాలకు రెక్కలు తొడుగుతారు. ► 2.60 లక్షల మంది మన పిల్లలు గ్రామ స్థాయిలో సేవలందిస్తున్నారు. ఇందులో 60 శాతం నా చెల్లెమ్మలే. మన వలంటీర్లు అంతా కూడా చదువుకున్న సంస్కారవంతులే. వీరంతా సేవా భావంతో పని చేస్తున్నారు. ఇలాంటి మన సేవామిత్రలు, సేవారత్నాలు, సేవా వజ్రాలు అయిన మన వలంటీర్ల కేరెక్టర్‌ను తప్పుపట్టింది ఎవరో తెలుసా? సభా ప్రాంగణం నిండిపోవడంతో బయట వేచి ఉన్న జనవాహిని ► ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వలంటీర్‌గా పని చేస్తున్న ప్యాకేజీ స్టార్. ఇంకొకరు చంద్రబాబు నాయుడు. మరొకరు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీరంతా ఒక గజదొంగల ముఠా. వీళ్లు వలంటీర్ల కేరెక్టర్ గురించి మాట్లాడుతున్నారు. వలంటీర్ పిల్లల కేరెక్టర్ ఎలాంటిదో అదే గ్రామంలో వారి సేవలందుకుంటున్న కోట్ల మందికి తెలుసు. వీరికి మంచి చేసిన చరిత్రే లేదు ► ఇచ్చేది తన పార్టీ బీ–ఫారమ్. నిజానికి టీడీపీకి బీ–టీమ్. చంద్రబాబు మీద పోటీ ఒక డ్రామా. బీజేపీతో స్నేహం మరో డ్రామా. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. అంతటికీ స్క్రిప్ట్ ఈనాడు రామోజీరావుది. నిర్మాత చంద్రబాబు. నటన, మాటలు, డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. ఇవీ నిజాలు. ► ఎందుకు ఈ స్థాయికి దిగజారిపోయారంటే వీరికి మంచి చేసిన చరిత్ర లేదు. ఫలానా మంచి చేశాం.. అందుకే మాకు తోడుగా ఉండండి అని చెప్పుకోవడానికి కూడా ఒక్కటంటే ఒక్కటి మంచి చేసిన చరిత్ర లేదు. ఉన్నదంతా వంచన, వెన్నుపోట్లు మాత్రమే. ఇదీ వీళ్ల జీవిత చరిత్ర. ఇదీ మన చరిత్ర ► మరోవైపు మీ బిడ్డ ప్రభుత్వం కేవలం 50 నెలల్లోనే ఎలాంటి అవినీతి, లంచాలకు తావులేకుండా ఏకంగా రూ.2.25 లక్షల కోట్లు నేరుగా బటన్ నొక్కి నా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో జమ చేసింది. 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మన చరిత్ర. అందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టడం మన చరిత్ర. ప్రతి ఏటా 44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ.. రూ.26 వేల కోట్లకు పైగా అమ్మఒడి పథకం ద్వారా నిలవడం మన చరిత్ర. ► దాదాపు కోటి మంది పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఆసరాగా.. వారికి తోడుగా నిలబడుతూ రూ.19,178 కోట్లు వాళ్ల చేతుల్లో పెట్టడం, సున్నా వడ్డీ కింద రూ.3,615 కోట్లు ఇవ్వడం మీ బిడ్డ చరిత్ర. ► నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా చేయూత అనే పథకం ద్వారా మరో రూ.14,129 కోట్లు ఇచ్చాం. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్టుగా వ్యాపారాలు సైతం చూపించడం ఇంకో చరిత్ర. రైతు భరోసాగా ఇప్పటికే దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతన్నలకు రూ.31 వేల కోట్లు నేరుగా జమ చేయడం మన చరిత్ర. గొప్ప చదువుల కోసం తాపత్రయం ► మన పిల్లలు చదవాలి, చదువుల కోసం పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఏ తల్లి, తండ్రీ తమ పిల్లల చదువుల కోసం అప్పుల పాలు కాకూడదని.. వారికి తోడుగా ఉంటూ విద్యా దీవెన పథకం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చాం. పిల్లలకు మెస్ చార్జీలకు.. బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం తీసుకొచ్చాం. ఈ రెండు పథకాలకు ఈ 50 నెలల్లో రూ.15 వేల కోట్లు ఇచ్చాం. ► మన పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, నాడు–నేడుతో రూపురేఖలు మారుతున్న స్కూళ్లు, మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, మూడో తరగతి నుంచే టోఫెల్లో సైతం ప్రిపరేషన్, ఆరో తరగతి నుంచే ప్రతి క్లాస్‌రూమ్‌లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఉండేలా ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేయడం, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబుల పంపిణీ, రోజుకొక మెనూతో పిల్లలకు గోరుముద్ద పథకాన్ని తీసుకురావడం, స్కూళ్లు తెరిచేటప్పటికే ఆ పిల్లల చిక్కటి చిరునవ్వుల మధ్య కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా విద్యా కానుక పంపిణీ.. ఇది మన పిల్లల భవిష్యత్ కోసం చేస్తున్న మన చరిత్ర. ఇంటింటికీ ధైర్యంగా వెళ్తున్నాం ► మేనిఫెస్టో అంటే చంద్రబాబు మాదిరిగా చెత్తబుట్టలో పడేయడం కాదు. దాన్నొక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించాం. ఏకంగా 98 శాతం హామీలను నెరవేర్చి.. గడప గడపకూ తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఈ మేనిఫెస్టోను వాళ్ల చేతుల్లో పెడుతూ మీరే చదివి మీ బిడ్డని ఆశీర్వదించండని అడుగుతున్న చరిత్ర మనది. ► ఏకంగా 26 జిల్లాలు చేసిన చరిత్ర మనది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంతవరకు 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ హయంలో ఏకంగా 50 శాతం పెరిగి 6 లక్షలకు చేరాయి. 2.06 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన చరిత్ర మనది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. ఉద్యోగులను ఆదుకున్న చరిత్ర కూడా మనదే. ► స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు ఉంటే.. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మరో 17 కడుతున్నాం. రాష్ట్రంలో నాలుగు చోట్ల ఆరు పోర్టులుంటే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగేళ్లలో మరో 4 పోర్టులు కడుతున్నాం. 10 ఫిషింగ్ హార్బర్లు, మరో 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ పేదలపట్ల, రాష్ట్రం పట్ల ప్రేమతో చేస్తున్నాం. మారుతున్న గ్రామాల ముఖచిత్రం ► ప్రతి గ్రామం రూపురేఖలు మారుతున్నాయి. ప్రతి గ్రామంలో వలంటీర్లు కనిపిస్తారు. సెక్రటేరియట్ వ్యవస్థ, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. ప్రతి గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ కనిపిస్తుంది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లూ కనిపిస్తాయి. ► కొత్తగా 108, 104 అంబులెన్స్ వాహనాలు 1,600 పైచిలుకు కుయ్ కుయ్‌మంటూ వినిపిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ రూపురేఖలు మారాయి. గతంలో సరిగా నిర్వహించకుండా.. కేవలం 1,000 వ్యాధులకు పరిమితమైన ఆరోగ్యశ్రీని.. 3,250 వ్యాధులకు విస్తరించాం. ఆరోగ్య ఆసరా కూడా తీసుకొచ్చాం. కోవిడ్ టైంలో మనం చేసిన యుద్ధం ఇంకొక చరిత్ర. ► అమ్మఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళా సాధికారత విషయంలో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేలా చేశాం. సామాజిక న్యాయంలో ఎవరూ చేయని విధంగా ప్రతి అడుగులో నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 50 శాతం నామినేటెడ్ పదవులు, 50 శాతం నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల కోసం ఏకంగా చట్టం చేసి అమలు చేస్తున్న చరిత్ర మనది. ► రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా అసైన్డ్ భూములు మీద హక్కులు ఇచ్చిన చరిత్ర మనది. 2 లక్షల ఎకరాలకు పైగా చుక్కల భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో రైతులు ఉంటే.. భూముల సమస్యలను తొలగించి రైతన్నల చేతిలో పెట్టిన చరిత్ర మనది. అప్పటికీ, ఇప్పటికీ తేడా చూడండి ► మనిషి కేరెక్టర్, విశ్వసనీయత విషయంలో కానీ, మేనిఫెస్టోకి ఇస్తున్న విలువ గురించి కానీ, చేస్తున్న మంచి విషయంలో కానీ గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య తేడా మీరే గమనించండి. మనకు ఎలాంటి పాలకుడు, పాలన కావాలన్నది ఆలోచన చేయండి. మీ బిడ్డకు వాళ్ల మాదిరిగా ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లేదు. మీ బిడ్డ దేవుడి దయను, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు. రాబోయే రోజుల్లో వాళ్లు ఇంకా అబద్ధాలు చెబుతారు. ఇవాళ వలంటీర్ల గురించి ఏ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారో.. రాబోయే రోజుల్లో మీ బిడ్డ గురించి, మీ బిడ్డ ప్రభుత్వం గురించి, ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి అదే మాదిరిగా దారుణంగా అబద్ధాలు చెప్తారు. ఇవేవీ నమ్మొద్దు. మీ ఇంట్లో మంచి జరిగిందా? లేదా? అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీ ఇంట్లో మంచి జరిగితే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి. సభా ప్రాంగణానికి సీఎం జగన్ వస్తుండగా జై జగన్ అంటూ నినాదాలు -
వెంకటగిగిలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం.. జగనన్నకు జనం జేజేలు (ఫొటోలు)
-
వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదల.. సీఎం జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ నేతన్న నేస్తం నిధులు విడుదలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేలైన వెంకటగిరిలో నేడు వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్లను విడుదల చేశాం’’ అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు. ‘‘బీసీలంటే బ్యాక్వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఈ నాలుగేళ్లలో నేతన్నల ఖాతాల్లో ఏడాదికి రూ.24 వేల చొప్పున ఐదు విడతల్లో రూ.1,20,000 జమ చేశాం. ఈ ఒక్క పథకానికే మన ప్రభుత్వం రూ.970 కోట్లను కేటాయించింది. దేవుడి దయతో నేతన్నలకు తోడుగా నిలబడే అవకాశం వచ్చినందుకు గర్వపడుతున్నాను’’ అని సీఎం జగన్ అన్నారు. చదవండి: అలాంటి క్యారెక్టర్ ఉన్నోడా వలంటీర్లను అనేది!: సీఎం జగన్ ఫైర్ మగ్గాలకే ఉరి వేసుకొనే దుస్థితి నుంచి మగ్గాలను ఆధునికీకరించుకొని, జీవనాన్ని మెరుగుపర్చుకొనే స్థాయికి నేతన్నలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు సీఎం జగన్. మగ్గానికి మహర్దశ తీసుకొచ్చి, దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చి, వారి స్థితిగతులను మెరుగు పరిచేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని తీసుకొచ్చి, ఏటా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు అందిస్తున్నారు. గత నాలుగేళ్లూ క్రమం తప్పకుండా ఈ సాయాన్ని అందించారు. వరుసగా ఐదో ఏడాది కూడా వైఎస్సార్ నేతన్న నేస్తం’ ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. శుక్రవారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగే సభలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేలైన వెంకటగిరిలో నేడు వైయస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని మన ప్రభుత్వంలో నిర్వహించాం. మొత్తం 80,686 చేనేత కుటుంబాల ఖాతాల్లో రూ.193.64 కోట్లను విడుదల చేశాం. బీసీలంటే బ్యాక్వార్డ్ క్లాసులు కాదు.. వారిని బ్యాక్‌బోన్… pic.twitter.com/8yH6yeSYcH — YS Jagan Mohan Reddy (@ysjagan) July 21, 2023 -
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్, బాలకృష్ణ ఒరిజినల్ క్యారెక్టర్.. సీఎం జగన్ సెటైర్లు
-
చేనేత చేయి పట్టుకొని నడిపిస్తా
-
తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైయస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం (ఫొటోలు)
-
సీఎం జగన్ రాకతో.. దద్దరిల్లిన వెంకటగిరి సభ!
-
వెంకటగిరిలో సీఎం జగన్ సభ.. ఇసుకేస్తే రాలనంత జనం
-
వరుసగా ఐదో ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం
-
నేతకు జీవం పోశాం
సాక్షి, తిరుపతి: రాష్ట్రంలో నేతన్నకు తోడుగా నిలిచి, అన్ని విధాలా చేయి పట్టుకుని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. నేతకు, ఆప్కోకు జీవం పోయడమే కాకుండా చేనేత వ్రస్తాలకు మార్కెటింగ్‌పై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. ఇంతకు ముందు లేని విధంగా అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల మీద నేతన్నల వ్రస్తాలను అమ్మే ఏర్పాటు చేశామని, తద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపామని తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా వెంకటగిరిలో వైఎస్సార్ నేతన్న నేస్తం ఐదో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్లో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 80,686 మంది నేతన్నల ఖాతాల్లో రూ.193.64 కోట్లు నేరుగా జమ చేశారు. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ ఏడాది కూడా రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నేతన్నల మగ్గాలు ప్రపంచంతో మాట్లాడే నేల వెంకటగిరి అని చెప్పారు. అలాంటి ఈ గడ్డపై నుంచి ఐదో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆరి్థకంగా, రాజకీయంగా, విద్యా పరంగా, మహిళా సాధికారత పరంగా అన్ని విధాలా మేలు చేయడంలో.. అంబేడ్కర్, పూలే భావజాలాన్ని అమలు చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందున్నామని స్పష్టం చేశారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. బీసీలు బ్యాక్ బోన్ క్లాసులు బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులుగా మారుస్తానని ఎన్నికల వేళ చెప్పాను. ఆ రోజు చెప్పిన మాటకు కట్టుబడి ఈ నాలుగేళ్లలో ప్రతి పనిలోనూ నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కనిపించే విధంగా అడుగులు వేశాను. ఈ కోవలోనే నవరత్నాలు తీసుకు వచ్చాను. నేతన్న నేస్తం తీసుకొచ్చాను. సొంత మగ్గం కలిగి ఉన్న ప్రతి నేతన్నకు ఏటా రూ.24 వేల చొప్పున వరుసగా ఇస్తూ పోతున్నా. ఇలా ఐదు విడతలుగా రూ.1.20 లక్షలు ప్రతి నేతన్న చేతిలో పెట్టాం. 80,686 మంది చేనేత అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకి మేలు జరిగేలా ఇవాళ రూ.194 కోట్లు జమ చేస్తున్నాం. ఈ ఒక్క పథకం ద్వారా మాత్రమే ఐదు దఫాలుగా రూ.970 కోట్లు జమ చేసి నేతన్నలకు తోడుగా నిలబడ్డాం. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 77 నేతన్నల కుటుంబాలకు కనీసం సహాయం కూడా చేయలేదు. మీ బిడ్డ సీఎం అయ్యాక ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు చొప్పున ఇచ్చాం. ఇకపై అలా జరగకుండా నవరత్నాలు తీసుకొచ్చాం. హామీలు గాలికొదిలేసిన గత ప్రభుత్వం నేతన్నలకు ఇచ్చిన హామీలన్నీ చంద్రబాబు గెలిచాక గాలికి వదిలేశారు. వారికి రూ.1.50 లక్షలతో ఉచితంగా ఇళ్లు కట్టిస్తామన్నారు. మగ్గం షెడ్డు కట్టిస్తామన్నారు. బడ్జెట్లో రూ.1000 కోట్లు ఏటా కేటాయిస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష బ్యాంకు రుణాలిస్తామన్నారు. చేనేత కారి్మకులకు రుణమాఫీ చేస్తామన్నారు. ఇలా ఎన్నో హామీలిచ్చి చివరకు చేనేతలను మోసం చేశారు. ఏటా రూ.1000 కోట్లు ఖర్చు చేస్తామన్న వారు ఐదేళ్లకు కలిపి రూ.450 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. దీంతో నేతన్నల కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. మన ప్రభుత్వంలో ఆ పరిస్థితి మార్చేశాం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికలప్పుడు చెప్పిన మాట నెరవేరుస్తూ 2019 డిసెంబర్ 21న నా పుట్టిన రోజునాడు వైఎస్సార్ నేతన్న నేస్తం తీసుకొచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరుసగా ఐదో దఫా సహాయం చేశాం. సామాజిక పింఛన్ల రూపంలో రూ.1,396 కోట్లు, నవరత్నాల్లో ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టాం. బకాయిలతో కలిపి ఆప్కోకు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు.. మొత్తంగా రూ.3,706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం ఖర్చు చేయగలిగాం. గత చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి రూ.450 కోట్లు ఎక్కడ? మీ బిడ్డ ప్రభుత్వంలో 50 నెలల్లో రూ.3,706 కోట్లు ఎక్కడ? ఒక్కసారి మీరే ఆలోచించండి. వెంకటగిరికి వరాలు వెంకటగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ఎమ్మెల్యే రామ్‌కుమార్‌రెడ్డి నిధులు అడిగారు. ఆల్తూరుపాడు ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి అడుగులు ముందుకు వేయకుండా అడ్డుకున్న పరిస్థితి చూశాం. రివైజ్డ్ ప్రాజెక్టు కాస్ట్ ఎస్టిమేషన్ తయారుచేయిస్తే రూ.553 కోట్లు అవుతుందన్నారు. ఇందుకు అనుమతులు మంజూరు చేస్తాను. 6 మండలాల్లో డ్రెయిన్లు, సీసీరోడ్ల కోసం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నా. మున్సిపాలిటీలో డ్రెయిన్లు, సీసీరోడ్లకు సంబంధించి ప్రతి గడపకూ తిరగమని రామ్‌కు చెబుతున్నాను. ఒక్కోసచివాలయానికి రూ.50 లక్షలు కేటాయిస్తాం. వెంకటగిరికి ఇరిగేషన్ ట్యాంకుకు సంబంధించిన నిధులూ మంజూరు చేస్తాను. బీసీ కమ్యూనిటీ హాల్, ఎస్సీ గురుకుల స్కూల్ మంజూరు చేస్తున్నా. పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తున్నా. జాతర ఇవాళే వచ్చినట్లయ్యింది గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో నేత పనులు గిట్టుబాటు కాక చేనేత కార్మికులు ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మీరొచ్చాక (సీఎం జగన్) వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఆ పరిస్థితులు మారిపోయాయి. నవరత్నాల పథకాల ద్వారా ఎంతగానో లబ్ధి పొందుతున్నాం. నా భర్తకు కిడ్నీలో రాళ్లు వస్తే రూపాయి ఖర్చు కాకుండా ఆరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చేయించాం. పిల్లలకు స్కూల్లో రుచికరమైన భోజనం పెడుతున్నారు. మీ (సీఎం) పుణ్య మా అని టిడ్కో ఇల్లు కూడా వచ్చింది. సీఎం జగనన్న మేలు ఎప్పటికీ మరచిపోం. రెండు నెలల తర్వాత వచ్చే వెంకటగిరి జాతర.. ఇవాళే వచ్చినంత ఆనందంగా ఉంది. – సోమా విజయలక్ష్మి, చేనేత కార్మికురాలు, వెంకటగిరి (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కళల కల‘నేత’
సాక్షి, అమరావతి: ‘‘పట్టు వస్త్రంపై ప్రధాని మోదీ ధ్యానముద్ర.. వాల్ హ్యాంగింగ్ వస్త్రంపై సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్న నిలువెత్తు చిత్రం.. పట్టు చీరపై శ్రీరామకోటి, రామాయణ పాత్రలు.. ఇదంతా ఓ చేనేత కార్మికుడి కళల కలబోత’’. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జూటూరి నాగరాజు.. చేనేతలో నైపుణ్యానికి సాంకేతికతను జోడించి అద్భుతాలు సాధిస్తున్నాడు. చేనేతలో ఆకట్టుకునేలా నాగరాజు ఆవిష్కరించిన వాటిల్లో కొన్ని.. ► ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ అందించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రాన్ని పట్టు వస్త్రంపై ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి.. ఆ వస్త్రాన్ని ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభ సభలో సీఎం వైఎస్ జగన్‌కు, చేనేత, జౌళి శాఖ కమిషనర్‌కు అందజేశాడు. ► బాపట్ల వైఎస్సార్సీపీ నేతల కోరిక మేరకు నవరత్న పథకాల పేర్లు, చిత్రాలతో కూడిన రెండు మీటర్ల పొడవైన పట్టు శాలువాను నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే నేసి ఇచ్చాడు. పాదయాత్రలో వైఎస్ జగన్ నడిచి వస్తున్న చిత్రాన్ని సైతం అద్భుతంగా నేశాడు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిర్వహించిన పోటీల్లో అవార్డును సాధించాడు. ► ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ (తెలంగాణ) ఫొటోతో పాటు ఆయన కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా పట్టు వస్త్రంపై నేసి ఇచ్చాడు. ► లేపాక్షి మందిరములో చెక్కిన వందలాది శిల్పాలను అచ్చుగుద్దినట్టు చేనేత మగ్గం ద్వారా పట్టు చీరలో నేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. థాయ్‌లాండ్ సంస్కృతికి చెందిన చిహ్నాలు, చార్మినార్, తాజ్‌మహాల్‌ను సైతం పట్టు చీరలపై నేసి ప్రతిభకు పట్టం కట్టాడు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో 104 రాకెట్లను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించడాన్ని ఆదర్శంగా తీసుకొని ఇస్రో శాటిలైట్ శారీని చేనేత మగ్గంపై తయారు చేశాడు. విజయవాడలో జరిగిన ఎగ్జిబిషన్లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆ శాటిలైట్ శారీని చూసి నాగరాజును అభినందించారు. ► గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి చిత్రం, గాలిగోపురం, తెలుగు అక్షరాలు వచ్చే విధంగా చేనేత మగ్గంపై తయారు చేసి ఔరా అన్పించాడు. ఆధునికత జోడించాను మా తాత, తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన చేనేతకు ఆదరణ తగ్గిన తరుణంలో దానికి ఆధునికత జోడించి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకున్నాను. డిగ్రీ చదివాను. 25 ఏళ్లుగా చేనేతపైనే ఆధారపడ్డాను. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని చేనేతలో కొత్త డిజైన్లు ఆవిష్కరిస్తున్నాను. నా ఉత్పత్తులు పలు దేశాలకు, దేశంలోని ప్రముఖ నగరాలకు ఎగుమతి చేస్తున్నాను. కంప్యూటర్ ద్వారా ఆధునిక డిజైన్లను ముద్రించి మగ్గంలోని జకార్డ్, తదితర ఆధునిక పరికరాల సాయంతో వస్త్రాలను నేస్తున్నాను. అనేక పోటీల్లో బహుమతులు సాధించాను. –జూటూరి నాగరాజు, ధర్మవరం చేనేత కార్మికుడు -
జగనన్న కోసం జనం.. దారి పొడవునా తరగని అభిమానం (ఫొటోలు)
-
అందుకే సీఎం జగన్ జననేత అయ్యారు..!
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా పెడనలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవానికి హాజరైన అనారోగ్య బాధిత బాలుడి తల్లిదండ్రులు, ఓ వృద్ధురాలు, మరో ముగ్గురు మహిళలు ముఖ్యమంత్రి జగన్‌కు తమ సమస్యలను విన్నవించేందుకు నిరీక్షిస్తున్నారు. వేదికపై కూర్చున్న సీఎం జగన్ అర్జీలు చేతబట్టుకుని ఎదురుచూస్తున్న వారిని గమనించి తనవద్దకు తీసుకురావాలని కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ రావిలాల మహేష్‌కుమార్‌కు సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వారందరినీ బారికేడ్లు దాటించి వేదిక వద్దకు తీసుకొచ్చారు. సీఎం కార్యాలయ కార్యదర్శి ముత్యాలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని వారి వద్దకు వెళ్లి అర్జీలను స్వీకరించి సీఎంకు అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కార్యక్రమం ముగిశాక గుర్తు పెట్టుకుని మరీ మరోసారి వారిని పిలిచి మాట్లాడారు. చదవండి: CM YS Jagan: మంచిని ఓర్వలేరు -
మంచిని ఓర్వలేరు: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో మనం మంచి పనులు చేస్తుండటాన్ని చంద్రబాబుతో కూడిన దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీరి వైఖరి చూస్తుంటే బాధ కలుగుతోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక రాట్నం... ఒక మగ్గం మన దేశం రూపురేఖలను మార్చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి మన స్వాతంత్య్ర పోరాటాన్ని గమనిస్తే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, జాతీయ ఉద్యమాన్ని సంఘటితం చేసిన ఘనత నేతన్నలదేనని గుర్తు చేశారు. మన నేతన్నలు మగ్గాల మీద నేసేది దారాల కలబోత మాత్రమే కాదన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. బతుకుదెరువు కోసం.. మన నేత, చేనేత గొప్ప సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిల్చాయి. అటువంటి మగ్గాన్ని, చేనేతను వేల సంవత్సరాల నుంచి నమ్ముకుని బతుకుదెరువు కోసం నేతన్నలు అవస్థలు పడటాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిచోటా గమనిస్తున్నాం. అద్భుతమైన వస్త్రాలను నేసే నేతన్నల జీవితాలు ఎలా ఉన్నాయో నా 3,648 కి.మీ. పాదయాత్రలో చాలాచోట్ల కళ్లారా చూశా. మాట ప్రకారం వారికి తోడుగా నిలుస్తున్నాం. నేతన్నపై ప్రేమకు నిదర్శనం.. 2019లో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని నా పుట్టిన రోజు నాడే తెచ్చాం. నేతన్న మీద నా ప్రేమకు అది నిదర్శనం. క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలు చొప్పున అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ వరుసగా నాలుగో ఏడాదీ అందచేస్తున్నాం. ఈ ఒక్క పథకం కింద ఇప్పటివరకు ఒక్కో నేతన్న కుటుంబానికి రూ.96 వేల మేర ప్రయోజనాన్ని చేకూర్చాం. గత అప్పుల కింద బ్యాంకులు ఈ డబ్బులను జమ చేయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం. నేతన్నలకు మొత్తం సాయం రూ.2,049.43 కోట్లు ఇవాళ అందించే సాయంతో కలిపితే ఇప్పటివరకూ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ఇది కాకుండా నేతన్నలకు సామాజిక ఫించన్ల ద్వారా మరో రూ.880 కోట్లు, ఆప్కో ద్వారా మరో రూ.393.30 కోట్లు చెల్లించాం. ఇలా మూడేళ్లలో నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం ఏకంగా రూ.2,049.43 కోట్లు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా గతంలో ఏ ఒక్క ప్రభుత్వమైనా నేతన్నలకు ఇంత అండగా నిలబడిందా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. సీఎం వైఎస్ జగన్‌కు నవరత్నాల లోగోతో కూడిన చేనేత వస్త్రాన్ని చూపుతున్న నేతన్న నేతన్నల కుటుంబాలకు దన్ను అప్‌గ్రేడ్ మిషన్స్... ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయంతో మగ్గాలను జాకార్డ్ లిప్టింగ్ మిషన్స్ లాంటి ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం నేతన్నలకు వచ్చింది. తద్వారా కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సులువుగా మగ్గాన్ని నడుపుతున్నారు. 2018–19లో నెలకి రూ.4,680 మాత్రమే ఉన్న నేతన్నల ఆదాయం వైఎస్సార్ నేతన్న నేస్తం దన్నుతో మగ్గాలు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరింది. ఆన్‌లైన్‌తో ప్రపంచానికి పరిచయం.. ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేశాం. ఈ కామర్స్ సంస్ధలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్, పేటీఎం లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను మార్కెటింగ్ చేసే స్థాయిని పెంచాం. మూడేళ్లలో చేసిన మంచి ఇదీ.. శాశ్వత బీసీ కమిషన్... శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్, బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర నేరుగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాం. అధికారంలో.. మొదటి విడత మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిస్తే రెండో విడతలో వారికి 70 శాతం ఇవ్వగలిగాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. శాససనభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ అక్క ఉన్నారు. మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలే. ఎమ్మెల్సీలుగా 32 మందికి అవకాశం కల్పిస్తే వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. కార్పొరేషన్లలో... 98 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీ ఛైర్మన్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 70 పదవులు దక్కాయి. 648 మండల ప్రజా పరిషత్ పదవుల్లో వైఎస్సార్ సీపీ 637 గెలుచుకుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 66.7 శాతం పదవులు ఇచ్చాం. జడ్పీ ఛైర్మన్లు 13కిగానూ 13 వైఎస్సార్సీపీనే గెల్చుకుంది. వీటిలో 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారంటే గతానికి, ఇప్పటికి తేడాను మీరే గమనించండి. సామాజిక న్యాయం... చంద్రబాబు పాలనలో ఎలాంటి సామాజిక న్యాయం ఉందో చెప్పేందుకు ఒక్క ఉదాహరణ చాలు. నాడు విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్, కృష్ణా జడ్పీ ఛైర్మన్‌గా గద్దె అనురాధ, కనకదుర్గమ్మ ఆలయం ఛైర్మన్‌గా యలమంచి గౌరంగబాబు ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇవాళ మన పాలనలో విజయవాడ మేయర్‌గా నా చెల్లి, బీసీ మహిళ భాగ్యలక్ష్మి ఉన్నారు. కృష్టా జడ్పీ ఛైర్మన్‌గా మరో బీసీ చెల్లెమ్మ హారిక ఉన్నారు. దుర్గ గుడి ఛైర్మన్‌గా బీసీ అన్న సోమినాయుడు ఉన్నారు. ఎటు చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. 50 శాతం కేటాయిస్తూ చట్టం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేశాం. అందులోనూ 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 137 ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో అక్కచెల్లెమ్మలు 50 శాతానికి పైగా కనిపిస్తారు. నేతన్న నేస్తం సభకు హాజరైన జనసందోహం అక్కచెల్లెమ్మలకు అండగా.. అక్కచెల్లెమ్మల పేరుతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో శరవేగంగా సాగుతోంది. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందనుకుంటే అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి పెడుతున్నాం. అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత పథకాలతో తోడుగా నిలిచాం. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెన, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మారుస్తున్నాం. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు 86 శాతం ఉన్నారు. నేతన్న నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్ సంతోషించే హృదయాలు కావవి.. ► ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతుంటే జీర్ణించుకోలేని కుట్రదారులు చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నప్పుడు సంతోషపడే హృదయాలు కావవి. మంచి జరుగుతుంటే రాళ్లు వేసే కుళ్లు, కుతంత్రాలను మన కళ్లెదుటే చూస్తున్నాం. ► నాకు వాళ్ల మాదిరిగా ఈనాడు సపోర్టు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, టీవీ 5 అండ ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సహాయం ఉండకపోవచ్చు. కానీ వాళ్లకు లేనిది, నాకు ఉన్నది ఒక్కటే.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నాకు తోడున్నాయి. ► కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడనుకుంటే.. అప్పుడు జనంపై నమ్మకం పెట్టుకుని పరిపాలన చేస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికి వాడుతున్నా. అందుకే నేను చేసిన మంచి మీద నమ్మకం ఉంది. నా నమ్మకం మీమీద ఉంది. ► గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు ముఖ్యమంత్రి పదవిని తన వాళ్ల కోసం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి కోసం వినియోగించారు. రాష్ట్రాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీంతో పాలన సాగించారు. ► ఆ రోజు అప్పులు గమనిస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (అప్పు శాతం పెరుగుదల) 19 శాతం ఉంటే ఈ రోజు 15 శాతం మాత్రమే ఉంది. అంటే ఆరోజు కన్నా ఇవాళ అప్పులు తక్కువగానే చేస్తున్నాం. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగతున్నాడో ఆలోచన చేయండి. అప్పటికి, ఇప్పటికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మార్పు. నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.102 కోట్ల పనులకు పచ్చజెండా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి జోగి రమేష్ దాదాపు రూ.102 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, నీటి సరఫరా, బ్రిడ్జిలు, బీటీ రోడ్ల పనులకు సంబంధించి మొత్తం మంజూరు చేస్తున్నా. ఇంకో శుభవార్త ఏమిటంటే.. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. జిల్లాలో నా తర్వాత కార్యక్రమం బందరు పోర్టుకు శంకుస్ధాపన చేయడమే. అందుకోసం మళ్లీ వస్తా. నేరుగా ప్రజల వద్దకే ఈ సందర్భంగా వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని గమనించిన సీఎం జగన్ తన రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్‌ను నేరుగా వారి వద్దకు పంపి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. -
వైఎస్సార్ నేతన్న నేస్తం.. సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన (ఫొటోలు)
-
మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్
సాక్షి, పెడన(కృష్ణా జిల్లా): మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాను ఈ సభలో మాట్లాడటానికి మైక్ పట్టుకున్న తర్వాత ఒక శుభవార్త కూడా వచ్చిందని, అది ఏమిటంటే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. దీనిలో భాగంగా మచిలీపట్నం పోర్టుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు సీఎం జగన్. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం అన్న సీఎం జగన్.. త్వరలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపకు వస్తానని సభా ముఖంగా తెలిపారు. చదవండి: సామాజిక న్యాయ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం: సీఎం వైఎస్ జగన్ దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది: సీఎం జగన్ -
నేతన్నల ఆదాయం మూడురెట్లు పెరిగింది: సీఎం జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటిది మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలవలేదని, నేతన్నల జీవితాలను తన పాదయాత్రలో గమనించా గనుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. ఇవాళ 80, 546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చేనేత మాత్రమే కాదు.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు పవర్లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మాది. కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి కోసమే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారని, గతంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని ఎద్దేవా చేశారు సీఎం జగన్. తప్పుడు విమర్శలు చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకుంటున్నారని, జరుగుతున్న మంచిని ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. అన్ని వర్గాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామన్న ఆయన.. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
నేడు కృష్ణా జిల్లా పెడనలో సీఎం జగన్ పర్యటన
-
వైఎస్ఆర్ నేతన్న నేస్తం
-
దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది: సీఎం జగన్
వైఎస్సార్ నేతన్న నేస్తం.. నాలుగో విడత నగదు జమ కార్యక్రమం అప్డేట్స్ ►ప్రసంగం అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి నేతన్నల ఖాతాల్లోకి నేరుగా 193.31 కోట్లు జమ చేశారు సీఎం జగన్. పెడన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ►దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది ►గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు అండగా నిలవలేదు ►నేతన్నల జీవితాలను నా పాదయాత్రలో గమనించా ►వారికి నేనున్నాననే భరోసా అందించా ►అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చాం ►మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం ►నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ. 96వేల సాయం ► 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమ ►లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం ► ఇప్పటివరకూ నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049 కోట్లు ►మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్ ►పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం: సీఎం జగన్ ►త్వరలో మచిలీపట్నం పోర్టు శంకస్థాపన: సీఎం జగన్ ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ కామెంట్స్ ► కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ► మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే నేత సీఎం వైఎస్ జగన్ ► బలహీనపక్షాల తరఫున నిలబడే బలమైన నేత సీఎం జగన్ ► రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారు ► అన్ని వర్గాల ప్రజలకు సీఎం అండగా నిలుస్తున్నారు ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, ఇతరులు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. ► చేనేత కళాకారుల ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్.. స్వయంగా మగ్గాన్ని నేశారు. ► పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్.. స్థానిక నేతలతో ఆప్యాయ పలకరింపు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమం కోసం పెడన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు.. పర్యాటక మంత్రి, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పుష్ఫగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. గురువారం ఉదయం కృష్ణా జిల్లా పెడనకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. హెలీప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన మంత్రి జోగిరమేష్, చీఫ్ విప్ లు సామినేని ఉదయభాను,ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని,కొడాలి నాని,పార్ధసారధి,కైలే అనీల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా ► కృష్ణా జిల్లా పెడన పర్యటన కోసం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే వేదిక నుంచి.. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం.. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. ప్రసంగిస్తారు. షెడ్యూల్ ► సీఎం జగన్ ఇవాళ (గురువారం) కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ► పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ► బహిరంగ సభలో ప్రసంగించి.. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ► కార్యక్రమం అనంతరం.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
కృష్ణా, విశాఖ జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 25న (గురువారం) కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఆయన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. 10.50 నుంచి 12.30 గంటల వరకు పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. విశాఖపట్నం జిల్లా పర్యటన ఇలా.. 26న (శుక్రవారం) విశాఖపట్నంలో సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో ఒప్పంద కార్యక్రమం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన వారికి ధ్రువపత్రాలను అందించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరతారు. 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20 నుంచి 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుంటారు. 11.23 నుంచి 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు. 12.40 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ నేతన్న కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గురువారం కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు 4వ విడతగా రూ.193.31 కోట్లను జమ చేస్తారు. ► అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందిస్తున్న సాయంతో కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు అందించిన మొత్తం సాయం రూ.96,000. ఇప్పటివరకూ నేరుగా నేతన్నలకు ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం కింద రూ.776.13 కోట్లు, నేతన్నల పెన్షన్ కోసం రూ.879.8 కోట్లు, ఆప్కోకు చెల్లించిన రూ.393.3 కోట్లతో కలిపి మూడేళ్లలో నేతన్నల సంక్షేమం కోసం వెచ్చించిన మొత్తం రూ.2,049.2 కోట్లు. ► చేనేత కార్మికులు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో మగ్గాలను డబుల్ జాకార్డ్, జాకార్డ్ లిఫ్టింగ్ మెషిన్ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకుని కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం వల్ల 2018–19లో కేవలం రూ.4,680 మాత్రమే ఉన్న నెలవారీ ఆదాయం పథకం అమలు తర్వాత మూడు రెట్లు పెరిగి రూ. 15,000కు చేరింది. ► గత సర్కారు బకాయి పెట్టిన రూ.103 కోట్లుసహా రూ.393.30 కోట్లను ఆప్కోకు అందచేసింది. ► ఆప్కో వస్త్రాలకు ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ఈ–కామర్స్ సంస్థలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫోక్స్, లాంటి దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. -
మగ్గం.. చిద్విలాసం.. కష్టకాలంలో ఆదుకున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెడనకు చెందిన వి.అక్కనాగమ్మ టీడీపీ మాజీ కౌన్సిలర్. చేనేత మగ్గం పనితో కుటుంబానికి బాసటగా నిలుస్తోంది. సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీ చూడం, కులం చూడం, మతం చూడం అని సీఎం వైఎస్ జగన్ అన్నట్టుగానే టీడీపీకి చెందిన ఆమెకు కూడా ఏడాదికి రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం అందించారు. గత మూడేళ్లలో వచ్చిన రూ.72 వేలతో.. గతంలో చేసిన అప్పులు తీర్చడంతోపాటు చేనేతకు అవసరమైన ముడి సరుకులు కొనుగోలు చేసింది. ఇలా ఒక్క అక్కనాగమ్మ మాత్రమే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏటా సగటున 85 వేలకు పైగా చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ప్రభుత్వం నేతన్న నేస్తం అందిస్తోంది. ఫలితంగా చేనేత రంగం సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. నేత కార్మికులు నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. నేత కార్మికులకు భరోసా ఇలా.. ► నేతన్న నేస్తంతోపాటు నవరత్నాల పథకాలు చేనేత రంగంపై ఆధారపడిన వారికి ఊపిరి పోశాయి. ఈ మూడేళ్లలో దాదాపు రూ.576.05 కోట్లు నేతన్న నేస్తం కింద పంపిణీ చేశారు. ► కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాల నిల్వలను ఆప్కో ద్వారా సేకరించి విక్రయించారు. చేనేతకు కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తూ ఆర్గానిక్ వ్రస్తాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి వినూత్న ప్రయోగాలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ► మూడేళ్లలో దాదాపు 40 ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ, క్లస్టర్ ట్రైనింగ్ ఇచ్చారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో సబ్సిడీ అందించి మగ్గాలు, షెడ్డులు, తదితర సామగ్రిని సమకూర్చారు. మిల్లు వ్రస్తాలకు దీటుగా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పిస్తూ.. ఆప్కో షోరూమ్‌లను విస్తరించి సొసైటీల వద్ద వస్త్రాలు కొనుగోలు చేసి విక్రయించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయి. ► రెడీమేడ్ వ్రస్తాలను కూడా తయారు చేయడంతో చేనేత డిజైన్లకు ఆదరణ పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లోనూ, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లోనూ వీటిని విక్రయిస్తున్నారు. రాజకీయంగానూ అందలం చంద్రబాబు మోసం చేస్తే, జగన్ చేనేతలను ఆదుకున్నారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కారి్మకుడికి అండగా నిలిచారు. గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన చేనేత కారి్మకుల కుటుంబాలకు రూ.3.52 కోట్లు చెల్లించారు. ఇద్దరికి ఎమ్మెల్సీ, ఒకరికి ఎంపీ, ఏడుగురికి మున్సిపల్ చైర్మన్లు, ఇద్దరికి టీటీడీ బోర్డు మెంబర్.. పద్మశాలి, తొగట, దేవాంగ, కరి్ణశాలి కార్పొరేషన్ చైర్మన్లు, 48 మందికి డైరెక్టర్ల పదవులు ఇచ్చారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా ఎంతోమందికి అవకాశమిచ్చారు. – మోహనరావు, ఆప్కో చైర్మన్ చదవండి: పారిశ్రామికవేత్తలుగా పొదుపు మహిళలు -
ఏపీకి ‘స్కోచ్’ అవార్డుల పంట
సాక్షి, అమరావతి: ఆంద్రప్రదేశ్‌కు స్కోచ్ అవార్డుల పంట పండింది. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో గురువారం ప్రకటించిన అవార్డుల్లో అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా, గతంలో ఎన్నడూ లేని విధంగా వివిధ కేటగిరిల్లో 5 గోల్డ్, 5 సిల్వర్ స్కోచ్ మెడల్స్ రాష్ట్రానికి దక్కాయి. ఢిల్లీ నుంచి గురువారం నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు. సంక్షేమ పథకాలకు బంగారు స్కోచ్‌లు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా మహిళలను తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాలకు గోల్డ్ స్కోచ్‌లు వరించాయి. అదే విధంగా మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగాన్ని పెంచే లక్ష్యంతో మత్స్యశాఖ ఇటీవల ప్రారంభించిన ‘ఫిష్ ఆంధ్రా’కు డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్ కేటగిరిలో గోల్డ్ స్కోచ్ దక్కింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎన్నికలనాటికి డ్వాక్రా సంఘాలకున్న అప్పును వైఎస్సార్ ఆసరా పథకం కింద నాలుగు విడతల్లో వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది. అదేవిధంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు అందిస్తోంది. మత్స్య ఉత్పత్తుల స్థానిక వినియోగం కనీసం 30 శాతం పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 70 ఆక్వా హబ్‌లను, వాటికి అనుబంధంగా 14 వేలకుపైగా రిటైల్ అవుట్‌లెట్స్‌ను తీసుకొస్తోంది. ప్రయోగాత్మకంగా పులివెందులలో ఆక్వాహబ్తో పాటు 100కు పైగా రిటైల్ అవుట్‌లెట్స్ ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి. సంక్షోభంలో ఉన్న చేనేత కార్మికులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకాన్ని అత్యంత సమర్ధవంతంగా అమలుచేస్తోన్న అనంతపురం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డు దక్కింది. ఇక గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన వరి (రైస్ ఫోర్టిఫికేషన్) సాగు చేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ వరించింది. ఐదు విభాగాల్లో సిల్వర్ మెడల్స్ డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్‌లో గోల్డ్‌మెడల్ దక్కించుకున్న మత్స్యశాఖ ఈ–ఫిష్ విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. ఈ–క్రాప్ తరహాలోనే ఆక్వా సాగును గుర్తించేందుకు తీసుకొచ్చిన ఈ–ఫిష్ యాప్‌తో పాటు పశువైద్యాన్ని పాడిరైతుల ముంగిటకు తీసుకెళ్లే లక్ష్యంతో పశుసంవర్ధక శాఖ తీసుకొచ్చిన పశుసంరక్షక్ యాప్‌కు సిల్వర్ స్కోచ్ అవార్డులు వరించాయి. ఆర్బీకేల ద్వారా సకాలంలో సబ్సిడీపై విత్తనాలు అందిస్తూ రైతుసంక్షేమం కోసం పాటు పడుతున్న ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్)కు సిల్వర్ స్కోచ్ దక్కింది. కరోనా కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలను అత్యంత పారదర్శకంగా ప్రజల ముంగిటకు తీసుకెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాల విభాగానికి సిల్వర్ స్కోచ్ వరించింది. ఇక.. బయోవిలేజ్, నేచురల్ ఫార్మింగ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ స్కోచ్ దక్కింది. ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. చదవండి: ('చంద్రబాబు నీకు జీవితకాలం టైం ఇస్తున్నా.. దమ్ముంటే నా ఛాలెంజ్ తీసుకో') -
ఇదిగో ‘నేస్తం’.. నేనున్నా
సాక్షి, అమరావతి: చేనేత కార్మికుల సంక్షేమం కోసం వైఎస్సార్ నేతన్న నేస్తం, ఆప్కో ద్వారా రూ.1,600 కోట్ల మేర ప్రయోజనం చేకూరుస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన మాస్కులు, చేనేత సహకార సంఘాల నుంచి ఆప్కో సేకరించిన వస్త్రాలు, పిల్లల యూనిఫామ్స్ కోసం కానివ్వండి.. ఇలా దాదాపుగా రూ.1,600 కోట్లను నేతన్నలకు మంచి చేసేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోందన్నారు. 1,06,400 మంది నేతన్నలకు పెన్షన్లు పెంచి ఇస్తున్న సొమ్ము కాకుండా, నేతన్నలకు ఇచ్చిన ఇళ్లపట్టాలు, ఇంటి నిర్మాణాలు, చేయూత, ఆసరా, అమ్మఒడి, విద్యాదీవెన.. వసతి దీవెన ఇవన్నీ లెక్కలో వేసుకోకుండా.. కేవలం నేతన్న నేస్తం, ఆప్కోల ద్వారా వారికి జరుగుతున్న మేలు దాదాపుగా రూ.1,600 కోట్లు ఉంటుందని వెల్లడించారు. గత సర్కారు ఐదేళ్లలో చేనేతల కోసం కేవలం రూ.259 కోట్లు మాత్రమే వ్యయం చేసిందన్నారు. కరోనా విపత్తు వేళప్రభుత్వానికున్న ఇబ్బందులు కన్నా చేనేతల కష్టమే ఎక్కువని భావించానని, మూడేళ్ల పాలన పూర్తి కాకముందే వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం అమలు చేస్తున్నామని చెప్పారు. మూడో విడత నేతన్న నేస్తంతో కలిపి చేనేతలకు ఇప్పటివరకు రూ.600 కోట్లు సాయం అందించామని, ఐదేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారానే రూ.1,000 కోట్లు అందచేయనున్నట్లు వివరించారు. చేనేతలు పడుతున్న ఇబ్బందులు, అవస్థలను తన పాదయాత్రలో స్వయంగా చూశానని, అధికారంలోకి రాగానే వారి బాగోగుల కోసం ఆలోచిస్తూ ప్రతి అడుగులోనూ మంచి చేయడానికి ఆరాటపడుతున్నానని సీఎం జగన్ పేర్కొన్నారు. వివిధ జిల్లాలకు చెందిన లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఇలాంటి కార్యక్రమాన్ని దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడం లేదని, మీ బిడ్డ ప్రభుత్వమే అమలు చేస్తోందని గర్వంగా చెబుతున్నానన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నెల రోజుల్లోగా గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలన చేసి నేతన్న నేస్తం అందిస్తామని ప్రకటించారు. ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ వరుసగా మూడో ఏడాది సాయం కింద 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని చేనేత కార్మికులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలు ఇవీ.. నేనెప్పటికీ మరిచిపోలేను.. ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దాదాపు 80 వేల చేనేత కుటుంబాలకు లబ్ధి కలుగుతోంది. ఒక్కొక్కరికి రూ.24 వేల చొప్పున రూ.192 కోట్లకుపైగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నాం. చేనేతల అవస్ధలు నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో చూశా. ప్రతి జిల్లాలోనూ తమ సమస్యలు నాకు చెప్పుకున్నారు. వారి గోడును నేనెప్పటికీ మరిచిపోలేను. నా పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో, ఎన్నికల్లో ఏదైతే చెప్పామో... అవన్నీ కూడా ఎన్నికలు పూర్తి కాగానే అమలు చేయడం ప్రారంభించాం. మూడేళ్ల పాలన పూర్తి కాకముందే... అందులో ఒక మంచి కార్యక్రమం.. నేతన్న నేస్తం. ఈ రోజు వరుసగా మూడో సంవత్సరం పథకాన్ని అమలు చేస్తున్నాం. అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన, ఆ మగ్గం మీద బతుకుతున్న చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని చేస్తున్నాం. మూడేళ్ల పాలన పూర్తి కాకముందే.. 2 సంవత్సరాల 2 నెలల్లో వరుసగా మూడో విడత నేతన్న నేస్తం డబ్బులు విడుదల చేస్తున్నాం. ఈ సొమ్ము మన నేతన్నలు మార్కెట్లో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడాలని కోరుకుంటున్నా. మీ ఇబ్బందులే ఎక్కువని... కరోనా సమయంలో ఎన్ని ఆర్థిక కష్టాలున్నా.. ప్రభుత్వానికి ఉన్న సమస్యల కన్నా చేనేతలు బతకడానికి పడుతున్న ఇబ్బందులే ఎక్కువని భావించాం. వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో వరుసగా మూడో ఏడాది 80 వేల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఏటా దాదాపుగా రూ.200 కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.1,000 కోట్లు కేవలం నేతన్న నేస్తం ద్వారానే ఇస్తున్నాం. నేరుగా వారి ఖాతాల్లోకే జమ చేస్తున్నాం. వివక్షకు తావులేకుండా ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా చేయడంలేదు. మన రాష్ట్రంలో మీ బిడ్డగా దీన్ని అమలు చేస్తున్నా. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏటా రూ.24 వేలు చొప్పున మూడు దఫాలుగా నేతన్న నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.72 వేలు ఈ ఒక్క పథకం ద్వారానే ఇచ్చాం. సొంత మగ్గం ఉండి, ఆ మగ్గమే ఆధారంగా బతుకున్న వారికి ఐదేళ్లలో రూ.1.20 లక్షలు ఈ ఒక్క స్కీం ద్వారానే అవినీతి, వివక్షకు తావులేకుండా, బ్యాంకులు పాత అప్పులకు జమ చేసుకోకుండా.. అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపిస్తున్నాం. నేతన్న నేస్తం లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా జరిగింది. మేలు చేసే ప్రభుత్వమిది.. ఇంత పారదర్శకంగా చేసినప్పటికీ కూడా పొరపాటున ఇంకా ఎవరైనా ఒకరో ఇద్దరో అర్హులు మిగిలిపోయి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సొంత మగ్గం ఉన్నవారు, దానిమీదే బతుకున్నవాళుŠల్ వలంటీర్లు ద్వారా కానీ, గ్రామ సచివాలయానికి నేరుగా వెళ్లి కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. నెలరోజుల పాటు గడువు ఇస్తాం. పరిశీలన చేసి అర్హత ఉంటే వారికి కూడా వచ్చేటట్లుగా చేస్తాం. మీ బిడ్డ ప్రభుత్వం ఇది.. ఎవరికైనా సరే ఎలా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉంది. అనర్హులకు రాకూడదు, అర్హత ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అని ఆరాటపడే ప్రభుత్వం ఇది. నిర్దిష్ట గడువులోగా తనిఖీలు పూర్తి చేసి లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం.. ఈ సందర్భంగా మరో రెండు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా ఇవాళ్టితో కలిపి దాదాపుగా రూ.600 కోట్లను నేతన్నలకు నేరుగా సహాయం అందించాం. అంతేకాకుండా చేనేత సహకార సంఘాలు, ఆప్కోకు గత సర్కారు బకాయిపడ్డ రూ.103 కోట్లను కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి ఏడాదిలోనే చెల్లించాం. నాడు ఐదేళ్లలో కేవలం రూ.259 కోట్లే గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేనేత రంగం మీద, నేతన్నల కోసం ఖర్చు చేసింది కేవలం రూ.259 కోట్లు మాత్రమే. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తోందంటే.. ఇది మీ బిడ్డ ప్రభుత్వం, మీ బాగోగుల కోసం ఆలోచించే ప్రభుత్వం ఇది అని చెప్పడానికి దీన్ని గుర్తు చేస్తున్నా. ఆప్కో ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ చేనేత రంగంలో నేతన్నల ఇబ్బందులను దూరం చేసేందుకు ఆప్కో ద్వారా ఇ– మార్కెటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను తీసుకువచ్చాం. దీని ద్వారా ఉత్పత్తులను అమ్ముకునే వెసులుబాటు కల్పించాం. ప్లిఫ్‌కార్ట్, అమెజాన్‌లో ఆప్కో ఉత్పత్తులు కనిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇలా ప్రతి అడుగులోనూ మంచి చేయడానికి ఆరాటపడుతున్న మనందరి ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా మంచిచేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నా. –ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, వాణిజ్య, చేనేత శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమలు, వాణిజ్య (హేండ్లూమ్, టెక్స్టైల్స్) శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, హేండ్లూమ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ పి.అర్జునరావు, ఆప్కో ఛైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహనరావు, దేవాంగ కార్పొరేషన్ ఛైర్మన్ బీరక సురేంద్ర, పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ జే.విజయలక్ష్మి, తోగాటివీర కార్పొరేషన్ ఛైర్మన్ గెడ్డం సునీత, కుర్నిశాలి కార్పొరేషన్ ఛైర్మన్ బుట్టా శారదమ్మ, లేపాక్షి ఛైర్మన్ బి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తోబుట్టువులా తోడున్నారు.. పాదయాత్రలో మా కష్టాలను చూసి నేతన్న నేస్తం పథకంతో ఆదుకున్నారు. కరోనా కష్టకాలంలో కూడా సాయం చేసి మా జీవితాలను నిలబెట్టారు. మేం నేసిన చీరలు అమ్ముకోవడానికి దుకాణాలు కూడా లేని సమయంలో ఈ సాయం మాకు ఎంతో ఆసరాగా నిలిచింది. ప్రతి ఏడాది మీ తోబుట్టువులకు డబ్బులు జమ చేస్తున్నారు. సొంత అన్నదమ్ములు కూడా ఇంతలా ఆదరించరు. విద్యా దీవెనతో మా పిల్లలు ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. చేయూత పథకం ద్వారా వస్తున్న మొత్తాలతో చిరు వ్యాపారాలు చేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి మహిళా నెలకు ఎంతో కొంత సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోందంటే మీ చలవేనన్నా. – జి.జానకి, మంగళగిరి, గుంటూరు జిల్లా -
వైఎస్సార్ నేతన్న నేస్తం హైలైట్స్
-
చేనేతల ఇబ్బందులు ముఖ్యమని భావించాం: సీఎం జగన్
-
'వైఎస్సార్ నేతన్న నేస్తం' మూడో విడత ఆర్ధిక సాయం
-
నేతన్న.. జగనన్న వేర్వేరు కాదన్నా.. మీరే సీఎంగా ఉండాలి
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 'వైఎస్సార్ నేతన్న నేస్తం' అమలు చేయడం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపత్కాలంలో సంక్షేమ పథకాలతో తమకు అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం వివిధ కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా కడప నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్దిదారు మాట్లాడుతూ.. ‘‘మీ తండ్రిగారు మాకు విద్యాదానం చేశారు. ఫీజు రీయింబర్స్ పథకం పెట్టారు.. నా కుమారుడు ఇంజనీరింగ్ చదివి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మీ తండ్రి గారు ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ ద్వారా లబ్దిపొందుతున్నారు. ప్రతీ నెల రేషన్, నిత్యావసర సరుకులు ఇంటివద్దకే వస్తున్నాయి. మీ పాలనతో మా తలరాతను మార్చారు. మీరు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో భార్యా పిల్లలతో సంతోషంగా ఉన్నాం’’ అని కృతజ్ఞతలు తెలిపారు. మీరే కావాలన్నా.. మీరు మళ్లీ మళ్లీ రావాలన్నా ఎవరూ చేయనంతంగా సాయం చేశారు. నేను ఉన్నానంటూ మాకు కోసం ఆలోచన చేశారు. మా కుటుంబాలకు అండగా నిలిచారు. నవరత్నాల్లో భాగంగా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. రైతు మిత్ర, వాహన మిత్ర ఇలా ఎన్నో పథకాలు మాకు కోసం పెట్టారు. ఈ ఘనత మీదే. అందువల్లే మా కుటుంబాలు మిమ్మల్నే తలుస్తున్నాయి. కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను మార్చడం ఎంతో అభినందనీయం. మీరే కావాలన్నా.. మీరు మళ్లీ మళ్లీ రావాలన్నా. నేను ఉన్నానంటూ మాకు అండగా నిలిచారు. - మహిళా లబ్దిదారు, గుంటూరు. థాంక్యూ అన్నా ‘‘20 ఏళ్లుగా నేత నేస్తున్నా. కొన్ని రోజుల క్రితం నా భర్త చనిపోయారు. అలా కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో.. మీ పుట్టిన రోజు నాడు తొలి విడత నేతన్న నేస్తం ద్వారా రూ. 24 వేలు వేసి మమ్మల్ని ఆదుకున్నారు. చేనేత అంతరించే పోయే సమయంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు. నేనున్నానంటూ మా కుటుంబాల్లో వెలుగు చూపించారన్నా మీ దయతో బతుకున్నా. నాకు బాబు, పాప.. మీరిచ్చిన అమ్మఒడి పథకంతో చదివించుకోగలిగాం. బాబు ఇంటర్. మా పాప వాలంటీర్‌గా పనిచేస్తోందన్నా. నేతన్న నేస్తం పథకం, ఆసరా పథకం కూడా మమ్మల్ని నిలబెట్టింది. మాకు రోజంతా కష్టపడితే మాకు రెండొందల వచ్చేవి.. మీరు నేతన్న నేస్తం ప్రవేశపెట్టిన తర్వాత మా పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. నేత మీద ఇప్పుడు లాభం పొందుతున్నా. సొంతింటి కల ఉండేదన్నా. నాకు ఇల్లు స్థలం వచ్చింది. శ్రావణంలో ఇల్లు కట్టుకుంటా అన్నా. మీ పరిపాలనలో ఎల్లప్పుడూ ఇలాగే చల్లగా ఉండాలన్నా. మీతో మాట్లాడటం సంతోషంగా ఉందన్నా. థాంక్యూ అన్నా’’. - సుబ్బలక్ష్మి, మహిళా లబ్దిదారు, బండారులంక, అమలాపురం, తూర్పు గోదావరి. నేతన్న.. జగనన్న వేర్వేరు కాదు.. మాది నిరుపేద కుటుంబం. మా కష్టాలు తీర్చడానికి ఎవరు వస్తారని ఎదురుచూశాం.. అలాంటి సమయంలో మీరొచ్చారు.. దేవుడిలా మీరొచ్చారు. మీరు పాదయాత్రకి వచ్చినప్పుడు నేను ఉన్నాననే ధైర్యం చెప్పారు.. అది చేసి చూపించారు. మాకు వచ్చిన కష్టాలు తీరుస్తూ అండగా నిలిచారు. మీరిచ్చిన భరోసా, ఆర్థిక సాయంతో ఇప్పుడు మా కుటుంబ ఆదాయం కూడా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ చేనేత కార్మికుడు మూడు పూటల కడుపు నిండా తింటున్నాడంటే అది మీ వల్లే సార్. రుణమాఫీ, అమ్మబడి, ఆరోగ్య శ్రీ వంటి పథకాల ద్వారా లబ్ది పొందుతున్నాం. మీరు ప్రతీ చేనేత కార్మికుడు గుండెల్లో గుడిని కట్టుకున్నారు. వైఎస్సార్ మాకు జన్మనిస్తే.. మీరు పునర్జన్మనిచ్చారు. మీరిచ్చిన ధైర్యమే మమ్మల్ని నడిపిస్తోంది. మా ముఖాల్లో నవ్వులు కనపడటానికి మీరే కారణం. దేశంలోనే అత్తుత్తమ సీఎంగా నిలుస్తారు. నేను మిమ్మల్ని పొగడటం లేదు సార్.. వాస్తవం చెబుతున్నా. నేతన్న.. జగనన్న వేర్వేరు కాదు.. శాశ్వతంగా మీరే సీఎంగా ఉండాలి. - అనంతపురం లబ్దిదారు. చదవండి: సీఎం జగన్ మా పాలిట దైవం: ఎంపీడీఓ భావోద్వేగం -
ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది 'వైఎస్సార్ నేతన్న నేస్తం' అమలు చేసింది. ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, మరో మంచి కార్యక్రమానికి నాంది పలికామని, 'వైఎస్ఆర్ నేతన్న నేస్తం' ద్వారా 80వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. తన పాదయాత్రలో చేనేతల కష్టాలు చూశానని, ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు ఆర్ధిక సాయం చేస్తున్నామని సీఎం అన్నారు. ‘‘వరుసగా మూడో ఏడాది నేతన్న నేస్తం ద్వారా ఆర్ధిక సాయం చేస్తున్నాం. మూడో విడత కింద రూ.192.08 కోట్లు జమ చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా చేనేతలకు ఆర్ధిక సాయం అందిస్తున్నాం. ఒక్కో చేనేత కుటుంబానికి రూ.24వేల చొప్పున సాయం చేస్తున్నాం. భవిష్యత్‌లో కూడా ప్రతి చేనేత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. అవినీతి, వివక్షకు తావులేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేస్తున్నాం. అర్హత ఉండి జాబితాలో పేర్లు లేని వారు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆప్కో ద్వారా ఈ-మార్కెటింగ్ తీసుకొచ్చామని సీఎం జగన్ అన్నారు. మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చిన రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది. -
నేడు నేతన్న నేస్తం మూడో విడత ఆర్థిక సాయం
-
నేడు చేనేతలకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: కరోనా వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మాటకు కట్టుబడుతూ చేనేత కార్మికులను ఆదుకునేందుకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. వరుసగా మూడో ఏడాది నేతన్నకు ఆపన్న హస్తం అందించేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలుకు సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం కింద అర్హులైన 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో కంప్యూటర్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 మగ్గం కలిగిన, అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఐదేళ్లలో ప్రతి లబ్ధిదారుడికి రూ.1,20,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది. ఇప్పటికే 2 విడతల్లో సాయం అందగా తాజాగా మూడో విడత సాయాన్ని అందచేయడం ద్వారా అర్హులైన ప్రతి నేతన్నకు రూ.72,000 చొప్పున ప్రయోజనం చేకూరనుంది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో నేతన్నలకు ప్రభుత్వం రూ.383.99 కోట్లు అందచేసింది. మంగళవారం మూడో విడత కింద ఇచ్చే రూ.192.08 కోట్లతో కలిపితే నేతన్నలకు రూ.576.07 కోట్ల సాయం అందించినట్లయింది. పారదర్శకంగా అర్హులందరికీ.. దేశ చరిత్రలోనే తొలిసారిగా చేనేత కుటుంబాలకు పారదర్శకంగా లబ్ధి చేకూర్చేలా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న వెంటనే వలంటీర్ల సహకారంతో నిర్దిష్ట కాలపరిమితితో తనిఖీ పూర్తి చేసి అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించడం ద్వారా సోషల్ ఆడిట్ చేపట్టింది. ఎక్కడైనా అర్హులకు ప్రభుత్వ పథకాలు ఏ కారణం చేతనైనా అందకపోతే వారికి ఒక నెల రోజుల పాటు గడువిచ్చి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. వెంటనే ఆ దరఖాస్తులను పరిశీలించి అర్హులైతే సాయం అందేలా చర్యలు చేపట్టింది. ఏ ఒక్క అర్హుడికీ అన్యాయం జరగకూడదనే తపనతో ఆర్థిక సాయం అందించేలా ఏర్పాట్లు చేసింది. ఈ ఆర్థిక సాయాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోరాదని ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసి నేతన్నలు గౌరవప్రదంగా జీవించేలా ఆపన్న హస్తం అందిస్తోంది. -
YSR Nethanna Nestham: రేపు లబ్ధి దారుల అకౌంట్లో రూ. 24 వేలు జమ
-
YSR Nethanna Nestham: రేపు లబ్ధి దారుల అకౌంట్లో రూ. 24 వేలు జమ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (మంగళవారం) మూడవ విడత వైఎస్సార్ నేతన్న నేస్తంను అమలు చేయనున్నారు. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలోకి సొమ్మును జమచేయనున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక లబ్ధిదారుని ఖాతాలో రూ. 24 వేలు చొప్పున నగదు జమకానుంది. కరోనా కష్టకాలంలోనూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది ఈ పథకాన్ని అమలు చేస్తోంది. -
రేపు నేతన్న నేస్తం మూడో విడత ఆర్థిక సాయం
-
జాతీయ చేనేత దినోత్సవం: ‘వైఎస్‌ను గుర్తుచేస్తున్న సీఎం జగన్’
సాక్షి, అమరావతి: ‘మగ్గాలను పెట్టినాం.. నూలు నూలు ఒడికినాం.. మా నరాలనే దారాలుగా గుడ్డలెన్నో నేసినాం.. శ్రమ ఎవడిదిరో.. సిరి ఎవడిదిరో అని ఆక్రోశించిన నేతన్నల బతుకు చిత్రం ఇప్పుడు మెరుగుపడుతోంది. నవరత్నాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించిన సాయం చేనేతపై ఆధారపడిన వేలాది కుటుంబాలకు ఉపాధి దక్కేలా చేసింది. కరోనా కష్టకాలంలోనూ ‘నేతన్న నేస్తం’ ఆదుకుంది. చేనేత రంగం.. ఇప్పుడు సంక్షేమ రంగులు అద్దుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం బతికి బట్టకడుతున్న వైనం పూర్వాపరాలపై ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం. సుదీర్ఘ చరిత్ర గల చేనేత రంగానికి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రంగులు అద్దుతోంది. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా మగ్గం కలిగివున్న 81,703 మందికి రూ.383.79 కోట్లు అందించి జీవనోపాధి కల్పించింది. ఇప్పటికే రెండు పర్యాయాలు నేతన్న నేస్తం అందించిన ప్రభుత్వం మూడో పర్యాయం కూడా ఒక్కొక్కరికీ రూ. 24 వేల చొప్పున సాయమందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా సమయంలో చేనేత సొసైటీల్లో పేరుకుపోయిన వస్త్రాలను ఆప్కో ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పించింది. ఆర్గానిక్ వస్త్రాల తయారీ, కొత్త కొత్త డిజైన్లు వంటి అనేక వినూత్న ప్రయోగాలతో చేనేత రంగానికి మరింత ఊతమిచ్చేలా ఆప్కో ద్వారా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ( ఫైల్ ఫోటో ) చేనేత ఉపాధికి చేయూత.. ఆంధ్రప్రదేశ్‌లో చేనేత రంగం ఒక కులానికి పరిమితం కాకుండా అనేక సామాజికవర్గాలకు ఉపాధి చూపుతోంది. పద్మశాలి, దేవంగ, కర్ణిభక్తులతోపాటు దాదాపు 18 ఉపకులాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. నాల్గవ అఖిల భారత చేనేత లెక్కలు 2019–2020 ప్రకారం చేనేత, నేత, అనుంబంధ కార్యకలాపాల్లో దేశంలో 31.45 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్రంలో 90,775 చేనేత కుటుంబాలు ఉన్నట్టు అంచనా. రాష్ట్రంలోని వెంకటగిరి, ధర్మవరం, చీరాల, మంగళగిరి, పెడన, మచిలీపట్నం, ఉప్పాడ, రాజాం తదితర అనేక ప్రాంతాల్లో చేనేత రంగం రారాజుగా గుర్తింపు పొందింది. పట్టుచీరలు, జరీ చీరలు, కాటన్ చీరలు, కలంకారీ, పొందూరు ధోవతులు, పుత్తూరు లుంగీలు అంటూ ఒక్కో ప్రాంతంలో ఒక్కో చేనేత వస్త్రం ప్రసిద్ధి పొందాయి. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తి.. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని గుర్తుకు తెచ్చేలా ప్రతియేటా ఆగస్టు7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం మన దేశానివే. చేనేత వస్త్రాలకు కొంతకాలంగా పవర్ లూమ్స్, షటిల్ మగ్గాలు, స్పిన్నింగ్ మిల్లులు, ప్రాసెసింగ్ మిల్లులతో పోటీ ఎదురవుతుండగా.. నేడు కంప్యూటర్ సాయంతో ఎయిర్‌జెట్ వంటి మగ్గాల నుంచి పోటీ వచ్చిపడింది. ఇటువంటి పరిస్థితిలో చేనేతను ప్రోత్సహించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టాయి. ( ఫైల్ ఫోటో ) హామీలు మరచిన బాబు.. ‘నేతన్న నేస్తం’ అందించిన సీఎం జగన్ రాష్ట్రంలో చేనేత రంగాన్ని ఆదుకుంటానంటూ 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు గెలిచిన తర్వాత మరిచిపోయారని ఇప్పటికీ నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. కాగా.. 2019లో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘నేతన్న నేస్తం’ తదితర పథకాల ద్వారా చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్నారని నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఉపాధి చూపారు నేతన్న నేస్తం ద్వారా రూ.24వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కరోనా కష్టకాలంలో మా కుటుంబానికి ఉపాధి చూపారు. మొత్తంతో ముడి సరుకులు(మెటీరియల్) కొనుక్కున్నాను. పెట్టుబడి పెట్టిన రూ.24 వేలు రాగా, రోజువారీ కూలీ డబ్బులు(ఉపాధి) గిట్టుబాటు కాగా, అదనంగా మరో రూ.3వేల లాభం వచ్చింది. –జంజనం లక్ష్మీ, మంగళగిరి, గుంటూరు జిల్లా మగ్గాన్ని ఆధునీకరించుకున్నాను పాత మగ్గంతో ఎన్నో ఏళ్లుగా అవస్థలు పడ్డాను. ప్రభుత్వం ఇచ్చిన రూ.24 వేలకు తోడు.. నేను కొంత సొమ్ము కలిపి లిఫ్టింగ్ మిషన్, జాకార్డ్ అమరికం ఏర్పాటు చేసుకున్నాను. దీని వల్ల నాకు నేత పని ఎంతో సులువు అయ్యింది. 2019 నుంచి మా జీవితాల్లో కొత్త కాంతి వచ్చింది. –జక్కుల వెంకట సుబ్బారావు, పెడన, కృష్ణా జిల్లా జీవితాల్లో రంగులు నింపారు దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేనేతకు ఎంతో ఊతమిచ్చారు. అచ్చం తండ్రి మాదిరిగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతన్నలను ఆదుకోవడంలో నిజంగానే నేస్తం అన్పించుకున్నారు. మహానేత వైఎస్‌ను గుర్తు చేస్తున్నారు. కళా విహీనంగా మారిన చేనేత బతుకుల్లో రంగులు నింపుతున్నారు. – ఊటుకూరి రంగారావు, పెడన, కృష్ణా జిల్లా -
Andhra Pradesh: సంస్కరణలతో విద్యావిప్లవం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలపడమే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచి ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను ప్రభుత్వం తన భుజస్కందాలపై వేసుకుంది. విద్యాపరంగా, వ్యవస్థాపరంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ఆరు రకాలుగా వర్గీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు. సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2021–22కిగాను ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 10న ఆర్థిక సహాయం అందించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో దశ నగదు చెల్లింపులను మంత్రివర్గం ఆమోదించింది. అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్‌లను ఆమోదించింది. కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. మంత్రివర్గం సమావేశం వివరాలను రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యావేత్తలతో చర్చించి సంస్కరణలు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రభుత్వం వివిధ సర్వేలను నిర్వహించింది. విద్యావేత్తలతో చర్చించి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల విధానంలో సంస్కరణలు తెస్తూ ఆరు రకాలుగా వర్గీకరించింది. ►శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్: ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 ►ఫౌండేషన్ స్కూల్స్ : ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 లతోపాటు ఒకటి, రెండో తరగతులు ►ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ : ప్రీప్రైమరీ 1 నుంచి ఐదో తరగతి వరకు ►ప్రీ హైస్కూల్స్: మూడో తరగతి నుంచి ఏడు (లేదా) ఎనిమిదో తరగతి వరకు ►హై స్కూల్స్ : మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ►హై స్కూల్ ప్లస్ స్కూల్స్: మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు మహర్దశ ఈ ఏడాది జగనన్న విద్యా కానుక పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదించింది. విద్యాకానుక, మనబడి, నాడు– నేడు ద్వారా ఇప్పటికే విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రివర్గం పేర్కొంది. ప్రభుత్వ విద్యాసంస్థల దశ, దిశ మారుతోందని తెలిపింది. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నాడు – నేడు తొలి విడత కోసం రూ.3,669 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది. ఈ పనుల కోసం మొత్తం రూ.16,021.67 కోట్లు వెచ్చించనుంది. తద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దనుంది. 10న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఆగస్టు 10న అర్హులైన నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అందుకోసం బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయించింది. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపులు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. రెండో దశ చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 5 వరకూ అందిన వివరాల ప్రకారం నాలుగు లక్షల మంది డిపాజిట్‌దారులకు ప్రభుత్వం దాదాపు రూ.511 కోట్లు చెల్లించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులు 3.4 లక్షల మందికి గతంలోనే రూ.238.7 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆక్రమణల క్రమబద్ధీకరణ ఇలా.. అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. 300 చ.గజాల వరకు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు విధి విధానాలు ఇలా ఉన్నాయి... ►ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ►2019 అక్టోబరు 15 నాటి వరకూ ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తారు. ►75 చ. గజాల వరకు భూమి బేసిక్ వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. లబ్ధిదారుడు కేటగిరీ–1కు చెందినవారైతే ఉచితంగా పట్టా, డి ఫారం పట్టా పంపిణీ చేస్తారు. ►75 నుంచి 150 చ.గజాల వరకూ భూమి బేసిక్‌వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. ►150 నుంచి 300 చ.గజాల వరకూ భూమి బేసిక్ వాల్యూలో 100 శాతం రుసుము వసూలు చేస్తారు. ►మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్‌లో ప్రభావితమైన భూములకు ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. ►అప్రూవ్డ్ లే అవుట్లలోని నిర్మాణాలకు వర్తించదు. అసైన్డ్ చట్టంలో సవరణలు.. అసైన్డ్ చట్టం–1977(పీవోటీ)లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అందుతున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. చట్టంలోని సెక్షన్ 3(2ఎ), సెక్షన్ 3(2బీ) సవరించేందుకు ఆమోదం తెలిపింది. ►అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇల్లు విక్రయానికి ప్రస్తుతం ఉన్న గడువు 20 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించారు. ►సవరించిన చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటిని ఆమోదిస్తారు. ►చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇంటిని అమ్మాలని అనుకుంటే నిర్దేశించిన రుసుములను అనుసరించి అనుమతులు ఇస్తారు. ప్రైవేట్ భూమి తీసుకుంటే బదులుగా మరోచోట.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాల కొరత సమస్య తీర్చేందుకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రైవేట్ భూమి తీసుకుని బదులుగా మరోచోట ప్రభుత్వ భూమి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, విత్తన అభివృద్ధి కేంద్రాలు, మల్లీ ఫెసిలిటీ కేంద్రాలు, 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు మొదలైన వాటికి భూములు సేకరించి అవసరమైన నిర్మాణాలు చేపడతారు. నిర్దేశిత సమయంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్‌లకు ఆమోదం బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను మంత్రివర్గం ఆమోదించింది. రూ.5,155.73 కోట్లతో బందరు పోర్టు రివైజ్డ్ డీపీఆర్ రూపొందించారు. 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. భావనపాడు పోర్టు మొదటి దశ కోసం రూ.4,361.90 కోట్లతో రివైజ్డ్ డీపీఆర్ రూపొందించారు. భూసేకరణ, పోర్టు మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్లు రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రివర్గం పరిపాలన అనుమతులు జారీ చేసింది. బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం(ప్రకాశం)లలో ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.1,720.61 కోట్లతో డీపీఆర్‌ను ఆమోదించారు. స్వచ్ఛతకు ‘క్లాప్’ ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇళ్ల వద్ద నుంచి చెత్త సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహిస్తారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు చేపడతారు. పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.550 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘రుడా’ ఏర్పాటు రాజమహేంద్రవర్గం పట్టణాభివృద్ధి సంస్థ (రుడా)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు కొవ్వూరు, నిడదవోలు, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థలోని కొంత భాగాన్ని రుడా పరిధిలోకి తెచ్చారు. మొత్తం 3 పట్టణ స్థానిక సంస్థలు, 17 మండలాలు, 207 గ్రామాలతో 1,566.44 చ.కి.మీ. పరిధితో ‘రుడా’ ఏర్పాటు చేశారు. గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ పేరును కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)గా మార్చారు. మొత్తం 1,236.42 చ.కి.మీ. పరిధిలోని కుడాలో 5 పట్టణ స్థానిక సంస్థలు, 15 మండలాలు, 172 గ్రామాలు ఉన్నాయి. ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలు పెంపు రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీడీసీ)లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలను గణనీయంగా పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వాటి వాటాను 50 నుంచి 74 శాతానికి పెంచేందుకు ఆమోదముద్ర వేసింది. ►నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెక్నో ఎకనామిక్ ఫీజ్‌బిలిటీ అధ్యయన నివేదికకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్ యాక్ట్ 1987లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల అభివృద్ది, అర్చకుల సంక్షేమం కోసం చర్యలు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ రూపొందించారు. ►ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ మేరకు చట్ట సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ కానుంది. ►చిత్తూరు జిల్లా పుంగనూరు రవాణా శాఖ కార్యాలయంలో ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, సీనియర్ /జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టుల మంజూరు. ►ఈ నెల 13న ప్రదానం చేయనున్న వైఎస్సార్ లైఫ్‌టైం ఎఛీవ్మెంట్ అవార్డులకు మంత్రివర్గం ఆమోదం. ►రాష్ట్ర హైకోర్టు అభిప్రాయం మేరకు హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం. ►హైకోర్టు అభిప్రాయాల మేరకే రాష్ట్ర మావన హక్కుల సంఘం కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం. మానవహక్కుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ –జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పీఆర్వో పోస్టులకు మంత్రివర్గం ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్–జ్యుడిషియల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ –అక్కౌంట్స్, లోకాయుక్త, ఉపలోకాయుక్త, రిజిస్ట్రార్లకు పీఏలు, అక్కౌంట్స్ ఆఫీసర్, లైబ్రేరియన్, మోటార్‌సైకిల్ మెసెంజర్ పోస్టుల మంజూరు. ►గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు ఆమోదం. ►రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్– 2021కి మంత్రివర్గం ఆమోదం. ►మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఉత్పత్తిలో 30 శాతం స్థానికంగానే వినియోగించేందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పన. ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఆక్వాహబ్‌లు, వీటికి అనుబంధంగా రిటైల్ దుకాణాల ఏర్పాటు. ►పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్ టెక్నీషియన్, 8 ల్యాబ్ అటెండెంట్ల పోస్టుల మంజూరు. కాంట్రాక్టు పద్ధతిలో టెక్నీషియన్లను, అవుట్ సోర్సింగ్‌పై అటెండెంట్లను నియమిస్తారు. ►రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. ఉద్యానవన పంటల సాగు చట్ట సవరణకు ఆమోదం. ఖరీఫ్‌లో ఇప్పటిదాకా 42.27 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఖరీఫ్ సాగు, పంటల పరిస్థితుల వివరాలను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 42.27 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. వైఎస్సార్ జిల్లాలో 70.2 శాతం, అనంతపురం జిల్లాలో 65.6 శాతం, కర్నూలు జిల్లాలో 25.5 శాతం, చిత్తూరు జిల్లాలో 58.6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అగ్రికల్చర్ అడ్వైజరీ సమావేశాలు, పంటల ప్రణాళికను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియచేశారు. -
ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిలో భాగంగా 2021-22 ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సొంత మగ్గంపై నేసే కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20 వేల రూపాయల డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం 4 లక్షల మందికి సుమారు రూ.500 కోట్లు ఇవ్వనుంది. రూ.10 వేలలోపు 3.4 లక్షలమంది డిపాజిట్‌దారులకు ఇప్పటికే పంపిణీ చేసింది. కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. ►క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం. ►జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద.. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు. ►ఇంటింటికీ చెత్త సేకరణ విధానం, పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ. ►రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. ►ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ►అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణ. ►అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణకు ఆమోదం. ►1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం. ►మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం రివైజ్డ్ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్ట్ రివైజ్డ్ డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం. ►ఏపీఐఐసీ, ఏపీఎంబీల వాటాలు 50 నుంచి 74 శాతం పెంపునకు ఆమోదం. ►ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం. ►నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి... టెక్నో ఎకనామిక్ ఫీజుబిలిటీ స్టడీ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం. ►ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ►పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం. ఇందుకోసం సుమారు రూ. 550 కోట్లు కేటాయించింది. ►ఈనెల 13న వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులకు కేబినెట్ ఆమోదం. ►హైకోర్టు ఆదేశానుసారం ఏపీలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కార్యాలయాలు, హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు తరలించాలని నిర్ణయం. ►రాష్ట్ర మానవహక్కుల సంఘం కార్యాలయాన్నీ కర్నూలుకు తరలించాలని నిర్ణయం. ►గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్- 2021కి కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ►రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం. ►ఉద్యాన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్ ఆమోదం. ఇక్కడ చదవండి: ఏపీ కేబినెట్: ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు -
ఆగస్టు 7న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం లబ్ధిదారుల ఎంపికకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ పథకం కింద అర్హతగల చేనేత కుటుంబానికి రూ.24 వేల వంతున ప్రభుత్వం సాయం చేయనుంది. ఈ సహాయాన్ని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీన పంపిణీ చేస్తారు. ఈ పథకానికి లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లు, అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇందుకోసం గడువును నిర్దేశించింది. ఇప్పటికే వార్డు, గ్రామ సచివాలయాల్లో ఉన్న 2020–2021 ఆర్థిక సంవత్సరం లబ్ధిదారుల జాబితాను ఈ నెల 25న తీసుకోవాలి. ఇంకా కొత్తగా అర్హులైన వారి పేర్లను వార్డు, గ్రామ సచివాలయాల్లో ఈ నెల 26 నుంచి జూలై 5వ తేదీ వరకు పరిశీలించాలి. జూలై 6 నుంచి 8వ తేదీలోపు అర్హులైన నేతన్నల జాబితాను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. 9, 10 తేదీల్లో అర్హుల జాబితాను ఎంపీడీవో, మునిసిపల్ కార్యాలయాలకు పంపాలి. అక్కడ జాబితాను పరిశీలించి ఆమోదం, తిరస్కరణ చర్యలను 11 నుంచి 14వ తేదీలోగా పూర్తిచేయాలి. ఆ జాబితాలను 15 నుంచి 18వ తేదీలోగా జిల్లాస్థాయిలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ అసిస్టెంట్ డైరెక్టర్లకు పంపించాలి. 19 నాటికి వాటిని పరిశీలించి కార్పొరేషన్ల వారీగా లబ్ధిదారుల జాబితాలను తయారు చేయాలి. 20 నుంచి 22వ తేదీలోపు జిల్లా స్థాయిలో అర్హుల జాబితాను ఖరారు చేయాలి. 23న తుది జాబితాను హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్‌కు అందజేయాలి. అందుకు అవసరమైన నిధుల కోసం జూలై 24న ప్రభుత్వానికి ప్రతిపాదిస్తారు. ఈ ప్రక్రియకు అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: పేదలందరికీ సొంతిళ్లు.. ఇదీ నా కల: సీఎం జగన్ వైద్య విద్యార్థులకు మరో శుభవార్త.. -
మరో 8,903 మందికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి సకాలంలో దరఖాస్తు చేసుకోలేక మిగిలిపోయిన అర్హులైన లబ్ధిదారులకు బుధవారం చేనేత, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి రూ.24 వేల చొప్పున సాయం అందజేశారు. హైదరాబాద్‌లోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా చేనేత కుటుంబాలతో మాట్లాడిన మంత్రి.. కంప్యూటర్లో బటన్ నొక్కడం ద్వారా 8,903 కుటుంబాలకు రూ.21.36 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. మగ్గాలను ఆధునీకరించుకుని మరింత నైపుణ్యవంతమైన పనితీరుతో పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి ఉదార గుణం వల్లే ఇవాళ మరింత మంది లబ్ధిదారులకు వైఎస్సార్ నేతన్న నేస్తం అందుతోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సాయమందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది ఇప్పటికే సుమారు 82 వేల మందికి ప్రభుత్వం సాయం అందించిందని తెలిపారు. -
చేనేత కార్మికులను చూస్తే గర్వంగా ఉంది
సాక్షి, అమరావతి: చేనేత కార్మికులను చూస్తే గర్వంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. ‘దేశీయ వస్త్ర పరిశ్రమలో చేనేత కార్మికుల పరంగా రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. రాష్ట్రంలోని గొప్ప వస్త్ర వారసత్వాన్ని కాపాడటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్న మా నేతన్నలను చూస్తే గర్వంగా ఉంది’ అని ట్వీట్లో కొనియాడారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అర్హత కలిగిన చేనేత కుటుంబాలకు రూ. 24,000 చొప్పున వరుసగా రెండేళ్లు ఇవ్వడం.. ముఖ్యంగా కోవిడ్–19 వంటి సమయంలో చేనేత కార్మికుల జీవితాలను సానుకూలంగా ప్రభావితం చేసిందని ట్విట్టర్లో పేర్కొన్నారు. -
ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు
విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తుంటే.. మంగళగిరికి ఇవతల ఆత్మకూరు రోడ్డులోని మసీదుకు దగ్గర్లో ఓ చిన్న ఇంటి నుంచి టకా టకామంటూ శబ్దం వినిపిస్తోంది. అదేంటో అని చూస్తే అందులో 60 ఏళ్ల వ్యక్తి గుంటలో కూర్చొని మగ్గం నేస్తున్నాడు. ఆయన పేరు ఉమ్మలేటి నాగేశ్వరరావు. 60–70 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఇప్పుడు మగ్గం మోగుతోంది. రాట్నం తిరుగుతోంది. కండె పోసుకుంటోంది. కారణం..‘రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నేతన్న నేస్తం పథకం కింద రూ.24 వేల సాయం అందించడమే..’ అంటున్నారు నాగేశ్వరరావు దంపతులు. జీపీ వెంకటేశ్వర్లు, ఎ.అమరయ్య చేనేత.. రాష్ట్ర సంస్కృతి, నాగరికతకు చిహ్నం. ఒకప్పుడు వ్యవసాయం తర్వాత బాగా ఉపాధిని కల్పించిన రంగం. కానీ, నిన్న మొన్నటి వరకు ఈ వృత్తి బాగా చితికిపోయింది. ఈ రంగానికి ఊతమిచ్చే ప్రక్రియలో భాగంగా సీఎం వైఎస్ జగన్ 6 నెలల కాలంలో ఒక్కో కుటుంబానికి రెండు విడతలుగా రూ.48 వేలను అందించారు. దీంతో చేనేతల ఆనందానికి అవధుల్లేవు. వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపిందన్న భావన చేనేతల జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులకు స్పష్టంగా కనిపించింది. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక సాయం అందిందని, ఈ నగదు తమ బతుకులు మార్చుకునేందుకు, మగ్గం పునరుద్ధరణకు ఉపయోగపడిందని లబ్ధిదారులే స్వయంగా చెప్పడం గమనార్హం. పరిశీలనలో గుర్తించిన అంశాలివీ.. ► వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద గత ఏడాది డిసెంబర్లో 81,783 కుటుంబాలకు రూ.24వేల వంతున రూ.196.28 కోట్లు సాయం చేసింది. ► ఈ ఏడాది జూన్ 20న 81,024 చేనేత కుటుంబాలకు రూ.194.46 కోట్లు సాయం అందించింది. వాస్తవ కార్మికులు, మగ్గాలున్న వారికే సాయం అందడంతో మగ్గాల్లో కదలిక వచ్చింది. ► ప్రభుత్వ సాయంతో ఎక్కువ మంది మగ్గం నడవడానికి అవసరమైన ముడి సరకుల్నే కొనుగోలు చేశారంటున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన నక్కా వెంకటేశ్వరరావు. ► చేనేత కార్మికులకు నేరుగా సాయం చేయడంతో సొంతంగా బట్టలు తయారుచేసుకునే పరిస్థితి ఏర్పడిందని మంగళగిరికి చెందిన ఎం.హనుమంతరావు చెప్పారు. ► నిజానికి రాష్ట్రంలో చేనేతలను మాస్టర్ వీవర్లు తమ కనుసన్నల్లో నడిపించే వారు. వారు పెట్టుబడి సాయం చేస్తేనే కార్మికులు బట్టలు నేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. ► చేనేత సహకార సంఘాలకు మంచి రోజులు రానున్నాయి. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఆప్కోకు నిధులు విడుదల చేసింది. లాక్డౌన్ సమయంలోనూ ఆదుకున్న ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కష్టాల్లో ఉన్న సుమారు 82 వేల చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. బియ్యం, కందిప్పు, నూనె వంటి నిత్యావసారాలు కూడా అందించి ఆదుకుంది. 50 ఏళ్లు నిండిన 1,07,674 మంది చేనేతలకు నెలనెలా రూ.2,250ల వంతున పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇవీ సమస్యలు.. ► ఉత్పాదక వ్యయం పెరగడం ► పరపతి సమస్య ► మార్కెటింగ్ చికాకులు ► ఆధునికీకరణ లేకపోవడం ► బతకలేక ఇతర రంగాల్లోకి వెళ్లిపోవడం.. ► కనీస మౌలిక వసతులు లేకపోవడం ► సరైన పరిశోధన, అభివృద్ధి లేకపోవడం ► విశ్వసనీయ డేటా కొరవడడం పరిష్కార మార్గాలు... ► ఆర్థిక రంగంలో చేనేత పరిశ్రమ సామాజిక, ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించడం ► ఆత్మాభిమానంతో మనుగడ సాగించే చేనేత వంటి రంగాలకు ఆర్థికంగా ఊతమివ్వడం ► చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రోత్సహించడం ► ఈ రంగంలోని కొత్త తరాన్ని నూతన ధృక్పథానికి అనుగుణంగా తీర్చిదిద్ది సమీకృతాభివృద్ధిలో భాగస్వాములను చేయడం. నేతన్నల బాగు కోసం అధ్యయనం చేనేతలకు ఎవ్వరూ చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ సాయం చేస్తున్నారు. నిరంతరం వీరి బాగు కోసం అధ్యయనం చేస్తాం. సొంతంగా వాళ్లు బట్టలు నేసి అమ్ముకునేలా చేస్తాం. మాస్టర్ వీవర్స్ వద్ద అప్పులు చేసే పరిస్థితిని రానివ్వం. ఆప్కోను గాడిలోకి తీసుకురావడమే కాకుండా వీవర్స్ తయారుచేసిన బట్టలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, చేనేత జౌళీ శాఖ మంత్రి జగన్ నిర్ణయం దేశానికే ఆదర్శం 15 ఏళ్లుగా చేనేత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన నేతన్న నేస్తం పథకం దేశానికే ఆదర్శం కావాలి. వడ్డీలు తగ్గించి కనీసం లక్షకు తక్కువ కాకుండా కార్మికునికి రుణం ఇప్పించాలి. ముడి సరుకు కొనుగోలుపై సబ్సిడీ పెంచితే బాగుంటుంది. ప్రభుత్వమే కొనుగోలు దుకాణాలు ఏర్పాటుచేసి మార్కెటింగ్‌ను విస్తృత పరచాలి. – డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, జౌళి విధాన రంగ నిపుణులు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి చేనేతల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మా సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులైతే అప్పుకు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అడ్డగోలు లాభాలు చూసుకోదు కాబట్టి సామాన్యులకు అనుకూలమైన ధరకు అమ్మడమే కాకుండా నేత నేసిన మాకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. – పడవల ఉమామహేశ్వరరావు, బండారులంక, తూర్పుగోదావరి జిల్లా మగ్గం పట్టిన ప్రతి కార్మికునికీ అండగా.. సడుగులిరిగిన మగ్గానికి సీఎం వైఎస్ జగన్ కొత్త వన్నె తెచ్చారు. పడుగు వడుపు పెంచారు. స్వాతంత్య్రానంతర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతటి సాహసాన్ని ఆయన చేసి చూపించారు. ఇప్పటివరకు పాలకులు ఆయా వర్గాల నాయకులకే రాయితీలిచ్చి జోకొట్టారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం మగ్గం పట్టిన ప్రతి కార్మికునికీ అండగా నిలిచారు. – బొద్దుల కనకరామారావు, చేనేత కార్మికులు, ఆత్మకూరు, గుంటూరు జిల్లా -
చేనేత, హస్తకళలకు మరింత ప్రోత్సాహం
కరోనా కారణంగా కష్టాలున్నాయి. మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. మార్కెట్లు పూర్తిగా ఓపెన్ కాలేదు. సరుకుల రవాణా లేదు. కొత్త కొత్త సమస్యలతో యుద్ధం చేస్తున్నాం. అందువల్లే నిజంగా చేనేతలకు మంచి జరగాలన్న తలంపుతో ఈ రోజు ఈ పథకం అమలు చేస్తున్నాం. సాక్షి, అమరావతి: చేనేత, హస్తకళల ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మరింత ప్రోత్సాహం కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం ప్రత్యేకంగా అక్టోబర్ 2వ తేదీన ఈ–మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో మూడు బ్రిడ్జిలు దాటాల్సి ఉందని, ఇందులో ఒకటి సరుకులు, ఉత్పత్తుల నాణ్యత కాగా.. రెండోది లాజిస్టిక్స్ (కొనుగోలు విధానం, రవాణా), మూడోది ఉత్పత్తులకు ఆర్డర్స్ ఇస్తే సకాలంలో సరఫరా చేయడం, పేమెంట్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవడం అన్నారు. ఇందుకోసం అధికారులు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.196.46 కోట్లను శనివారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి రాష్ట్రంలోని అర్హులైన సుమారు 80 వేల చేనేత కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత బకాయిల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో వేశారు. ఈ సందర్భంగా జిల్లాల్లోని కలెక్టర్లు, లబ్ధిదారులు, ప్రజా ప్రతినిధులనుద్దేశించి సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. మీ కష్టాన్ని స్వయంగా చూశాను ► నా సుదీర్ఘ 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు అన్ని జిల్లాల్లో చేనేతన్నల కష్టాలు స్వయంగా చూశాను.. విన్నాను. వస్త్రాలు బాగా తయారు చేసినా, మార్కెటింగ్ లేకపోవడం.. మరోవైపు ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల వస్త్రాలను అమ్ముకోలేక ఇబ్బందులు పడటం చూశాను. ► అందుకే మగ్గం ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఏటా రూ.24 వేలు ఇస్తానని హామీ ఇచ్చాను. ఆ మేరకు గత ఏడాది డిసెంబరు 21న నా పుట్టినరోజున వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని అనంతపురం జిల్లా ధర్మవరంలో ప్రారంభించాం. ప్రస్తుతం కరోనా కష్టాలు చూశాక, అన్ని రోజులు ఆగితే మీ కష్టాలు ఇంకా పెరుగుతాయని భావించి.. మళ్లీ ఆరు నెలలకే ఇవాళ ఈ పథకం కింద సాయం చేస్తున్నాం. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 నెలల్లో దాదాపు రూ.600 కోట్లు ► గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో చేనేత కుటుంబాలకు కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వలేదు. అలాంటిది మనం కేవలం 13 నెలల్లోనే.. నిరుడు రూ.200 కోట్లు, ఇవాళ దాదాపు రూ.400 కోట్లు.. ఇచ్చాం. ఆ విధంగా కేవలం 13 నెలల్లోనే దాదాపు రూ.600 కోట్లు ఇచ్చామంటే దేవుడి దయ. ► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయి పెట్టిన రూ.103 కోట్లతో పాటు మాస్కుల తయారీ కోసం ఆప్కో నుంచి తీసుకువచ్చిన వస్త్రాలకు రూ.109 కోట్లు ఇవాళే విడుదల చేస్తున్నాం. ప్రతి పేదవాడికి మంచి జరగాలని ఆరాటపడ్డాం. ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది ► అన్ని వర్గాల ప్రజల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నాం. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ రూ.2,250కి పెంపు.. గతంలో 44 లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ దాదాపు 60 లక్షల మంది అవ్వాతాతలకు పెన్షన్ ఇస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు వచ్చే నెల 8న ఇవ్వబోతున్నాం. ► పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం, నామినేషన్ విధానంలో ఇచ్చే పనులు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించాం. ఆయా పథకాల ద్వారా 3.89 కోట్ల కుటుంబాలకు దాదాపు రూ.43 వేల కోట్లు నేరుగా వారి వారి ఖాతాలకు నగదు బదిలీ చేశాం. ఇందులో రూ.600 కోట్లు నేతన్నలకే ఇచ్చాం. ► 13 నెలల వ్యవధిలోనే పేదలందరికీ మంచి చేయగలిగినందుకు సంతృప్తికరంగా ఉంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేశాం. దేవుడి దయ, మీ అందరి దీవెనలతో ఇంకా మంచి చేయాలన్న తపన ఉంది. 1902కు ఫోన్ చేయండి ► ఎవరికి ఏ సమస్య వచ్చినా 1902కు ఫోన్ చేయండి. ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. ప్రతి చేనేత కుటుంబానికి, చేనేతన్నకి భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఎం.శంకరనారాయణ, బొత్స సత్యనారాయణతో పాటు, పలువురు అధికారులు, నేతన్నల ప్రతినిధులు పాల్గొన్నారు. పథకం అందకపోతే కంగారు పడొద్దు ► గ్రామ స్థాయి నుంచి గొప్ప మార్పులు చేశాం. వలంటీర్లు, సచివాలయాల వ్యవస్థ ఇందుకు దోహదపడింది. వ్యవస్థలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అవినీతి లేదు. లంచాలు లేవు. వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేశాం. ► అందుకే 13 నెలల్లో ఇన్ని చేయగలిగాం. ఇప్పుడు దాదాపు 80 వేల మంది నేతన్నల కుటుంబాలకు మేలు జరుగుతోంది. మగ్గం ఉన్న ప్రతి ఇంటిని వలంటీర్లు పరిశీలించి, వారి పేర్లు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించారు. ► అర్హులు మిగిలిపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. మీకు అర్హత ఉంటే వెంటనే గ్రామ సచివాలయానికి వెళ్లి, మా ఇంట్లో మగ్గం ఉంది కాబట్టి ఆర్థిక సాయం చేయాలని, చేనేత పెన్షన్ కావాలని దరఖాస్తు చేయండి. మీకు అర్హత ఉంటే వచ్చే నెల ఇదే తేదీన సహాయం చేస్తాం. మంచి చేయాలి అన్నదే తప్ప, ఎలా ఎగ్గొట్టాలని ఆలోచన అసలు చేయం. మా ఆదాయం పెంచుకున్నాం 15 సంవత్సరాలుగా మగ్గం నేస్తున్నాం. గతంలో చాలా మంది చేనేత కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకున్నారు. మా కష్టాలు ఆలకించి ధర్మవరంలో చేనేత కార్మికుల దీక్ష సందర్భంగా నేనున్నానని ఆనాడు మీరు మాకు ధైర్యాన్నిచ్చారు. మీరు ఇచ్చిన ధైర్యంతో, చేసిన సాయంతో ముందుకు సాగుతున్నాం. మొదట్లో మేం గద్వాల్ చీరలు నేసేవారం, ఇప్పుడు పెద్ద చీరలు నేస్తున్నాం. గతంలో నెలకు రూ.8 వేలు సంపాదిస్తే.. ఇప్పుడు నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాం. మరో 30 ఏళ్లు మీరే సీఎంగా ఉండాలన్నా. – బాలం లక్ష్మి, సిండికేట్ నగర్, రాప్తాడు నియోజకవర్గం, అనంతపురం జిల్లా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపారు ఏడాదికి రూ.24 వేలు అందించడం ద్వారా చేనేత కుటుంబాల్లో వెలుగు నింపిన దేవుడు మీరు. మీరు అందించిన సాయంతో మగ్గాలకు కావాల్సిన సామాన్లు కొనుక్కొని, మా ఆదాయాన్ని పెంచుకున్నాం. కరోనా కష్టకాలంలో మా ఇబ్బందులను గమనించి ఆరు నెలలు ముందుగానే రెండో సారి నేతన్న నేస్తం కింద మీరు రూ.24 వేలు ఇవ్వడం మాకు ఎంతో భరోసాను కల్పించింది. మీరు మాత్రమే మా కష్టాలు గుర్తించి మాకు అండగా నిలిచారు. – వాసా సత్యవతి, వంగర గ్రామం, తూర్పు గోదావరి జిల్లా ఇప్పుడు డిజైన్ చీరలు నేస్తున్నాం గతంలో మాకు చాలీచాలని బతుకు దెరువుగా చేనేత వుండేది. మా స్తోమతను బట్టి ముతక రకాలను నేసే వాళ్లం. దానివల్ల మాకు ఆదాయం కూడా తక్కువగానే వచ్చేది. ఇప్పుడు మీరు నేతన్న నేస్తం ద్వారా అందిస్తున్న రూ.24 వేల సాయంతో సామన్లు కొనుగోలు చేసి డిజైన్ చీరెలు నేస్తున్నాం. గతం కంటే మా ఆదాయం కూడా పెరిగింది. మీరే కలకాలం సీఎంగా వుండాలి. – కె.మల్లిబాబు, రాజుల గ్రామం, శ్రీకాకుళం జిల్లా వదిలేసిన వారు మళ్లీ వృత్తిలోకి వస్తున్నారు ఒకప్పుడు వ్యవసాయం తర్వాత చేనేత ప్రధాన రంగంగా వుండేది. కానీ ఆర్థిక ఇబ్బందులకు తాళలేక చాలా మంది ఇతర వృత్తుల్లోకి వెళ్లిపోయారు. ఏడాదిగా మీరిస్తున్న భరోసాతో తిరిగి వారంతా మగ్గాలను ఏర్పాటు చేసుకుని ఈ వృత్తిలోకి వస్తున్నారు. మా గ్రామంలోనే కొత్తగా 70–80 మగ్గాలు వచ్చాయి. కరోనా వల్ల వస్త్రాల ఎగుమతులు ఆగిపోయాయి. కొనుగోలు చేసే వారు లేక, మాకు ఆదాయం లేకుండా పోయింది. ఈ సమయంలో ఆరు నెలల ముందే మీరిస్తున్న సొమ్ము మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. – లక్ష్మీనారాయణ, ఈతముక్కల గ్రామం, ప్రకాశం జిల్లా ఈ ఏడాదే ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టండి నేతన్న నేస్తం రెండో ఏడాది ఆర్థిక సాయం విడుదల కార్యక్రమం అనంతరం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను పలువురు లబ్ధిదారులు కలిశారు. ఈ ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను కచ్చితంగా ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇంగ్లిష్ మీడియం విద్యతో తమ పిల్లలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని.. అందుకే మీరు తీసుకున్న నిర్ణయానికి తామంతా మద్దతిస్తున్నామని చెప్పారు. -
నేత కార్మికులకు అండగా సీఎం జగన్
సాక్షి, చిత్తూరు: చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొండంత అండగా నిలబడ్డారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ‘వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం’ అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో నేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వలసలు లేకుండా సీఎం జగన్ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఆరు నెలల ముందే రెండో విడత ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. నేత కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు నేత కార్మికులంతా రుణపడి ఉన్నామని అంటున్నారని తెలిపారు. ('చేనేత కష్టాలు చాలా దగ్గరగా చూశా') -
రెండో విడత 'వైఎస్సార్ నేతన్న నేస్తం'
సాక్షి,తాడేపల్లి : కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా రెండో విడత నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. కోవిడ్-19 కారణంగా 6 నెలల ముందుగానే ప్రభుత్వం సాయం అందించడం విశేషం. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ లబ్దిదారులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... 'నా పాదయాత్రలో చేనేతల కష్టాలను చాలా దగ్గరగా చూశాను. వారందరికీ తోడుగా ఉంటానని వారికి మాట ఇచ్చాను . ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కొ ప్రఖ్యాతి గాంచిన చేనేత పరిశ్రమ ఉన్నా కూడా, మార్కెటింగ్ సరిగా లేక, ముడిసరుకుల ధరలు ఎక్కువగా ఉండడం, ఎలా బ్రతకాలో అర్థంకాని పరిస్థితి వారిది. గత ఏడాది నా పుట్టినరోజున డిసెంబర్ 21న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మళ్లీ ఈ ఏడాది కూడా అదే రోజున ప్రారంభిద్దామనుకున్నాం. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడానికి, అంతవరకూ వేచి చూడ్డం ఇష్టంలేక ఇప్పడే ఇస్తున్నాం. మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ.24వేలు ఇస్తామని చెప్పాం. ఈ మాట నెరవేరుస్తూ వైయస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దేవుడిదయతో, మీ అందరి ఆశీర్వాదాలతో అడుగు ముందుకు వేస్తున్నాం. (మరో విప్లవానికి ఏపీ సర్కార్ నాంది) గత ప్రభుత్వ హయాంలో చేనేతలకు ఎంత ఇచ్చారంటే.. కనీసం రూ.200 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. అలాంటిది ఈ 13 నెలల కాలంలోనే ఇదే చేనేతలకు ఎంత ఇస్తున్నామో చూడండి. గత ఏడాది వైయస్సార్ నేతన్న నేస్తం కింద రూ. 200 కోట్లు సుమారుగా ఇస్తే.. ఇవాళ రూ. 406 కోట్లకు పైగా ఇస్తున్నాం. ఆప్కోకు గత ప్రభుత్వం పెట్టిన రూ.103 కోట్లతో పాటు, రెండో ఏడాది వైయస్సార్ నేతన్న నేస్తకోసం మరో రూ.200 కోట్లు సుమారుగా ఇస్తున్నాం. కరోనా నివారణా చర్యల్లో భాగంగా ఆప్కోనుంచి బట్టను మాస్కుల తయారీకి కొన్నాం. దీనికోసం రూ. 109 కోట్లు ఇవాళే ఇస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేసిన పథకాలు చూస్తే.. నేనే ఆపేర్లు మిస్ అవుతానామో అనిపిస్తుంది. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్లు సుమారు రూ.60లక్షల మందికి ఇస్తున్నాం. పేదవాడి బతుకులు మార్చే విధంగా ఇంగ్లీషు మీడియం తెస్తున్నాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు ఇస్తూ నామినేషన్ పనుల్లో, పదవుల్లో చట్టాలే తీసుకువచ్చాం . కేబినెట్లోనే ఏకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60శాతం మంత్రి పదవులు ఇచ్చాం . ఐదుగురు డిప్యూటీ సీఎంల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చాం. 3.89 కోట్ల మందికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.40వేల కోట్లకుపైగా ఇచ్చాం. ఎలాంటి లంచాలు లేకుండా, వివక్ష లేకుండా.. వారి చేతికే ఇవ్వగలుగుతున్నాం. గ్రామస్థాయి నుంచి గొప్ప మార్పులు తీసుకు రాగలిగాం. ఈ 13 నెలల్లోనే ఇవన్నీ చేయగలిగాం అంటే దేవుడి దయ, మీ అందరి దీవెనల వల్లే ఇది సాధ్యమయింది. ఈ లబ్ధిదారుల జాబితా, ఎంపికకు సంబంధించి దాదాపు 80వేల కుటుంబాలకు ఇవాళ మంచి జరుగనుంది. గ్రామ వాలంటీర్లు సర్వేచేసి లబ్ధిదారులను గుర్తించి గ్రామ సచివాలయంలో సామాజిక తనిఖీ కోసం ఒక జాబితాను పెట్టాం. ఒకవేళ జాబితాలో పేరు లేకపోతే ఎలా నమోదు చేసుకోవాలో వివరాలు కూడా అక్కడ పెట్టాం. ఇంకా నెలరోజుల సమయం ఉంది. ప్రతి ఒక్కరికీ మంచి చేయాలనే తపించే ప్రభుత్వం మనది. పథకాన్ని ఎగరగొట్టాలనే ఆలోచన చేసే ప్రభుత్వం మనది కాదు. అర్హత ఉండి.. మీపేరు జాబితాలో లేకపోతే గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోండి. వెంటనే పరిశీలించి మళ్లీ వచ్చే నెల ఇదే తేదీలోగా మిగిలిపోయిన వారు ఉంటే వారికి కూడా మంచి చేస్తాం. ఏవైనా సందేహాలుంటే 1902 అనే నంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు.' అంటూ తెలిపారు. -
ఆర్నెల్లు ముందుగానే ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: కరోనా సంక్షోభం కారణంగా ప్రభుత్వానికి ఆదాయం పూర్తిగా తగ్గిపోయినా ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సొంత మగ్గం కలిగి దారిద్ర రేఖకు దిగువనున్న ప్రతి చేనేత కుటుంబానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ ద్వారా రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని వరుసగా రెండో ఏడాది అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్ శనివారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కడం ద్వారా ఆర్నెల్ల ముందుగానే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నగదు బదిలీ చేయనున్నారు. ఆప్కో బకాయిలూ విడుదల... ► ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల కన్నా చేనేత కుటుంబాల కష్టమే పెద్దదనే ఉద్దేశంతో ఆర్నెల్ల ముందుగానే వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. గత ఏడాది డిసెంబర్లో తొలిసారిగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ► రాష్ట్రంలో 81,024 చేనేత కుటుంబాలకు రూ.24 వేల చొప్పున రూ.194.46 కోట్లను వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. గత ప్రభుత్వాలు చేనేత కుటుంబాలకు ఇలా ఆర్థిక సాయం అందించిన దాఖలాలు లేవు. ► గత ప్రభుత్వం ఆప్కోకు బకాయిపడ్డ రూ.103 కోట్లతో పాటు కరోనా నియంత్రణ మాస్కుల తయారీకి రూ.109 కోట్లను కూడా విడుదల చేసి చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలిచింది. -
రేపు రెండో విడత ‘నేతన్న నేస్తం’ ప్రారంభం
సాక్షి, అమరావతి: చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న నేత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోన్న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ రెండో విడత కార్యక్రమాన్ని రేపు(శనివారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు. మగ్గం ఉన్న ప్రతి నేతన్నకు రూ.24 వేలు నగదు పంపిణీ చేయనున్నారు. శనివారం ఉదయం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ చేయనున్నారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మొత్తం 81024 మంది చేనేతలకు లబ్ధి చేకూరనుంది. కోవిడ్ కారణంగా 6 నెలలు ముందుగానే ప్రభుత్వం సాయం అందించనుంది. (ఏపీ సర్కార్ మరో కీలక ఒప్పందం..) 194.46 కోట్లు పంపిణీ ఈ పథకం కింద మొత్తం 194.46 కోట్లు పంపిణీ జరగనుంది. గత ప్రభుత్వ బకాయిలు రూ.103 కోట్లు చెల్లింపుతో పాటు, కోవిడ్ మాస్క్‌లు తయారు చేసిన ఆప్కోకు రూ.109 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించనుంది. దశాబ్దాలుగా చేనేతలు అనుభవిస్తున్న కష్టాలను పాదయాత్రలో వైఎస్ జగన్ గమనించి, ఆనాడే చేనేతలకు భరోసా ఇచ్చారు. మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు ఆర్థిక సాయం చేస్తానని పాదయాత్రలో ఇచ్చిన మాటను వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారు. డిసెంబరు 21, 2019న వైఎస్సార్ నేతన్ననేస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. ఆరు నెలల వ్యవధిలోనే మళ్లీ రెండో విడత సాయం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. -
అర్హులందరికీ ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’
సాక్షి, అమరావతి: అర్హులైన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు లబ్ధిదారులకు సంబంధించి గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా ప్రభుత్వం 2020–21 సంవత్సరానికి సర్వే చేయించింది. సర్వే జాబితాలను జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి ఖరారు చేశాయని ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఇప్పటికే నిధులు విడుదల చేసినట్లు వివరించింది. ఈ ఆదేశాల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ► గత సంవత్సరం అర్హులైన నేతన్న నేస్తం లబ్ధిదారులు వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందుకోని వారు కొందరున్నారని, వారికి ఈ సంవత్సరం అందజేయాలని చేనేత జౌళి శాఖ డైరెక్టర్ చేసిన సూచనను ప్రభుత్వం స్వాగతించింది. ► పవర్‌లూమ్స్ రావడం వల్ల చాలా మంది చేనేతలు ఆర్థికంగా ముందుకు సాగలేక పోయారు. కేవలం మగ్గాలను నమ్ముకుని జీవిస్తున్న వారికి ప్రభుత్వం ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించి ముడి సరుకు, ఇతర అవసరాలకు ఉపయోగించుకునే విధంగా సాయ పడింది. ► ఆరు నెలల క్రితం గత సంవత్సరానికి వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. వేల మంది చేనేత కార్మికులకు ఈ ఆర్థిక సాయం వరంగా మారింది. అప్పుల బారి నుంచి చాలా మంది బయట పడ్డారు. మాస్టర్ వీవర్స్ వద్ద పని చేయడం మానేశారు. ► గతంలో పెట్టుబడి సాయం లేక మాస్టర్ వీవర్లను చేనేత కార్మికులు ఆశ్రయించే వారు. ఇప్పుడు ఆ పరిస్థితులు పోయాయి. నేరుగా ప్రభుత్వం సాయం అందించడంతో జీవనోపాధిని మెరుగు పరుచుకునేందుకు అవకాశం ఏర్పడింది. ► అసెంబ్లీ సమావేశాల కారణంగా ఈ నెల17న అందించాల్సిన ఆర్థిక సాయం ఈ నెల 20న అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ ద్వారా నగదు బదిలీ జరిగి నేరుగా నేతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో జిల్లా కమిటీలదే తుది నిర్ణయం. -
చారిత్రాత్మకం నేతన్న నేస్తం
-
వైఎస్సార్ నేతన్న నేస్తం వరం
వైఎస్ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు: వైఎస్సార్ నేతన్న నేస్తం చేనేతలకు వరం లాంటిదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మున్ముందు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో చేనేతలకు మరింత మేలు జరుగుతుందని అన్నారు. స్థానిక 37 వార్డు పరిధిలోని హనుమాన్‌నగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో చేనేత నాయకుడు సింపిరి అనిల్ కుమార్ అధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ తాను పుట్టింది చేనేతల ఇళ్ల మధ్యనే అని, పుట్టినప్పటినుంచీ మీతో తత్సంబంధాలు కొనసాగిస్తున్నాని చెప్పారు. ఏప్రభుత్వం చేనేతల అభివృద్ధి గురించి ఆలోచిస్తుందో, ఏ ముఖ్యమంత్రి మీ పట్లప్రేమాభిమానాలు చూపుతున్నారో తెలుసుకోవాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతలకు రూ.350 కోట్ల రుణమాఫీ చేశారని అన్నారు. అలాగే సబ్సిడీ పథకాన్ని అమలుచేసింది ఆయనే అని తెలిపారు. ఆయన కుమారుడైన వైఎస్ జగన్ బీసీ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తర్వాత మీ అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు. 2014 ఎన్నికల్లో చేనేతల సంక్షేమం కోసం మేనిఫేస్టోలో పెట్టినా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. గతంలో చేనేతల ఫించన్లకు తాను దీక్ష చేసిన విషయాన్ని గుర్తుచేశారు. పేదల ఇళ్లనిర్మాణం కోసం రూ.150 కోట్లు ఖర్చుపెట్టి 300 ఎకరాలకు పైగాభూములు కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో తొలిమారు ఈ విధంగా చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అనుమతితో ఈ పక్రియ చేపట్టామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో చేనేతలకు తప్పక ప్రాధాన్యతను ఇస్తామన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషిచేస్తున్నారని తెలిపారు. చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ అవ్వారు ప్రసాద్ మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేనేత సామాజిక వర్గం ఓట్లతో మూడు మార్లు ముఖ్యమంత్రి అయినా తమ సంక్షేమాన్ని గాలికొదిలేశారని వివరించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి చేనేతల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. చేనేతల అభివృద్ధి కి జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, చేనేత విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి బలిమిడిచిన్నరాజు, జిల్లా అధ్యక్షుడు బీఎన్ఆర్, చేనేత నాయకులు, మెడికల్‌షాపు శ్రీను, పల్లా సురేష్, పుణ్యవతి, రమణారెడ్డి, శివారెడ్డి, బండారు సుబ్రమణ్యం, రాగా నరసింహరావు, శ్రీను, కృష్ణా, నాగేంద్ర, కన్నయ్య పాల్గొన్నారు. -
టీడీపీ వర్గీయుల బరితెగింపు
అనంతపురం, పెద్దపప్పూరు: తెలుగుదేశం వర్గీయులు బరితెగించారు. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నరసాపురంలో గ్రామ వలంటీర్ ఉక్కీసల నాగేష్ వద్దకు గురువారం సాయంత్రం జేసీ సోదరుల ముఖ్య అనుచరులైన టీడీపీ నాయకులు రామాంజులరెడ్డి, భాస్కర్‌రెడ్డిల వర్గీయులు ఇద్దరు వెళ్లి తమకు ‘నేతన్న నేస్తం’ వర్తింపజేయాలని బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. విషయం కాస్తా వైఎస్సార్సీపీ నాయకులకు తెలియడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయిన వలంటీర్ వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. -
ఇది సంక్షేమ రాజ్యం
పెడన: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనులు, భూగర్భ శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని), పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ కలెక్టర్ ఇంతియాజ్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ చేనేత కారి్మకుల సంక్షేమం, వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఏటా ప్రభుత్వం లబి్ధదారుల ఖాతాల్లో రూ.24 వేల చొప్పున జమ స్తుందని తెలిపారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత వరకు నేత కారి్మకులకు సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. జిల్లాలో 4,270 మందికి చేనేతలకు రూ.10.24 కోట్లు అందనున్నట్లు స్పష్టం చేశారు. ముద్ర యోజన రుణం కింద ఏడు శాతం వడ్డీ రాయితీతో రూ.లక్ష మాత్రమే ఇచ్చేవారని, ఇదే రాయితీతో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అందించేలా ముఖ్యమంత్రి నేత కార్మికుల కోసం అవకాశం కల్పించారన్నారు. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నవరత్నాలలోని పథకాలను తూచా తప్పకుండా అమలుచేసి తీరుతున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే 80 శాతం హామీలు అమలు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నేను ఉన్నాను.. నేను విన్నాను.. నేను చేస్తాను అని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తున్న మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పదికాలాల పాటు సీఎంగా ఉండేలా మద్దతు ఇద్దామన్నారు. నేత కార్మికులకు ఆత్మగౌరవం అధికం : మంత్రి పేర్ని నాని నేత కార్మికులు ఆత్మగౌరవంతోనే జీవిస్తుంటారని, వారికి పనులు లేకపోయినా పస్తులుంటారే తప్ప ఏనాడు కూడా చేయి చాచిన దాఖలాలు లేవని రాష్ట్ర రవాణా, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. నేత కార్మికులను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో సబ్సిడీ రుణాలు, నూలుపై రాయితీలు వంటివి ఏమి కాకుండా నేరుగా నేత కార్మికుని బ్యాంకు ఖాతాలో రూ.24 వేలు జమ అయ్యేలా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకున్నారని చెప్పారు. చేనేతలను ఆదుకోవాలనే కృతనిశ్చయంతో : మంత్రి కొడాలి నాని చేతి వృత్తిదారుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో అధికంగా నేత కార్మికులున్నారని, వారిని ఆదుకోవాలనే కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. పలు పథకాలు డిసెంబరు 21న ప్రారంభించుకుందామని చెప్పినా తిరస్కరించిన ముఖ్యమంత్రి, నేత కార్మికులు అధికంగా ఉండే ధర్మవరం నియోజకవర్గంలో నేతన్నల నడుమ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి, వైఎస్సార్ నేతన్న నేస్తం ప్రారంభించేందుకు వెళ్లారని తెలిపారు. చేనేత కార్మికుల పట్ల సీఎంకు ఉన్న అంకితభావం ఎటువంటిదో మీరే ఆలోచించుకోవాలన్నారు. పెడన నియోజకవర్గంలో అధికంగా లబ్ధిదారులు : ఎమ్మెల్యే జోగి రమేష్ జిల్లాలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి అర్హులు 4,270 మంది ఉంటే అందులో పెడన నియోజకవర్గంలో 3,219 మంది ఉన్నారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ తెలిపారు. కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ సొంత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి రూ.24 వేలు జమ అవుతాయని చెప్పారు. ఆ డబ్బుతో తమ మగ్గాలను ఆధునికీకరించుకుని ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. డీసీఎంఎస్ చైర్మన్ ఉప్పాల రాంప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, మాజీ కౌన్సిలర్ కటకం ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు భళ్ల గంగాధరరావు, కేడీసీసీబీ డైరెక్టర్ నల్లమోతు సూర్యప్రకాశరావు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మాజీ కౌన్సిలర్లు గరికిముక్కు చంద్రబాబు, మెట్ల గోపిప్రసాద్, బంటుమిల్లి, పెడన, కృత్తివెన్ను, గూడూరు మండలాల పార్టీ అధ్యక్షులు మలిశెట్టి రాజబాబు, దావు బైరవలింగం, కొల్లాటి గంగాధరరావు, తలుపుల కృష్ణ, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, చేనేత జౌళి శాఖ ఏడీ ఎస్.రఘునంద, ఆర్డీఓ ఖాజావలి, తహసీల్దారు పి.మధుసూదనరావు, కమిషనర్ అబ్దుల్రïÙద్ తదితరులు పాల్గొన్నారు. -
నేతన్న నేస్తం
-
పల్లె పల్లెకు ప్రగతి ఫలాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవకముందే అనేక పనులు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రైతన్న భరోసా, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడం, రాష్ట్రంలో ఏకంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తన పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానని, అందుకే ఇచ్చిన హామీ మేరకు మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన సభకు హాజరైన ప్రజలు. నేతన్నలు ఇచ్చిన కండువాతో సీఎం వైఎస్ జగన్ అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 85 వేల కుటుంబాలకు రూ.196 కోట్లకు పైగా సహాయాన్ని ఇక్కడి నుంచే విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఈ సభ ముగిశాక కంప్యూటర్లో బటన్ నొక్కిన వెంటనే ఆ 85 వేల చేనేత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో డబ్బు జమ అవుతుందన్నారు. ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోవద్దని బ్యాంకులకు చెప్పామని, ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లల్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అక్షరాలా లక్షా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఆయన వివరించారు. ఈ సభలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం 2014 నుంచి 2019 వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ కుటుంబాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెబుతూ రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు ఆయన మెగా చెక్కును అందజేశారు. ‘మన ప్రభుత్వం అన్ని వర్గాల వారికి లబ్ధి కలిగేలా పలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇవాళ రాజకీయ స్వార్థంతో శత్రువులందరూ ఏమేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరందరూ చూస్తున్నారు. మరణించిన నేతన్నలకు సంబంధించిన ఆర్థిక సాయం చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నా బలమంతా మీ ఆశీస్సులు, దేవుడి దీవెనలు. అవి మీ ఇంటి బిడ్డగా నాకు అందాలి’ అని సీఎం జగన్ అన్నారు. కాగా, ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు వైఎస్ జగన్‌తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్ రెడ్డి, శంకర్‌నారాయణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, రంగయ్య, సంజీవ్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. నేతన్నలకు తోడుగా ఉన్నది జగనొక్కడే ‘నేతన్నలకు మొదటి నుంచి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉన్నది కేవలం జగన్ ఒక్కడే. ధర్మవరంలో నేతన్నల పరిస్థితి, వారి అగచాట్ల గురించి బహుశా నా కంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరూ ఉండరేమో. ఎందుకంటే పక్కనే పులివెందుల నియోజకవర్గం. ధర్మవరంలో నేతన్నలకు సంబంధించిన సమస్యల మీద, ఎప్పుడు ఏమి జరిగినా ఇక్కడకు వచ్చింది.. నిరాహార దీక్షలు చేసింది.. నేతన్నలకు తోడుగా నేనుంటాను అని భరోసా ఇచ్చింది ఒక్క జగన్ తప్ప ఇంకో నాయకుడు లేడు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారో చూశాను. సబ్సిడీ రాక అవస్థలు పడుతుంటే పట్టించుకోని పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చి ధర్నా చేశా. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరూ పట్టించుకోకపోతే గళంవిప్పి గట్టిగా అడిగా. అయినా ఎటువంటి స్పందన రాని పరిస్థితి. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చేనేతలు పడిన కష్టాలు చూశాను. ధర్మవరం, మంగళగిరి, వెంకటగిరి, ఎమ్మిగనూరు, చీరాల, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు, ఉప్పాడ, తిప్పసముద్రం, పొందూరు.. ఎక్కడ చూసినా చేనేతల పరిస్థితి ఏమిటంటే పేదరికంలో ఉండటం, అప్పుల్లో కూరుకుపోవడం.. ఇవే వారి జీవితగాథలు. ఇదే ధర్మవరంలో చేనేత కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని గత ప్రభుత్వాన్ని చూశాం. ఆప్కోను స్కాంల మయం చేశారు. దీనిపై విచారణ జరిపిస్తున్నాం. నివేదిక రాగానే ఆప్కోను పూర్తిగా సంస్కరించి చేనేత కుటుంబాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశ పెడితే ఒక గ్రామం ఎంత మారుమూల ఉన్నా కూడా అక్కడి ప్రజలకు దాని ఫలాలు అందాలి. ఆ పథకాలు అందేటప్పుడు వివక్ష, అవినీతి ఉండకూడదు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అనే తేడా చూడకుండా అర్హులందరికీ శాచ్యురేషన్ (సంతృప్త స్థాయి) పద్ధతిలో మేలు జరగాలి. ఈ దిశగా ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా పిలిచి.. బొట్టుపెట్టి మరీ లబ్ధి కలిగించే కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది. – సీఎం వైఎస్ జగన్ -
వైఎస్సార్ నేతన్న నేస్తం
-
సీఎం జగన్ పేదల పక్షపాతి
-
నేతన్నలు గౌరవంగా జీవించేందుకే ఈ సాయం
-
నేతన్నలకు అండగా నిలబడ్డా: సీఎం జగన్
సాక్షి, ధర్మవరం: ప్రతి చేనేత కార్మికుడికి మంచి జరిగే విధంగా ముందడుగు వేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని శనివారం సీఎం ప్రారంభించారు. తన పుట్టిన రోజున నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మవరంలో నేతన్నల కష్టాలు తన కన్నా బాగా ఎవరికీ తెలీదన్నారు. నేతన్నలకు కష్టం వచ్చిన ప్రతిసారి అండగా నిలబడ్డానని పేర్కొన్నారు. అగ్గిపెట్టేలో పట్టే చీర దగ్గర నుంచి స్వాతంత్రోద్యమం వరకు నేతన్నలకు ఒక చరిత్ర ఉందన్నారు. ధర్మవరం చేనేతల గురించి ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారన్నారు. చేనేతల ఇబ్బందుల గురించి మాత్రం ఎవరూ పట్టించుకోలేదన్నారు. చేనేత కుటుంబాలు పేదరికం, అప్పుల బాధతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఆప్కో పేరుతో దోచుకుందని, దీనిపై దర్యాప్తు జరిపిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ‘పాదయాత్రలో చేనేతల కష్టాన్ని చూశాను.. బాధను విన్నాను. నేను ఉన్నానని చెప్పి ఆ రోజు అందరికి చెప్పానన్నారు. చెప్పిన మాట ప్రకారం మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి 24వేల రూపాయలు ప్రోత్సాహకంగా ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చాం. ఆ మాటను నిలబెట్టుకుంటూ వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమాన్ని ఇదే ధర్మవరంలో ప్రారంభిస్తున్నాను. రాష్ట్రంలో దాదాపు 85 వేల కుటుంబాలకు ఈ సాయాన్ని విడుదల చేయబోతున్నాం. చేనేత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుంది. సొమ్మును మీరు చేసిన పాత అప్పులకు బ్యాంకు వాళ్లు జమ చేసుకోకుండా వారితో కూడా మాట్లాడటం జరిగిందని సీఎం జగన్ అన్నారు. ఉగాది లోగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఐదేళ్లలో ప్రతి చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షలు నేరుగా అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. చంద్రబాబు హయాంలో అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు రూ.3.5 కోట్ల ఆర్థిక సాయం చేస్తున్నట్టు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ‘నవరత్నాలు’ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే ఉగాది లోగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలకు ఇస్తామన్నారు. జనవరి 9 నుంచి అమ్మఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ.15వేలు సాయం అందజేస్తామన్నారు. వాహన మిత్ర ద్వారా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం చేశామన్నారు. ఐదేళ్లుగా న్యాయం జరగని అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా కల్పించామన్నారు. మత్స్యకారులకు మునుపెన్నడూ లేనివిధంగా సహాయం చేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు. నా బలం.. ప్రజల ఆశీస్సులు, దేవుడి అండ.. సామాజిక పెన్షన్ల కోసం గత ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తే ఇప్పుడు నెలకు రూ.1500 కోట్లు ఇస్తున్నామని వెల్లడించారు. అవ్వా-తాతలకు భరోసా కల్పించామని.. పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా చట్టం తెచ్చామన్నారు. గ్రామ సచివాలయ, గ్రామ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. శాశ్వత ప్రతిపాదికన బీసీ కమిషనర్ ఏర్పాటు చేశామన్నారు. కేబినెట్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అవకాశం కల్పించామన్నారు. మారుమూల గ్రామాలకు కూడా ప్రభుత్వ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కులాలు, మతాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రివర్స్ టెండరింగ్ ద్వారా అవినీతి లేకుండా కాంట్రాక్టులు ఇస్తున్నామన్నారు. ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేస్తున్నారో చూస్తున్నామని.. తన బలం ప్రజల ఆశీస్సులు, దేవుడి అండ అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. -
‘నేతన్న నేస్తం అద్భుత పథకం’
సాక్షి, ధర్మవరం: రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. నేతన్న నేస్తం పథకం కింద మగ్గాలు ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ. 24000 ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ధర్మవరం పట్టు చీరలకు గిట్టుబాటు ధరలు వచ్చేలా కృషి చేస్తున్నట్టు చెప్పారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హాయాంలో చేనేతలకు మేలు జరిగిందని, ఆయన బాటలోనే సీఎం వైఎస్ జగన్ పయనిస్తున్నారని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ పేదల పక్షపాతి అని.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. చేనేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నడుంబిగించారని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం అద్భుత పథకమని కొనియాడారు. చంద్రబాబు చేనేత రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. నేతన్నల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్ గతంలో మూడు రోజులు నిరాహారదీక్ష చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దిగజారుతున్న రాజకీయ వ్యవస్థను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రక్షాళన చేస్తున్నారని, ఎన్నికల హామీలను నిక్కచ్చిగా అమలు చేసి చూపిస్తున్నారని ప్రశంసించారు. -
ధర్మవరంలో ‘వైఎస్ఆర్ నేతన్న నేస్తం’ పథకం ప్రారంభం
-
చేనేతలకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని.. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు అపూర్వ సంక్షేమ పథకం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ను ప్రవేశపెడుతోంది. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, హస్త కళలకు పూర్వ వైభవం తేవడమే కాకుండా కేవలం మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న వారికి మరింత తోడ్పాటునివ్వడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఈనెల 21న అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. (చదవండి : రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు) ముడిసరుకు కొనుగోలుకు అవకాశం మరమగ్గాలు వచ్చిన తరువాత చేనేతలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో చేతి ద్వారా నేత నేసే నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సాయం తోడ్పాటునిస్తుందని చేనేత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మగ్గాలను బాగు చేయించుకోవడం, నూలు, రంగులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మగ్గంపై నేత నేయాలంటే నేత కార్మికుడు అప్పుచేయాల్సిందే. అది కూడా ముందుగానే చీరలు, ఇతర వస్త్రాలు కొనుగోలు చేసే పెట్టుబడిదారుల నుంచి అప్పులు తీసుకుంటారు. వీటిని తీర్చలేక నేసిన వస్త్రాలు వారికే విక్రయిస్తారు. అప్పు ఇచ్చిన వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి వీరికి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలని సంకల్పించి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’కు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 81,783 మంది నేతన్నలను గుర్తించారు. అలాగే, ఇందుకోసం రూ.196.27కోట్లు ఖర్చు చేయనుంది. అర్హులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ.. ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరు.. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా పెడన, నెల్లూరు జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, వైఎస్సార్ జిల్లాలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మాధవరం, అప్పనపల్లె వంటి పేరుగాంచిన పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా నేతన్నలు వస్త్రాలు తయారుచేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. నేను పదో తరగతి వరకు చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులవల్ల పై చదువులకు వెళ్లలేకపోయా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేత నేస్తూనే ఉన్నా. ఇప్పటివరకు చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద రూ.24వేలు ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం. దీంతో ఆధునిక పరికరాలు కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుంది. – మరక షణ్ముఖరావు, పెడన, కృష్ణా జిల్లా -
రేపు ధర్మవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. చేతి వృత్తులకు చేయూతనిచ్చేందుకు అమలు చేస్తున్న ఈ పథకానికి ధర్మవరం నుంచే శ్రీకారం చుట్టారు. చేనేత మగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం రూ.24,000 అందించనుంది. కాగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకానికి జిల్లాలో 27,481మంది ఎంపిక అయ్యారు. -
21న ధర్మవరంలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారు అయింది. ఈ నెల 21న ఆయన ధర్మవరంలో పర్యటించనున్నారు. ధర్మవరంలో ‘నేతన్న నేస్తం’ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ధర్మవరం జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లును మంత్రి శంకర్ నారాయణ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ చంద్రుడు, జిల్లా ఎస్పీ సత్యా యేసుబాబు పరిశీలించారు. కాగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. సొంతంగా మగ్గాలున్న ప్రతి కుటుంబానికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. దారిద్ర్య రేఖకు దిగువన, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. -
21న వైఎస్సార్ నేతన్న నేస్తం
నెల్లూరు(పొగతోట) : జిల్లాలో అర్హులైన చేనేతలకు వైఎస్సార్ నేతన్న నేస్తం అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్ నేతన్ననేస్తంపై వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ నెల 21వ తేదీ కార్యక్రమం నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. కష్టాలు ఎదుర్కొంటున్న చేనేతలకు చేయూత నందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నేతన్న నేస్తం పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. పథకం ద్వారా అర్హులైన చేనేతలందరికి ఈనెల 21న రూ.24 వేలు ఆర్థిక సాయం అందించాల్సి ఉందన్నారు. దీనిపై చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 5,943 మంది సొంత మగ్గాలు కలిగిన చేనేత కుటుంబాలను గుర్తించామని, వాటిలో 14 డబుల్ ఎంట్రీలు నమోదు కావడంతో వాటిని తొలగించామని తెలిపారు. అభ్యర్థుల జాబితాలను సచివాలయాల్లో అందుబాటులో ఉంచామన్నారు. అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని కోరామని పేర్కొన్నారు. 967 కుటుంబాల పేర్లు జాబితాలో లేవని, వారి నుంచి దరఖాస్తులు అందాయని తెలిపారు. వాటిని పరిగణలోకి తీసుకుని 6,852 మంది అర్హుల జాబితాను సిద్ధం చేశామని తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ ఆయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో చేనేత జౌళిశాఖ ఏడీఓ ప్రసాదరావు, చేనేత సేవ కేంద్రం సహాయ సంచాలకులు జనార్దన్ తదితర అధికారులు పాల్గొన్నారు. నిధులను సద్వినియోగం చేయండి ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించిందన్నారు. వార్షిక బడ్జెట్ కేటాయించడంలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం నిధులు ప్రత్యేకంగా కేటాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ శాఖల అధికారులు వార్షిక బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధులను నెలాఖరుకు 70 శాతం వరకు ఖర్చు చేయాలని స్పష్టంచేశారు. 2020 మార్చి నాటికి నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ–2 కమలకుమారి, డీఆర్డీఏ పీడీ శీనానాయక్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ రాజ్యలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ జీవపుత్రకుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రైతుల బకాయిలు చెల్లించండి షుగర్‌కేన్ రైతులకు సత్వరమే బకాయిలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంవీ శేషగిరిబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు చెల్లించవలసిన బకాయిలపై అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. చెరకు సరఫరా చేసిన 900 మంది రైతులకు రూ.8.67 కోట్లు చెల్లించవలసి ఉందన్నారు. ఫ్యాక్టరీని మూసివేసి ఐదు నెలలు గడిచినప్పటికి రైతులకు బకాయిలు చెల్లించలేదన్నారు. ఫ్యాక్టరీ స్థిర, చరాస్తుల వ్యాల్యువేషన్ రిపోర్టును షుగర్‌కేన్ అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ప్రకారం ఆర్ఆర్ యాక్టు కింద చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బకాయిలు వసూలు చేసేందుకు పొదలకూరు తహసీల్దార్ ఆర్ఆర్ యాక్టు ప్రకారం వేలం వేసేందుకు నోటీలులు ఇచ్చారని తెలిపారు. దీనిపై ఇండియన్ బ్యాంక్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఆస్తులు బ్యాంకుకు మార్ట్గేజ్ చేసి ఉన్నారని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారని, కోర్టు వారు నాలుగు వారాలు స్టేటస్కో ఇచ్చినట్లు వివరించారు. దీనిపై కౌంటర్ ఆఫిడవిట్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో రైతుల బకాయిలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో డీఆర్ఓ మల్లికార్జున, నెల్లూరు ఆర్డీఓ హూస్సేన్ సాహెబ్, షుగర్‌కేన్ అసిస్టెంట్ కమిషనర్ జాన్‌విక్టర్, పొదలకూరు తహసీల్దార్ స్వాతి పాల్గొన్నారు. -
‘నేతన్నల నిజమైన నేస్తం జగనన్న’
సాక్షి, అనంతపురం: కష్టాల్లో ఉన్న చేనేతలకు ఆపన్నహస్తం.. నేతన్న నేస్తం అని ఎంపీ తలారి రంగయ్య అన్నారు. శనివారం ఆయన అనంతపురంలోని ఉరవకొండలో నిర్వహించిన ‘చేనేతల ఆత్మీయసభ’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లానే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. రాబోయే ఐదేళ్లలో చేనేతరంగం దశ దిశలను సీఎం జగన్ మారుస్తారని తెలిపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా చేనేతలకు ఏడాదికి రూ. 24 వేలు ప్రభుత్వం ఇస్తుందని రంగయ్య తెలిపారు. అదేవిధంగా నేతన్నల నిజమైన నేస్తం జగనన్న అని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. చంద్రబాబు చేనేతలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా అందరికి నేతన్న నేస్తం వర్తిస్తుందన్నారు. కార్మికుల ఉత్పత్తుల అమ్మకానికి ఈ-కామర్స్ దిగ్గజాలు.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. -
చేనేతలకు కొండంత అండ
సాక్షి, అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్రంలో సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలందరికీ వైఎస్సార్ నేతన్న నేస్తం కింద ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత చేనేత జౌళి శాఖ రాష్ట్రంలో నిర్వహించిన సర్వే ప్రకారం 13 జిల్లాల్లో మగ్గం ఉన్న చేనేత కుటుంబాలు 75,243 ఉన్నట్లు గుర్తించారు. ఈ కుటుంబాలకు డిసెంబర్ నెలలో రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు రూ.180.58 కోట్లు అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇదే విషయాన్ని ఉత్తర్వుల్లో కూడా పేర్కొన్నారు. బడ్జెట్లో చేనేత కుటుంబాలకు ఆర్థిక సాయం కోసం రూ.200 కోట్లు కేటాయించారు. ఇంకా అర్హులైన కుటుంబాలు ఉంటే వారికి కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా.. మగ్గం ఉన్న ఒక చేనేత కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దారిద్య్ర రేఖకు దిగువనున్న చేనేత కుటుంబాలే అర్హతగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చేనేత, జౌళి శాఖ సర్వే ఆధారంగా గ్రామ, వార్డు వలంటీర్లు క్షేత్ర స్థాయిలో చేనేత కుటుంబాల తనిఖీలను నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరులోగా తనిఖీలను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత అర్హుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. వలంటీర్ల తనిఖీల అనంతరం ఇంకా ఎవరైనా అర్హులుగా తేలితే వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. జిల్లా కలెక్టర్లు అర్హులైన చేనేత కుటుంబాల జాబితాలను ఆమోదించాల్సి ఉంది. అర్హులైన చేనేత కుటుంబాల నిర్ధిష్ట బ్యాంకు ఖాతా, ఆధార్ వివరాలను ప్రతి ఏడాది జిల్లా కలెక్టర్లు అందజేయాల్సి ఉంటుంది. వైఎస్సార్ వాహన మిత్ర పథకం కింద ఆటో, టాక్సీ వాలాలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించిన తరహాలోనే చేనేత కుటుంబాలకు ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ కింద లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్ ద్వారా నేరుగా నగదు బదిలీ చేయనున్నారు. -
మరో పథకానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. చేనేత కార్మికులకు ఆపన్నహస్తం అందించడానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం అమలుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం అమలవుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా మగ్గం ఉన్న నేతన్నలకు ఈ సాయం అందనుంది. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు అవకాశం ఏర్పడుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. మగ్గం ఉన్న కుటుంబాన్నిఒక యూనిట్‌గా పరిగణిస్తారు.