అనంతపురం, పెద్దపప్పూరు: తెలుగుదేశం వర్గీయులు బరితెగించారు. అర్హతలేకపోయినా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద రూ.24వేలు లబ్ధి పొందేందుకు ఏకంగా వలంటీర్‌ను బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. నరసాపురంలో గ్రామ వలంటీర్ ఉక్కీసల నాగేష్ వద్దకు గురువారం సాయంత్రం జేసీ సోదరుల ముఖ్య అనుచరులైన టీడీపీ నాయకులు రామాంజులరెడ్డి, భాస్కర్‌రెడ్డిల వర్గీయులు ఇద్దరు వెళ్లి తమకు ‘నేతన్న నేస్తం’ వర్తింపజేయాలని బెదిరించి మరీ దరఖాస్తులో సంతకాలు చేయించుకున్నారు. విషయం కాస్తా వైఎస్సార్‌సీపీ నాయకులకు తెలియడంతో వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు శుక్రవారం ఆ గ్రామాన్ని సందర్శించి వివరాలు ఆరా తీశారు. టీడీపీ నాయకుల బెదిరింపులకు భయపడిపోయిన వలంటీర్ వారిపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment