వైఎస్సార్ నేతన్న నేస్తం.. నాలుగో విడత నగదు జమ కార్యక్రమం అప్‌డేట్స్
►ప్రసంగం అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి నేతన్నల ఖాతాల్లోకి నేరుగా 193.31 కోట్లు జమ చేశారు సీఎం జగన్.
పెడన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం
►దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది
►గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు అండగా నిలవలేదు
►నేతన్నల జీవితాలను నా పాదయాత్రలో గమనించా
►వారికి నేనున్నాననే భరోసా అందించా
►అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చాం
►మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం
►నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ. 96వేల సాయం
► 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమ
►లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం
► ఇప్పటివరకూ నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049 కోట్లు
►మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్
►పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం: సీఎం జగన్
►త్వరలో మచిలీపట్నం పోర్టు శంకస్థాపన: సీఎం జగన్
ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ కామెంట్స్
► కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు
► మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే నేత సీఎం వైఎస్ జగన్
► బలహీనపక్షాల తరఫున నిలబడే బలమైన నేత సీఎం జగన్
► రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారు
► అన్ని వర్గాల ప్రజలకు సీఎం అండగా నిలుస్తున్నారు
► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, ఇతరులు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్.
► చేనేత కళాకారుల ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్.. స్వయంగా మగ్గాన్ని నేశారు.
► పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్.. స్థానిక నేతలతో ఆప్యాయ పలకరింపు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు.
► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమం కోసం పెడన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు.. పర్యాటక మంత్రి, కృష్ణా జిల్లా ఇన్‌చార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పుష్ఫగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు.
► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. గురువారం ఉదయం కృష్ణా జిల్లా పెడనకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. హెలీప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన మంత్రి జోగిరమేష్, చీఫ్ విప్ లు సామినేని ఉదయభాను,ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని,కొడాలి నాని,పార్ధసారధి,కైలే అనీల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా
► కృష్ణా జిల్లా పెడన పర్యటన కోసం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్.
► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే వేదిక నుంచి.. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు.
► వైఎస్సార్ నేతన్న నేస్తం.. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు.
► వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. ప్రసంగిస్తారు.
షెడ్యూల్
► సీఎం జగన్ ఇవాళ (గురువారం) కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు.
► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
► పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
► బహిరంగ సభలో ప్రసంగించి.. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు.
► కార్యక్రమం అనంతరం.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment