pedana
-
కళంకారి వెలుగు దారి
కలంకారి అనే మాట ఎంతో సుపరిచితం. అయితే ఈ సుప్రసిద్ధ కళ చరిత్ర చాలామందికి అపరిచితం. ఆ ఘనచరిత్రను ఈ తరానికి పరిచయం చేయడానికి, కలంకారీని మరింత వైభవంగా వెలిగించడానికి పూనుకుంది లీలావతి. కలంకారి అద్దకపు పనికి బోలెడంత ఓపిక కావాలి అంటారు. పరిశోధకులకు కూడా అంతే ఓపిక కావాలి. పెద్ద వస్తువు నుంచి చిన్నవాక్యం వరకు ఎన్నో ఎన్నెన్నో పరిశోధనకు ఇరుసుగా పనిచేస్తాయి. ఈ ఎరుకతో కలంకారిపై లోతైన పరిశోధన చేసిన లీలావతి.. ఆ కళపై పీహెచ్డీ పట్టా పొందిన తొలి మహిళగా ప్రశంసలు అందుకుంటోంది..కలంకారి అంటే గుర్తుకు వచ్చేది పెడన. కృష్ణాజిల్లా పెడన పట్టణంలో కలంకారి వస్త్రాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 2,500 సంవత్సరాల క్రితమే ప్రారంభమైన ఈ కళపై చరిత్ర అధ్యాపకురాలు గుడివాడకు చెందిన పామర్తి లీలావతి పరిశోధన చేసింది. ఈ పరిశోధనకు ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఇటీవల పీహెచ్డీ పట్టా అందుకుంది. కలంకారిపై తొలిసారిగా పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పొందిన మహిళగా ప్రశంసలు అందుకుంటోంది.పెడనలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా విధుల్లో చేరిన లీలావతికి సహజంగానే అక్కడి వాతావరణం వల్ల కలంకారి కళపై ఆసక్తి పెరిగింది. కళాశాలకు వెళ్లే సమయంలో కలంకారి వస్త్రాలపై ముద్రణ నుంచి కలంకారి కళాకారుల జీవన శైలి వరకు ఎన్నో విషయాలు గమనించేది. నాగార్జున యూనివర్శిటీలో కలంకారి పరిశ్రమలపైన, ఆయా కుటుంబాల సామాజిక పరిస్థితులపై ఒకసారి పరిశోధన ప్రసంగం చేసింది.ఆ ప్రసంగానికి మంచి స్పందన లభించింది. ఆ సమయంలోనే ‘కలంకారి కళ’పై పీహెచ్డీ చేయాలనే ఆలోచన వచ్చింది. నాగార్జున విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ స్టూడెంట్‌గా ప్రవేశం పొందింది. ‘కలంకారి కళకు సుదీర్ఘ చరిత్ర ఉంది. దేశవిదేశాల్లో గుర్తింపు ఉన్న కలంకారిపై ఇప్పటి వరకు ఎవరూ పరిశోధన చేయక పోవడంతో నేనే ఎందుకు చేయకూడదని నిర్ణయించుకుని ఆ దిశగా అడుగులు వేశాను’ అంటుంది లీలావతి. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకురాలిగా పనిచేస్తున్న లీలావతి కలంకారిపై మరిన్ని పరిశోధనలు చేయాలని ఆశిద్దాం. ఎన్నో దారులలో...కలంకారిపై పరిశోధనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందడం సంతోషంగా ఉంది. కలంకారి పరిశ్రమ చరిత్ర, సంస్కృతి, దేశ విదేశాల్లో ఉన్నప్రాధాన్యం, ఆదరణ, కార్మికుల జీవన స్థితిగతులపై నా పరిశోధనలో సమగ్రంగా తెలుసుకున్నాను. పరిశోధనలో ఉన్న విశేషం ఏమిటంటే ఒక దారి అనేక దారులకు దారి చూపుతుంది. ఇలా కలంకారి గురించి అనేక కోణాలలో అనేక విషయాలు తెలుసుకోగలిగాను.– పామర్తి లీలావతి– నారగాని గంగాధర్ సాక్షి, పెడన -
అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. రోడ్డెక్కిన జనసేన
సాక్షి, కృష్ణాజిల్లా: పెడనలో న్యాయం కోసం జనసేన పార్టీ కార్యకర్తలు రోడ్డెక్కారు. టీడీపీ నేతల అరాచకాలపై జనసేన పోరాట దీక్షకు దిగింది. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ వాహనం ముందు జనసేన కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ కార్యక్తలకు అన్యాయం జరుగుతున్నా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కల్యాణ్ అపాయింట్మెంట్ కోరుతూ జనసేన కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. పెడన నియోజకవర్గం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సీరం సంతోష్ ఆధ్వర్యంలో దీక్షకు దిగారు. అరగంట కేటాయిస్తే పనైపోద్ది.. మా గోడు తెలియజేయడానికి సమయం ఇవ్వాలంటూ బ్యానర్లు కట్టారు.కార్యకర్తలకు అవమానాలు జరుగుతున్నా పవన్ కల్యాణ్ పట్టించుకోకపోవడంతో ఆయన అపాయింట్మెంట్ కోరుతూ ఆమరణదీక్ష చేపట్టిన సీరం సంతోష్ దీక్షతో టీడీపీ,జనసేన పార్టీలో కలవరం రేగుతోంది. జనసేన కృష్ణాజిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు. దీక్ష విరమింపజేయాలని ప్రయత్నాలు చేస్తుండగా, సీరం సంతోష్ మాత్రం ససేమిరా అంటున్నారు. మరో వైపు, నిన్న(బుధవారం) కోనసీమలో మంత్రి అచ్చెన్నాయుడికి జనసేన కార్యకర్తలు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పి.గన్నవరంలో మంత్రి పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి సమావేశంలో గందరగోళం నెలకొంది. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్న మాట్లాడుతున్న సమయంలో జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించకుండా అచ్చెన్నాయుడు ఎలా మాట్లాడతారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.జనసేన ఎమ్మెల్యే ఉన్న చోటే పవన్ పేరు పలకరా అంటూ నిరసన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో పవన్ పేరు ప్రస్తావించక పోవడంతో టీడీపీ, జనసేన నేతల మధ్య వాగ్వాదం జరిగింది. జనసేన కార్యకర్తలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోబోయారు. దీంతో వివాదం మరింత ముదిరింది. షాక్ తిన్న అచ్చెన్నాయుడు సభ నుంచి వెళ్లిపోయారు. -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి
కృష్ణా, సాక్షి: రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున జిల్లా రహదారి నెత్తురోడింది. శుక్రవారం ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రొయ్యల ఫీడ్‌తో వెళ్తున్న కంటెయినర్‌ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వాళ్లుగా పోలీసులు గుర్తించారు. వీళ్లంతా మునిపెడలో చేపల వేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్‌ది కాగా.. అతని పేరు, ఇతర వివరాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రొయ్యల ఫీడ్‌తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తోంది. ఇక బొలెరో వ్యాన్ అమలాపురం మండలం తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వెళ్తోంది. అయితే పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేసే క్రమంలో కంటెయినర్‌కు ఢీ కొట్టినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించుకున్నారు.పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతికృష్ణా జిల్లా సీతనపల్లి ఘోర రోడ్డు ప్రమాద ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆమె.. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను కోరారు. అలాగే ఘటన తర్వాత.. గాయపడిన వాళ్లను బయటకు తీసిన స్థానికుల చొరవకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. -
బూరగడ్డ భవితవ్యం ప్రశ్నార్థకం
సాక్షి, మచిలీపట్నం: టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సర్వత్రిక ఎన్నికల్లో పెడన అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో ఆయనతో పాటు అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాగిత కృష్ణ ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంతో చంద్రబాబును నమ్మి పార్టీలోకి వస్తే మరోసారి మోసం చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వేదవ్యాస్ పెడన టికెట్ ఆశిస్తుండగా ఆయనకు కాకుండా కాగిత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు కేటాయించారు. దీంతో బూరగడ్డ తీవ్ర మనోవేదనతో అనారోగ్యానికి గురయ్యారు. హై బీపీతో రెండు వారాల క్రితం హైదరాబాదు లోని ఆస్పత్రిలో చేరి, చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జి అయ్యారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోని ఆయన విశ్రాంతిలో ఉన్నారు. వారసత్వంగా రాజకీయాల్లోకి.. బూరగడ్డ తండ్రి బూరగడ్డ నిరంజనరావు గతంలో మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన వారసుడిగా వేదవ్యాస్ 1989లో కాంగ్రెస్ తరఫున కాగిత వెంకట్రావుపై గెలిచి అసెంబ్లీలో డెప్యూటీ స్పీకర్‌గా, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా సేవలు అందించారు. 2004 ఎన్నికల్లో గెలిచి, అసెంబ్లీ పద్దుల కమిటీ చైర్మన్‌గా చేశారు. 2009లో పెడన నియోజకవర్గం ఏర్పడింది. వేదవ్యాస్ ప్రజా రాజ్యం పార్టీలో చేరి, మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్ సీపీ పెడన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టికెట్ లేదని తీవ్ర ఆందోళన 2018 వరకు వైఎస్సార్ సీపీలో ఉన్న వేదవ్యాస్ టీడీపీలో చేరారు. అప్పట్లో ఆయన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) చైర్మన్‌గా చేశారు. 2019లో టీడీపీ నుంచి టికెట్ ఆశించినా.. 2024లో ఇస్తానని చంద్రబాబు మాయ మాటలు చెప్పి దాటేశారని అనుచరులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోవడంతో వేదవ్యాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కత్తివెన్ను మండలం చినపాండ్రక గ్రామంలో పర్యటనలో ఉండగా టికెట్ లేదని తెలిసి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రక్తపోటు అధికమై హైదరాబాదులోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. అసంతృప్తిలో అనుచర వర్గం పెడన టీడీపీ టికెట్ కాగిత కృష్ణ ప్రసాద్‌కు ఇవ్వ డంతో వేదవ్యాస్ అనుచరులు చంద్రబాబుపై అసంతృప్తితో రగిలిపోతున్నారు. తమ నాయకుడు పార్టీ కోసం కష్టపడి పని చేస్తూ వచ్చారని, నమ్ముకొని ఉన్న నేతకు టికెట్ ఇవ్వకపోడం సరైంది కాదని చెబుతున్నారు. బాబు తీరు వల్లే తమ నాయకుడు అనారోగ్యానికి గురయ్యారని, తనను నమ్మిన నేతలను నట్టేట ముంచడం చంద్ర బాబుకు కొత్తేమీ కాదని అంటున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ కోసం పట్టు వచ్చే ఎన్నికల్లో పెడన నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని బూరగడ్డ అనుచరులు పట్టుపట్టినట్లు తెలుస్తోంది. హైదరాబాదులో ఉన్న ఆయన నాలుగైదు రోజుల్లో ఇక్కడికి వచ్చి, తన అనుచరులతో సమావేశం నిర్వహించి భవితవ్యం వెల్లడించనున్నట్లు సమాచారం. అయితే, తమకు ఓటు బ్యాంకు ఉందని, గెలిచినా.. ఓడినా పోటీ చేసి ఉనికిని కాపాడుకోవాలనే ఆలోచనతో బూరగడ్డ ఉన్నట్లు అనుచరులు చెప్పుకొంటున్నారు. -
పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట బొప్పూడి సభను పెడన, విజయవాడ వెస్ట్ జనసేన కార్యకర్తలు బాయ్‌కాట్ చేశారు. పెడన టికెట్ విషయంలో జనసేన కార్యకర్తలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్ల ను పవన్ పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్‌కు సీటు వస్తుందని జనసైనికులు ఆశించారు. టికెట్ బీజేపీకి వెళ్లడంతో జనసేన శ్రేణులు మండిపోతున్నారు. ఈ క్రమంలో బొప్పూడి సభకు పోతిన మహేష్ ఒంటరిగానే వెళ్లారు. అయితే సభలో పవన్‌ను నిలదీయాలని మహేష్‌కు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. చదవండి: పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏమిటో? -
సీఎం జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరిన జనసేన నేతలు
-
టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు వైరస్: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సినిమా స్టైల్లో రాళ్లదాడి జరగబోతుందంటూ డైలాగులు వేశారని దుయ్యబట్టారు. తీరాచూస్తూ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిసినా రెండు వేలమందిని కూడా జనాన్ని తెచ్చుకోలేక పోయారని అన్నారు.పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు పవన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ కాదు అది వైరస్ కేవలం రెండు వేలమందితో కూడా సభ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. అవనిగడ్డలో ప్లాప్ షో నిర్వహించాని అన్నారు. టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు అది వైరస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్, చంద్రబాబుక కలయిక విషంతో సమానమని అన్నారు. టీడీపీ, జనసేన కలిసిన తర్వాత మరింత దిగజారిపోయారని మండిపడ్డారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ నిసిగ్గుగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్‌కు సిగ్గు, మనసాక్షి లేదని విమర్శించారు. రౌడీలతో పోల్చుతావా పవన్? ‘మీ వెకిలి వేషాలు చూశాక ప్రజలు నిర్దారణకు వచ్చేశారు. 2014లో మీరు చేసిన స్కాంలను జనం చూశారు. దోచిన సొమ్ము షెల్ కంపెనీలకు పంపిన వైనాన్ని సీఐడీ బయట పెట్టింది. చివరికి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్నారున. అత్తారింటికి దారేది సినిమా ఎక్కడో పైరసీ జరిగితే మా పెడన కళంకారీ తమ్ముళ్లను పవన్ కొట్టించారు. కలంకారీ పరిశ్రమ దేశానికే గర్వకారణం. సీఎం జగన్ ప్రభుత్వం ఆ కళాకారులను గౌరవించి సత్కరించింది. అలాంటి వారిని రౌడీలతో పోల్చుతావా పవన్? చదవండి: పరిటాల సునీత, శ్రీరామ్‌లపై కేసు నమోదు కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉంది చంద్రబాబు పాలన అవినీతి రాజ్యం అంటూ గతంలో పవన్ మాట్లాడారు. టీడీపీ ప్రజాద్రోహి అన్నారు. పవన్ సీఎం కావాలంటే మా కులం బ్లడ్ ఎక్కించుకోవాలన్నారు. మొన్న రాజమండ్రి జైల్లో పవన్ ఆ కులం బ్లడ్ ఎక్కించుకున్నారా?. పవన్‌కు సిగ్గులేనందుక వారి బ్లడ్ ఎక్కించుకున్నారేమో?. కానీ కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉంది. పవన్ లాగ వ్యవహరించరు. టీడీపీ వారికి ఇదేం ఖర్మ! వంగవీటి రంగాని ఘోరంగా నరికి చంపిన వారికి పవన్ భుజాన వేసుకొని మోస్తున్నారు. మీలాంటివారిని ప్రజలు నమ్మరుకాక నమ్మరు. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా, మరికొందరు బ్రోకర్లు పావలాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి ఖర్మ పట్టింది. పవన్ వారాహి మీద మాట్లాడుతుంటే టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర కింద నిలపడే ఖర్మ పట్టింది. పేదల పక్షాన జగన్, పెత్తందార్ల పక్షాన పవన్, పవన్ భారతీయుడో, రష్యావాడో తెలియదు. రష్యా వాడైతే ఏపీకి రావాలంటే కచ్చితంగా పాస్ పోర్టు కావాల్సిందే. పేదల పక్షాన జగన్, పెత్తందార్ల పక్షాన పవన్, చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని పవన్ చెప్తున్నారు. టీడీపీ వారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి. చంద్రబాబు, పవన్ కలయిక అపవిత్రమైనది, ఒక విషబీజం లాంటిది. వీరి వలన ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. 2024 తర్వాత పవన్‌తో నేను సినిమా తీస్తా. జానీ-కూలీ, గబ్బర్ సింగ్-రబ్బర్ సింగ్ పేరుతో సినిమా తీస్తా’ అంటూ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. -
పవన్ వ్యాఖ్యలు.. పోలీసు నోటీసులు
సాక్షి, కృష్ణా: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారాహి యాత్రపై రాళ్ల దాడికి ప్లాన్చేశారంటూ పవన్ కల్యాణ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆరోపణలకు సాక్ష్యాలు ఏవైనా ఉన్నాయా? అని నోటీసులు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ జాషువా వెల్లడించారు. ‘‘దాడులు జరగుతాయనే సమాచారం మీకు ఎక్కడి నుంచి వచ్చిందనేది మాకు తెలియపర్చమని నోటీసుల్లో కోరాం. మేం పంపిన నోటీసులకు పవన్ నుంచి ఎలాంటి రిప్లై లేదు. రిప్లై రాలేదంటే ఆయన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారాని అనుకోవాలా?. ఎటువంటి సమాచారంతో పవన్ వ్యాఖ్యలు చేశారు.పైగా.. పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు తిరగబడి కాళ్ళు చేతులు కట్టేయండంటూ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. పవన్ అందుకే నోటీసులు ఇచ్చాం. సరైన ఆధారాల్లేకుండా వ్యాఖ్యలు, ఆరోపణలు చేయకూడదు.బాధ్యతారాహిత్యంగా ఆరోపణలు చేస్తే పర్యవసానాలు ఉంటాయి. రెచ్చగొట్టే భాష, సైగలు మానుకుని మాట్లాడాలి. మా సమాచార వ్యవస్థ మాకుంది. పవన్ కంటే నిఘా వ్యవస్థ మాకు బలంగా ఉంది. అసాంఘిక శక్తులుంటే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు ఎస్పీ జాషువా. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నాల్గో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. పెడనలో జరుగనున్న వారాహి యాత్రలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందంటూ పవన్ ఆరోపించారు. మచిలీపట్నం జనవాణి కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ సంచలన ఆరోపణలు చేశారు. పెడన వారాహి యాత్రలో గుండాలు, క్రిమినల్స్‌తో రాళ్ల దాడులు చేసి, రక్తపాతం సృష్టించాలని ప్లాన్ వేస్తున్నారని పవన్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇదీ చదవండి: వారాహిని అడ్డుకునే అవసరం ఏంటి? -
జనసేనలో భగ్గుమన్న వర్గపోరు.. కత్తులతో పరస్పర దాడులు
సాక్షి, పెడన: కృష్ణా జిల్లా పెడన మండలం నడుపూరులో జనసేన పార్టీ శ్రేణుల మధ్య వర్గ పోరు భగ్గుమంది. గ్రామంలోని కోళ్లఫారం వద్ద జనసేన పార్టీకి చెందిన రెండు వర్గాలు కత్తులతో, కర్రలతో మంగళవారం దాడికి తెగబడ్డాయి. పెడన–గుడివాడ హైవే పక్కనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భీతిల్లారు. సినిమాల్లోని పోరాట సన్నివేశాలను తలపించేలా సమ్మెట బాబు వర్గం కత్తులతో దాడులకు తెగబడటంతో యడ్లపల్లి రామసుధీర్ వర్గం హడలిపోయింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచీ పెడన నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణులు యడ్లపల్లి రామసుధీర్, సమ్మెట బాబు వర్గాలుగా విడిపోయి వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు వర్గాలు ఎక్కడైనా తారసపడితే పరస్పరం హెచ్చరికలు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా సమ్మెట బాబు వర్గానికి చెందిన వ్యక్తులు రామసుధీర్ వర్గంపై కత్తులు, కర్రలతో దాడి చేయడంతో ఆ వర్గానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనుచిత పోస్టింగ్‌ల వల్లే వివాదం! రెండు వర్గాల వారు వాట్సాప్ గ్రూపుల్లో అసభ్య పదజాలంతో పోస్టింగ్‌లు పెట్టడం వల్లే ఈ దాడులు చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. పోలీసుల కథనం ప్రకారం.. నడుపూరు గ్రామానికి చెందిన సింగంశెట్టి అశోక్‌కుమార్(35) గుడివాడ రోడ్డులో కోళ్లఫారం నడుపుతున్నాడు. మంగళవారం అశోక్‌కుమార్, కొఠారి మల్లిబాబు(35), మద్దాల పవన్(28)లతో పాటు మరో ముగ్గురు కోళ్లఫారం వద్ద ఉండగా.. సమ్మెట బాబు వర్గానికి చెందిన బత్తిన హరిరామ్, మెట్టా గణపతి, కనపర్తి వెంకన్న, సమ్మెట శివనాగప్రసాద్, పినిశెట్టి భరత్ శివశంకర్, దాసరి సుబ్రహ్మణ్యం, ముద్దినేని రామకృష్ణ కలిసి అక్కడకు వచ్చారు. వాట్సాప్‌లో పెట్టిన పోస్టింగ్‌ల విషయమై రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో రెండు వర్గాలు కత్తులు, తాటి మట్టలు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. అశోక్‌కుమార్‌తోపాటు కొఠారి మల్లిబాబు, మద్దాల పవన్ అనే వారు కత్తిపోట్లకు గురయ్యారు. మరో వ్యక్తికి కర్ర దెబ్బలు తగిలాయి. నలుగురినీ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పెడన పోలీసులు కేసు నమోదు చేశారు. -
మా ఇళ్ల వద్ద ఫొటోలు ఎలా దిగుతారు?: జనసేన నాయకులకు షాక్
పెడన/రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుపేదల పక్షాన నిలబడి అర్హులకు స్థలాలిచ్చి, ఇళ్లను నిర్మిస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారా? అంటూ జనసేన నేతలను లబ్ధిదారులు నిలదీశారు. రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలోని జనసేన నేతలు రామ్‌సుధీర్, రమాదేవి తదితరులు శనివారం ఉదయం పట్టణ శివారులోని పల్లోటి లేఅవుట్–2 వద్దకు వెళ్లి ఫొటోలు దిగుతున్నారు. అదే సమయంలో అక్కడ ఇళ్లను నిర్మించుకుంటున్న పలువురు లబ్ధిదారులు ఫొటోలు ఎందుకు దిగుతున్నారని ప్రశ్నించారు. దీనిపై జనసేన నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ.. ఇక్కడ వైఎస్సార్సీపీ నాయకులకు, కౌన్సిలర్లకు మాట్లాడే పనిలేదని, మీకు ఇక్కడ ఏం సంబంధం అంటూ నల్లా నాగలక్ష్మి, షాహినాబేగంలను ప్రశ్నించారు. దీంతో వారిద్దరూ ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ‘మీరేం మాట్లాడుతున్నారు.. మేం ఎవరని ప్రశ్నిస్తున్నారేంటి? అసలు మీరెవరు? మా ఇళ్ల దగ్గరకు ఎందుకొచ్చారు? ఫొటోలు ఎందుకు దిగుతున్నారు? లబ్ధిదారులైన మమ్మల్ని ప్రశ్నిస్తున్నారేంటి’ అంటూ ఎదురుతిరిగి గట్టిగా నిలదీశారు. దీంతో.. సమస్యలుంటే చెప్పాలని జనసేన నేతలు కోరారు. సమస్యలేమి లేవని లబ్ధిదారులు గట్టిగా బదులివ్వగా చేసేదిలేక వారు వెనుదిరిగారు. అనంతరం ఒకటో వార్డులోని పైడమ్మ లేఅవుట్ వద్దకు కూడా వారు వెళ్లి తాపీ పనివారితో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగడంతో స్థానికుల జోక్యంతో సద్దుమణిగింది. రాజమహేంద్రవరంలో ఇలా.. మరోవైపు.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బొమ్మూరు టిడ్కో గృహ సముదాయం వద్ద కూడా జనసేన నేతలు ఓవరాక్షన్ చేశారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, అర్బన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు శనివారం ఉదయం టిడ్కో గృహ సముదాయంలోని కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడున్న మహిళలను ఉద్దేశించి జనసేన నేతలు ‘మిమ్మల్ని ఇప్పుడే పిలిచారా అంటే.. వెంటనే ఆ మహిళలు తమకు ఆగన్టులోనే ఇళ్లు అందజేశారని, కానీ.. తామే ఇంకా దిగలేద’న్నారు. అయినా ఇళ్లను ఎందుకు అప్పగించలేదంటూ అధికారులతో జనసేన నేతలు వాదనకు దిగారు. అక్కడ కొద్దిసేపు నినాదాలుచేసి సీ–బ్లాకు వద్దకు వచ్చారు. అక్కడ ఆ పార్టీ అభిమాని లలితను ఆమె ఫ్లాట్ కాని జీఎఫ్8 వద్ద నిలబెట్టి సమస్యలున్నాయంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు చెప్పించారు. తీరా చూస్తే ఇంటి ప్లాన్‌లోనే లేని బాల్కని కావాలని ఆమె సమస్యగా పేర్కొంది. ఆ తర్వాత.. ట్విట్టర్లో పెట్టేందుకు అంటూ మళ్లీ అనుశ్రీ సత్యనారాయణ అక్కడకొచ్చి లలితతో మళ్లీ అదే సమస్య చెప్పించి షూట్ చేశారు. ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేస్తున్నారు వారు స్థలాలివ్వరు. ఇచ్చిన వాటిని సక్రమంగా చూపడంలేదు. పక్కనే చెరువులను చూపి ఫొటోలు దిగుతూ చెరువుల్లో స్థలాలు ఇచ్చారంటూ టీవీలకు చెబుతున్నారు. ఇలా ప్రభుత్వాన్ని ఆప్రదిష్టపాలు చేయాలని చూస్తున్నారు. – నల్లా నాగలక్ష్మీ, లబ్ధిదారురాలు, పెడన వారికేంటి సంబంధం? మా స్థలాల వద్దకు వచ్చి మీకు సంబంధంలేదని ఎలా అంటారు? పార్టీలకు అతీతంగా అందరికి ఇళ్ల స్థలాలిస్తే వీరికి వచ్చిన బాధ ఏమిటో? మరీ ఇంత అన్యాయంగా ఫొటోలు దిగి టీవీలకు ఫోజులిస్తుంటే వారిని ఏమనాలి? – షాహినాబేగం, లబ్ధిదారురాలు, పెడన -
కృష్ణాజిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవర్ యాక్షన్
-
జనసేన నాయకుల ఓవరాక్షన్.. దెబ్బకు జారుకున్నారు
సాక్షి, కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లా పెడన జగనన్న కాలనీలో జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. జగనన్న లే ఔట్‌ను పరిశీలించేందుకు వచ్చిన జనసేన నాయకులు సౌకర్యాలు లేవని చెప్పాలంటూ లబ్ధిదారులపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు దిగిన జనసేన నాయకులపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత ఇల్లు లేని తమకు జగనన్న కాలనీలో ఇళ్లు ఇచ్చారని, సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక జనసేన నాయకులు తోకముడిచి అక్కడినుంచి జారుకున్నారు. చదవండి: (సహృదయులైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి: సీఎం జగన్) -
లైబ్రరీ అసిస్టెంట్ వికృత చేష్టలు.. దంచికొట్టిన విద్యార్థిని బంధువులు
సాక్షి, పెడన: పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్ విద్యార్థినిని వికృత చేష్టలు, మాటలతో లైంగిక వేధింపులకు గురి చేయడంతో బాలిక తల్లి, బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన కృష్ణాజిల్లా పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మచిలీపట్నం ఈడేపల్లికి చెందిన పల్లపాటి శ్రీకృష్ణ(47) పెడన పట్టణంలోని భట్ట జ్ఞానకోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లైబ్రరీ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ పాఠశాల లో ఏడో తరగతి చదువుతున్న బాలిక హైస్కూల్లో జరిగే గ్రంథాలయ తరగతులకు హాజరయ్యేది. గత రెండు రోజులుగా ఇంటి వద్ద ఏడుస్తూ ఉండటం గమనించిన తల్లి ఆరా తీయడంతో బాలిక పాఠశాలలో శ్రీకృష్ణ తనను లైంగికంగా వేధిస్తున్న విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో తల్లి దుర్గాంబిక తన బంధువులతో కలసి సోమవారం ఉదయం పాఠశాలకు వెళ్లి హెచ్ఎం గోపాలరావును నిలదీశారు. ఆయన శ్రీకృష్ణను పిలిచి విచారిస్తున్న సమయంలో బాలిక బంధువులు అకస్మాత్తుగా శ్రీకృష్ణపై దాడి చేశారు. సమాచారం అందుకున్న పెడన ఎస్ఐ రవిచంద్ర పాఠశాలకు వెళ్లి శ్రీకృష్ణను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాలిక తల్లి దుర్గాంబిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ కేసుతో పాటు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల నుంచి వివరాలు తెలుసుకుంటున్న మంత్రి జోగి రమేష్ బాలిక కుటుంబానికి మంత్రి పరామర్శ ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సోమవారం సాయంత్రం బాలిక ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమైన ఘటన అని, విద్యాబుద్ధులు నేర్పించాల్సిన వ్యక్తి దుర్మార్గపు ఆలోచనలతో వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, సంబంధిత శాఖాధికారులు కూడా శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలిక తల్లికి ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. లైబ్రరీ అసిస్టెంట్‌పై చర్యలకు సిఫార్సు మచిలీపట్నం: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన పెడన జెడ్పీ స్కూల్ ల్రైబరీ అసిస్టెంట్ పల్లపాటి శ్రీకృష్ణపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసినట్లు కృష్ణాజిల్లా డీఈవో తాహెరా సుల్తానా సోమవారం వెల్లడించారు. బాలిక తల్లి ఫిర్యాదుపై డెప్యూటీ డీఈవోతో విచారణ జరిపించామన్నారు. శ్రీకృష్ణపై సర్వీసుపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా జెడ్పీ సీఈవోకు విచారణ నివేదికను పంపించామని పేర్కొన్నారు. -
జగనన్న కోసం జనం.. దారి పొడవునా తరగని అభిమానం (ఫొటోలు)
-
అందుకే సీఎం జగన్ జననేత అయ్యారు..!
సాక్షి, మచిలీపట్నం: కృష్ణా జిల్లా పెడనలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ప్రారంభోత్సవానికి హాజరైన అనారోగ్య బాధిత బాలుడి తల్లిదండ్రులు, ఓ వృద్ధురాలు, మరో ముగ్గురు మహిళలు ముఖ్యమంత్రి జగన్‌కు తమ సమస్యలను విన్నవించేందుకు నిరీక్షిస్తున్నారు. వేదికపై కూర్చున్న సీఎం జగన్ అర్జీలు చేతబట్టుకుని ఎదురుచూస్తున్న వారిని గమనించి తనవద్దకు తీసుకురావాలని కలెక్టర్ రంజిత్ బాషా, జేసీ రావిలాల మహేష్‌కుమార్‌కు సూచించారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులు వారందరినీ బారికేడ్లు దాటించి వేదిక వద్దకు తీసుకొచ్చారు. సీఎం కార్యాలయ కార్యదర్శి ముత్యాలరాజు, మాజీ మంత్రి పేర్ని నాని వారి వద్దకు వెళ్లి అర్జీలను స్వీకరించి సీఎంకు అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. కార్యక్రమం ముగిశాక గుర్తు పెట్టుకుని మరీ మరోసారి వారిని పిలిచి మాట్లాడారు. చదవండి: CM YS Jagan: మంచిని ఓర్వలేరు -
మంచిని ఓర్వలేరు: సీఎం వైఎస్ జగన్
రాష్ట్రంలో మునుపెన్నడూ లేని రీతిలో మనం మంచి పనులు చేస్తుండటాన్ని చంద్రబాబుతో కూడిన దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతోంది. అన్ని వర్గాలకు అండగా నిలవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. వీరి వైఖరి చూస్తుంటే బాధ కలుగుతోంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఒక రాట్నం... ఒక మగ్గం మన దేశం రూపురేఖలను మార్చేశాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి మన స్వాతంత్య్ర పోరాటాన్ని గమనిస్తే భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు, ఆచారాలు, జాతీయ ఉద్యమాన్ని సంఘటితం చేసిన ఘనత నేతన్నలదేనని గుర్తు చేశారు. మన నేతన్నలు మగ్గాల మీద నేసేది దారాల కలబోత మాత్రమే కాదన్నారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లను బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. బతుకుదెరువు కోసం.. మన నేత, చేనేత గొప్ప సంస్కృతి, చరిత్ర, స్వాతంత్య్ర పోరాటాలకు నిదర్శనాలుగా నిల్చాయి. అటువంటి మగ్గాన్ని, చేనేతను వేల సంవత్సరాల నుంచి నమ్ముకుని బతుకుదెరువు కోసం నేతన్నలు అవస్థలు పడటాన్ని శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతిచోటా గమనిస్తున్నాం. అద్భుతమైన వస్త్రాలను నేసే నేతన్నల జీవితాలు ఎలా ఉన్నాయో నా 3,648 కి.మీ. పాదయాత్రలో చాలాచోట్ల కళ్లారా చూశా. మాట ప్రకారం వారికి తోడుగా నిలుస్తున్నాం. నేతన్నపై ప్రేమకు నిదర్శనం.. 2019లో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని నా పుట్టిన రోజు నాడే తెచ్చాం. నేతన్న మీద నా ప్రేమకు అది నిదర్శనం. క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలు చొప్పున అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇవాళ వరుసగా నాలుగో ఏడాదీ అందచేస్తున్నాం. ఈ ఒక్క పథకం కింద ఇప్పటివరకు ఒక్కో నేతన్న కుటుంబానికి రూ.96 వేల మేర ప్రయోజనాన్ని చేకూర్చాం. గత అప్పుల కింద బ్యాంకులు ఈ డబ్బులను జమ చేయకుండా అన్ ఇన్‌కంబర్డ్ ఖాతాల ద్వారా జమ చేస్తున్నాం. నేతన్నలకు మొత్తం సాయం రూ.2,049.43 కోట్లు ఇవాళ అందించే సాయంతో కలిపితే ఇప్పటివరకూ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు. ఇది కాకుండా నేతన్నలకు సామాజిక ఫించన్ల ద్వారా మరో రూ.880 కోట్లు, ఆప్కో ద్వారా మరో రూ.393.30 కోట్లు చెల్లించాం. ఇలా మూడేళ్లలో నేతన్నల సంక్షేమానికి మన ప్రభుత్వం ఏకంగా రూ.2,049.43 కోట్లు ఖర్చు చేసింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి కార్యక్రమం చేయడం లేదు. మన రాష్ట్రంలో కూడా గతంలో ఏ ఒక్క ప్రభుత్వమైనా నేతన్నలకు ఇంత అండగా నిలబడిందా? ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి. సీఎం వైఎస్ జగన్‌కు నవరత్నాల లోగోతో కూడిన చేనేత వస్త్రాన్ని చూపుతున్న నేతన్న నేతన్నల కుటుంబాలకు దన్ను అప్‌గ్రేడ్ మిషన్స్... ప్రభుత్వం అందిస్తున్న ఆర్ధిక సాయంతో మగ్గాలను జాకార్డ్ లిప్టింగ్ మిషన్స్ లాంటి ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం నేతన్నలకు వచ్చింది. తద్వారా కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నారు. సులువుగా మగ్గాన్ని నడుపుతున్నారు. 2018–19లో నెలకి రూ.4,680 మాత్రమే ఉన్న నేతన్నల ఆదాయం వైఎస్సార్ నేతన్న నేస్తం దన్నుతో మగ్గాలు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో ఏకంగా మూడు రెట్లు పెరిగి రూ.15 వేలకు చేరింది. ఆన్‌లైన్‌తో ప్రపంచానికి పరిచయం.. ఆప్కో వస్త్రాలను మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆన్లైన్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌కు పరిచయం చేశాం. ఈ కామర్స్ సంస్ధలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకాప్, లూమ్‌ఫోక్స్, మిరావ్, పేటీఎం లాంటి వ్యాపార దిగ్గజాలతో ఒప్పందాలు చేసుకుని ఆప్కో ద్వారా వస్త్రాలను మార్కెటింగ్ చేసే స్థాయిని పెంచాం. మూడేళ్లలో చేసిన మంచి ఇదీ.. శాశ్వత బీసీ కమిషన్... శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్, బీసీ కులాలకు ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తొలి ప్రభుత్వం మనదే. మూడేళ్లలో వివిధ పథకాల ద్వారా రూ.1.65 లక్షల కోట్ల మేర నేరుగా అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూర్చగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన అక్కచెల్లెమ్మలకే 75 శాతం పైగా డబ్బులు ఇవ్వగలిగాం. అధికారంలో.. మొదటి విడత మంత్రివర్గంలో 56 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిస్తే రెండో విడతలో వారికి 70 శాతం ఇవ్వగలిగాం. రెండు మంత్రివర్గాల్లోనూ ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులిస్తే అందులో నాలుగు (80 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చాం. శాససనభ స్పీకర్‌గా బీసీ, శాసనమండలి ఛైర్మన్‌గా ఎస్సీ ఉన్నారు. మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ అక్క ఉన్నారు. మూడేళ్లలో రాజ్యసభకు 8 మందిని పంపిస్తే అందులో నలుగురు బీసీలే. ఎమ్మెల్సీలుగా 32 మందికి అవకాశం కల్పిస్తే వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారు. కార్పొరేషన్లలో... 98 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీ ఛైర్మన్ల పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఏకంగా 70 పదవులు దక్కాయి. 648 మండల ప్రజా పరిషత్ పదవుల్లో వైఎస్సార్ సీపీ 637 గెలుచుకుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 66.7 శాతం పదవులు ఇచ్చాం. జడ్పీ ఛైర్మన్లు 13కిగానూ 13 వైఎస్సార్సీపీనే గెల్చుకుంది. వీటిలో 9 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉన్నారంటే గతానికి, ఇప్పటికి తేడాను మీరే గమనించండి. సామాజిక న్యాయం... చంద్రబాబు పాలనలో ఎలాంటి సామాజిక న్యాయం ఉందో చెప్పేందుకు ఒక్క ఉదాహరణ చాలు. నాడు విజయవాడ మేయర్‌గా కోనేరు శ్రీధర్, కృష్ణా జడ్పీ ఛైర్మన్‌గా గద్దె అనురాధ, కనకదుర్గమ్మ ఆలయం ఛైర్మన్‌గా యలమంచి గౌరంగబాబు ఉన్నారు. వీరంతా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ఇవాళ మన పాలనలో విజయవాడ మేయర్‌గా నా చెల్లి, బీసీ మహిళ భాగ్యలక్ష్మి ఉన్నారు. కృష్టా జడ్పీ ఛైర్మన్‌గా మరో బీసీ చెల్లెమ్మ హారిక ఉన్నారు. దుర్గ గుడి ఛైర్మన్‌గా బీసీ అన్న సోమినాయుడు ఉన్నారు. ఎటు చూసినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులే కనిపిస్తున్నారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించాం. 50 శాతం కేటాయిస్తూ చట్టం నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయిస్తూ ఏకంగా చట్టం చేశాం. అందులోనూ 50 శాతం పదవులు నా అక్కచెల్లెమ్మలకే రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 137 ఛైర్మన్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 58 శాతం ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు 3, ఎస్టీలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో అక్కచెల్లెమ్మలు 50 శాతానికి పైగా కనిపిస్తారు. నేతన్న నేస్తం సభకు హాజరైన జనసందోహం అక్కచెల్లెమ్మలకు అండగా.. అక్కచెల్లెమ్మల పేరుతో ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. దాదాపు 22 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో శరవేగంగా సాగుతోంది. ఒక్కో ఇంటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఉంటుందనుకుంటే అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల ఆస్తి పెడుతున్నాం. అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత పథకాలతో తోడుగా నిలిచాం. వంద శాతం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యాదీవెన అమలు చేస్తున్నాం. వసతి దీవెన, ఇంగ్లీషు మీడియం స్కూళ్ల తో పాటు ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలను మారుస్తున్నాం. 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ చెల్లెమ్మలు, తమ్ముళ్లు 86 శాతం ఉన్నారు. నేతన్న నేస్తం లబ్ధిదారులకు చెక్కు అందజేస్తున్న సీఎం జగన్ సంతోషించే హృదయాలు కావవి.. ► ఇవాళ ఇన్ని మంచి పనులు జరుగుతుంటే జీర్ణించుకోలేని కుట్రదారులు చాలా మంది ఉన్నారు. మంచి జరుగుతున్నప్పుడు సంతోషపడే హృదయాలు కావవి. మంచి జరుగుతుంటే రాళ్లు వేసే కుళ్లు, కుతంత్రాలను మన కళ్లెదుటే చూస్తున్నాం. ► నాకు వాళ్ల మాదిరిగా ఈనాడు సపోర్టు ఉండకపోవచ్చు, ఆంధ్రజ్యోతి తోడుగా ఉండకపోవచ్చు, టీవీ 5 అండ ఉండకపోవచ్చు, దత్తపుత్రుడి సహాయం ఉండకపోవచ్చు. కానీ వాళ్లకు లేనిది, నాకు ఉన్నది ఒక్కటే.. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు నాకు తోడున్నాయి. ► కోట్ల మందికి మంచి చేయడానికి దేవుడు ఈ ముఖ్యమంత్రి పదవిని ఇచ్చాడనుకుంటే.. అప్పుడు జనంపై నమ్మకం పెట్టుకుని పరిపాలన చేస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికి వాడుతున్నా. అందుకే నేను చేసిన మంచి మీద నమ్మకం ఉంది. నా నమ్మకం మీమీద ఉంది. ► గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నవారు ముఖ్యమంత్రి పదవిని తన వాళ్ల కోసం, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడి కోసం వినియోగించారు. రాష్ట్రాన్ని దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీంతో పాలన సాగించారు. ► ఆ రోజు అప్పులు గమనిస్తే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేటు (అప్పు శాతం పెరుగుదల) 19 శాతం ఉంటే ఈ రోజు 15 శాతం మాత్రమే ఉంది. అంటే ఆరోజు కన్నా ఇవాళ అప్పులు తక్కువగానే చేస్తున్నాం. అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ బిడ్డ ఎలా చేయగలుగతున్నాడో ఆలోచన చేయండి. అప్పటికి, ఇప్పటికి తేడా ఒక్కటే.. ముఖ్యమంత్రి మార్పు. నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.102 కోట్ల పనులకు పచ్చజెండా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి మంత్రి జోగి రమేష్ దాదాపు రూ.102 కోట్ల విలువైన పనుల ప్రతిపాదనలు అందచేశారు. ఇందులో రోడ్లు, డ్రైనేజీ, కాంపౌండ్ వాల్, నీటి సరఫరా, బ్రిడ్జిలు, బీటీ రోడ్ల పనులకు సంబంధించి మొత్తం మంజూరు చేస్తున్నా. ఇంకో శుభవార్త ఏమిటంటే.. కాసేపటి క్రితమే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న శుభవార్త వచ్చింది. జిల్లాలో నా తర్వాత కార్యక్రమం బందరు పోర్టుకు శంకుస్ధాపన చేయడమే. అందుకోసం మళ్లీ వస్తా. నేరుగా ప్రజల వద్దకే ఈ సందర్భంగా వినతిపత్రాలు అందించేందుకు వచ్చిన వారిని గమనించిన సీఎం జగన్ తన రాజకీయ కార్యదర్శి ముత్యాలరాజు, జిల్లా కలెక్టర్‌ను నేరుగా వారి వద్దకు పంపి విజ్ఞాపనలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. -
వైఎస్సార్ నేతన్న నేస్తం.. సీఎం జగన్ కృష్ణా జిల్లా పర్యటన (ఫొటోలు)
-
చేనేతలతో పాటు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం
-
మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్
సాక్షి, పెడన(కృష్ణా జిల్లా): మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. తాను ఈ సభలో మాట్లాడటానికి మైక్ పట్టుకున్న తర్వాత ఒక శుభవార్త కూడా వచ్చిందని, అది ఏమిటంటే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. దీనిలో భాగంగా మచిలీపట్నం పోర్టుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు సీఎం జగన్. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం అన్న సీఎం జగన్.. త్వరలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపకు వస్తానని సభా ముఖంగా తెలిపారు. చదవండి: సామాజిక న్యాయ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం: సీఎం వైఎస్ జగన్ దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది: సీఎం జగన్ -
నేతన్నల ఆదాయం మూడురెట్లు పెరిగింది: సీఎం జగన్
సాక్షి, కృష్ణా జిల్లా: ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందని, అలాంటిది మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాలకూ ప్రాధాన్యత ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యయానికి తమ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేనేత రంగానికి అండగా నిలవలేదని, నేతన్నల జీవితాలను తన పాదయాత్రలో గమనించా గనుకే అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చానని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటివరకు వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని ఆయన గుర్తు చేశారు. ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నామని ఆయన అన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్ తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నాం. ఇవాళ 80, 546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చేనేత మాత్రమే కాదు.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు పవర్లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేసిన ప్రభుత్వం మాది. కేబినెట్లో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. మూడేళ్లలో నలుగురు బీసీలను రాజ్యసభకు పంపాం. శాసన మండలి సీట్లను బడుగు, బలహీన వర్గాలకే ఇచ్చాం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశామని సీఎం జగన్ తెలిపారు. ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, దత్తపుత్రుడి కోసమే గత ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేశారని, గతంలో దోచుకో, తినుకో, పంచుకో పథకం నడిచిందని ఎద్దేవా చేశారు సీఎం జగన్. తప్పుడు విమర్శలు చేయడమే ఇప్పుడు వాళ్లు పనిగా పెట్టుకుంటున్నారని, జరుగుతున్న మంచిని ఓర్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం జగన్. అన్ని వర్గాలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించామన్న ఆయన.. ప్రజలు వాస్తవాన్ని గ్రహిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది: సీఎం జగన్
వైఎస్సార్ నేతన్న నేస్తం.. నాలుగో విడత నగదు జమ కార్యక్రమం అప్డేట్స్ ►ప్రసంగం అనంతరం కంప్యూటర్ బటన్ నొక్కి నేతన్నల ఖాతాల్లోకి నేరుగా 193.31 కోట్లు జమ చేశారు సీఎం జగన్. పెడన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగం ►దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఒక మగ్గం మార్చేసింది ►గతంలో ఏ ప్రభుత్వం చేనేతకు అండగా నిలవలేదు ►నేతన్నల జీవితాలను నా పాదయాత్రలో గమనించా ►వారికి నేనున్నాననే భరోసా అందించా ►అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమల్లోకి తెచ్చాం ►మగ్గం ఉన్న ప్రతి నేతన్న కుటుంబానికి ఏడాదికి రూ. 24 వేలు సాయం ►నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి రూ. 96వేల సాయం ► 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లు జమ ►లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం ► ఇప్పటివరకూ నేతన్న సంక్షేమం కోసం రూ. 2,049 కోట్లు ►మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది: సీఎం జగన్ ►పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం: సీఎం జగన్ ►త్వరలో మచిలీపట్నం పోర్టు శంకస్థాపన: సీఎం జగన్ ఏపీ గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ కామెంట్స్ ► కుల,మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ► మాట ఇస్తే కచ్చితంగా నిలబెట్టుకునే నేత సీఎం వైఎస్ జగన్ ► బలహీనపక్షాల తరఫున నిలబడే బలమైన నేత సీఎం జగన్ ► రాష్ట్ర ప్రజలంతా సీఎం జగన్ వైపే చూస్తున్నారు ► అన్ని వర్గాల ప్రజలకు సీఎం అండగా నిలుస్తున్నారు ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న సీఎం జగన్, ఇతరులు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్. ► చేనేత కళాకారుల ప్రదర్శన వీక్షించిన సీఎం జగన్.. స్వయంగా మగ్గాన్ని నేశారు. ► పెడన వేదిక వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను తిలకించిన సీఎం జగన్.. స్థానిక నేతలతో ఆప్యాయ పలకరింపు. అక్కడ ఏర్పాటు చేసిన హస్తకళాకారుల ప్రదర్శనలను వీక్షించారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమం కోసం పెడన వేదిక వద్దకు చేరుకున్న సీఎం జగన్‌కు.. పర్యాటక మంత్రి, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి అయిన ఆర్కే రోజా పుష్ఫగుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. గురువారం ఉదయం కృష్ణా జిల్లా పెడనకు చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. హెలీప్యాడ్ వద్ద సీఎంకు స్వాగతం పలికిన మంత్రి జోగిరమేష్, చీఫ్ విప్ లు సామినేని ఉదయభాను,ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని,కొడాలి నాని,పార్ధసారధి,కైలే అనీల్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, కలెక్టర్ రంజిత్ బాషా,ఎస్పీ జాషువా ► కృష్ణా జిల్లా పెడన పర్యటన కోసం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరారు ఏపీ సీఎం వైఎస్ జగన్. ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడుత పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే వేదిక నుంచి.. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం.. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. ► వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి.. ప్రసంగిస్తారు. షెడ్యూల్ ► సీఎం జగన్ ఇవాళ (గురువారం) కృష్ణా జిల్లాలో పర్యటిస్తారు. ► పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ► పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ► బహిరంగ సభలో ప్రసంగించి.. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ► కార్యక్రమం అనంతరం.. తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
కృష్ణా, విశాఖ జిల్లాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం కృష్ణా జిల్లాలో, శుక్రవారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం జగన్ ఈ నెల 25న (గురువారం) కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం నాలుగో విడత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అక్కడే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేస్తారు. ఆయన ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.40 గంటలకు పెడన చేరుకుంటారు. 10.50 నుంచి 12.30 గంటల వరకు పెడన బంటుమిల్లి రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ నేతన్న నేస్తం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. బటన్ నొక్కి వైఎస్సార్ నేతన్న నేస్తం నగదును లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. గ్రామదర్శిని కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. విశాఖపట్నం జిల్లా పర్యటన ఇలా.. 26న (శుక్రవారం) విశాఖపట్నంలో సాగర తీరాన్ని పరిరక్షించేందుకు అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో ఒప్పంద కార్యక్రమం, గ్రాడ్యుయేట్లకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దిగ్గజ మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన వారికి ధ్రువపత్రాలను అందించే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. సీఎం జగన్ శుక్రవారం ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరతారు. 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. 10.20 నుంచి 11.13 గంటల వరకు ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ ప్రభుత్వం, పార్లే ఫర్ ది ఓషన్స్ మధ్య అవగాహన ఒప్పందం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆ తర్వాత సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్‌కు చేరుకుంటారు. 11.23 నుంచి 12.10 గంటల వరకు మైక్రోసాఫ్ట్ సంస్థ శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు ధ్రువపత్రాలను అందిస్తారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తారు. 12.40 గంటలకు విశాఖ నుంచి బయల్దేరి 1.55 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అత్తపై కోడలు భారీ స్కెచ్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు బట్టబయలు
పెడన(కృష్ణా జిల్లా): కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తపై కక్ష పెట్టుకున్న కోడలు.. ఆమెను కిరాతకంగా హత్య చేసింది. ఆపై దానిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టు మార్టం రిపోర్టు అసలు విషయాన్ని బహిర్గతం చేయడంతో కోడలు జైలు పాలయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సీఐ ప్రసన్న వీరయ్యగౌడ్ పెడన పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరులకు వెల్లడించారు. చదవండి: ఒంటరి మహిళలే టార్గెట్.. వారితో చనువు పెంచుకుని.. హోటల్‌కు తీసుకెళ్లి.. మొదటి నుంచీ గొడవలే.. పెడన పరిధిలోని కృష్ణాపురానికి చెందిన పడమట వీరబాబుతో కొండాలమ్మకు వివాహం జరిగి దాదాపు 12 ఏళ్లు అయ్యింది. ఈ క్రమంలో అత్త, కోడళ్లు తరచూ గొడవ పడుతుండేవారు. దీంతో అత్త రజనీకుమారి(50)పై కక్ష పెట్టుకున్న కోడలు కొండాలమ్మ ఆమె అడ్డు తొలగించుకునేందుకు గత నెల 27వ తేదీన విచక్షణ రహితంగా కర్రతో తలపై బలంగా కొట్టింది. ఆపై పీక పిసికి చంపేందుకు ప్రయత్నించింది. అప్పటికీ చనిపోకపోవడంతో చీరను మెడకు బిగించింది. ఆమె నోరు, ముక్కు నుంచి రక్తం రావడంతో స్పృహ కోల్పోయింది. దీంతో అత్త చనిపోయిందని భావించి తన భర్తకు, బంధువులకు సమాచారం అందించింది. ప్రమాదం అంటూ కలరింగ్.. తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు అత్త కాలుజారి వరండాలో పడిపోయి తీవ్రంగా గాయపడినట్లు భర్త, బంధువులకు ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన కుమారుడు, కూతురు తీవ్ర గాయాలతో ఉన్న తల్లిని మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం చేర్చారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గత నెల 30వ తేదీన రజనీకుమారి మరణించింది. ఈ క్రమంలో మృతురాలి కుమారుడు వీరబాబు తన తల్లి ఇంట్లో ప్రమాదవశాత్తు పడటంతో తీవ్ర గాయాలైనట్లు పేర్కొనడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టించిన పోస్టు మార్టం రిపోర్టు.. విజయవాడ వైద్యులు ఇచ్చిన పోస్ట్‌మార్టం రిపోర్టులో కోడలు చేసిన అసలు విషయం వెలుగు చూసింది. మృతురాలి తలకు బలమైన దెబ్బ తగలడం.. ఆపై ఊపిరి ఆడక చనిపోయినట్లు నివేదిక స్పష్టం చేసింది. దీంతో అనుమానించిన పోలీసులకు గ్రామంలో అందిన సమాచారంతో కోడలు కొండాలమ్మను తమదైన శైలిలో విచారించారు. దీంతో కొండాలమ్మ తానే అత్తను హత్య చేసినట్లు అంగీకరించింది. అత్తను చంపడానికి ఉపయోగించిన చీరను కూడా స్వా«దీనం చేసుకున్నామని సీఐ చెప్పారు. దీంతో కేసును హత్య కేసుగా మార్చి.. నిందితురాలు కొండాలమ్మను కోర్టులో హాజరు పరిచామని పేర్కొన్నారు. -
ప్రేమ పెళ్లి ఆపై వరకట్న వేధింపులు.. ఐదు వారాల గర్భవతి..
సాక్షి, కృష్ణా జిల్లా(పెడన): వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఉరి వేసుకున్న సంఘటన పెడన పట్టణంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని 12వ వార్డు కాపులవీధిలో పిచ్చుక దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మి(19) నివాసం ఉంటున్నారు. దేవేంద్రకుమార్ తాపీ పనిచేస్తూ ఉంటాడు. భార్యభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. గురువారం ఉదయం కూడా గొడవ జరగడంతో కుసుమలక్ష్మి తన తల్లి భట్ట నాగేశ్వరమ్మకు ఫోన్ చేసి పరిస్థితి వివరించింది. తాను వస్తున్నానని.. గొడవ పడవద్దని చెప్పి.. కుసుమ ఇంటికి నాగేశ్వరమ్మ బయల్దేరింది. తల్లి ఇంటికి చేరేసరికి కుసుమలక్ష్మి తన ఇంట్లోని దూలానికి చీరతో ఉరి వేసుకుని ఉంది. తల్లి గమనించి చుట్టుపక్కవాళ్లను పిలిచి కుసుమలక్ష్మిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లింది. అయితే అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించిన ఆస్పత్రి సిబ్బంది అవుట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు పెడన పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుసుమలక్ష్మి భర్త పిచ్చుక దేవేంద్రకుమార్, అత్త శ్యామలమ్మ, బావ ప్రసాద్, ఆడపడుచు సుహాసినిలు అధికకట్నం కోసం తరచూ వేధించేవారని, ఈ వేధింపులు వల్ల తన కుమార్తె చనిపోయిందని తల్లి నాగేశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (బోసినవ్వులు కనుమరుగు: ఏమైందో ఏమో ఒకరితర్వాత ఒకరు..) ఐదు వారాల గర్భవతి.. పట్టణంలోని 9వ వార్డు రాజీవ్‌నగర్‌లో వేర్వేరుగా ఉండే దేవేంద్రకుమార్, కుసుమలక్ష్మిలు 2021 ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అందుకు ఇరుపక్షాల పెద్దలు కూడా అంగీకరించారు. మూడు నెలలు దేవేంద్రకుమార్ తల్లిదండ్రుల వద్దే ఉంటూ కాపురం చేశారు. ఆ తర్వాత గొడవలు కావడంతో పెద్దల సూచనలతో 12వ వార్డులోని అద్దె ఇంట్లో కాపురానికి దిగారు. అయినా గొడవలు సద్దుమణగలేదు. తన కుమార్తె ఐదువారాల గర్భవతి అని, బుధవారం ఆస్పత్రికి తీసుకువెళ్లి చూపించానని తల్లి నాగేశ్వరమ్మ కన్నీరుమున్నీరవుతోంది. -
ఐదేళ్ల క్రితం రెండో పెళ్లి: ఏమైందోఏమో రోడ్డుపై నిర్జీవంగా..
పెడన: మండలంలోని నందమూరు పంచాయతీ సత్యనారాయణపురంలో ఓ మహిళ హత్యకు గురైంది. భర్తే ఆమెను హత్య చేశాడని మృతురాలి కుమార్తెలు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం వేములదీవికి చెందిన పేరం లక్ష్మి(37) మొదటి భర్తకు విడాకులు ఇచ్చి సుమారు ఐదేళ్ల కిందట పెడన మండలం నందమూరు పంచాయతీ సత్యనారాయణపురం గ్రామానికి వచ్చి ఇక్కడ ఉంటోంది. నందమూరు గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పరసా సూరిబాబు తన భార్యకు విడాకులు ఇచ్చి లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. లక్ష్మికి మొదటి వివాహంలో పుట్టిన సంతానంలో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. సూరిబాబు వారితో కలిసి సత్యనారాయణపురంలోనే ఉంటున్నాడు. నాలుగేళ్ల కిందట లక్ష్మి పెద్దకుమార్తెకు వివాహం చేశారు. ఇటీవల తరుచుగా సూరిబాబు, లక్ష్మిల మధ్య గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట సూరిబాబు లక్ష్మితో గొడవపడి ఆమెను గాయపరచడంతో ప్రభుత్వాసుపత్రికి వెళ్లి చికిత్స పొందింది. అనంతరం భర్తపై కేసు పెట్టింది. ఈ కేసు విషయంలో శుక్రవారం ఉదయం కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం నందమూరు నుంచి కాకర్లమూడి వెళ్లే డొంక మార్గంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ ఎన్.కొండయ్య, ఎస్ఐ మురళి, తమ సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహం లక్ష్మిదిగా గుర్తించారు. ఉదయం పంచాయతీ జరిగిన అనంతరం సూరిబాబు, లక్ష్మి కలసి వెళ్లారని లక్ష్మి కుమార్తెలు లావణ్య, శ్రీదుర్గ చెబుతున్నారు. సూరిబాబే తమ తల్లిని హత్య చేశాడని వారు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుమార్తెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కొండయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: గుజరాత్ చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్: వీళ్ల అరాచకాలు ఒక్కొక్కటిగా.. -
హైటెక్ మోసం: యూ ట్యూబ్‌లో చూసి కలర్ జిరాక్స్‌తో దొంగనోట్ల ముద్రణ..
పెడన: ఈజీగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి.. వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పెడన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలి.. వాటిని ఎలా చెలామణి చేయాలి అనే అంశాలపై మూడు నెలలపాటు క్షుణ్ణంగా నేర్చుకుని.. పక్కాగా అమలు చేయాలనుకున్న వారికి పోలీసులు ఆదిలోనే చెక్ పెట్టారు. పెడన పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మచిలీ పట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా సోమవారం విలేకరులకు వెల్లడించారు. సూత్రధారితో పాటు కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. అసలు ఎలా తెలిసిందంటే.. పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం రామలక్ష్మీవీవర్స్‌కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు దగ్గర అప్పుగా రూ.2వేలు తీసుకున్నాడు. వీటితో శివ స్థానికంగా మెడికల్ దుకాణంలో మందులు కొనుగోలు చేసేందుకు నగదు ఇచ్చాడు. మెడికల్ షాపులో ఉన్న వ్యక్తి ఆ నోట్లలో తేడాను గమనించి.. ఇవి దొంగనోట్లు అని చెప్పడంతో శివ తిరిగి వాసా వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లాడు. వెంకటేశ్వరరావు అవి దొంగనోట్లు కాదని, తనకు వీరభద్రపురంలోని కాసా నాగరాజు, అతని కుమారుడు ఇచ్చారని చెప్పి వెళ్లిపోయాడు. అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లోనే ముద్రణ.. దీంతో పోలీసులు తొలుత వెంకటేశ్వరరావును విచారించి, ఆపై కాసా నాగరాజు ఇంటికి వెళ్లి శనివారం అర్ధరాత్రి సోదాలు చేశారు. ఈ సోదాల్లో కలర్ జిరాక్స్ మిషన్‌తో పాటు ల్యాప్‌టాప్, కటింగ్ మిషన్, రూ.4లక్షలు విలువ గల నకిలీ కరెన్సీ నోట్లు, రూ.32,700 అసలు నగదు దొరికింది. దీంతో నాగరాజును పూర్తిస్థాయిలో విచారించగా.. అసలు విషయాలు బయటకొచ్చాయి. నాగరాజు, ఇంటర్ చదివే తన కుమారుడు ఇద్దరూ కలిసి ఇంట్లోనే నకిలీ నోట్లు ముద్రిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. యూట్యూబ్‌లో నకిలీ నోట్లకు సంబంధించిన వీడియో చూసి, మూడు నెలలుగా ముద్రణపై ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. చెలామణి చేసేందుకు మరికొందరు.. నకిలీ నోట్లు ఎవరెవరికి.. ఎంతెంత ఇచ్చిన దానిపై పోలీసులు విచారణ చేయగా రూ.40వేలు లేదా రూ.35వేలు అసలు నగదు తీసుకుని రూ.లక్ష నకిలీ కరెన్సీ నోట్లు ఇస్తున్నట్లు వారు వివరించారు. ఇలా నకిలీ కరెన్సీ నోట్లు తీసుకుని చెలామణి చేసేందుకు సిద్ధమైన వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బొప్పి సాయికుమార్, తాళ్ల నాగేశ్వరరావు, కాసా శివరాజు, వీణం వెంకన్న, వాసా రాజశేఖర్, బట్ట పైడేశ్వరరావు, సిద్ధాని పెద్దిరాజులు ద్వారా చెలామణి చేసేందుకు ప్రయత్నించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఒక్క పెద్దిరాజులు మాత్రం పరారీలో ఉన్నాడు. నాగరాజు కుమారుడు మైనర్ కావడంతో మీడియా ముందు ప్రవేశపెట్టలేదు. కేసును త్వరితగతిన కొలిక్కి తీసుకువచ్చిన ఏఎస్ఐ టి. సురేష్‌కుమార్, పీసీలు జి. కోటేశ్వరరావు, కె. కృష్ణమూర్తిలతో పాటు ఎస్ఐ మురళీలను డీఎస్పీ షేక్ మసూంబాషా, సీఐ ఎన్ కొండయ్య ప్రత్యేకంగా అభినందించారు. చదవండి: సీఎం జగన్ ఎవరితో పోరాడాలి పవన్?: ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి -
ట్రీ ఆఫ్ లైఫ్ కలంకారీకి కేరాఫ్ కొండ్ర బ్రదర్స్
పెడన: కలంకారీ పరిశ్రమకు కేరాఫ్‌గా కృష్ణాజిల్లా పెడన చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఆ పరిశ్రమకు వెన్నెముకగా నిలిచిన కొండ్ర బ్రదర్స్ గంగాధర్, నరసయ్య తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా ధిల్‌గల్ నుంచి వలస వచ్చి పెడనలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుని కలంకారీకి ఊపిరి పోశారు. జాతీయస్థాయి అవార్డులెన్నో దక్కించుకున్న కొండ్ర బ్రదర్స్ ప్రస్థానం సాగిందిలా.. పెదనాన్న నుంచి వారసత్వంగా.. పెదనాన్న నుంచి కలంకారీ వృత్తిలో మెళకువలు నేర్చుకున్న కొండ్ర బ్రదర్స్ తొలుత హైదరాబాద్‌లో హ్యాండ్ బ్లాకుల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అయితే వీరికి పెడన నుంచి ఎక్కువగా గిరాకీ వస్తుండడంతో అక్కడే పరిశ్రమ పెట్టుకుంటే బాగుంటుందని భావించి.. 1986–87లో పెడనలో కళంకారీ పరిశ్రమకు శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి పలు రకాల డిజైన్లతో బ్లాకులు తయారు చేస్తూ దేశ, విదేశీయులను ఆకట్టుకుంటున్నారు. ‘కలంకారి పండు’ డిజైన్‌కు 2005లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయస్థాయి అవార్డులను పొందారు. అలాగే మామిడి పండు, ఆర్చి, స్తంభం వంటి బ్లాకులకు కూడా మెరిట్ అవార్డులు దక్కాయి. 1998 నుంచి 2001 వరకు రూపొందించిన డిజైన్ బ్లాకులకు గానూ 2005లో అవార్డులు అందుకున్నారు. వీరి కళను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ డెవలప్మెంటు హ్యాండీ క్రాఫ్ట్ కమిషనరేట్ శిక్షణ కేంద్రాన్ని 2002లో ఏర్పాటు చేసింది. ఐదారు సంవత్సరాల పాటు సుమారు వంద మంది వరకు కొండ్ర బ్రదర్స్ శిక్షణ ఇచ్చారు. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌కలాం చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న నరసయ్య డిజైన్ల తయారీ ఇలా.. రాజమండ్రి నుంచి టేకును తీసుకొచ్చి.. ఆ చెక్క ముక్కలపై అన్నదమ్ములైన గంగాధర్, నరసయ్యలు డిజైన్లు గీసి బ్లాకులను తయారు చేస్తారు. ఆ బ్లాకులను వారం రోజులపాటు వంట నూనెలో నానబెట్టి.. కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్ వ్యాపారస్తులకు విక్రయిస్తారు. ట్రీ ఆఫ్ లైఫ్‌కు మంచి స్పందన.. పట్టణానికి చెందిన కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్ వ్యాపారి పిచ్చుక శ్రీనివాసరావు ట్రీ ఆఫ్ లైఫ్ డిజైన్‌కు సంబంధించిన బ్లాకులు తయారు చేయాల్సిందిగా కోరడంతో 233 బ్లాకులతో డిజైన్ రూపొందించారు. బెంగళూరు తదితర ప్రాంతాలకు సైతం ఈ బ్లాక్‌లను సరఫరా చేసేవారు. నెదర్లాండ్స్, థాయ్‌లాండ్ తదితర దేశాలకు చెందిన విదేశీయులు సైతం ఈ బ్లాక్‌లను కొనుగోలు చేసి తీసుకెళ్లడం విశేషం. వీరు తయారు చేసిన బ్లాకులు ఒక కళ అయితే.. వాటితో ప్రింటింగ్ వేయడం మరో కళ. శిల్పగురుకు ఎంపికైన ఆర్చి తప్పని కరోనా దెబ్బ.. కలంకారీ హ్యాండ్ ప్రింటింగ్‌తో ఎప్పుడూ రద్దీగా ఉండే వీరి వద్ద రోజూ 25 మందికి పైగా పనిచేసేవారు. అయితే అన్ని రంగాలనూ దెబ్బ తీసిన విధంగానే.. కరోనా వీరి వ్యాపారాన్ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ప్రస్తుతం ఐదారుగురు మాత్రమే పని చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ‘శిల్పగురు’కు ఎంపిక.. అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి అవార్డు ‘శిల్పగురు’కు కొండ్ర గంగాధర్ ఎంపికయ్యారు. ఆయన రూపొందించిన మామిడి పండు, పండు, ఆర్చి డిజైన్ బ్లాకులను తయారు చేసినందుకు గానూ కేంద్ర ప్రభుత్వం జాతీయ హస్తకళల అభివృద్ధి సంస్థ ఎంపిక చేసింది. త్వరలోనే ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. చాలా సంతోషంగా ఉంది.. చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా జాతీయస్థాయి ‘శిల్పగురు’ వంటి అవార్డులకు ఎంపికవడం చాలా కష్టంగా ఉండేది. అవార్డుకు ఎంపికైన వారిని క్షేత్రస్థాయిలో పలువురు ఉన్నతాధికారులు స్వయంగా వచ్చి పరిశీలించి ఎంపిక చేయడంతో చాలా ఆనందం వేసింది. త్వరలోనే శిల్పగురు అవార్డు అందుకుంటా. –కొండ్ర గంగాధర్, శిల్పగురు అవార్డు గ్రహీత, పెడన చేతి వృత్తులకు కరువైన ఆదరణ ప్రస్తుతం చేతివృత్తులు బాగా తగ్గిపోయాయి. ఒకప్పుడు పెడనలో మంచి గీరాకీ ఉండేది. ప్రస్తుతం తగ్గడంతో విదేశాలకు, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. ట్రీ ఆఫ్ లైఫ్‌ను చూసేందుకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కూడా వచ్చారు. స్థానికంగా కార్మికులు లభించకపోవడంతో ఉత్తరప్రదేశ్ నుంచి 10 మందిని తీసుకొచ్చాం. –కొండ్ర నరసయ్య, జాతీయ అవార్డు గ్రహీత, పెడన -
పెడన మున్సిపల్ కమిషనర్‌పై దాడికి యత్నం
సాక్షి, పెడన(గూడూరు): మున్సిపల్ కమిషనర్‌పై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడిన ఘటన పెడన పురపాలక సంఘంలో సోమవారం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం వాకింగ్‌కు వెళ్తుండగా తనపై పారిశుద్ధ్య కార్మికులు దాడికి పాల్పడ్డారంటూ కమిషనర్ ఎం.అంజయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్లు పేర్కొన్నారు. దాడిలో డ్రైవర్‌కు గాయాలయ్యాయని తెలిపారు. అయితే తనపై కమిషనర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ పారిశుద్ధ్య కార్మికురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలంటూ కార్మికులతో కలసి పురపాలక సంఘం ఎదుట నిరసనకు దిగారు. ఘటనపై ప్రత్యేక అధికారి, బందరు ఆర్డీఓ ఎన్.ఎస్.కె.ఖాజావలి విచారణ నిర్వహించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు వచ్చాయని, విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్సై టి.మురళి తెలిపారు. (జగన్ బాత్రూమ్ను లోకేశ్ కడిగాడా?) -
డిసెంబర్ 25 చరిత్రలో గుర్తుండిపోతుంది
సాక్షి, కృష్ణా: భారత దేశ రాజకీయ చరిత్రలోనే డిసెంబర్ 25 గుర్తుండిపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇళ్ల పట్టాల పంపిణీతో రాష్ట్రంలో 1 కోటి 40 లక్షల మంది లబ్ధి పొందనున్నారని పేర్కొన్నారు. పెడన నియోజకవర్గంలో ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ బాలశౌరి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. పెడన నియోజకవర్గంలో 7600 మంది ప్రజల సొంతింటి కల నెరవేరనుందన్నారు. ఒక్క పెడన పట్టణంలోనే 2500 మంది ఇళ్ల పట్టాలు పొందారని చెప్పారు. పేదల బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్ జగన్ అని కీర్తించారు. (చదవండి: నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండగ: సీఎం జగన్) బాబుకు ఇంకా బుద్ధి రాలేదు కోర్టుల ద్వారా స్టేలతో పట్టాలను అడ్డుకోవాలని చూశారంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద జోగి రమేష్ ధ్వజమెత్తారు. బాబు శిఖండిలా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలని చూశారని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం తప్పా? అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల్లో 23 సీట్లకు పరిమితమైనా బాబుకు బుద్ధి రాలేదని విమర్శించారు. రాజధానిలో లక్షల కోట్లు పెడితేనే రాష్ట్ర అభివృద్ధి ఎలా అవుతుందని నిలదీశారు. బాబును తరిమికొడతాం అని హెచ్చరించారు. సొంతింటి కల సాకారమవుతోంది మచిలీపట్నం ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. పేదవాడికి సొంతిల్లు ఒక కల అని, దానిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజం చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ కన్నా ఎక్కువగా ఇళ్ల పట్టాలను మంజూరు చేశారని తెలిపారు. 31 లక్షల మంది పేదల కలను సీఎం జగన్ సాకారం చేశారన్నారు. 340 చదరపు అడుగుల ఇంటిని ఒక్క రూపాయికి ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది అని ఉద్ఘాటించారు. (చదవండి: రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత?) -
క్షణికావేశం ప్రాణాన్ని బలిగొంది
క్షణికావేశం ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.. చిన్నారులు సరదాగా టపాసులు కాలుస్తున్నారు.. సమీపంలో ఒకరు పావురాలు పెంచుతున్నాడు.. టపాసుల వలన పావురాలకు ఇబ్బంది అని వాదనకు దిగాడు.. పిల్లలతో వాగ్వాదంపై మేనత్త కల్పించుకుంది. ఇరువురు వాదులాడుకున్నారు.. పక్కన ఉంటున్న వ్యక్తి వివాదంలో కల్పించుకుని.. చెబితే వినరా అంటూ క్షణికావేశంతో కత్తితో భార్యాభర్తలపై దాడి చేశాడు. భర్త మృతి చెందగా భార్య గాయపడిన ఘటన పెడనలో బుధవారం చోటుచేసుకుంది. పెడన: పట్టణంలోని 9వ వార్డు కట్లపల్లిలో సంచలనం సృష్టించిన ఘటనకు సంబంధించిన వివరాలను బందరు రూరల్ సీఐ ఎన్.కొండయ్య అందించారు. స్థానిక కట్లపల్లిలో అబ్దుల్ ఇర్ఫాన్(45) దంపతులు ఉంటున్నారు. ఐస్, జ్యూస్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇర్ఫాన్ ఇంటి పరిసరాల్లో సరదగా మేనల్లుళ్లు టపాకాయలు కాలుస్తున్నారు. టపాకాయలు కాల్చడం వల్ల సమీపంలోని పెంచుతున్న పావురాలు బెదిరి ఎగిరిపోతాయని పక్కింటి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వీరి మధ్య వాదులాట జరిగింది. పక్కింట్లో ఉంటున్న పాలపర్తి ప్రభాకరరావు అనే వ్యక్తి సంబంధం లేకుండానే కల్పించుకుని ఇర్ఫాన్ మేనల్లుళ్లను తిట్టాడు. అదే సమయంలో వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన ఇర్ఫాన్ నీకు సంబంధం ఏమిటంటూ ప్రభాకరరావును నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇద్దరూ కర్రలతో కొట్టుకునే వరకు వచ్చింది. అనంతరం ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత.. ఇరువురికి వాగ్వాదం చోటుచేసుకోగా సర్దుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. తరువాత మద్యం తాగి కత్తితో వచ్చిన ప్రభాకరరావు, ఇర్ఫాన్‌ను రెచ్చగొట్టి ఇంటి నుంచి బయటకు రప్పించాడు. తొలుత ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఇర్ఫాన్ భార్య అబ్దుల్ ఖాజాని(38) చేతిపై దాడి చేశాడు. తీవ్ర గాయమైన ఖాజాని అపస్మారక స్థితిలో పడిపోయింది. వెనుక వచ్చిన ఇర్ఫాన్ డొక్క భాగంలో మూడు కత్తిపోట్లు పొడిచాడు. ఇర్ఫాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బందరు డీఎస్పీ మహబూబ్ బాషా, ట్రైనీ డీఎస్పీ మల్లంపాటి శ్రావణి, బందరు రూరల్ సీఐ ఎన్.కొండయ్య, పెడన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడిన ఖాజానీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు కాగా ఒకరికి వివాహం అయింది. -
బాబుకు అధికారమిస్తే.. చెవిలో క్యాబేజీ పెడతాడట : వైఎస్ షర్మిల
సాక్షి, పెడన: ‘అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చామని చెబుతోంది. కానీ, అయిదేళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు అక్కడ ఒక్కటంటే ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదు. ఒక్క ఫ్లైఓవర్ కూడా వేయలేదు. రాజకీయంగా అనుభవం ఉంది.. అమరావతిని గొప్ప రాజధాని చెస్తా అని గొప్పలు చెప్పిన బాబు అనుభవం దేనికి పనికొచ్చింది. దోచుకోవడానికి పనికొచ్చిందా..? అమ్మకు అన్నం పెట్టనోళ్లు.. పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తారట. ఇంకొకసారి అధికారం ఇస్తేనట.. అమరావతిని అమెరికా చేస్తాడట.. శ్రీకాకుళాన్ని హైదరాబాద్ చేస్తాడట.. మన చెవిలో పూలు.. క్యాబేజీలు కూడా పెడతాడట’ అని చంద్రబాబు పాలనను వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల ఎండగట్టారు. బస్సుయాత్రలో భాగంగా బుధవారం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె ఇంకా ఏం మట్లాడారంటే... ‘దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రతి ఒక్కరికీ భరోసా ఉండేది. కార్పొరేటు ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందేది. ఫోన్ చేస్తే చాలు ఇరవై నిముషాల్లో 108 వచ్చేది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని వైఎస్సార్ తపనపడేవారు. అయిదేళ్ల పాలనలో ఒక్క రూపాయి చార్జీ పెంచకుండా.. పన్నులు పెంచకుండా.. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేసి సీఎం ఎలా ఉండాలో వైఎస్సార్ చూపించారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ ఫలాలు అందించారు. ఓటు వేసేముందు ఒక్కసారి వైఎస్సార్‌ను తలచుకోండి. రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్న సీఎం కావాలి. మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి.. వైఎస్సార్సీపీ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని, పెడన ఎమ్మెల్యే అభ్యర్థిగా జోగి రమేష్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తోడుగా నిలిచిన ఉప్పల రాంప్రసాద్ సేవల్ని మరిచిపోం. ఆయనను పైకి తెచ్చుకుంటాం. జగనన్న తప్పకుండా న్యాయం చేస్తాడు’ అని అన్నారు. ‘చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో రైతులను, డ్వాక్రా మహిళలను, విద్యార్థులను, ఇలా ప్రతి ఒక్కరిని మోసం చేశారు. రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్న చంద్రబాబు వారిని వంచించారు. డ్వాక్రా మహిళలను ఒక్క రూపాయి వడ్డీ కూడా మాఫీ చేయలేదు. పసుపు-కుంకుమ పేరుతో చంద్రబాబు మళ్లీ మహిళలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు-కుంకుమ పేరిట చంద్రబాబు ఎంగిలి చేయి విదిలిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్న చంద్రబాబు దానికి తూట్లు పొడిచారు. వైఎస్సార్ హయంలో ఉన్నట్టు ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుందా?. ఆరోగ్యశ్రీ జాబితా నుంచి కార్పొరేటు ఆస్పత్రులను తొలగించారు. ఏదైనా జబ్బొస్తే చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటారా..? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సామాన్య ప్రజానీకం గురించి ఇలాగేనా ఆలోచించేది’ అని దుయ్యబట్టారు. -
మీ ఊరు గుర్తుందా.. ఎమ్మెల్యే సారు..?
సాక్షి, పెడన: బంటుమిల్లి మండలంలోని నాగేశ్వరరావుపేట పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వగ్రామం. నాగేశ్వరరావు పేట పంచాయతీ పరిధిలో లక్ష్మీనారాయణపురం, జానకీరామపురం, గార్లగుంట శివారు గ్రామాలున్నాయి. కాగిత వెంకట్రావు 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి టీటీడీ బోర్డు చైర్మన్‌గాను, అంచనాల కమిటీ చైర్మన్, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్‌గాను, చీఫ్‌విప్‌గా చేసిన ఘనతా ఉంది. ఇన్ని పదవులు అలంకరించినా స్వగ్రామైన పంచాయతీలోని గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. రహదార్ల నిర్మాణం, తాగునీటి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జానకీరామపురం, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పేదలకు ఇచ్చిన కాలనీల్లో అనర్హులు పట్టాలు దక్కించుకున్న ఆరోపణలున్నాయి. వారు స్థలాలను ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారట. ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికీ కుళాయి పథకం ఎమ్మెల్యే కాగిత స్వగ్రామంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు ఉన్నా కనీసం సొంత పంచాయతీ పరిధిలో మౌలిక సౌకర్యాల కల్పించ లేకపోయారు. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో ఏర్పడిన సీసీ రోడ్లు తప్ప 20 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన రోడ్లు బహు అరుదు అని గ్రామస్తులు వ్యంగ్యంగా చెబుతుంటారు. నాగేశ్వరరావుపేట గ్రామాన్ని ఆనుకుని బంటుమిల్లి ప్రధాన కాలువ ఉన్న గ్రామంలో తాగునీటికి గ్రామస్తులు ఎక్కువగా ఊట బావులపైనే ఆధారపడుతున్నారు. గార్లగుంట దళితవాడ రోడ్డు నిర్మాణంలో నాణ్య ప్రమాణాలు మృగ్యమయ్యాయి. -
పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తాం
సాక్షి, పెడన: సొంత ఇల్లు లేని ప్రతిపేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామని, తన సొంత ఇంటి కలను నేరవేరుస్తామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం కట్టబెట్టాలని ఆ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం 8వ వార్డులో ‘గడపగడపకు వైఎస్సార్’ ద్వారా నవరత్నాలకు సంబం దించిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. తొలుత విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు పేదలను ఆదుకోవడానికి మీ ముందకు వచ్చారన్నారు. వైఎస్సార్ సీపీని ఆదరించి నవరత్నాలు గురించి చెబుతూ ఫ్యాన్ గుర్తు ద్వారా అధికారం కట్టబెట్టాలని కోరారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబునాయుడికి తగిన గుణపాఠం చెప్పాలని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితే డ్వాక్రా రుణమంతా ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీల్లోని అక్కాచెల్లెళ్లకు 45 సంవత్సరాలకే వైఎస్సార్ చేయూత ద్వారా రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలపాటు విడతల వారీగా రూ.75వేలు ఉచితంగా కార్పొరేషన్ ద్వారా ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు.. పేద పిల్లలు ప్రాథమిక స్థాయిలో ఏటా రూ.15వేలు ఉపకారవేతనం అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20వేలు ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు ఇంటిని కట్టించి ఇచ్చే బాధ్యత నాదంటూ ముస్లింలకు హామీ ఇస్తూ నవరత్నాల కరపత్రాలను అందజేస్తూ ముందుకు సాగారు. పింఛను వయస్సు 65 నుంచి 60 తగ్గించడమే కాకుండా రూ.3వేలు ఇస్తామన్నారు. నవరత్నాలు గురించి పూర్తిగా తెలుసుకుని మరిచిపోకుండా వైఎస్సార్సీపీని గుర్తుపెట్టుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తామని, రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామన్నారు. నవరత్నాలు వంటి మంచి పథకాలు అమలు అయ్యేం దుకు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మీపై ఉందని చెబుతూ ముందుకు కదిలారు. ఈయనతో పాటు పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మున్సి పల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపీప్రసాద్, పిచ్చిక సతీష్, గరికిముక్కు చంద్రబాబు, దొంతుమాధవి, పోతర్లంక నాని, ముస్లిం మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్, భళ్ల గంగయ్య, బట్ట దివాకర్, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి మహంకాళరావు, వార్డు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తా : జోగి రమేష్
సాక్షి, పెడన: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పునాది వేసింది, రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డేనని.. ఆయన ఆశయాలతో మీ ముందుకు వస్తున్న జగనన్నను గెలిపించుకుందామని నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఐదో వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం ద్వారా నవరత్నాలు కరపత్రాలను అందజేశారు. తొలుత మహబూబ్ సుభాని జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన పిమ్మట గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణంలోని ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇచ్చే పూచినాదన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చామని, మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే పేదవాడి కల సాకారం అయ్యేలా ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు ఆయా కాలనీలలో మౌలికవసతులు కల్పించడం జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన ఇందిరమ్మ కాలనీలలో నేటికి కూడా మౌలికవసతలు కల్పించకుండా టీడీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, అక్కాచెల్లిళ్లకు 45 సంవత్సరాలకు రెండో ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్లు ద్వారా వడ్డిలేకుండా ఉచితంగా రూ.75వేలను విడతలు వారీగా అందించడం జరుగుతుందన్నారు. పిల్లల చదువు కోసం ప్రతి ఏటా ఉపకారవేతనంగా రూ.15వేలు ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా చదువులకు ఆటంకం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. నవరత్నాల్లోని తొమ్మిది పధకాలను తూచతప్పకుండా అమలు చేసి చూపిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పట్టణానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించేలా చూస్తామన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కౌన్సిలర్లు మెహరున్నీసా, కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, పిచ్చిక సతీష్‌బాబు, మెట్లగోపీ ప్రసాద్, పట్టణప్రధాన కార్యదర్శి పోతర్లంక సుబ్రమణ్యం, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి మహాంకాళరావు, మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్, అబ్దుల్‌ఖాదర్ జిలానీ, అబ్దుల్‌హై, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు పాషి, అబ్దుల్రఫి, రియాజుల్ రహామాన్, కరీం, మజీద్, బాషా, ఆయా విభాగాల నాయకులు భళ్ల గంగయ్య, బట్ట దివాకర్ తదితరులు పాల్గొన్నారు. -
154వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, పెడన : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. పెడన నియోజకవర్గంలోని కొంకెపూడి శివారు నుంచి ఆదివారం ఉదయం రాజన్న బిడ్డ 154వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి గుడివాడ నియోజకవర్గంలోని రెడ్డిపాలెం, వడ్లమన్నాడు, వేమవరం, కవుతారం మీదుగా గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి వైఎస్ జగన్ అక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. అడుగడునా జననేతకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. వైఎస్ జగన్ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. -
జిల్లాస్థాయి ఇన్స్పైర్–2016 ప్రారంభం
పెడన టౌన్ (మచిలీపట్నం) : సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యార్థులు అత్యున్నత స్థానానికి ఎదగాలని పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అన్నారు. పెడనలోని సెయింట్ విన్సెంట్ పల్లోటి ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో గురువారం ఇన్స్పైర్ –2016 వైజ్ఞానిక ప్రదర్శనను ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. పట్టుదల, కృషి, ధృడసంకల్పంతో చదివితే ఉన్నత స్థానానికి ఎదిగేందుకు పేదరికం అడ్డురాదన్నారు. 2010లో ప్రారంభమైన ఇన్స్పైర్ కార్యక్రమం విద్యార్థుల్లో నిబిడికృతమైన ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు వేదికగా మారిందన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ విద్య అంటే కేవలం మార్కుల సాధనే కాదని, జ్ఞానం, నూతన పరిశోధనల పట్ల జిజ్ఞాస పెంచుకోవటమన్నారు. విద్యార్థులు స్వేచ్ఛగా ఆలోచించే విధంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మార్గదర్శనం చేయాలని సూచించారు. డీఈవో ఎ.సుబ్బారెడ్డి మాట్లాడుతూ రెండు రోజులపాటు జరగనున్న ఇన్స్పైర్–2016 వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లావ్యాప్తంగా 250 ప్రదర్శనలు ఉన్నాయన్నారు. వీటిలో ఉత్తమ ప్రదర్శనలను ఎంపిక చేసి రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు పంపనున్నట్లు చెప్పారు. తొలుత నిండుగా దీవెనలు ఇచ్చిన దేవునికి స్తోత్రం అంటూ సెయింట్ విన్సెంట్ పల్లోటి స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన స్వాగతగీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మునిసిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, వైస్‌చైర్మన్ అబ్ధుల్ ఖయ్యూం, మునిసిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, ఎస్ఈఆర్టీ ప్రొఫెసర్ వనజాక్షి, మచిలీపట్నం, గుడివాడ డీవైఈవోలు గిరికుమారి, జి వెంకటేశ్వరరావు, పల్లోటి స్కూల్ కరస్పాండెంట్ ఫాదర్ జోజప్ప తదితరులు పాల్గొన్నారు. -
పెడనలో ప్రజాస్వామ్యం గెలిచింది
– ఉప్పాల రాంప్రసాద్ పెడన టౌన్ (చిలకలపూడి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో పెడనలో ప్రజాస్వామ్యం గెలిచిందని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపారని అధికార పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారని, గత స్థానిక సంస్థల ఎన్నికల్లో పెడన మండలంలో పది ఎంపీటీసీ సెగ్మెంట్లకు గానూ ఆరు ఎంపీటీసీ సభ్యులు గెలుచుకున్న తమలో ఒక సభ్యుడిని విచక్షణారహితంగా తీసుకెళ్లినపుడు ఆ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు. టీడీపీ కౌన్సిలర్ విప్ జారీచేసినా కాపాడుకోలేని నాయకులు ఏకతాటిపై నిబద్ధతతో నిలబడిన తమపై విమర్శలు చేయడం అర్థరహితమన్నారు. తాను అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నానని అంటున్నారని, గీత కార్మిక కుటుంబంలో పుట్టిన తాను కులవృత్తి ద్వారా న్యాయపరంగా వ్యాపారం చేస్తున్నానని రాంప్రసాద్ చెప్పారు. గీత కార్మికులను అవమానపరిచేలా మాట్లాడటం తగదని హితవు పలికారు. తమ పార్టీకి మద్దతు తెలిపిన లంకే స్రవంతికి లక్షల్లో సొమ్ము అందజేశామని వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీ నాయకులు ఈ సంఘటనపై విచారణ జరిపి ఎలాంటి చర్య తీసుకున్నా అంగీకరిస్తానన్నారు. మునిసిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ కౌన్సిలర్ లంకే స్రవంతి అధికార పార్టీకి మద్దతుగా చేయి ఎత్తనప్పుడు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే, పార్టీ నాయకులు వ్యవహరించిన తీరును ప్రజలు అసహ్యించుకున్నారన్నారు. ఎన్నికల ప్రక్రియపై వీడియో చిత్రీకరణను చూసిన అనంతరం అధికార పార్టీలో ఉన్న మీరు విచారణ చేయించుకోవచ్చని, దానికి తామంతా సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. ఎంపీపీ రాజులపాటి అచ్యుతరావు మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన మీరు ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, కౌన్సిలర్లు మెట్ల గోపీప్రసాద్, కటకం ప్రసాద్, పెడన మండల కన్వీనరు దావు భైరవలింగం పాల్గొన్నారు. -
ఉప్పాలకు జగన్ అభినందనలు
పెడన టౌన్ (చిలకలపూడి) : వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఫోన్లో మాట్లాడారు. పెడన మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవటంపై రాంప్రసాద్‌కు జగన్హెహన్రెడ్డి అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను టీడీపీ ప్రలోభపెట్టి ఫిరాయింపులకు తెరతీస్తున్న సమయంలో అధికార పార్టీ కౌన్సిలర్ తమ పార్టీ వైపు వచ్చి మద్దతు తెలియజేయడంపై రాంప్రసాద్‌ను అభినందించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్మోహన్రెడ్డి సూచించారు. -
98 ఏళ్ల వయసులోనూ దీక్ష
పెడన: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరహారదీక్షకు మద్దతుగా కృష్ణాజిల్లా పెడనలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం బస్టాండ్ సెంటర్లో జరిగిన దీక్షల్లో 98 ఏళ్ల అబ్దుల్ గఫార్ అనే వృద్ధుడు పాల్గొన్నారు. ఆయనతోపాటు ముస్లిం మైనార్టీ నాయకులు, పలువురు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు. -
భూసేకరణ భయంతో రైతు ఆత్మహత్య
పెడన రూరల్ (కృష్ణా జిల్లా) : పోర్టు భూసేకరణలో తనకున్న కొద్దిపాటి పొలం పోతుందనే భయంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పెడన పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పెడన ఎస్ఐ ఎ.గణేష్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా పెడన మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన లింగం వెంకటేశ్వరరావు(70)కు పది సెంట్ల భూమి ఉంది. దీంతోపాటు మరో ఎకరం కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. తన సొంత పొలంలో ఉద్యానవన పంటలైన ఆకు కూరలు, కూరగాయలు పండిస్తున్నాడు. వెంకటేశ్వరరావు భార్య గతేడాది మృతి చెందింది. ఆయనకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో ఒక కుమారుడు మృతిచెందాడు. ఇటీవల తనకున్న పది సెంట్ల భూమిని వెంకటేశ్వరరావు అమ్మకానికి పెట్టాడు. స్థానిక రైతు ఒకరు లక్ష రూపాయలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకొని రూ.10 వేలు అడ్వాన్సు ఇచ్చాడు. ఆ సొమ్ముతో ఈ నెల 30న తన భార్య సంవత్సరీకం చేయాలని వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. ఇంతలో బందరు పోర్టు భూసేకరణలో బందరు మండలంలోని పలు గ్రామాలతో పాటు పెడన మండలం కాకర్లమూడిలోని 1879 మంది రైతులకు చెందిన 864 ఎకరాల భూమిని పోర్టు కోసం సేకరించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో వెంకటేశ్వరరావు భూమి కూడా ఉండటంతో దానిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్న రైతు అడ్వాన్సు సొమ్ము వెనక్కి తీసుకున్నాడు. పొలం ఉన్నప్పటికీ యాభయ్యేళ్లు కలిసి జీవించిన భార్యకు సంవత్సరీకం కూడా చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఇటీవల పలువురు వద్ద అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం తన ఇంటి ఎదురుగా ఉన్న వేప చెట్టుకు తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలొదిలాడు. మృతుడి కుమారుడు స్వాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్ఐ ఎ.గణేష్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రామచంద్రపురం ఎస్సై కారు చోరీ
పెడన రూరల్(కృష్ణా) : తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై కారు పెడనలో అపహరణకు గురైంది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఎస్సై దుర్గా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన విశ్రాంత ఎస్సై అబ్దుల్లా బుధవారం మచిలీపట్నంలో మరణించారు. పెడనలోని జామియా మసీదు ప్రాంగణంలో ఉన్న కబరస్తాన్‌లో అదేరోజు రాత్రి ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లాతో పాటు ఇతర జిల్లాలకు చెందిన పోలీస్ అధికారులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. వీరిలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం ఎస్సై రెహమాన్ కూడా ఉన్నారు. రామచంద్రాపురం నుంచి ఆయన ఒక్కరే కారులో ఇక్కడకు వచ్చారు. వాహనాన్ని మసీదు ముందు భాగంలో నిలిపి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. గంట తరువాత రెహమాన్ బయటకు వచ్చి చూడగా కారు కనిపించలేదు. పరిసరాల్లో వెదికినా ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. -
పెడన పేలుడులో బాలుడు మృతి
-
టిడిపిలో రుమాలు వేసి కాంగ్రెస్ పై తిట్లపురాణం
-
విద్యుదాఘాతానికిగురై విద్యార్థి మృతి
పెడన రూరల్, న్యూస్‌లైన్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై పాలిటెక్నిక్ విద్యార్థి పండ్రాజు సాంబశివరావు (20) దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని ఉరివి గ్రామంలో మంగళవారం రాత్రి జరిగింది. సంక్రాంతి పండుగ రోజునే ఇంట్లో విషాద సంఘటన జరగడంతో విద్యార్థి తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. సేకరించిన వివరాల ప్రకారం... ఉరివి గ్రామానికి చెందిన పండ్రాజు సూరిబాబు అనే రైతుకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడైన సాంబశివరావు గుడ్లవల్లేరులోని ఏఏఎన్ అండ్ వీవీఆర్‌ఎస్‌ఆర్ కళాశాలలో పాలిటెక్నిక్ చదువుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు ఇవ్వడంతో ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఇంట్లోని విద్యుత్ మెయిన్‌ను ఆఫ్ చేసి, గొడ్లచావిడిలో సీలింగ్ ఫ్యాన్‌ను బిగించబోయాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇన్వర్టర్ను ఆఫ్ చేయలేదు. దీంతో ఫ్యాన్ బిగిస్తున్న సమయంలో ఇన్వర్టర్ నుంచి ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో సాంబశివరావు తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలను వదిలాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహటిని సాంబశివరావును ముదినేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు సాంబశివరావు మృతిచెందినట్లు ప్రకటింటంతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. పండుగపూట ఇంట్లో విషాద ఘటన జరగడంతో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. కుమారుడి మృతదేహం వద్ద అతని తల్లి జ్యోతి రోదిస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. గ్రామ సర్పంచి దొండపాటి గంగాలక్ష్మి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కోన భూషయ్య, ఎస్సీ నాయకుడు చిన్నం శివ తదితరులు మృతదేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బుధవారం ఉదయం ఉరివి గ్రామంలో సాంబశివరావు అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల్లో మృతుడి సహచర విద్యార్థులు పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. -
ప్రభుత్వ జాగా..వేసేయ్ పాగా..
పెడన, న్యూస్‌లైన్ : పెడన పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణదారులకు అడ్డేలేకుండా పోతోంది. ప్రభుత్వ స్థలాలు, భూములే లక్ష్యంగా ఆక్రమణలు చేస్తున్నారు. ఏకంగా విక్రయాలూ పూర్తిచేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ, మున్సిపల్, గ్రామ పంచాయతీ అధికారులు లంచాలు మరిగి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. మామూళ్ల మత్తులో మునిగిన పలువురు అధికారులు ఏకంగా విక్రయాలకు కూడా సహకరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా అధికారి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు వస్తుండటంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోతున్నారు. ఆక్రమణలు ఇలా... పెడన మండలం బల్లిపర్రులో 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో మూడు గదులతో దుకాణ సముదాయం నిర్మిస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు అడ్డుపడితే.. నీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగటం, ఉన్నతాధికారులు కూడా ఒత్తిడి చేయడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. దీనివెనుక వేలకువేలు చేతులు మారాయని కొంతమంది అధికారులే చెబుతున్నారు. పెడన పట్టణం కాపులవీధి శివారు హనుమాన్కాలనీలో 2.54 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలుచేసి 86 మందికి ఇళ్లు నిర్మించింది. కాలనీ నిర్మాణ సమయంలో రెవెన్యూ అధికారులు కమ్యూనిటీ స్థలం కోసం పది సెంట్ల మేరకు ఖాళీ స్థలం వదిలారు. దీనిపై కన్నేసిన ఆక్రమణదారులు అక్కడ అక్రమంగా నాలుగు గదుల ఇందిరమ్మ ఇల్లు కట్టేశారు. ఆపై మూడు లక్షలకు ఓ హోటల్ యజమానికి దానిని అమ్మేశారు. ఆయన మరింత అందంగా తీర్చిదిద్ది, మొదటి అంతస్తు నిర్మాణానికి యత్నాలు చేస్తుండటంతో అసలు విషయం బయటపడింది. పెడన నూతన బైపాస్ సమీపంలో ఆర్ఎస్ఆర్ 341లో 4.30 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కోటి రూపాయల విలువైన ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకుని వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుత ఆర్డీవో సాయిబాబు దీనిని గుర్తించి మున్సిపల్ అధికారులకు అధికారులకు స్వాధీనం చేస్తామని స్పష్టం చేశారు. ఓ నాయకుడికి భయపడి మున్సిపల్ అధికారులు రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ పబ్బం గడుపుతున్నారు. దీంతో ఆ భూమి ఆక్రమణదారుల చేతుల్లోనే ఉంది. పెడన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, శ్మశానవాటికకు మధ్యలో 30 సెంట్ల ప్రభుత్వ భూమి మరొకరి ఆధీనంలో కొనసాగుతోంది. పెడన మార్కెట్ యార్డు వెనుక ప్రాంతంలో అర కోటి ఖరీదు చేసే 37 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. దీనిని ఓ వ్యక్తి ఆక్రమించుకుని ప్లాట్లు వేసుకుని అమ్మకాలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనికోసం పూడిక పనులు కూడా పూర్తిచేశారు. కొనే వారుంటే అమ్మటానికి సిద్ధంగా ఉంది. మామూళ్ల మత్తులో అధికారులు... ఆక్రమణలు ఇష్టారాజ్యంగా సాగుతున్నా మామూళ్ల మత్తులో ఉన్న అధికారులు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక రెవెన్యూ అధికారులకు ఎప్పుడు నగదు అవసరమైతే అప్పుడు వచ్చి తమవద్ద వేలాది రూపాయలు దండుకుంటున్నారని పలువురు ఆక్రమణదారులే చెబుతున్నారు. ప్రభుత్వ స్థలాలు, భూములు ఓ పక్క ఆక్రమణల్లో ఉండగా వివిధ కార్యాలయాల అవసరాల నిమిత్తం భవనాల నిర్మాణానికి ప్రభుత్వ భూములే లేవంటూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు జిల్లా ఉన్నతాధికారులకు నివేదించటం కొసమెరుపు. దీనివల్ల టూరిజం టెక్స్టైల్స్ పార్కు, రెండు స్త్రీ శక్తి భవనాలు, విద్యుత్ సబ్‌స్టేషన్, స్టేడియం, నియోజకవర్గ స్థాయి వసతి గృహం ఏర్పాటుకు స్థలాలు లేక నిధులు వెనక్కితరలిపోయే ప్రమాదముందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణల విషయంపై తహశీల్దారును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అవేమీ తమ దృష్టికి రాలేదని, అలాంటివి ఉంటే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. -
అత్తారింటికి దారేది కేసులో ఐదుగురి అరెస్టు
* ఈ నెల 14న స్పీడ్ పోస్ట ద్వారా పెడనకు చేరిన డీవీడీ * సైజు తగ్గించి మెమొరీ కార్డుల్లోకి.. * స్నేహితుల మధ్య సరదాగా సాగిన వైనం.. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అత్తాంరిటికి దారేది సినిమా పైరసీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల్ని చూపించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకరరావు తెలిపిన మేరకు.. ఈ సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ వద్ద విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొత్త తలనివారిపాలెం గ్రామానికి చెందిన చీకటి అరుణ్‌కుమార్ ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు నిర్మాత కంప్యూటర్ నుంచి సినిమా మొదటి భాగాన్ని డీవీడీలోకి డౌన్లోడ్ చేశాడు. స్నేహం ఇంతపని చేయించింది ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఫిల్మనగర్లో ఉంటున్న అరుణ్‌కుమార్‌కు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ప్రసన్నకుమార్, అనూప్ స్నేహితులు. ఈ నేపథ్యంలో ప్రసన్నకుమార్ ఒత్తిడి చేయటంతో అరుణ్‌కుమార్ సినిమాలోని సగభాగాన్ని డీవీడీలోకి ఎక్కించి ఇచ్చాడు. ప్రసన్నకుమార్ హోం థియేటర్లో బొమ్మలే తప్ప మాటలు రాకపోవటంతో ఆ డీవీడీని అనూప్ ఇంటికి తీసుకువెళ్లి కంప్యూటర్లో సినిమా చూశారు. తరువాత ఆ డీవీడీ తీసుకెళ్లిన వారి స్నేహితుడు, ఈ కేసులో కీలక నిందితుడైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా రవి దాన్ని ఈనెల 14న పెడనలోని తన స్నేహితుడు సుధీర్‌కుమార్‌కు స్పీడ్ పోస్టలో పంపారు. పైరసీ జరిగిందిలా... డీవీడీ చూసిన సుధీర్‌కుమార్ పెడనకు చెందిన తన స్నేహితుడు పోరంకి సురేష్‌కి ఇచ్చాడు. సురేష్ 4 జీబీగా ఉన్న ఈ సినిమాను 160 ఎంబీలోకి మార్చాడు. తరువాత పెడనలోని దేవి మొబైల్స షాపులో సెల్ఫోన్లో వాడే మెమొరీ కార్డుల్లోకి, సీడీల్లోకి ఎక్కించి అమ్మకం ప్రారంభించారు. సుధీర్‌కుమార్ సోదరుడు కిశోర్ ఈ సినిమాను తన పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో పైరసీ వ్యవహారం బయటకు వచ్చింది. నిర్మాత హైరాబాదులో డీజీపీకి ఫిర్యాదు చేశారు. యూ ట్యూబ్‌లోనూ హల్చల్... సినిమాను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించిన కిశోర్ తన స్నేహితుడు, మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటరులోని స్మార్ట లింక్స కమ్యూనికేషన్స నడుపుతున్న గిరికి ఇచ్చాడు. గిరి సినిమాను యూ ట్యూబ్‌లో పెట్టాడు. సైబర్ పోలీసుల విచారణలో ఐపీ నంబరు ఆధారంగా స్మార్టలింక్స కమ్యూనికేషన్ నుంచి ఈ సినిమాలోని కొంతభాగం యూ ట్యూబ్‌లోకి వచ్చిందని కనుగొన్నారు. స్మార్ట లింక్స కమ్యూనికేషన్ నుంచి 380 మందికి అనుసంధానం ఉండగా ఎంతమందికి ఈ సినిమా వెళ్లిందనే విషయంపై సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పెద్దల హస్తంపైనా ఆరా... నిర్మాత కంప్యూటర్ నుంచి సినిమా బయటకు రావడానికి ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల సెల్‌ఫోన్ నంబర్లు, వారు ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. అరుణ్‌కుమార్ సెల్ నుంచి సినీరంగ ప్రముఖులకు కాల్స వెళ్లాయా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించామన్నారు. డీవీడీల స్వాధీనం... ఎడిటింగ్ అసిస్టెంట్ అరుణ్‌కుమార్ నుంచి డీవీడీ తీసుకున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా రవి, అతడి నుంచి అందుకున్న సుధీర్‌కుమార్, డీవీడీలు తయారు చేసిన పోరంకి సురేష్ తదితరులు తమ వద్ద ఉన్న సీడీలను, డీవీడీలను ఎస్పీకి అందజేశారు. పెడనలో ఎన్ని సీడీలు తయారుచేశారు, ఎన్ని మెమొరీ కార్డుల్లోకి ఎక్కించారు తదితర అంశాలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ చెప్పారు. తన స్నేహితుడి ఒత్తిడి మేరకే సినిమాను డీవీడీలోకి ఎక్కించి ఇచ్చానని అరుణ్‌కుమార్ వెల్లడించాడు. పెడనలో ఉన్న తన స్నేహితుడు సుధీర్‌కుమార్ కోరగానే స్పీడ్ పోస్టులో డీవీడీ పంపానని, వ్యాపారం చేద్దామనే ఆలోచన లేదని ఏపీఎస్పీ కట్టా రవి తెలిపాడు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బందరు రూరల్ సీఐ పల్లపురాజు, టౌన్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తిలకు రివార్డు ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో బందరు డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెనమలూరు : కృష్ణాజిల్లా పెనమలూరు అంబేద్కర్ కాలనీలో ‘అత్తారింటికి దారేదీ’ సినిమా పైరసీ సీడీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ సీడీలను కొందరు విజయవాడలో రూ.30కి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఒరిజినల్ సీడీలు విడుదలచేస్తే సరి: జయప్రకాశ్‌రెడ్డి సాక్షి, గుంటూరు : ‘పైరసీ నివారణకు ఒక్కటే మార్గం. కొత్త సినిమా విడుదలయ్యాక రెండో వారంలో ఒరిజినల్ సీడీలు రిలీజ్ చేస్తే సరి. ఆ పైన సినిమా పైరసీ జరగనే జరగదు..’ అని సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి చెప్పారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సినిమా విడుదలయ్యాక రెండో వారంలో ఒరిజినల్ సీడీలు విడుదల చేస్తే అటు నిర్మాతలు, ఇటు థియేటర్ల యజమానులకు నష్టం రాదు. కొత్త సినిమాను థియేటర్లోనే చూస్తారు. దీనివల్ల థియేటర్లకు కలెక్షన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గవు. వారంలో పెట్టుబడి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎవరికీ నష్టం ఉండదు..’ అని ఆయన పేర్కొన్నారు. -
అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు
-
అత్తారింటికి.. దారి కనుక్కున్న పోలీసులు
విజయవాడ: 'అత్తారింటికి దారేది’ సినిమా పైరసీ కేసుకు సంబంధించి కృష్ణా జిల్లా పోలీసులు అయిదుగురిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఎస్పి ప్రభాకర రావు వారిని విలేకరుల ముందు హాజరుపరిచారు. పది సంవత్సరాల నుంచి సినిమా ప్రొడక్షన్ విభాగంలో ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న చీకటి అరుణ్ కుమార్ సూత్రదారిగా తేలింది. డివిడిలు ఇతరులకు చేరడానికి ప్రధాన కారకులు ఎపిఎస్పి కానిస్టేబుళ్లుగా గుర్తించారు. ఈ సినిమా విడుదల కాకముందే సిడిలు విడుదలయిన విషయం తెలిసిందే. ఎస్పి చెప్పిన కథనం ప్రకారం అరుణ్ కుమార్ 'అత్తారింటికి దారేది’ చిత్రంకు ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఆ సినిమా ఫైల్ ఉంచిన కంప్యూటర్ పాస్వర్డ్ కూడా ఇతని దగ్గర ఉంటుంది. దాంతో అతను రెండు డివిడిలలో ఆ చిత్రాన్ని కాపీ చేశాడు. ఆ రెండు డివిడిలను చూడటానికి మిత్రులకు ఇచ్చాడు. సినిమా చూసిన తరువాత సివిడిని విరగగొట్టమని వారికి చెప్పాడు. మిత్రులు ఆ డివిడిలను విరగొట్టకుండా ఇతరులకు ఇచ్చారు. ఈ డివిడిలు ప్రసన్న కుమార్ అనే కానిస్టేబుల్ నుంచి అనూక్ అనే కానిస్టేబుల్ వద్దకు చేరాయి. అతని వద్ద నుంచి ఎపిఎస్పి పోలీస్ కానిస్టేబుల్ కట్టా రవి కుమార్ ఎలియాస్ రవి వద్దకు చేరాయి. అతను వాటిని ఈ నెల 14న కొరియర్లో ద్వారా పెడనుకు పంపాడు. అవి పెడనులోని ఊటుకూరు సుధీర్ కుమార్ తీసుకున్నారు. అతని దగ్గర నుంచి వీరంకి సురేష్ కుమార్ వద్దకు, ఆ తరువాత దేవి మోబైల్ సెల్ రిపేర్ షాపు యజమాని కొల్లిపర అనీల్ కుమార్ వద్దకు చేరాయి. అక్కడ నుంచి మార్కెట్లో వచ్చేశాయి. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు పెడన, మచిలీపట్నంలలో దాడులు చేసి సిడిలను స్వాధీనం చేసుకున్నారు. ఐటి, కాపీరైట్ చట్టం, చీటింగ్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. బందరు సిఐ పల్లంరాజు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పి తెలిపారు. కోట్ల రూపాయలు వెచ్చించి తీసిన ఈ సినిమా పైరసీ సీడీని 50 రూపాయలకే అమ్మకాలు సాగించిన తీరుపై సోమవారం పెడన, బందరులో దాడులు చేసి పలు ఇంటర్నెట్, సెల్‌పాయింట్లు నుంచి కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. మంగళవారం సుమారు 30 మందిని విచారించారు. వారిలో 12 మందిని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అయిదుగురిని అరెస్ట్ చేశారు. ఈ సినిమా పైరసీ సీడీలు పెడనలో దొరుకుతున్నాయని, ఒక టీవీ చానల్‌కు అజ్ఞాత వ్యక్తి చేసిన ఫోన్‌కాల్‌తో కలకలం రేగింది. చిత్ర నిర్మాత రెండు హైదరాబాద్‌లో డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ జె.ప్రభాకరరావు ఆదేశాలతో డీఎస్పీ కేవీ శ్రీనివాస్ నేతృత్వంలో పోలీస్ ప్రత్యేక బృందాలు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, కంప్యూటర్, ఇంటర్నెట్ సెంటర్లు, సీడీ షాపులపై దాడులు చేశారు. ఈ సంగతి తెలుసుకున్న పవన్ కల్యాణ్, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున మొబైల్ షాపులు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద గుమిగూడారు. ఓ చానల్ ప్రతినిధులు ఎస్పీ ప్రభాకరరావుకు సీడీని అందజేశారు. ఆయన ఆదేశంతో బందరు డీఎస్సీ డాక్టర్ కేవీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీఐ పల్లంరాజు పలువురు ఎస్సైలు మొబైల్ షాపులను తనిఖీ చేశారు. తొలుత దేవీ మొబైల్స్ షాపును పరిశీలించగా అక్కడేమి దొరకలేదు. దీంతో సీఐ పల్లంరాజు పెడన, మచిలీపట్నంలోని పలు మొబైల్, ఇంటర్నెట్ కంప్యూటర్ షాపులను తనిఖీ చేసి షాపుల్లో ఉన్న వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
పెడనలో రూ.50కే అత్తారింటికి దారేది సీడీ
పెడన : పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కొత్త సినిమా విడుదలకు ముందే మార్కెట్లో ప్రత్యక్షం అయ్యింది. కృష్ణా జిల్లా పెడనలో ఈ సినిమా పైరసీ సీడీ రూ.50కే లభ్యం అవుతోంది. పైరసీ సీడీలపై సమాచారం అందుకున్న పోలీసులు సీడీ షాపులు, సెల్‌ఫోన్ రిపేర్ షాపుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పైరసీపై చిత్ర నిర్మాతలు డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సుమారు 90 నిముషాలు నిడివి గల చిత్రం పైరసీ సీడీలో హల్చల్ చేస్తోంది. పైరసీ భూతం మరోసారి చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పైరసీ సీడీల్లో లభిస్తున్నట్లు సమాచారం.