ఉప్పాలకు జగన్ అభినందనలు
పెడన టౌన్ (చిలకలపూడి) :
వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్‌తో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఫోన్‌లో మాట్లాడారు. పెడన మున్సిపల్ చైర్మన్, ఎంపీపీ స్థానాలు వైఎస్సార్ సీపీ కైవసం చేసుకోవటంపై రాంప్రసాద్‌కు జగన్‌హెహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులను టీడీపీ ప్రలోభపెట్టి ఫిరాయింపులకు తెరతీస్తున్న సమయంలో అధికార పార్టీ కౌన్సిలర్ తమ పార్టీ వైపు వచ్చి మద్దతు తెలియజేయడంపై రాంప్రసాద్‌ను అభినందించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు.