
స్థానికులతో మాట్లాడుతున్న జోగి రమేష్
సాక్షి, పెడన: సొంత ఇల్లు లేని ప్రతిపేదవాడికి ఇంటిని నిర్మించి ఇస్తామని, తన సొంత ఇంటి కలను నేరవేరుస్తామని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారం కట్టబెట్టాలని ఆ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ అన్నారు. ఆదివారం సాయంత్రం 8వ వార్డులో ‘గడపగడపకు వైఎస్సార్’ ద్వారా నవరత్నాలకు సంబం దించిన సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేశారు. తొలుత విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేదల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేశారని, ఇప్పుడు ఆయన తనయుడు పేదలను ఆదుకోవడానికి మీ ముందకు వచ్చారన్నారు. వైఎస్సార్ సీపీని ఆదరించి నవరత్నాలు గురించి చెబుతూ ఫ్యాన్ గుర్తు ద్వారా అధికారం కట్టబెట్టాలని కోరారు.
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అంటూ కల్లబొల్లి మాటలు చెప్పిన చంద్రబాబునాయుడికి తగిన గుణపాఠం చెప్పాలని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే డ్వాక్రా రుణమంతా ఒకేసారి మాఫీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీల్లోని అక్కాచెల్లెళ్లకు 45 సంవత్సరాలకే వైఎస్సార్ చేయూత ద్వారా రెండో సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలపాటు విడతల వారీగా రూ.75వేలు ఉచితంగా కార్పొరేషన్ ద్వారా ఇస్తామన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు..
పేద పిల్లలు ప్రాథమిక స్థాయిలో ఏటా రూ.15వేలు ఉపకారవేతనం అందిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వస్తుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటుతో పాటు వసతి, భోజనం కోసం అదనంగా ఏటా రూ.20వేలు ప్రతి విద్యార్థికి ఇస్తామన్నారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలంతో పాటు ఇంటిని కట్టించి ఇచ్చే బాధ్యత నాదంటూ ముస్లింలకు హామీ ఇస్తూ నవరత్నాల కరపత్రాలను అందజేస్తూ ముందుకు సాగారు. పింఛను వయస్సు 65 నుంచి 60 తగ్గించడమే కాకుండా రూ.3వేలు ఇస్తామన్నారు. నవరత్నాలు గురించి పూర్తిగా తెలుసుకుని మరిచిపోకుండా వైఎస్సార్‌సీపీని గుర్తుపెట్టుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని కోరారు.
ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యాన్ని అందిస్తామని, రూ.వెయ్యి దాటితే ఆరోగ్య శ్రీ వర్తింపజేస్తామన్నారు. నవరత్నాలు వంటి మంచి పథకాలు అమలు అయ్యేం దుకు పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యత మీపై ఉందని చెబుతూ ముందుకు కదిలారు.
ఈయనతో పాటు పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మున్సి పల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కౌన్సిలర్లు కటకం ప్రసాద్, మెట్ల గోపీప్రసాద్, పిచ్చిక సతీష్, గరికిముక్కు చంద్రబాబు, దొంతుమాధవి, పోతర్లంక నాని, ముస్లిం మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్, భళ్ల గంగయ్య, బట్ట దివాకర్, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి మహంకాళరావు, వార్డు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment