
98 ఏళ్ల వయసులోనూ దీక్ష
పెడన: ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో చేపట్టిన నిరవధిక నిరహారదీక్షకు మద్దతుగా కృష్ణాజిల్లా పెడనలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఆ పార్టీ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం బస్టాండ్ సెంటర్‌లో జరిగిన దీక్షల్లో 98 ఏళ్ల అబ్దుల్ గఫార్ అనే వృద్ధుడు పాల్గొన్నారు. ఆయనతోపాటు ముస్లిం మైనార్టీ నాయకులు, పలువురు ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.