
సాక్షి, పెడన(కృష్ణా జిల్లా): మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తాను ఈ సభలో మాట్లాడటానికి మైక్ పట్టుకున్న తర్వాత ఒక శుభవార్త కూడా వచ్చిందని, అది ఏమిటంటే మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమని సీఎం జగన్ తెలిపారు. గురువారం పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ ప్రసంగించారు. దీనిలో భాగంగా మచిలీపట్నం పోర్టుకు కోర్టు అనుమతి ఇచ్చిన విషయాన్ని వెల్లడించారు సీఎం జగన్. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామం అన్న సీఎం జగన్.. త్వరలో మచిలీపట్నం పోర్టు శంకుస్థాపకు వస్తానని సభా ముఖంగా తెలిపారు.
చదవండి: సామాజిక న్యాయ చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం: సీఎం వైఎస్ జగన్