అత్తారింటికి దారేది కేసులో ఐదుగురి అరెస్టు | Editing assistant nabbed for leak of Attarintiki Daredi DVD | Sakshi
Sakshi News home page

అత్తారింటికి దారేది కేసులో ఐదుగురి అరెస్టు

Published Thu, Sep 26 2013 4:35 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM

Editing assistant nabbed for leak of Attarintiki Daredi DVD

* ఈ నెల 14న స్పీడ్‌ పోస్‌‌ట ద్వారా పెడనకు చేరిన డీవీడీ
* సైజు తగ్గించి మెమొరీ కార్డుల్లోకి..
* స్నేహితుల మధ్య సరదాగా సాగిన వైనం..

మచిలీపట్నం, న్యూస్‌లైన్‌ : అత్తాంరిటికి దారేది సినిమా పైరసీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల్ని చూపించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకరరావు తెలిపిన మేరకు.. ఈ సినిమా నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ వద్ద విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొత్త తలనివారిపాలెం గ్రామానికి చెందిన చీకటి అరుణ్‌కుమార్‌ ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు నిర్మాత కంప్యూటర్‌ నుంచి సినిమా మొదటి భాగాన్ని డీవీడీలోకి డౌన్‌లోడ్‌ చేశాడు.

స్నేహం ఇంతపని చేయించింది
ఎడిటింగ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఫిల్‌‌మనగర్‌లో ఉంటున్న అరుణ్‌కుమార్‌కు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ప్రసన్నకుమార్‌, అనూప్‌ స్నేహితులు. ఈ నేపథ్యంలో ప్రసన్నకుమార్‌ ఒత్తిడి చేయటంతో అరుణ్‌కుమార్‌ సినిమాలోని సగభాగాన్ని డీవీడీలోకి ఎక్కించి ఇచ్చాడు. ప్రసన్నకుమార్‌ హోం థియేటర్‌లో బొమ్మలే తప్ప మాటలు రాకపోవటంతో ఆ డీవీడీని అనూప్‌ ఇంటికి తీసుకువెళ్లి కంప్యూటర్‌లో సినిమా చూశారు. తరువాత ఆ డీవీడీ తీసుకెళ్లిన వారి స్నేహితుడు, ఈ కేసులో కీలక నిందితుడైన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ కట్టా రవి దాన్ని ఈనెల 14న పెడనలోని తన స్నేహితుడు సుధీర్‌కుమార్‌కు స్పీడ్‌ పోస్‌‌టలో పంపారు.

పైరసీ జరిగిందిలా...
డీవీడీ చూసిన సుధీర్‌కుమార్‌ పెడనకు చెందిన తన స్నేహితుడు పోరంకి సురేష్‌కి ఇచ్చాడు. సురేష్‌ 4 జీబీగా ఉన్న ఈ సినిమాను 160 ఎంబీలోకి మార్చాడు. తరువాత పెడనలోని దేవి మొబైల్‌‌స షాపులో సెల్‌ఫోన్‌లో వాడే మెమొరీ కార్డుల్లోకి, సీడీల్లోకి ఎక్కించి అమ్మకం ప్రారంభించారు. సుధీర్‌కుమార్‌ సోదరుడు కిశోర్‌ ఈ సినిమాను తన పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో పైరసీ వ్యవహారం బయటకు వచ్చింది. నిర్మాత హైరాబాదులో డీజీపీకి ఫిర్యాదు చేశారు.

యూ ట్యూబ్‌లోనూ హల్‌చల్‌...
సినిమాను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించిన కిశోర్‌ తన స్నేహితుడు, మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటరులోని స్మార్‌‌ట లింక్‌‌స కమ్యూనికేషన్‌‌స నడుపుతున్న గిరికి ఇచ్చాడు. గిరి సినిమాను యూ ట్యూబ్‌లో పెట్టాడు. సైబర్‌ పోలీసుల విచారణలో ఐపీ నంబరు ఆధారంగా స్మార్‌‌టలింక్‌‌స కమ్యూనికేషన్‌ నుంచి ఈ సినిమాలోని కొంతభాగం యూ ట్యూబ్‌లోకి వచ్చిందని కనుగొన్నారు. స్మార్‌‌ట లింక్‌‌స కమ్యూనికేషన్‌ నుంచి 380 మందికి అనుసంధానం ఉండగా ఎంతమందికి ఈ సినిమా వెళ్లిందనే విషయంపై సైబర్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు.

పెద్దల హస్తంపైనా ఆరా...
నిర్మాత కంప్యూటర్‌ నుంచి సినిమా బయటకు రావడానికి ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల సెల్‌ఫోన్‌ నంబర్లు, వారు ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. అరుణ్‌కుమార్‌ సెల్‌ నుంచి సినీరంగ ప్రముఖులకు కాల్‌‌స వెళ్లాయా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించామన్నారు.

డీవీడీల స్వాధీనం...
ఎడిటింగ్‌ అసిస్టెంట్‌ అరుణ్‌కుమార్‌ నుంచి డీవీడీ తీసుకున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ కట్టా రవి, అతడి నుంచి అందుకున్న సుధీర్‌కుమార్‌, డీవీడీలు తయారు చేసిన పోరంకి సురేష్‌ తదితరులు తమ వద్ద ఉన్న సీడీలను, డీవీడీలను ఎస్పీకి అందజేశారు. పెడనలో ఎన్ని సీడీలు తయారుచేశారు, ఎన్ని మెమొరీ కార్డుల్లోకి ఎక్కించారు తదితర అంశాలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ చెప్పారు. తన స్నేహితుడి ఒత్తిడి మేరకే సినిమాను డీవీడీలోకి ఎక్కించి ఇచ్చానని అరుణ్‌కుమార్‌ వెల్లడించాడు.

పెడనలో ఉన్న తన స్నేహితుడు సుధీర్‌కుమార్‌ కోరగానే స్పీడ్‌ పోస్టులో డీవీడీ పంపానని, వ్యాపారం చేద్దామనే ఆలోచన లేదని ఏపీఎస్పీ కట్టా రవి తెలిపాడు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బందరు రూరల్‌ సీఐ పల్లపురాజు, టౌన్‌ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తిలకు రివార్డు ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో బందరు డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

పెనమలూరు : కృష్ణాజిల్లా పెనమలూరు అంబేద్కర్‌ కాలనీలో ‘అత్తారింటికి దారేదీ’ సినిమా పైరసీ సీడీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ సీడీలను కొందరు విజయవాడలో రూ.30కి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

ఒరిజినల్‌ సీడీలు విడుదలచేస్తే సరి: జయప్రకాశ్‌రెడ్డి
సాక్షి, గుంటూరు : ‘పైరసీ నివారణకు ఒక్కటే మార్గం. కొత్త సినిమా విడుదలయ్యాక రెండో వారంలో ఒరిజినల్‌ సీడీలు రిలీజ్‌ చేస్తే సరి. ఆ పైన సినిమా పైరసీ జరగనే జరగదు..’ అని సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి చెప్పారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సినిమా విడుదలయ్యాక రెండో వారంలో ఒరిజినల్‌ సీడీలు విడుదల చేస్తే అటు నిర్మాతలు, ఇటు థియేటర్ల యజమానులకు నష్టం రాదు. కొత్త సినిమాను థియేటర్‌లోనే చూస్తారు. దీనివల్ల థియేటర్లకు కలెక్షన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గవు. వారంలో పెట్టుబడి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎవరికీ నష్టం ఉండదు..’ అని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement