Attarintiki Daaredhi
-
చనిపోయిన తర్వాత నా ఫోటోలు పెట్టకండి.. కన్నీళ్లతో గ్లామర్ క్వీన్ రిక్వెస్ట్
ముంబైలో పుట్టిన ముంతాజ్ (నగ్మా ఖాన్) తమిళ సినిమాతో ప్రపంచానికి పరిచయం అయింది. ఆపై తెలుగులో దాదాపు 16 ఏళ్లుగా చాలా సినిమాలలో తన గ్లామర్ డ్యాన్స్‌లతో మెప్పించింది. ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌తో మాత్రమే ఆమెకు గుర్తింపు వచ్చింది. అందులోనూ చాలా గ్లామర్‌గా సాంగ్స్‌లలో కనిపించడంతో ఆమె పేరు బాగా వైరల్ అయింది. అయితే, తన కెరీర్ చాలా పీక్‌లో ఉన్నప్పుడే సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చేసింది. ముఖ్యంగా తెలుగులో ఖుషి,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌లలో ఆమె డ్యాన్స్‌ను ఎవరూ మరిచిపోరు.తనకు 21 ఏళ్ల వయసులోనే పాటలలో మితిమీరిన గ్లామర్‌గా కనిపించి అందరినీ షాక్ అయ్యేలా చేసింది ముంతాజ్(Mumtaz ). 1999లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో అతిథి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2015లో 'టామీ' అనే తెలుగు సినిమాలో కనిపించింది.సినిమాలకు ఎందుకు దూరం అయింది..?నటిగా కెరీర్ ఓ మాదిరిగా ఉండగానే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. హిజాబ్ ధరించింది. అయితే ఇలా పూర్తిగా నటనని పక్కనబెట్టేయడానికి గల కారణాన్ని కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించింది. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చింది. సినిమా నుంచి పూర్తిగా తప్పుకున్న ముంతాజ్ ఇప్పుడు దైవభక్తి, ఆధ్యాత్మికతలో పూర్తిగా మునిగిపోయింది. ఆమె ఇప్పటికి మూడు సార్లు మక్కా వెళ్లింది.నేను చనిపోయిన తర్వాత ఫోటోలు షేర్ చేయకండిఇంట్లో నా తోబుట్టువుల పిల్లలతో కలిసి నేను చేసిన డ్యాన్స్ పాటలను చూడలేకపోయాను. అంతలా ఆ గ్లామరస్ సాంగ్స్ నన్ను ఇబ్బంది పెట్టాయి. నేను చిన్న వయసులో ఉండగానే గ్లామర్ పాత్రలలో నటించాను. అప్పుడు నేను దేనికీ భయపడలేదు. కానీ, ఇప్పుడు మాత్రం చాలా బాధ పడుతున్నాను. నేను ప్రేక్షకులతో పాటు నెటిజన్లను వేడుకుంటున్నాను. నేను చనిపోయిన తర్వాత, నా అగ్లీ (అంటే బోల్డ్, గ్లామరస్) ఫోటోలను షేర్ చేయకండి. ఇది నా చివరి కోరికగా తీసుకోండి. మీరు నా అగ్లీ ఫోటోలను షేర్ చేస్తే, అది నా మరణంలో కూడా నాకు బాధ కలిగిస్తుంది.' అని ఆమె మాట్లాడింది.నాకు పెళ్లిపై ఆశలు లేవుతాను గ్లామరస్‌గా నటించినందుకు పెళ్లి చేసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని తెలిపింది. కాబట్టి అభిమానులు సాధ్యమైనంత వరకూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని వేడుకుంది. ఇకపై తనకు వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని, అది జరుగుతుందా..? అన్నది వేచి చూద్దాం అని నటి ముంతాజ్ తన కన్నీటి కథను చెప్పింది. ఆమె చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించింది. -
స్టార్ హీరోయిన్‌కి త్వరలో మరో బుజ్జాయి
ప్రముఖ హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ వేడుకలు చేసుకుంది. బెంగళూరులోని బస్టైన్ గార్డెన్ సిటీలో ఇందుకు సంబంధించిన సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ క్రమంలోనే కొన్ని ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇప్పటికే ఈమెకు పాప ఉండగా.. త్వరలో మరో బిడ్డ పుట్టనుంది.(ఇదీ చదవండి: కూతురికి రామ్‌చరణ్ బహుమతి.. ఆ గిఫ్ట్‌కు మగధీరతో లింక్!)కర్ణాటకకు చెందిన ప్రణీత సుభాష్.. 2010లో నటిగా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం తదితర సినిమాల్లో నటించింది. మలయాళ, హిందీ చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. 2021లో నితిన్ రాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాదికే అర్న అనే అమ్మాయి పుట్టింది. కొన్నాళ్ల క్రితం తాను మరోసారి ప్రెగ్నెంట్ అయినట్లు ప్రకటించింది.ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ ఫొటోల్ని పోస్ట్ చేస్తున్న ప్రణీత.. తాజాగా తనకు బేబీ షవర్ వేడుకలు చేసినట్లు పేర్కొంది. అలానే ఇవి ఎప్పటికీ గుర్తుండిపోతాయని చెప్పుకొచ్చింది. ఈ సెలబ్రేషన్స్ బట్టి చూస్తే మరికొన్నిరోజుల్లో ప్రణీత మరో బిడ్డకి జన్మనివ్వనుంది. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత కిరణ్ అబ్బవరం తొలి పోస్ట్.. అదేంటంటే!) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) -
ఆ ఫోటోలు షేర్ చేయకండి.. నాకు పెళ్లి అవుతుందనే నమ్మకం లేదు: హీరోయిన్
సినిమా తారల ఆడంబరాలే బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. చాలా మంది కష్టాలు, కన్నీ ళ్లు అంతర్గతంగా ఉండిపోతాయి. చాలా మంది రకరకాల వ్యాధులతో బాధ పడుతుంటారు. అయినప్ప టికీ బయటకు నవ్వుతూ కనిపిస్తారు. అది ఏడవ లేక నవ్వడమే అన్నది ఎంత మందికి తెలుస్తుంది. చాలా మంది కేన్సర్ బారిన పడి నరకయాతన పడుతున్న వారూ ఉన్నారు. టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇక నటి ముంతాజ్ (43) కన్నీటి కథ కూడా ఇలాంటిదే. ఆమె తెలుగు, తమిళ పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ఖుషి,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌లలో ఆమె మెప్పించింది. కోలీవుడ్‌లో 'మోనీసా ఎన్ మోనాలిసా' చిత్రం ద్వారా నటి ముంతాజ్‌ను దర్శకుడు టీ.రాజేందర్ పరిచయం చేశారు . ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ముంతాజ్‌కు మా త్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఈ భామ కొన్ని కారణాలు ఏమైనా ఐటమ్స్ సాంగ్స్‌లో నటించి, శృంగార తారగా ముద్రవేసుకున్నారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ పలు సినిమాల్లో నటించినా ఆ తరువాత సినీరంగం నుంచి కనుమరుగయ్యారు. ఆమె చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించారు. ఆ బాధను భరించలేక చనిపోవాలనుకుంటే.. లారెన్స్ సినిమా తరువాత తెలుగులో రెండు చిన్న చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో ముంతాజ్ పేర్కొంటూ సడన్‌గా తన వెన్నుముక భాగం కదలడానికి కూడా వీలుపడక నొప్పి వచ్చిందన్నారు. ఆ నొప్పిని తట్టుకోలేకపోయానన్నారు. పలువురు వైద్యులు పరీక్షించినా సమస్య ఏమిటో చెప్పలేకపోయారన్నారు. అలా రెండేళ్ల పాటు ఆ బాధను అనుభవించానని చెప్పారు. ఆ తరువాత ఒక ఆప్పత్రిలో పరిశోధన చేయగా తనకు ఆటో ఇమ్యూన్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యాధి కారణంగా తన శరీరంలో ఎక్కడెక్కడ ఎముకల జాయింట్స్ ఉన్నాయో ఆక్కడ భయంకరమైన నొప్పి కలుగుతుందన్నారు. దీంతో కూర్చోలేక, నిలబడలేక, శరీరాన్ని కదల్చలేక నరకయాతన పడ్డానని చెప్పారు. మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. ఎందుకు ఏడుస్తున్నానో తనకే తెలిసేది కాదన్నారు. అదే మానసిక వ్యాధి అని చెప్పారు. ఒకసారి రెండున్నర గంటల సేపు నాన్‌స్టాప్‌గా ఏడుస్తూనే ఉన్నానని, తన మానసిక వ్యాధిని అర్ధం చేసుకుని అందులోంచి బయటకు తీసుకొచ్చింది తన అన్నయ్యనేనని చెప్పా రు. ఆయన లేకుంటే తానీ పాటికి ఆత్మహత్య చేసుకునేదాన్నని అన్నారు. నాకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేదు తాను గ్లామరస్‌గా నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు ముంతాజ్ పేర్కొన్నారు. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని అన్నారు. కాబట్టి అభిమానులు సాధ్యమైనంత వరకూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని వేడుకున్నారు. ఇకపై తనకు వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని, అది జరుగుతుందా? అన్నది వేచి చూద్దాం అని నటి ముంతాజ్ తన కన్నీటి కథను పేర్కొన్నారు. -
అప్పట్లో తెలుగు హిట్ సినిమాల్లో.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా!
ఈమె ప్రముఖ నటి. తెలుగులో దాదాపు 16 ఏళ్లుగా బోలెడన్ని సినిమాలు చేసింది. దక్షిణాదిలో మిగతా భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. అయితే ఈమె పేరు చెబితే సరిగా గుర్తురాకపోవచ్చు. కానీ కొన్ని స్పెషల్ సాంగ్స్ పెడితే మాత్రం ఈమె ఎవరనేది టక్కున గుర్తుపట్టేస్తారు. అంతా బాగానే ఉందనుకునే టైంలో సడన్‌గా సినిమాలు బంద్ చేసి, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. ఇంతలా చెప్పాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు ముంతాజ్. ముంబయికి చెందిన ఈమె.. టీనేజ్లోనే ఉండగానే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసింది. 1999లోనే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. చాలా బాగుంది, అమ్మో ఒకటో తారీఖు, ఖుషి, జెమినీ, కూలీ, కొండవీటి సింహాసనం, అత్తారింటికి దారేది, ఆగడు తదితర చిత్రాల్లో అతిథి పాత్రలు, స్పెషల్ సాంగ్స్ చేసింది. చివరగా 2015లో 'టామీ' అనే తెలుగు సినిమాలో కనిపించింది. 'ఖుషీ', 'అత్తారింటికి దారేది' చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో మాస్ స్టెప్పులేసింది ఈమెనే. (ఇదీ చదవండి: నా భర్త మొదటి విడాకులు.. కారణం నేను కాదు: స్టార్ హీరో మాజీ భార్య) నటిగా కెరీర్ ఓ మాదిరిగా ఉండగానే పూర్తిగా ఇండస్ట్రీని వదిలేసింది. హిజాబ్ ధరించింది. అయితే ఇలా పూర్తిగా నటనని పక్కనబెట్టేయడానికి గల కారణాన్ని కూడా ఒకానొక సందర్భంలో వెల్లడించింది. 'నేను ముస్లిం కుటుంబంలో పుట్టాను. నాకు ఖురాన్ బాగా తెలుసు. మొదట్లో ఖురాన్లో పేర్కొన్న విషయాలకు అర్థం తెలియదు . ఒకానొక దశలో దాని అంతరార్థం నాకు అర్థమై నాలో మార్పు వచ్చింది. అందుకే ఇకపై సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే ఇప్పుడు హిజాబ్ ధరిస్తున్నాను' అని మాజీ నటి ముంతాజ్ చెప్పుకొచ్చింది. సినిమాలు చేయనప్పటిక.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలు పోస్ట్ చేస్తూ నెటిజన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. అయితే అప్పట్లో ఈమెని చూసి, ఇప్పుడు హిజాబ్‌లో చూసి చాలామంది గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ముంతాజ్ ఎవరో తెలుసుకుని అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) View this post on Instagram A post shared by Mumtaz (@mumtaz_mumo) View this post on Instagram A post shared by Mumtaz (@mumtaz_mumo) -
తమిళ ‘అత్తారింటికి దారేది’ రిలీజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్లో అత్తారింటికి దారేది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సగం సినిమా పైరసీ ద్వారా బయటకు వచ్చినా.. కలెక్షన్లలో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ (‘వంత రాజవథాన్ వరువెన్’) టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయగా.. ‘అత్తారింటికి దారేది’ని ఉన్నది ఉన్నట్టుగా దించేశారని కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీని ఫిబ్రవరి ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కేథరిన్ థెరిసాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించగా.. హిప్ హాప్ తమీజా సంగీతాన్నిఅందించారు. మరి ఈ చిత్రం.. అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి. -
‘అత్తారింటికి దారేది’ రీమేక్‌లో హీరో ఎవరంటే..?
తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. తాజాగా ఈ సినిమాను తమిళ రీమేక్ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. అత్తారింటికి దారేది తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సుందర్.సి డైరెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు తెలుగులో నదియ కనిపించిన అత్త పాత్రను కోలీవుడ్‌లో సుందర్ సతీమణి, ప్రముఖ నటి కుష్బూ పోషించనున్నారు. ఇప్పటికే కన్నడలో రీమేక్ అయిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి. -
ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే..
చూడ్డానికి కళ్లు సరిపోవేమో అనేంత అందంగా ఉన్న వేదికపై ఉల్లాసం, ఉత్తేజానిచ్చే ఆట-పాటలు కలగలిసి కళ్లు తిప్పుకోనివ్వని అందాలు,మిరమిట్లు గొలిపే మెరుపులు. ఇక చివరగా.. కళ్లింత చేసి, ఉత్కంఠగా చూస్తుండగా 'ద అవార్డ్ గోస్ టూ..' అనే సందర్భంలో ఏర్పడే నిశ్శబ్ధం.. వీటన్నింటికీ వేదికైంది 'ఫిల్మ్‌ఫేర్ అవార్డ్- 2013' వేడుక. చిత్రపరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత, ఆస్థాయి పేరు గాంచిన ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్‌ఫేర్. ప్రతీ యేటా హిందీ చిత్రాలకు, దక్షిణ భారత దేశంలోని వివిధ పరిశ్రమలకు వేర్వేరుగా ప్రకటించే ఈ అవార్డుల్లో.. 2013 సంవత్సరానికి హిందీ పరిశ్రమకు సంబంధించిన అవార్డు వేడుకను జనవరి నెలలో నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ భారత చలనచిత్రాలకు సంబంధించిన అవార్డు వేడుకను నిన్న (12-07-2013) న చెన్నైలో నిర్వహించారు. ఈ అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు గానూ, 2013లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన 'అత్తారింటికి దారేదీ' నాలుగు అవార్డులను సొంతం చేసుకోగా.. అదే సంవత్సరం విడుదలై మల్టీస్టారర్ చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' రెండు అవార్డులను ఎగరేసుకెళ్లింది. తెలుగు పరిశ్రమకు చెందిన అవార్డుల విశేషాలివీ.. ఉత్తమ చిత్రం : అత్తారింటికి దారేదీ ఉత్తమ నటుడు : మహేశ్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ దర్శకుడు : త్రివిక్రమ్ (అత్తారింటికి దారేదీ) ఉత్తమ నటి : నిత్యామీనన్ (గుండెజారి గల్లంతయిందే) ఉత్తమ సహాయ నటుడు : సునీల్ (తడాఖా) ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి(గుండెల్లో గోదారి) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీశ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేదీ) ఉత్తమ నేపథ్య గాయకుడు : కైలాష్ కేర్ (పండగలా దిగివచ్చావు.. మిర్చి) ఉత్తమ నేపథ్య గాయని : చిత్ర (సీతమ్మ వాకిట్లో.. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ గీత రచయిత : శ్రీమణి (ఆరడుగుల బుల్లెట్.. అత్తారింటికి దారేదీ) మరిన్ని చిత్రాల కోసం క్లిక్ చేయండి In English: Mahesh Babu wins Filmfare best actor south award -
‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్ కాదు!
‘అత్తారింటికి దారేది’ విడుదలై దాదాపు ఐదు నెలలవుతోంది.. ఇంకా పవన్‌కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కాలేదని, ‘గబ్బర్‌సింగ్ 2’కి ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియడంలేదని ఈ మధ్యకాలంలో ఫిల్మ్‌నగర్‌లో జోరుగానే చర్చించుకున్నారు. ఇక, ఆ చర్చకు ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. శుక్రవారం ఫిల్మ్‌నగర్ దేవాలయంలో ‘గబ్బర్‌సింగ్ 2’ పూజా కార్యక్రమాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామిపై చిత్రీకరించిన తొలి దృశ్యానికి సీనియర్ ప్రొడక్షన్ చీఫ్ ప్రకాశ్ కెమెరా స్విచాన్గా చేయగా, చిత్రనిర్మాత శరత్ మరార్ తండ్రి జీకే మరార్ క్లాప్ ఇచ్చారు. న్యాయవాది ప్రమోద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సంపత్ నంది దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రం విశేషాలను శరత్ మరార్ చెబుతూ -‘‘ఇది ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్ కాదు. ఓ కొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. కథ, రచన పవన్‌కల్యాణ్ పర్యవేక్షణలో జరుగుతోంది. మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, దసరాకి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. డి. సురేష్‌బాబు, కేఎల్ఎన్ రాజు, పి. కిరణ్ తదితరులు పాల్గొని, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రానికి రచనా పర్యవేక్షణ: సత్యానంద్, క్రియేటివ్ హెడ్: హరీష్ పాయ్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, కిశోర్ గోపు, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌సాయి. -
అత్తారింటికి వెళ్తే..
అల్లుడిని చితకబాదిన అత్త తాగిన మైకంలో చిందులు తీవ్రగాయాలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన అమాయక అల్లుడు కాటేదాన్,న్యూస్‌లైన్: మేనత్తను తన తాతయ్య వద్దకు తీసుకొచ్చేందుకు నానాతంటాలు పడి చివరకు ఒప్పించి మెప్పించి తీసుకెళ్తాడు హీరో.. ఇది ఇటీవల వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం ఉద్దేశం. కానీ కట్టుకున్న భార్యను పంపించండి అత్తా..అని మర్యాదగా అడిగినందుకు తీవ్రంగా దాడిచేసింది ఇక్కడి అత్త. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని బుద్వేల్‌లో జరిగింది. తాగిన మైకంలో అత్త చితకబాదడంతో తీవ్రంగా గాయపడిన అల్లుడు చివరకు ఎలాగోలా బయటపడి పోలీసులను ఆశ్రయిం చాడు. వివరాలి ఉన్నాయి.. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన నర్సింహకు మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన శంకరమ్మ కూతురితో మూడేళ్లక్రితం పెళ్లయ్యింది. పదిరోజుల క్రితం నర్సింహ భార్య పుట్టింటికొచ్చింది. కూలీ పనిచేసుకునే నర్సింహ తనభార్యను కాపురానికి పంపించాలంటూ శుక్రవారం నగరానికొచ్చి అత్త శంకర మ్మను కోరాడు. అంతే అప్పటికే తాగినమైకంలో ఉన్న అత్త నర్సింహపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది. అంతటితో ఆగకుండా కొట్టి జేబులో ఉన్న డబ్బులు లాక్కొని ఏంచేసుకుం టావో చేసుకోపో..అని తరిమేసింది. నుదిటిపై తీవ్రగాయమై రక్తంరావడంతో అల్లుడు నర్సింహ అత్తపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వద్దఉన్న డబ్బులు లాక్కుందని, ఊరికివెళ్లేం దుకు ఎవరైనా చిల్లర డబ్బులిస్తే వెళ్లిపోతానంటూ పోలీసుస్టేషన్‌కు వచ్చే ప్రతిఒక్కరినీ నర్సింహ వేడుకోవడం విస్మయానికి గురిచేసింది. -
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్!
-
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డ్!
సినిమా వంద రోజుల పండుగలు జరుపుకోవడం మరచిపోయి చాలా కాలం అయింది. ఒక సినిమా ఎన్ని రోజులు ఆడిందనేది రికార్డు కాదు. ప్రస్తుతం ఎంత కలెక్షన్ వసూలు చేసిందనేదే రికార్డుగా లెక్కిస్తున్నారు. బాలీవుడ్లో అయితే వంద కోట్ల రూపాయలు, రెండు వందల కోట్లు, మూడు వందల కోట్ల రూపాయలని లెక్కిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన 'అత్తారింటికి దారేది?' చిత్రం చరిత్రను తిరగరాసింది. ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. కలెక్షన్లలో కూడా రికార్డు సృష్టించింది. పవరున్న హీరో నటిస్తే ఈ రోజుల్లో కూడా సినిమా వంద రోజులు ఆడుతుందని పవన్ కళ్యాణ్ రుజువు చేశారు. తెలుగు సినిమా రంగంలో మళ్లీ ఆ గోల్డెన్ డేస్ వస్తాయన్న ఆశ ఈ చిత్రంతో చిగురించింది. సెప్టెంబర్ 27న విడుదలైన 'అత్తారింటికి దారేది?' సినిమా 170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 36 కేంద్రాలలో వంద రోజులు ఆడింది. ఇంకా ఆడుతోంది. తెలుగు సినిమా రంగంలో ఒక సినిమా విడుదల కాకముందే పైరసీ బయటకు రావడం ఎప్పుడూ జరగలేదు. మొట్టమొదటిసారిగా 'అత్తారింటికి దారేది?' సగం సినిమా పైరసీ సిడి బయటకు వచ్చింది. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ అల్లాడిపోయారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని చెప్పారు. పైరసీ వచ్చినప్పటికీ సినిమా విడుదలైన తరువాత థియేటర్లు నిండిపోయాయి. కాసుల వర్షం కురిపించింది. నిర్మాత ఆనందానికి అవధులులేవు. పవన్ ఇమేజ్ బాగా పెరిగిపోయింది. అభిమానులు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా టాలీవుడ్ రికార్డుని తిరగరాసింది. ఈ చిత్రంతో పవన్ పవర్ రేంజ్ ఏమిటో అందరికీ అర్ధమైంది. గబ్బర్ సింగ్ చిత్రం 57 కేంద్రాలలో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది. 2013లో హీరో ప్రభాస్ నటించిన మిర్చి, నితిన్ హీరోగా నటించిన గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలు కూడా 18 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకున్నాయి. అయితే కలెక్షన్లలో మాత్రం 'అత్తారింటికి దారేది?' చిత్రం వాటన్నిటికంటే ముందుంది. ఈ సినిమా 85 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా కూడా వంద కోట్ల రూపాయలు వసూలు చేయగలదన్న ఆశ చిగురిస్తోంది. పవన్ కళ్యాణ్ తన రికార్డును తానే అధిగమించారు. అత్తారింటికి దారేది? రికార్డుని కూడా తనే అధిగమిస్తారా? మరెవరైనా అధిగమిస్తారా? అనేది వేచి చూడాలి. మళ్లీ తన రికార్డుని తనే బద్దలు కొడతాడని పవన్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంతోపాటు అతని మాటలు, ఆ మాటలను పవన్ పలికిన స్టైల్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అన్నీ కలిపి ఈ చిత్రాన్ని సూపర్, డూపర్ హిట్ చేశాయి. కలెక్షన్ల వర్షం కురిపించాయి. s.nagarjuna@sakshi.com -
సల్లూభాయ్ కి 'అత్తారిల్లు' నచ్చలేదా!
టాలీవుడ్ లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ లో జితేంద్ర తర్వాత ఆస్థానం సల్మాన్ ఖాన్ కే దక్కుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇటీవల తెలుగులో హిట్ అయిన పోకిరి, రెఢి చిత్రాలను రీమేక్ చేసి తన ఖాతాలో విజయాలను నమోదు చేసుకున్నాడు. త్వరలో విడుదల కానున్న జైహో చిత్రం స్టాలిన్ ఆధారంగా, కిక్ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించిన సినిమాల్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఎప్పటికప్పడు సౌత్ సినిమాలపై దృష్టి పెట్టే సల్లూభాయ్ చెవిన అత్తారింటికి దారేది చిత్ర విజయం వార్త పడింది. దాంతో అత్తారింటికి దారేది చిత్ర హక్కుల్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారట. అయితే ఏమైందో ఏమో కాని.. ఆ చిత్రంలో కథ సల్లూభాయ్ కి నచ్చకపోవడంతో వెనకడుగు వేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిచన అత్తారింటికి దారేది చిత్ర కథలో పస లేదని డిసైడ్ చేయడం సినీ విమర్శకులను షాక్ గురి చేసింది. సినిమాలో సరైన పాయింట్, కథనం కాని లేదని, మెలోడ్రామా వంటి అంశాలను పట్టించుకోలేదని సల్మాన్ చెప్పుడంపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులకు అంతుపట్టని విషయంగా మారిందట. అసలు అత్తారింటికి దారేది సినిమా చూశాడో లేక తను ఆ సినిమా చేస్తే వర్కవుట్ కాదని ముందే డిసైడ్ అయ్యాడా అనేది ప్రశ్నగా మారింది. -
న్యూయార్క్ టైమ్స్ జాబితాలో పవన్ కళ్యాణ్!
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పవన్ కళ్యాణ్ స్టామినా ఒక్కసారిగా పెరిగిపోయింది. హిట్, ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా అభిమానుల హృదయాలను చూరగొన్న తెలుగు నటుల్లో పవన్ కళ్యాణ్ ది ఓ ప్రత్యేకమైన స్టైల్. గత కొద్దికాలం క్రితం వరకు సరియైన హిట్ లేక సతమతమైన పవర్ స్టార్ కు ఇటీవల కాలంలో ఘన విజయాలు అందివచ్చాయి. 'గబ్బర్ సింగ్' తో బ్లాక్ బస్టర్ సాధించిన పవన్...'కెమెరామెన్ గంగతో రాంబాబు' హిట్ పర్వాలేదనిపించాడు. ఇక ఇటీవల వచ్చిన అత్తారింటికి దారేది చిత్రం వంద కోట్ల కలెక్షన్లను సాధించే సత్తా ఉన్న చిత్రంగా వార్తల్లో నిలిచింది. వరుస విజయాలతో బాక్సాఫీస్ ను కుదిపేస్తున్న పవన్ కళ్యాణ్ కు అన్ని సానుకూల పరిస్థుతులే ఎదురవుతున్నాయి. 'అత్తారింటికి దారేది' ఘన విజయం అందించిన ఉత్సాహాన్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్న పవన్ కు మరో తీయ్యని వార్త అందింది. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేల్లో భారత దేశంలో '10 మోస్ట్ డిజైరబుల్ యాక్టర్స్' జాబితాలో పవన్ కళ్యాణ్ ఐదవ స్థానం దక్కింది. దక్షిణాది నటుల్లో పవన్ కళ్యాణ్ అగ్రస్థానం దక్కించుకున్నారు. ఈ జాబితాలో పవన్ ఐదవ స్థానంలో ఉండగా, ప్రిన్స్ మహేశ్ బాబు కు 6 స్థానం దక్కింది. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన జాబితాలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ మొదటి స్థానం సొంతం చేసుకోగా, సల్మాన్ ఖాన్ రెండవ, అక్షయ్ కుమార్ మూడవ స్థానం, హృతిక్ రోషన్ నాలుగవ స్థానంలో దక్కించుకున్నారు. తమిళ నటుడు విజయ్ 7వ, 8 వ స్థానం అమీర్ ఖాన్, రణబీర్ కపూర్ 9వ, అజయ్ దేవగన్ 10వ స్థానంలో నిలిచారు. -
పవన్‌కు ‘దారి’ చూపుదాం!
‘అత్తారింటికి దారేది?’ అంటూ బయలుదేరిన సినీనటుడు పవన్ కల్యాణ్‌కు టీడీపీ నేతలు ఒక పథకం ప్రకారం దారి చూపిస్తున్నారట. టీడీపీలో అంతా ఇప్పుడు ఈ ‘దారి’పైనే చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి దూరమయ్యారన్న ప్రచారానికి తోడు ఇటీవలి కాలంలో అత్తారింటికి దారేది సినిమా విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ ఈ కొత్త స్క్రిప్ట్ తయారు చేసి అమలు చేస్తోందట. ఆ స్క్రిప్టు ప్రకారం.. అప్పుడెప్పుడో ఒక సినిమా కార్యక్రమంలో సినీనటుడు బాలకృష్ణతో పవన్ కలిసిన ఫొటోలను ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశారట. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా ప్రచారం చేశారట. ఇంకేముంది టీడీపీ అనుకూల మీడియా ఆ విషయాన్ని తెరమీదకు తేవడం అంతా పథకం ప్రకారం జరిగిపోయిందట. పవన్ తమ పార్టీలో చేరుతున్నారన్న విధంగా సంకేతాలిస్తూ టీడీపీ విస్తృత ప్రచారానికి తెరలేపింది. చతికిల పడిన పార్టీని ఈ రకంగా ఎవరో ఒకరు వచ్చి ఆదుకుంటారని చూస్తున్న ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్న ప్రచారంపై పవన్ సన్నిహితులు ఆగ్రహంతో ఉన్నారట. దొరికిందే సందు అని.. చిరంజీవి అంటే సరిపడని రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్య నేత ‘నీవు ముందు కెళ్లు.. నీ వెనక నేనుంటా’నని పవన్‌ను లాగే ప్రయత్నం చేశారట. రాష్ట్రంలో విభజన అంశం ఊపుమీదున్న ఈ సమయంలో.. ‘మా పవర్‌స్టార్‌ను ఇబ్బంది పెట్టడానికో... లేదా ఇండస్ట్రీలో దెబ్బతీయడానికో.. మొత్తానికి ఏదో జరుగుతోంద’ని పవన్ అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. జరుగుతున్న ప్రచారంపై పవన్ సన్నిహితులు కొందరు ఆరా తీస్తే... ‘పవన్‌కు ఎలాంటి ఆలోచనలు లేకున్నా ముందు ఆయనను ఆలోచనలో పడేయటం, టీడీపీలో చేరితే బాగుంటుందన్న విధంగా మైండ్ గేమ్ ప్లే చేయడం.. ఇంతవరకే మా ప్లాన్.. ఆ తర్వాత ఆయనిష్టం.. బురద జల్లడమే మా వంతు. కడుక్కోవడం ఆయన వంతే’ అని సెలవిచ్చారట. -
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
-
'పవనిజం డే' జరుపుకుంటున్న మెగా ఫ్యాన్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు నేడు ప్రపంచవ్యాప్తంగా పవనిజం డే జరుపుకుంటున్నారు. తాజాగా విడుదలయిన అత్తారింటికి దారేది సినిమా విజయవంతం కావడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రెట్టించిన ఉత్సాహంతో పవనిజం రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజు, చిల్డ్రన్ డే, మదర్స్ డే తరహాలో మెగా అభిమానులు పవనిజం డే జరుపుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా విడుదలయిన తేదీ కాబట్టి అక్టోబర్ 11న పవనిజం డే నిర్వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి' 1996 అక్టోబర్ 11న విడుదలయింది. చిరంజీవి సోదరుడి టాగ్‌తో తెరంగ్రేటం చేసిన పవన్ కళ్యాణ్ తర్వాత సొంత ఇమేజ్ సృష్టించుకున్నారు. విలక్షణ నటన, ఆహార్యంతో యువతతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. తనదైన వ్యక్తిత్వంతో యూత్ ని ఆకట్టుకున్నారు. -
అభిమానులతో పవన్ కల్యాణ్ సమావేశం రద్దు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ సినిమా విజయోత్సవ వేడుకలు, సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటారు. ప్రతికూల పరిస్థితుల మధ్య ఇటీవల విడుదలైన 'అత్తారింటికి దారేది' సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో పవన్ తన శైలికి భిన్నంగా అభిమానులను కలవాలని భావించారు. సినిమాను విజయవంతం చేసినందుకు అభిమానులకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపేందుకోసం ఆదివారం వారితో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఈ కార్యక్రమం రద్దయింది. దీనికి గల కారణాలేంటన్నది తెలియరాలేదు. కాగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంతో సీమాంధ్రలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కారణం కాదని చిత్ర నిర్మాత ప్రసాద్ చెప్పారు. 'ఆదివారం అభిమానులతో కృతజ్ఞత సమావేశం నిర్వహించాలని భావించాం. అనివార్య కారణాల వల్ల దీన్ని రద్దు చేశాం. కొత్త తేదీని త్వరలో తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో అత్తారింటికి దారేది చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొంటారు' అని ప్రసాద్ చెప్పారు. గత నెల 27న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. -
తొలిరోజే 'అత్తారింటికి దారేది' రికార్డు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' సినిమా తొలిరోజే రికార్డు సృష్టించింది. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 10.89 కోట్ల రూపాయలు వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. టాలీవుడ్లో తొలిరోజే అత్యధిక మొత్తం వసూలు సినిమాగా ఘనత సాధించింది. ఇప్పటిదాకా జూనియర్ ఎన్టీయార్ సినిమా బాద్షా (రూ. 9 కోట్లకుపైగా) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 'జల్సా' సినిమా తర్వాత పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాపై విడుదల ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రం విడుదలకు ముందే 90 నిమిషాల నిడివి గల పైరసీ సీడీ మార్కెట్లోకి వచ్చినా కలెక్షన్లపై ప్రభావం చూపలేదు. అంచనాలకు తగినట్టే బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో అత్తారింటికి దారేది కలెక్షన్లను కలుపుకొంటే తొలిరోజే మొత్తం 12 కోట్లు రాబట్టినట్టు సిని వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో పవన్ సరసన సమంత, ప్రణీత నటించారు. -
అత్తారింటికి దారేది వాల్ పోస్టర్లు దహనం
విజయనగరం:అత్తారింటికి దారేది' సినిమాకు విడుదలకు ముందే సమైక్య సెగ తగిలింది. విజయనగరంలో ఈ చిత్ర వాల్ పోస్టర్లును సమైక్యవాదులు గురువారం దహనం చేసి హెచ్చరికలు జారీ చేశారు. కేంద్రమంత్రి చిరంజీవి కుటుంబానికి సంబంధించిన సినిమాలను అడ్డుకుంటామని సమైక్య వాదులు హెచ్చరించారు. చిరంజీవి తక్షణమే రాజీనామా చేసి సమైక్యాంధ్రా కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేది శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎఫ్టెక్ట్ తో విడుదల వాయిదా పడిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడన లో బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 9 తేదిన దసరా కానుకగా విడుదల చేయాలని తొలుత సినీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నా.. ఈ చిత్రం సీడీల రూపంలో బయటకి రావడంతో సినిమా విడుదల తేదీని మార్చక తప్పలేదు. తర్వాత పవన్ కళ్యాణ్, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. -
రేపు ప్రేక్షకులకు వద్దకు ఆరడుగుల బుల్లెట్!
తొలి మూడు రోజుల్లోనే ఇంటర్నెట్ లో పదిలక్షలకు పైగా హిట్స్ తో ఫస్ట్ లుక్, టీజర్స్ తో సంచలనం సృష్టించిన అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేదిన విడుదలకు సిద్ధమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎఫ్టెక్ట్ తో విడుదల వాయిదా పడిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడన లో బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ చిత్రం తొలుత అక్టోబర్ 9 తేదిన దసరా కానుకగా విడుదల చేయాలని భావించినా.. పైరసీ ఎఫెక్ట్ తో విడుదలను ముందుగానే ప్లాన్ చేశారు. జల్సా చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తన తాత కోరిక తేర్చేందుకు విదేశాల నుంచి గౌతమ్ నందా (పవన్ కళ్యాణ్) హైదరాబాద్ కు చేరుకుంటారు. అయితే తాత కోరిక ఏంటి? యూరప్ లో ఉండే తాత కోరికకు హైదరాబాద్ లింకేమిటి అనే ప్రశ్నలకు సమాధానం కోసం శుక్రవారం విడుదల అవుతున్న అత్తారింటికి దారేది చిత్రం చూడాల్సిందే. ఈ చిత్రంలో శశి పాత్రలో సమంతా, ఇతర పాత్రల్లో ప్రణీత, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ, నదియా, ఆలీ, కోట శ్రీనివాసరావు(సిద్దప్ప), ప్రత్యేక పాత్రలో హంస నందిని, ముంతాజ్ లు నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అభిమానుల్లో కిర్రాక్ రేపింది. ఆడియోలో పవన్ కళ్యాణ్ పాడిన 'కటమ రాయుడా', విజయ్ ప్రకాశ్, ఎంఎల్ఆర్ కార్తీకేయన్ పాడిన 'ఆరడుగుల బుల్లెట్', దేవి శ్రీ ప్రసాద్ పాడిన 'నిన్ను చూడగానే', దేవ దేవం(పలక్కడ్ శ్రీరాం, రీటా), బాపు గారి బొమ్మో (శంకర్ మహదేవన్), కిర్రాక్ (నరేంద్ర, డేవిడ్ సైమన్స్), టైమ్ టూ పార్టీ (డేవిడ్ సైమన్, మాల్గుడి శుభ) పాటలకు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది. అత్తారింటికి దారేది చిత్రం 55 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందింది. అయితే రికార్డు స్థాయిలో ఓవర్సీస్ రైట్స్ 7.5 కోట్లకు, శాటిలైట్ రైట్స్ 9 కోట్లకు అమ్ముడైనట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ చిత్రానికి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్. -
అత్తారింటికి దారేది కేసులో ఐదుగురి అరెస్టు
* ఈ నెల 14న స్పీడ్ పోస్ట ద్వారా పెడనకు చేరిన డీవీడీ * సైజు తగ్గించి మెమొరీ కార్డుల్లోకి.. * స్నేహితుల మధ్య సరదాగా సాగిన వైనం.. మచిలీపట్నం, న్యూస్‌లైన్ : అత్తాంరిటికి దారేది సినిమా పైరసీ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను కృష్ణాజిల్లా మచిలీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నిందితుల్ని చూపించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రభాకరరావు తెలిపిన మేరకు.. ఈ సినిమా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ వద్ద విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మండలం కొత్త తలనివారిపాలెం గ్రామానికి చెందిన చీకటి అరుణ్‌కుమార్ ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతడు నిర్మాత కంప్యూటర్ నుంచి సినిమా మొదటి భాగాన్ని డీవీడీలోకి డౌన్లోడ్ చేశాడు. స్నేహం ఇంతపని చేయించింది ఎడిటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ఫిల్మనగర్లో ఉంటున్న అరుణ్‌కుమార్‌కు ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు ప్రసన్నకుమార్, అనూప్ స్నేహితులు. ఈ నేపథ్యంలో ప్రసన్నకుమార్ ఒత్తిడి చేయటంతో అరుణ్‌కుమార్ సినిమాలోని సగభాగాన్ని డీవీడీలోకి ఎక్కించి ఇచ్చాడు. ప్రసన్నకుమార్ హోం థియేటర్లో బొమ్మలే తప్ప మాటలు రాకపోవటంతో ఆ డీవీడీని అనూప్ ఇంటికి తీసుకువెళ్లి కంప్యూటర్లో సినిమా చూశారు. తరువాత ఆ డీవీడీ తీసుకెళ్లిన వారి స్నేహితుడు, ఈ కేసులో కీలక నిందితుడైన ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా రవి దాన్ని ఈనెల 14న పెడనలోని తన స్నేహితుడు సుధీర్‌కుమార్‌కు స్పీడ్ పోస్టలో పంపారు. పైరసీ జరిగిందిలా... డీవీడీ చూసిన సుధీర్‌కుమార్ పెడనకు చెందిన తన స్నేహితుడు పోరంకి సురేష్‌కి ఇచ్చాడు. సురేష్ 4 జీబీగా ఉన్న ఈ సినిమాను 160 ఎంబీలోకి మార్చాడు. తరువాత పెడనలోని దేవి మొబైల్స షాపులో సెల్ఫోన్లో వాడే మెమొరీ కార్డుల్లోకి, సీడీల్లోకి ఎక్కించి అమ్మకం ప్రారంభించారు. సుధీర్‌కుమార్ సోదరుడు కిశోర్ ఈ సినిమాను తన పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించుకున్నాడు. ఈ నేపథ్యంలో పైరసీ వ్యవహారం బయటకు వచ్చింది. నిర్మాత హైరాబాదులో డీజీపీకి ఫిర్యాదు చేశారు. యూ ట్యూబ్‌లోనూ హల్చల్... సినిమాను పెన్‌డ్రైవ్‌లోకి ఎక్కించిన కిశోర్ తన స్నేహితుడు, మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటరులోని స్మార్ట లింక్స కమ్యూనికేషన్స నడుపుతున్న గిరికి ఇచ్చాడు. గిరి సినిమాను యూ ట్యూబ్‌లో పెట్టాడు. సైబర్ పోలీసుల విచారణలో ఐపీ నంబరు ఆధారంగా స్మార్టలింక్స కమ్యూనికేషన్ నుంచి ఈ సినిమాలోని కొంతభాగం యూ ట్యూబ్‌లోకి వచ్చిందని కనుగొన్నారు. స్మార్ట లింక్స కమ్యూనికేషన్ నుంచి 380 మందికి అనుసంధానం ఉండగా ఎంతమందికి ఈ సినిమా వెళ్లిందనే విషయంపై సైబర్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పెద్దల హస్తంపైనా ఆరా... నిర్మాత కంప్యూటర్ నుంచి సినిమా బయటకు రావడానికి ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల సెల్‌ఫోన్ నంబర్లు, వారు ఎవరెవరితో మాట్లాడారు తదితర అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. అరుణ్‌కుమార్ సెల్ నుంచి సినీరంగ ప్రముఖులకు కాల్స వెళ్లాయా అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించామన్నారు. డీవీడీల స్వాధీనం... ఎడిటింగ్ అసిస్టెంట్ అరుణ్‌కుమార్ నుంచి డీవీడీ తీసుకున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ కట్టా రవి, అతడి నుంచి అందుకున్న సుధీర్‌కుమార్, డీవీడీలు తయారు చేసిన పోరంకి సురేష్ తదితరులు తమ వద్ద ఉన్న సీడీలను, డీవీడీలను ఎస్పీకి అందజేశారు. పెడనలో ఎన్ని సీడీలు తయారుచేశారు, ఎన్ని మెమొరీ కార్డుల్లోకి ఎక్కించారు తదితర అంశాలపై ఆరా తీస్తున్నామని ఎస్పీ చెప్పారు. తన స్నేహితుడి ఒత్తిడి మేరకే సినిమాను డీవీడీలోకి ఎక్కించి ఇచ్చానని అరుణ్‌కుమార్ వెల్లడించాడు. పెడనలో ఉన్న తన స్నేహితుడు సుధీర్‌కుమార్ కోరగానే స్పీడ్ పోస్టులో డీవీడీ పంపానని, వ్యాపారం చేద్దామనే ఆలోచన లేదని ఏపీఎస్పీ కట్టా రవి తెలిపాడు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఎస్పీ చెప్పారు. నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న బందరు రూరల్ సీఐ పల్లపురాజు, టౌన్ సీఐ ఎస్వీవీఎస్ మూర్తిలకు రివార్డు ప్రకటిస్తామన్నారు. ఈ సమావేశంలో బందరు డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెనమలూరు : కృష్ణాజిల్లా పెనమలూరు అంబేద్కర్ కాలనీలో ‘అత్తారింటికి దారేదీ’ సినిమా పైరసీ సీడీలు ప్రత్యక్షమయ్యాయి. ఈ సీడీలను కొందరు విజయవాడలో రూ.30కి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఒరిజినల్ సీడీలు విడుదలచేస్తే సరి: జయప్రకాశ్‌రెడ్డి సాక్షి, గుంటూరు : ‘పైరసీ నివారణకు ఒక్కటే మార్గం. కొత్త సినిమా విడుదలయ్యాక రెండో వారంలో ఒరిజినల్ సీడీలు రిలీజ్ చేస్తే సరి. ఆ పైన సినిమా పైరసీ జరగనే జరగదు..’ అని సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి చెప్పారు. గుంటూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సినిమా విడుదలయ్యాక రెండో వారంలో ఒరిజినల్ సీడీలు విడుదల చేస్తే అటు నిర్మాతలు, ఇటు థియేటర్ల యజమానులకు నష్టం రాదు. కొత్త సినిమాను థియేటర్లోనే చూస్తారు. దీనివల్ల థియేటర్లకు కలెక్షన్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గవు. వారంలో పెట్టుబడి వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఎవరికీ నష్టం ఉండదు..’ అని ఆయన పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్ అభిమానుల ఆందోళన
జగన్నాధపురం(తాడేపల్లిగూడెం రూరల్), న్యూస్‌లైన్: ఇంకా విడుదల కాని అత్తారింటికి దారేది సినిమా పైరసీ సీడీలు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేయాలని బుధవారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. వివరాలు ఇవి.. జగన్నాథపురంలో మణిశివకేశవ్ అనే వ్యక్తి తన స్నేహితులతో గ్రామ కూడలిలో మాట్లాడుతుండగా అదే గ్రామానికి చెందిన గవిర్ని రాజు అక్కడికి వచ్చి అత్తారింటికి దారేది సినిమా సీడీ కృష్ణచౌదరి వద్ద ఉందని చెప్పాడు. దీంతో పైరసీ గుట్టు రట్టు చేయాలని తలచిన మణిశివకేశవ్ తనకు ఓ సీడీ కావాలని కృష్ణ చౌదరిని కోరడంతో అతను ఇచ్చాడు. దీంతో మణికేశవ్ పవన్‌కళ్యాణ్ అభిమానులకు ఫోన్‌చేయగా అక్కడకు వచ్చిన వారు ఓ సీడీ, మెమరీ కార్డు దొరికాయని రూరల్ పోలీసులకు అప్పగించారు. పవన్‌కళ్యాణ్ అభిమానులు కృష్ణ చౌదరి ఇంటికెళ్లారు. అక్కడున్న కొందరు మహిళలు ఇక్కడ నుంచి వెళ్లకపోతే అత్యాచార యత్నం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని మణిశివకేశవ్ తెలిపాడు. ఈ మేరకు అతను ఇన్చార్జి ఎస్సై ఎస్‌సీహెచ్ కొండలరావుకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు విషయంలో పైరసీ చేసిన వారితో పోలీసులు కుమ్మక్కవతున్నారంటూ పవన్‌కళ్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. కేసునమోదు చేయాలని, దోషులను వెంటనే శిక్షించాలంటే నినాదాలు చేశారు. పుల్లా అన్నవరం, ర్యాలీ నాగు, గట్టు గోపీకృష్ణ, మాకా దుర్గబాబు, గని, శ్రీరంగం అంజిబాబు, మట్టా రాంబాబు, బొడ్డు భాస్కర్ ఆందోళనకు నాయకత్వం వహించారు. దాడి చేశారంటూ మహిళ ఫిర్యాదు తనపై దాడిచేసి గాయపరిచారంటూ జగన్నాథపురానికి చెందిన పరిమి రామలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు. పైరసీ సీడీలు చేస్తున్నారంటూ తమ గ్రామానికి చెందిన కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు పారిచెర్ల కృష్ణచౌదరి ఇంటిలోకి వెళుతుంటే అడ్డుకున్నందుకు తనపై దాడిచేసి గాయపరిచారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్చార్జి ఎస్సై కేసు నమోదు చేశారు. -
రెచ్చిపోయిన పవన్ కళ్యాణ్ అభిమానులు
హైదరాబాద్ : తమ అభిమాన నటుడి చిత్రం 'అత్తారింటికి దారేది' విడుదల కాకముందే లీక్ అవుటంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ సీడీ షాపుపై దాడి చేసి సీడీలను ధ్వంసం చేశారు. పోలీసులు కూడా ఓ సీడీ షాపుపై దాడి చేసి కంప్యూటర్లు, లాప్‌ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ తమ హీరో తాజా చిత్రం కోసం ఎప్పటి నుంచో ఆత్రుతగా ఎదురు చూస్తున్నామన్నారు. పైరసీ సీడీలు విడుదలను వారు తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్‌ను అణగదొక్కేందుకే కొంతమంది ప్రయత్నిస్తున్నారని...దానిలో భాగంగానే లీక్ అయిందని వారు ఆరోపించారు. పవర్ స్టార్‌ను ఎవరూ తొక్కలేరని అభిమానులు అన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా కృష్ణాజిల్లా పెడనలో అత్తారింటికి దారేది చిత్రం రూ.50పై పైరసీ సీడీ మార్కెట్లో లభ్యమయిన విషయం తెలిసిందే. -
'అత్తారింటికి దారేది' సినిమా లీక్!
-
పెడనలో రూ.50కే అత్తారింటికి దారేది సీడీ
పెడన : పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' కొత్త సినిమా విడుదలకు ముందే మార్కెట్లో ప్రత్యక్షం అయ్యింది. కృష్ణా జిల్లా పెడనలో ఈ సినిమా పైరసీ సీడీ రూ.50కే లభ్యం అవుతోంది. పైరసీ సీడీలపై సమాచారం అందుకున్న పోలీసులు సీడీ షాపులు, సెల్‌ఫోన్ రిపేర్ షాపుల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పైరసీపై చిత్ర నిర్మాతలు డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సుమారు 90 నిముషాలు నిడివి గల చిత్రం పైరసీ సీడీలో హల్చల్ చేస్తోంది. పైరసీ భూతం మరోసారి చిత్ర పరిశ్రమను షేక్ చేస్తోంది. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో పైరసీ సీడీల్లో లభిస్తున్నట్లు సమాచారం. -
'అత్తారింటికి దారేది' సినిమా లీక్!
పవన్ కళ్యాణ్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన 'అత్తారింటికి దారేది' సినిమా ఇంకా విడుదల కాకముందే.. పైరసీ సీడీలు వచ్చేశాయి!! ఎడిట్ రూంలో కూర్చున్న ఎవరో తన మిత్రులకు దాన్ని చూపించేందుకు యూట్యూబ్‌లో 90 నిమిషాల పాటు పెట్టగా, ఈలోపే దాన్ని చూసిన కొంతమంది దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసేసి.. పైరసీ సీడీలుగా రూపొందించారని విశ్వసనీయ సమాచారం. దీంతో ఇప్పుడు ఆ చిత్రం పైరేటెడ్ సీడీలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేసినట్లు అయ్యింది. దాంతో ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు పైరసీదారులపై డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్ర యూనిట్ వాళ్లకు కూడా సినిమా ప్రదర్శన వేయాలేదని... అలాగే ప్రివ్యూ కూడా ఎక్కడా ప్రదర్శించలేనందున లీక్ అయ్యే అవకాశాలు కూడా లేవని తొలుత భావించినా.. తర్వాత మాత్రం అసలు విషయం తెలిసింది. గతంలో కూడా ‘అత్తారింటికి దారేది' ఫస్ట్ లుక్ టీజర్ విడుదలయ్యేలోపే అందులోని కొన్ని డైలాగులు బయటకు లీకయిన విషయం తెలిసిందే. దీనిపై చిత్ర నిర్మాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై భారీ నిర్మాత 'ఛత్రపతి' ప్రసాద్ నిర్మిస్తున్న భారీ చిత్రం 'అత్తారింటికి దారేది'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 9న విజయదశమి కానుకగా విడుదల కానుంది. సమంత హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా పాటలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. -
అక్టోబర్ 9న 'అత్తారింటికి దారేది?', 10న 'రామయ్యా వస్తావయ్యా' విడుదల!
సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా' చిత్రాల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్రాల విడుదల వాయిదాతో నిరాశకు లోనైన అభిమానులకు మళ్లీ తీయటి వార్త అందనుంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9 తేదిన విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.