సల్లూభాయ్ కి 'అత్తారిల్లు' నచ్చలేదా!
సల్లూభాయ్ కి 'అత్తారిల్లు' నచ్చలేదా!
Published Tue, Dec 24 2013 1:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
టాలీవుడ్ లో విజయం సాధించిన చిత్రాలను రీమేక్ చేయడంలో బాలీవుడ్ లో జితేంద్ర తర్వాత ఆస్థానం సల్మాన్ ఖాన్ కే దక్కుతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. ఇటీవల తెలుగులో హిట్ అయిన పోకిరి, రెఢి చిత్రాలను రీమేక్ చేసి తన ఖాతాలో విజయాలను నమోదు చేసుకున్నాడు. త్వరలో విడుదల కానున్న జైహో చిత్రం స్టాలిన్ ఆధారంగా, కిక్ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించిన సినిమాల్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. ఎప్పటికప్పడు సౌత్ సినిమాలపై దృష్టి పెట్టే సల్లూభాయ్ చెవిన అత్తారింటికి దారేది చిత్ర విజయం వార్త పడింది.
దాంతో అత్తారింటికి దారేది చిత్ర హక్కుల్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేపట్టారట. అయితే ఏమైందో ఏమో కాని.. ఆ చిత్రంలో కథ సల్లూభాయ్ కి నచ్చకపోవడంతో వెనకడుగు వేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో కలెక్షన్ల వర్షం కురిపించిచన అత్తారింటికి దారేది చిత్ర కథలో పస లేదని డిసైడ్ చేయడం సినీ విమర్శకులను షాక్ గురి చేసింది. సినిమాలో సరైన పాయింట్, కథనం కాని లేదని, మెలోడ్రామా వంటి అంశాలను పట్టించుకోలేదని సల్మాన్ చెప్పుడంపై టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులకు అంతుపట్టని విషయంగా మారిందట. అసలు అత్తారింటికి దారేది సినిమా చూశాడో లేక తను ఆ సినిమా చేస్తే వర్కవుట్ కాదని ముందే డిసైడ్ అయ్యాడా అనేది ప్రశ్నగా మారింది.
Advertisement
Advertisement