సినిమా తారల ఆడంబరాలే బాహ్య ప్రపంచానికి తెలుస్తాయి. చాలా మంది కష్టాలు, కన్నీ ళ్లు అంతర్గతంగా ఉండిపోతాయి. చాలా మంది రకరకాల వ్యాధులతో బాధ పడుతుంటారు. అయినప్ప టికీ బయటకు నవ్వుతూ కనిపిస్తారు. అది ఏడవ లేక నవ్వడమే అన్నది ఎంత మందికి తెలుస్తుంది. చాలా మంది కేన్సర్ బారిన పడి నరకయాతన పడుతున్న వారూ ఉన్నారు. టాప్ హీరోయిన్ సమంత కూడా మయోసైటీస్ అనే అరుదైన వ్యాధి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇక నటి ముంతాజ్ (43) కన్నీటి కథ కూడా ఇలాంటిదే. ఆమె తెలుగు, తమిళ పలు చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో ఖుషి,అత్తారింటికి దారేది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్‌లలో ఆమె మెప్పించింది.
కోలీవుడ్‌లో 'మోనీసా ఎన్ మోనాలిసా' చిత్రం ద్వారా నటి ముంతాజ్‌ను దర్శకుడు టీ.రాజేందర్ పరిచయం చేశారు . ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, ముంతాజ్‌కు మా త్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన ఈ భామ కొన్ని కారణాలు ఏమైనా ఐటమ్స్ సాంగ్స్‌లో నటించి, శృంగార తారగా ముద్రవేసుకున్నారు. తమిళంతో పాటు, తెలుగు, కన్నడం, మలయాళం భాషల్లోనూ పలు సినిమాల్లో నటించినా ఆ తరువాత సినీరంగం నుంచి కనుమరుగయ్యారు. ఆమె చివరిగా నటించిన తమిళ చిత్రం రాఘవ లారెన్స్ హీరోగా నటించిన రాజాది రాజా. అందులో ప్రతినాయకిగా నటించారు.
ఆ బాధను భరించలేక చనిపోవాలనుకుంటే..
లారెన్స్ సినిమా తరువాత తెలుగులో రెండు చిన్న చిత్రాల్లో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో ముంతాజ్ పేర్కొంటూ సడన్‌గా తన వెన్నుముక భాగం కదలడానికి కూడా వీలుపడక నొప్పి వచ్చిందన్నారు. ఆ నొప్పిని తట్టుకోలేకపోయానన్నారు. పలువురు వైద్యులు పరీక్షించినా సమస్య ఏమిటో చెప్పలేకపోయారన్నారు. అలా రెండేళ్ల పాటు ఆ బాధను అనుభవించానని చెప్పారు. ఆ తరువాత ఒక ఆప్పత్రిలో పరిశోధన చేయగా తనకు ఆటో ఇమ్యూన్ అనే అరుదైన వ్యాధి సోకినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యాధి కారణంగా తన శరీరంలో ఎక్కడెక్కడ ఎముకల జాయింట్స్ ఉన్నాయో ఆక్కడ భయంకరమైన నొప్పి కలుగుతుందన్నారు.
దీంతో కూర్చోలేక, నిలబడలేక, శరీరాన్ని కదల్చలేక నరకయాతన పడ్డానని చెప్పారు. మానసిక వేదనకు గురయ్యానని చెప్పారు. ఎందుకు ఏడుస్తున్నానో తనకే తెలిసేది కాదన్నారు. అదే మానసిక వ్యాధి అని చెప్పారు. ఒకసారి రెండున్నర గంటల సేపు నాన్‌స్టాప్‌గా ఏడుస్తూనే ఉన్నానని, తన మానసిక వ్యాధిని అర్ధం చేసుకుని అందులోంచి బయటకు తీసుకొచ్చింది తన అన్నయ్యనేనని చెప్పా రు. ఆయన లేకుంటే తానీ పాటికి ఆత్మహత్య చేసుకునేదాన్నని అన్నారు.
నాకు పెళ్లి జరుగుతుందనే నమ్మకం లేదు
తాను గ్లామరస్‌గా నటించినందుకు ఇప్పుడు బాధపడుతున్నట్లు ముంతాజ్ పేర్కొన్నారు. తన శృంగార భరిత ఫొటోలను సామాజిక మధ్యమాల నుంచి తొలగించాలని అనుకుంటున్నానని, అయితే ఆ పని తనకు సాధ్యం కావడం లేదని అన్నారు. కాబట్టి అభిమానులు సాధ్యమైనంత వరకూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయవద్దని వేడుకున్నారు. ఇకపై తనకు వివాహం జరుగుతుందనే నమ్మకం లేదని, అది జరుగుతుందా? అన్నది వేచి చూద్దాం అని నటి ముంతాజ్ తన కన్నీటి కథను పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment