‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్ కాదు!
‘అత్తారింటికి దారేది’ విడుదలై దాదాపు ఐదు నెలలవుతోంది.. ఇంకా పవన్‌కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కాలేదని, ‘గబ్బర్‌సింగ్ 2’కి ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియడంలేదని ఈ మధ్యకాలంలో ఫిల్మ్‌నగర్‌లో జోరుగానే చర్చించుకున్నారు. ఇక, ఆ చర్చకు ఫుల్‌స్టాప్ పెట్టేయొచ్చు. శుక్రవారం ఫిల్మ్‌నగర్ దేవాలయంలో ‘గబ్బర్‌సింగ్ 2’ పూజా కార్యక్రమాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామిపై చిత్రీకరించిన తొలి దృశ్యానికి సీనియర్ ప్రొడక్షన్ చీఫ్ ప్రకాశ్ కెమెరా స్విచాన్‌గా చేయగా, చిత్రనిర్మాత శరత్ మరార్ తండ్రి జీకే మరార్ క్లాప్ ఇచ్చారు. న్యాయవాది ప్రమోద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.
సంపత్ నంది దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రం విశేషాలను శరత్ మరార్ చెబుతూ -‘‘ఇది ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్ కాదు. ఓ కొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. కథ, రచన పవన్‌కల్యాణ్ పర్యవేక్షణలో జరుగుతోంది. మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, దసరాకి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. డి. సురేష్‌బాబు, కేఎల్‌ఎన్ రాజు, పి. కిరణ్ తదితరులు పాల్గొని, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రానికి రచనా పర్యవేక్షణ: సత్యానంద్, క్రియేటివ్ హెడ్: హరీష్ పాయ్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, కిశోర్ గోపు, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌సాయి.