
తెలుగులో ఘనవిజయం సాధించిన అత్తారింటికి దారేది సినిమాను కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరిగరాసింది. తాజాగా ఈ సినిమాను తమిళ రీమేక్ హక్కులను కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది.
అత్తారింటికి దారేది తమిళ రీమేక్‌లో శింబు హీరోగా నటించనున్నాడట. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు సుందర్.సి డైరెక్ట్ చేయనున్నాడు. అంతేకాదు తెలుగులో నదియ కనిపించిన అత్త పాత్రను కోలీవుడ్‌లో సుందర్ సతీమణి, ప్రముఖ నటి కుష్బూ పోషించనున్నారు. ఇప్పటికే కన్నడలో రీమేక్ అయిన ఈ సినిమా కోలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment