విజయనగరం:అత్తారింటికి దారేది' సినిమాకు విడుదలకు ముందే సమైక్య సెగ తగిలింది. విజయనగరంలో ఈ చిత్ర వాల్ పోస్టర్లును సమైక్యవాదులు గురువారం దహనం చేసి హెచ్చరికలు జారీ చేశారు. కేంద్రమంత్రి చిరంజీవి కుటుంబానికి సంబంధించిన సినిమాలను అడ్డుకుంటామని సమైక్య వాదులు హెచ్చరించారు. చిరంజీవి తక్షణమే రాజీనామా చేసి సమైక్యాంధ్రా కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అత్తారింటికి దారేది చిత్రం సెప్టెంబర్ 27 తేది శుక్రవారం విడుదలకు సిద్ధమవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎఫ్టెక్ట్ తో విడుదల వాయిదా పడిన అత్తారింటికి దారేది చిత్రం పైరసీ సీడీలు కృష్ణా జిల్లా పెడన లో బయటపడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే ఈ చిత్రం అక్టోబర్ 9 తేదిన దసరా కానుకగా విడుదల చేయాలని తొలుత సినీ యాజమాన్యం నిర్ణయం తీసుకున్నా.. ఈ చిత్రం సీడీల రూపంలో బయటకి రావడంతో సినిమా విడుదల తేదీని మార్చక తప్పలేదు. తర్వాత పవన్ కళ్యాణ్, రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.