అక్టోబర్ 9న 'అత్తారింటికి దారేది?', 10న 'రామయ్యా వస్తావయ్యా' విడుదల!
అక్టోబర్ 9న 'అత్తారింటికి దారేది?', 10న 'రామయ్యా వస్తావయ్యా' విడుదల!
Published Wed, Sep 18 2013 5:23 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది?', యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చిత్రం 'రామయ్య వస్తావయ్యా' చిత్రాల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే విజయదశమి కానుకగా భారీ చిత్రాల విడుదలకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిత్రాల విడుదల వాయిదాతో నిరాశకు లోనైన అభిమానులకు మళ్లీ తీయటి వార్త అందనుంది.
దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఆడియో విడుదలతో భారీ అంచాలు నెలకొన్న అత్తారింటికి దారేది చిత్రాన్ని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 9 తేదిన విడుదల చేస్తున్నట్టు నిర్మాత బి.ప్రసాద్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించింది.
అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా రూపొందిన జూనియర్ ఎన్టీఆర్ చిత్రం రామయ్యా వస్తావయ్యా చిత్రాన్ని అక్టోబర్ 10 తేదిన విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. 2008 అక్టోబర్ 9న కొత్త బంగారులోకం, 2010 అక్టోబర్ 14న బృందావనం విడుదలై సూపర్ హిట్ ను సాధించాయి. ఈ విజయదశమి సందర్భంగా 2013 అక్టోబర్ 10 తేదిన రామయ్యా వస్తావయ్యా చిత్రంతో హ్యట్రిక్ సాధించేందుకు సిద్దమవుతున్నాము అని అన్నారు. ఇటీవల థమన్ సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కు యూట్యూబ్ లో అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement