ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు. తాను నిర్మించిన 'గేమ్ ఛేంజర్' సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఏపీలో గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీరిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్‌తో దిల్ రాజు చర్చించనున్నారు.
తెలంగాణలో సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్‌గా చెప్పేశారు. దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది. ఈ క్రమంలో దిల్ రాజు- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా 'గేమ్ ఛేంజర్' జనవరి 10న విడుదల కానుంది. తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్‌షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు. దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది.
ఈమేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్‌షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన్ను కోరనున్నట్లు సమాచారం. జనవరి 4,5 తేదీలలో విజయవాడలో గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్‌ను కోరనున్నారు. ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment