
టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సగం సినిమా పైరసీ ద్వారా బయటకు వచ్చినా.. కలెక్షన్లలో ఈ మూవీ రికార్డులు సృష్టించింది. ఈ చిత్రాన్ని తమిళంలో శింబు హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అప్పట్లో ఈ మూవీ (‘వంత రాజవథాన్ వరువెన్’) టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేయగా.. ‘అత్తారింటికి దారేది’ని ఉన్నది ఉన్నట్టుగా దించేశారని కామెంట్స్ వినిపించాయి. ఈ మూవీని ఫిబ్రవరి ఒకటో తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా ఆకాష్, కేథరిన్ థెరిసాలు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ మూవీకి సుందర్.సి దర్శకత్వం వహించగా.. హిప్ హాప్ తమీజా సంగీతాన్నిఅందించారు. మరి ఈ చిత్రం.. అక్కడ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment