ఐదో వార్డులో ప్రచారంలో స్థానిక నాయకులతో మాట్లాడుతున్న జోగి రమేష్
సాక్షి, పెడన: ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం పునాది వేసింది, రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డేనని.. ఆయన ఆశయాలతో మీ ముందుకు వస్తున్న జగనన్నను గెలిపించుకుందామని నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఐదో వార్డులో గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమం ద్వారా నవరత్నాలు కరపత్రాలను అందజేశారు. తొలుత మహబూబ్ సుభాని జెండా వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన పిమ్మట గడపగడపకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టణంలోని ప్రతి పేదవాడికి ఇండ్ల స్థలంతో పాటు ఇంటిని నిర్మించి ఇచ్చే పూచినాదన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చామని, మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే పేదవాడి కల సాకారం అయ్యేలా ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు ఆయా కాలనీలలో మౌలికవసతులు కల్పించడం జరుగుతుందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించిన ఇందిరమ్మ కాలనీలలో నేటికి కూడా మౌలికవసతలు కల్పించకుండా టీడీపీ ప్రభుత్వం కుట్ర చేసిందని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీ, అక్కాచెల్లిళ్లకు 45 సంవత్సరాలకు రెండో ఏడాది నుంచి ఆయా కార్పొరేషన్లు ద్వారా వడ్డిలేకుండా ఉచితంగా రూ.75వేలను విడతలు వారీగా అందించడం జరుగుతుందన్నారు. పిల్లల చదువు కోసం ప్రతి ఏటా ఉపకారవేతనంగా రూ.15వేలు ఇస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంటు ద్వారా చదువులకు ఆటంకం లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. నవరత్నాల్లోని తొమ్మిది పధకాలను తూచతప్పకుండా అమలు చేసి చూపిస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
పట్టణానికి పూర్తిస్థాయిలో తాగునీరు అందించేలా చూస్తామన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు బండారు మల్లికార్జునరావు, మున్సిపల్ చైర్మన్ బండారు ఆనందప్రసాద్, కౌన్సిలర్లు మెహరున్నీసా, కటకం ప్రసాద్, గరికిముక్కు చంద్రబాబు, పిచ్చిక సతీష్‌బాబు, మెట్లగోపీ ప్రసాద్, పట్టణప్రధాన కార్యదర్శి పోతర్లంక సుబ్రమణ్యం, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి వన్నెంరెడ్డి మహాంకాళరావు, మైనార్టీ నాయకుడు అయూబ్‌ఖాన్, అబ్దుల్‌ఖాదర్ జిలానీ, అబ్దుల్‌హై, వార్డు అధ్యక్ష, కార్యదర్శులు పాషి, అబ్దుల్‌రఫి, రియాజుల్ రహామాన్, కరీం, మజీద్, బాషా, ఆయా విభాగాల నాయకులు భళ్ల గంగయ్య, బట్ట దివాకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment