నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌ | Minister Peddireddy Ramachandra Reddy Says CM YS Jagan To Support Weavers | Sakshi
Sakshi News home page

నేత కార్మికులకు అండగా సీఎం జగన్‌

Published Sat, Jun 20 2020 4:28 PM | Last Updated on Sat, Jun 20 2020 4:48 PM

Minister Peddireddy Ramachandra Reddy Says CM YS Jagan To Support Weavers - Sakshi

సాక్షి, చిత్తూరు: చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొండంత అండగా నిలబడ్డారని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం’ అమలు చేస్తున్నారని తెలిపారు. గతంలో నేత కార్మికులు అప్పుల బాధతో ఆత్మహత్యలకు చేసుకునేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వలసలు లేకుండా సీఎం జగన్‌ వారికి అండగా నిలుస్తున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఆరు నెలల ముందే రెండో విడత ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. నేత కార్మికులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌కు నేత కార్మికులంతా రుణపడి ఉన్నామని అంటున్నారని తెలిపారు. ('చేనేత కష్టాలు చాలా దగ్గరగా చూశా')

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement