
సాక్షి, అమరావతి : సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. చేనేత కార్మికులకు ఆపన్నహస్తం అందించడానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం అమలుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం అమలవుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా మగ్గం ఉన్న నేతన్నలకు ఈ సాయం అందనుంది. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు అవకాశం ఏర్పడుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. మగ్గం ఉన్న కుటుంబాన్నిఒక యూనిట్‌గా పరిగణిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment