Handloom weavers
-
చేనేత భాంధవ్యుల ఆత్మీయ సమ్మేళనం
-
బీమాతో ధీమా, ఆశలు రేకెత్తిస్తోన్న సీఎం కేసీఆర్ ప్రకటన
సాక్షి,హైదరాబాద్: రైతు బీమా తరహాలో రూ.5 లక్షలతో ‘చేనేత బీమా’అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సిరిసిల్లలో చేసిన ప్రకటన.. రాష్ట్రంలో చేనేత, వస్త్ర పరిశ్రమపై ఆధారపడిన కార్మికులు, వారి కుటుంబాల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ కొత్త పథకం మార్గదర్శకాలపై వారిలో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో చేనేత, మరమగ్గాలపై ఆధారపడి సహకార రంగంతో పాటు సహకారేతర రంగంలోనూ పెద్ద సంఖ్యలో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో రాష్ట్ర చేనేత విభాగం పథకం మార్గదర్శకాలపై ఇప్పటికే ప్రాథమిక కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం నేత కార్మికుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘చేనేత మిత్ర’, ‘నేతన్నకు చేయూత’తరహాలో.. కొత్తగా ప్రవేశపెట్టే ‘చేనేత బీమా’పథకాన్ని సహకారేతర రంగంలో ఉన్న వారికి కూడా వర్తింప చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రస్తుతం రైతుబీమా పథకాన్ని 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు ప్రమాదం, అనారోగ్యం, ఆత్మహత్యలు ఇలా..ఏ కారణంతో చనిపోయినా వర్తింపజేస్తున్నారు. అయితే చేనేత బీమా పథకాన్ని ఏ వయసు వారికి వర్తింపజేస్తారనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. క్షేత్ర స్థాయి పరిస్థితులు, ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంశంపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. వలస కార్మికులకూ వర్తింపజేయాలి రాష్ట్రంలో 615 చేనేత సహకార సంఘాలు ఉండగా, చేనేత దాని అనుబంధ రంగాల్లో సుమారు 40 వేలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారు. మరమగ్గాల కార్మికులను కూడా కలిపితే వీరి సంఖ్య 70 వేలకు పైనే ఉంటుందని చేనేత, వస్త్ర పరిశ్రమ విభాగం అధికారులు చెబుతున్నారు. అయితే నేత రంగంలో ఉపాధి లేక ప్రత్యామ్నాయ ఉపాధి వైపు మళ్లినవారు, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని కూడా పరిగణనలోకి తీసుకుంటే లక్షన్నర వరకు నేత కార్మికులు ఉంటారని నేత కార్మిక సంఘాలు చెప్తున్నారు. చదవండి: వాట్సాప్ మరో ఫీచర్, పాస్ వర్డ్ మరిచిపోతే అంతే సంగతులు గతంలో గొర్రెల పంపిణీ యూనిట్ల పంపిణీ సందర్భంగా క్షేత్ర స్థాయిలో గొర్రెల కాపరులతో కొత్త సహకార సంఘాలు ఏర్పాటు చేయడం, సహకార సంఘాల బయట ఉన్న వారికి సభ్యత్వం ఇవ్వడం తదితరాలను ప్రభుత్వం చేపట్టింది. అలాగే చేనేత బీమా పథకం అమలుకు ముందు కూడా అందరినీ సహకార రంగం పరిధిలోకి తెచ్చేలా సభ్యత్వం ఇవ్వాలని నేత కార్మిక సంఘాలు కోరుతున్నాయి. స్థానికంగా ఉపాధి లేక సూరత్, ముంబయి, షోలాపూర్, భివాండీ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన నేత కార్మికులకు కూడా బీమా వర్తింప చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. జీవనజ్యోతి, సురక్ష పునరుద్దరణ? గతంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి జీవన జ్యోతి బీమా యోజన’, ‘ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన’పథకాల అమలుతో నేత కార్మికులకు కూడా ప్రయోజనం చేకూరింది. అయితే రెండేళ్లుగా ఈ పథకాల అమలు నిలిచిపోవడం, వీరికి మరే జీవిత బీమా పథకాలు లేకపోవడంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ చేనేత బీమా పథకంతో పాటు కేంద్ర పథకాలు కూడా తిరిగి అమల్లోకి వస్తే నేత కార్మికుల కుటుంబాలకు బాగా ప్రయోజనం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వయసుతో నిమిత్తం లేకుండా అమలు చేయాలి నేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ దృష్టిలో పెట్టుకుని కొత్త బీమా పథకానికి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయాలి. వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలి. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యల మూలంగా రాష్ట్రం ఏర్పడింది మొదలు ఇప్పటివరకు 360 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ బాధిత కుటుంబాలన్నిటికీ రూ.10 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలి. పదిరోజుల్లోగా మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న చేనేత బీమా పథకం మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నాం. మరో వారం పదిరోజుల్లో ప్రభుత్వానికి సమర్పిస్తాం. ప్రస్తుతం 40 వేలకు పైగా కార్మికులు చేనేత రంగంలో, మరో 30 వేలకు పైగా పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ పథకం ద్వారా వీలైనంత మందికి లబ్ధి జరిగేలా మార్గదర్శకాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం. సంబంధిత రంగానికి చెందిన కార్మికులు, ఇతరుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం. – శైలజా రామయ్యర్, కమిషనర్, చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కు చెందిన పిస్క పోశెట్టి (57) చేనేత కార్మికుడు. ఇతని భార్య కనకవ్వ పవర్లూమ్ కార్మికులకు భోజనం పెడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉండేది. అయితే కరోనా, ఇతర కారణాల నేపథ్యంలో ఇద్దరికీ ఆదాయం లేక ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురయ్యింది. ఈ పరిస్థితుల్లోనే ఈ ఏడాది ఏప్రిల్ 10న పోశెట్టి కొత్త చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్తను కోల్పోయిన కనకవ్వ ప్రస్తుతం తన కుమారునితో కలిసి కిరాయి ఇంట్లో దిక్కుతోచని స్థితిలో అల్లాడుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్లో నివాసముండే బిట్ల చంద్రమౌళి (51)కూడా నేత కార్మికుడే. దివ్యాంగుడైన ఇతనికి ఒక కుమారుడు, కుమార్తె ఉండగా.. కూతురు పెళ్ళికి రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు. మరోవైపు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ పరిస్థితుల్లో చంద్రమౌళి ఇటీవల వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతని భార్య ప్రస్తుతం బీడీలు చుడుతూ కుటుంబాన్ని నడిపేందుకు నానా అవస్థలూ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి చేనేత బీమా ఉపయోగపడుతుందని కార్మిక సంఘాలు అంటున్నాయి. -
ఆర్టీసీ బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఆప్కో వస్త్రాలకు మరింత మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఎంపిక చేసిన ఆర్టీసీ బస్టాండ్లలో అందుకు సంబంధించిన కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. ఇందులో భాగంగా ఆర్టీసీ ఎండీ ఆర్పీ ఠాకూర్‌కు ఆప్కో వైస్ చైర్మన్, ఎండీ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లేఖ రాశారు. ఫ్లిప్‌కార్డ్, అమెజాన్, మింత్ర, పేటీఎం, లూమ్‌ఫ్లోక్స్ తదితర ఈ–కామర్స్ సంస్థలతో ఆప్కో ఎంవోయూ కుదుర్చుకుందని లేఖలో వివరించారు. ఆప్కో వ్యాపారాభివృద్ధికి బస్టాండ్లలో స్టాళ్లు కేటాయిస్తే వ్యాపారం పెరుగుతుందని.. అందువల్ల నామమాత్రపు అద్దెలతో స్టాళ్లను కేటాయించాలని కోరారు. ఇందుకు ఆర్టీసీ కూడా సూత్రప్రాయంగా అంగీకరించింది. స్టాళ్లకు నెలనెలా ఎంత అద్దె వసూలు చేయాలనే అంశాన్ని నిర్ణయించేందుకు త్వరలో నివేదిక ఇవ్వాలని ఎండీ ఠాకూర్ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లు కాగా, ఈ విక్రయ కేంద్రాలను రాష్ట్రవ్యాప్తంగా 15 బస్టాండ్లలో ఏర్పాటుచేయనున్నారు. కార్పొరేషన్లు, ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు ద్వారా చేనేత ఉత్పత్తుల విక్రయాలు పెంచాలన్నదే లక్ష్యం. ముందుగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం బస్టాండ్లలో వీటిని ఏర్పాటుచేస్తారు. అమూల్ మిల్క్ యూనిట్లకు అవకాశం బస్టాండ్లలో ఆప్కో స్టాళ్లకే కాకుండా అమూల్ మిల్క్ యూనిట్లకు స్టాళ్లను కేటాయించేందుకు ఆర్టీసీ సుముఖంగా ఉంది. కొన్ని బస్టాండ్లలో సంగం డెయిరీకి స్టాళ్లను కేటాయించిన సంగతి తెలిసిందే. అమూల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని పాడి రైతుల అభివృద్ధికి పాటు పడుతున్నందున అమూల్ ఉత్పత్తులకూ స్టాళ్లను ఆర్టీసీ కేటాయించనుంది. ఇదేకాక విశాఖపట్నం ద్వారకా బస్టాండ్‌లో మత్స్యశాఖకు ఓ స్టాల్‌ను ఆర్టీసీ అధికారులు ఇటీవలే కేటాయించారు. త్వరలో స్టాళ్లను కేటాయిస్తాం ఆప్కో ఎండీ కోరిక మేరకు రాష్ట్రంలో ప్రధాన బస్టాండ్లలో స్టాళ్లను త్వరలోనే కేటాయిస్తున్నాం. దీనిద్వారా చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగానే ఆర్టీసీ నడుచుకుంటుంది. – ఆర్పీ ఠాకూర్, ఎండీ, ఆర్టీసీ -
నేతన్నలకు బాసటగా శ్రీకాకుళం టెకీలు
సాక్షి, శ్రీకాకుళం: పొందూరు ఖద్దరు.. ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొన్ని తెలుగు సినిమాల్లో కూడా దీని ప్రస్తావన ఉంటుంది. ఎక్కువగా రాజకీయ ప్రముఖులు దీనిని బాగా ఇష్ట పడతారు. ఇవన్ని నాణెనికి ఒక వైపు. పొందూరు ఖద్దరు ఎంత దర్జగా ఉంటుందో దాన్ని నేసే వారి బతుకులు అంత దీనంగా ఉంటాయి. ప్రాణం పెట్టి నేసిన బట్టలను అమ్ముకునే పరిజ్ఞానం కొరవడటంతో నేతన్నలు ఎంతో మోసపోతున్నారు. ఈ క్రమంలో వారికి బాసటగా నిలవడానికి కొందరు యువ టెకీలు ముందుకు వచ్చారు. పొందూరు ఖద్దరు ఉత్పత్తుల అమ్మకం కోసం ఓ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించారు. వివరాలు.. శ్రీకాకుళం జిల్లా పొందూరు ఫైన్ కాటన్‌కు ఎంతో గుర్తింపు. కానీ సరైన మార్కెటింగ్ టెక్నిక్స్ తెలియకపోవడంతో నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం వీరిపై డాక్యుమెంటరీ రూపొందించాలని శ్రీకాకుళానికి చెందిన నలుగురు యువ టెకీలు పోగిరి జవాంత్ నాయుడు, సూరజ్ పోట్నురు, సైలేంద్ర, భరద్వాజ్ నేతన్నలను సంప్రదించారు. ఈ క్రమంలో నేతన్నల కుటుంబాలు రోజుకు కనీసం రెండు వందల రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నారని తెలుసుకుని షాక్ అయ్యారు. వారికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: ‘సిరి’సిల్ల మురుస్తోంది..!) దానిలో భాగంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించారు. వారి ఉత్పత్తులను విక్రయించడానికి గాను చేనేత కార్మికులను దీనిలో చేరేలా ప్రేరేపించారు. ప్రారంభంలో కొందరు ఎంపిక చేసిన కస్టమర్లను ఆహ్వానించారు. ఈ సందర్భంగా జశ్వంత్ నాయుడు మాట్లాడుతూ.. ‘పొందూరు నేతన్నలు ఎదుర్కొంటున్న ఇక్కట్లు మమ్మల్ని కదిలించాయి. వారికి సాయం చేయాలని భావించాం. ఇందుకు గాను ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ రూపిందించాము. దానిలో భాగంగానే ‘లూమ్2హోమ్’ వెబ్ పేజ్ క్రియేట్ చేశాం. ప్రస్తుతం దీన్ని రినోవేట్ చేస్తున్నాం. సోమవారం నుంచి అదనపు పేజీలతో అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. -
ఆశలు అద్దుకుంటున్న మగ్గం బతుకులు
విజయవాడ నుంచి గుంటూరుకు వెళ్తుంటే.. మంగళగిరికి ఇవతల ఆత్మకూరు రోడ్డులోని మసీదుకు దగ్గర్లో ఓ చిన్న ఇంటి నుంచి టకా టకామంటూ శబ్దం వినిపిస్తోంది. అదేంటో అని చూస్తే అందులో 60 ఏళ్ల వ్యక్తి గుంటలో కూర్చొని మగ్గం నేస్తున్నాడు. ఆయన పేరు ఉమ్మలేటి నాగేశ్వరరావు. 60–70 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఇప్పుడు మగ్గం మోగుతోంది. రాట్నం తిరుగుతోంది. కండె పోసుకుంటోంది. కారణం..‘రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నేతన్న నేస్తం పథకం కింద రూ.24 వేల సాయం అందించడమే..’ అంటున్నారు నాగేశ్వరరావు దంపతులు. జీపీ వెంకటేశ్వర్లు, ఎ.అమరయ్య చేనేత.. రాష్ట్ర సంస్కృతి, నాగరికతకు చిహ్నం. ఒకప్పుడు వ్యవసాయం తర్వాత బాగా ఉపాధిని కల్పించిన రంగం. కానీ, నిన్న మొన్నటి వరకు ఈ వృత్తి బాగా చితికిపోయింది. ఈ రంగానికి ఊతమిచ్చే ప్రక్రియలో భాగంగా సీఎం వైఎస్ జగన్ 6 నెలల కాలంలో ఒక్కో కుటుంబానికి రెండు విడతలుగా రూ.48 వేలను అందించారు. దీంతో చేనేతల ఆనందానికి అవధుల్లేవు. వారి జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపిందన్న భావన చేనేతల జీవన స్థితిగతులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వెళ్లిన సాక్షి ప్రతినిధులకు స్పష్టంగా కనిపించింది. రాజకీయాలకు అతీతంగా ఆర్థిక సాయం అందిందని, ఈ నగదు తమ బతుకులు మార్చుకునేందుకు, మగ్గం పునరుద్ధరణకు ఉపయోగపడిందని లబ్ధిదారులే స్వయంగా చెప్పడం గమనార్హం. పరిశీలనలో గుర్తించిన అంశాలివీ.. ► వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద గత ఏడాది డిసెంబర్లో 81,783 కుటుంబాలకు రూ.24వేల వంతున రూ.196.28 కోట్లు సాయం చేసింది. ► ఈ ఏడాది జూన్ 20న 81,024 చేనేత కుటుంబాలకు రూ.194.46 కోట్లు సాయం అందించింది. వాస్తవ కార్మికులు, మగ్గాలున్న వారికే సాయం అందడంతో మగ్గాల్లో కదలిక వచ్చింది. ► ప్రభుత్వ సాయంతో ఎక్కువ మంది మగ్గం నడవడానికి అవసరమైన ముడి సరకుల్నే కొనుగోలు చేశారంటున్నారు నెల్లూరు జిల్లాకు చెందిన నక్కా వెంకటేశ్వరరావు. ► చేనేత కార్మికులకు నేరుగా సాయం చేయడంతో సొంతంగా బట్టలు తయారుచేసుకునే పరిస్థితి ఏర్పడిందని మంగళగిరికి చెందిన ఎం.హనుమంతరావు చెప్పారు. ► నిజానికి రాష్ట్రంలో చేనేతలను మాస్టర్ వీవర్లు తమ కనుసన్నల్లో నడిపించే వారు. వారు పెట్టుబడి సాయం చేస్తేనే కార్మికులు బట్టలు నేసేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. ► చేనేత సహకార సంఘాలకు మంచి రోజులు రానున్నాయి. అప్పులు తీర్చేందుకు ప్రభుత్వం రూ.100 కోట్లకు పైగా ఆప్కోకు నిధులు విడుదల చేసింది. లాక్డౌన్ సమయంలోనూ ఆదుకున్న ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా కష్టాల్లో ఉన్న సుమారు 82 వేల చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.వెయ్యి చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. బియ్యం, కందిప్పు, నూనె వంటి నిత్యావసారాలు కూడా అందించి ఆదుకుంది. 50 ఏళ్లు నిండిన 1,07,674 మంది చేనేతలకు నెలనెలా రూ.2,250ల వంతున పెన్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటోంది. ఇవీ సమస్యలు.. ► ఉత్పాదక వ్యయం పెరగడం ► పరపతి సమస్య ► మార్కెటింగ్ చికాకులు ► ఆధునికీకరణ లేకపోవడం ► బతకలేక ఇతర రంగాల్లోకి వెళ్లిపోవడం.. ► కనీస మౌలిక వసతులు లేకపోవడం ► సరైన పరిశోధన, అభివృద్ధి లేకపోవడం ► విశ్వసనీయ డేటా కొరవడడం పరిష్కార మార్గాలు... ► ఆర్థిక రంగంలో చేనేత పరిశ్రమ సామాజిక, ఆర్థిక ప్రాధాన్యతను గుర్తించడం ► ఆత్మాభిమానంతో మనుగడ సాగించే చేనేత వంటి రంగాలకు ఆర్థికంగా ఊతమివ్వడం ► చేనేత రంగాన్ని కాపాడుకునేందుకు ప్రోత్సహించడం ► ఈ రంగంలోని కొత్త తరాన్ని నూతన ధృక్పథానికి అనుగుణంగా తీర్చిదిద్ది సమీకృతాభివృద్ధిలో భాగస్వాములను చేయడం. నేతన్నల బాగు కోసం అధ్యయనం చేనేతలకు ఎవ్వరూ చేయని విధంగా సీఎం వైఎస్ జగన్ సాయం చేస్తున్నారు. నిరంతరం వీరి బాగు కోసం అధ్యయనం చేస్తాం. సొంతంగా వాళ్లు బట్టలు నేసి అమ్ముకునేలా చేస్తాం. మాస్టర్ వీవర్స్ వద్ద అప్పులు చేసే పరిస్థితిని రానివ్వం. ఆప్కోను గాడిలోకి తీసుకురావడమే కాకుండా వీవర్స్ తయారుచేసిన బట్టలు పూర్తిస్థాయిలో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. – మేకపాటి గౌతమ్‌రెడ్డి, చేనేత జౌళీ శాఖ మంత్రి జగన్ నిర్ణయం దేశానికే ఆదర్శం 15 ఏళ్లుగా చేనేత రంగాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన నేతన్న నేస్తం పథకం దేశానికే ఆదర్శం కావాలి. వడ్డీలు తగ్గించి కనీసం లక్షకు తక్కువ కాకుండా కార్మికునికి రుణం ఇప్పించాలి. ముడి సరుకు కొనుగోలుపై సబ్సిడీ పెంచితే బాగుంటుంది. ప్రభుత్వమే కొనుగోలు దుకాణాలు ఏర్పాటుచేసి మార్కెటింగ్‌ను విస్తృత పరచాలి. – డాక్టర్ దొంతి నరసింహారెడ్డి, జౌళి విధాన రంగ నిపుణులు. ప్రభుత్వమే కొనుగోలు చేయాలి చేనేతల నుంచి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మా సమస్య పరిష్కారమవుతుంది. వ్యాపారులైతే అప్పుకు తీసుకుంటున్నారు. ప్రభుత్వం అడ్డగోలు లాభాలు చూసుకోదు కాబట్టి సామాన్యులకు అనుకూలమైన ధరకు అమ్మడమే కాకుండా నేత నేసిన మాకు కూడా గిట్టుబాటు ధర లభిస్తుంది. – పడవల ఉమామహేశ్వరరావు, బండారులంక, తూర్పుగోదావరి జిల్లా మగ్గం పట్టిన ప్రతి కార్మికునికీ అండగా.. సడుగులిరిగిన మగ్గానికి సీఎం వైఎస్ జగన్ కొత్త వన్నె తెచ్చారు. పడుగు వడుపు పెంచారు. స్వాతంత్య్రానంతర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చేయనంతటి సాహసాన్ని ఆయన చేసి చూపించారు. ఇప్పటివరకు పాలకులు ఆయా వర్గాల నాయకులకే రాయితీలిచ్చి జోకొట్టారు. కానీ, వైఎస్ జగన్ మాత్రం మగ్గం పట్టిన ప్రతి కార్మికునికీ అండగా నిలిచారు. – బొద్దుల కనకరామారావు, చేనేత కార్మికులు, ఆత్మకూరు, గుంటూరు జిల్లా -
చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో చేనేత కార్మికుల సమస్యలపై రాపోలు భాస్కర్ వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. లాక్డౌన్ సమయంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా? ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా? అని ధర్మాసనం ప్రశ్నించగా దీనిపై కౌంటర్ దాఖలు చేశామని అడ్వకేట్ జనరల్ సమాధానమిచ్చారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాచర్ల రంగయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వం నేత కార్మికులకు ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని స్పష్టం చేశారు. లాక్డౌన్ నుంచి ఈ రోజు వరకు రాష్ట్రంలో ఏ ఒక్క చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం కింద ఖాతాలో కనీసం 100 రూపాయలు జమ కాలేదని తెలిపారు. (‘చేయూత’ లాక్ తీశాం..) అందరితోపాటు బియ్యం, రూ.1500 మాత్రమే ఇచ్చిందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం మే 26న షోకాజు నోటీసు ఇవ్వగా ప్రభుత్వం స్పందించి ఇప్పటివరకు తయారైన మొత్తం సరుకును 45 రోజుల్లో కొంటామని తర్వాతే రోజే సర్క్యులర్ జారీ చేసిందని తెలిపారు. కేవలం ప్రధాన న్యాయమూర్తి చలవతోనే ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సమాధానం తప్పులతో కూడి ఉందని, తగిన సమాచారంతో ఒక రీజాయిండర్ వేస్తామని తెలిపారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోఆపరేటివ్ సొసైటీల నుంచి సమాచారం సేకరించాల్సి ఉంటుందని, అందుకు వారం రోజుల గడువు న్యాయస్థానాన్ని కోరారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం పది రోజుల గడువు ఇచ్చింది. (చేనేత, హస్తకళలకు మరింత ప్రోత్సాహం) -
చేనేతలకు ఆపన్నహస్తం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని.. చేనేత కార్మికుల స్థితిగతులను మార్చి వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు అపూర్వ సంక్షేమ పథకం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ను ప్రవేశపెడుతోంది. వారిని ఆర్థికంగా ఆదుకోవాలని, హస్త కళలకు పూర్వ వైభవం తేవడమే కాకుండా కేవలం మగ్గాలపై ఆధారపడి బతుకుతున్న వారికి మరింత తోడ్పాటునివ్వడం ఈ పథకం ముఖ్యోద్దేశ్యం. ఒక్కో మగ్గం నిర్వహణకు రూ.24 వేలు ఆర్థిక సాయం ఇస్తానని ప్రజా సంకల్ప యాత్రలోనే వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఈనెల 21న అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. (చదవండి : రాష్ట్రంలో 5 వేల ఆరోగ్య ఉపకేంద్రాలు) ముడిసరుకు కొనుగోలుకు అవకాశం మరమగ్గాలు వచ్చిన తరువాత చేనేతలకు కొంత ఇబ్బంది ఏర్పడింది. దీంతో చేతి ద్వారా నేత నేసే నేతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈ ఆర్థిక సాయం తోడ్పాటునిస్తుందని చేనేత వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చే సాయంతో మగ్గాలను బాగు చేయించుకోవడం, నూలు, రంగులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మగ్గంపై నేత నేయాలంటే నేత కార్మికుడు అప్పుచేయాల్సిందే. అది కూడా ముందుగానే చీరలు, ఇతర వస్త్రాలు కొనుగోలు చేసే పెట్టుబడిదారుల నుంచి అప్పులు తీసుకుంటారు. వీటిని తీర్చలేక నేసిన వస్త్రాలు వారికే విక్రయిస్తారు. అప్పు ఇచ్చిన వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి వీరికి ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్న హస్తం అందించాలని సంకల్పించి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’కు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 81,783 మంది నేతన్నలను గుర్తించారు. అలాగే, ఇందుకోసం రూ.196.27కోట్లు ఖర్చు చేయనుంది. అర్హులు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పిస్తోంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా ధర్మవరం, హిందూపురం, ఉరవకొండ.. ప్రకాశం జిల్లాలోని చీరాల, కందుకూరు.. గుంటూరు జిల్లా మంగళగిరి, కృష్ణాజిల్లా పెడన, నెల్లూరు జిల్లా వెంకటగిరి, చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, మదనపల్లి, కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, కోడుమూరు, వైఎస్సార్ జిల్లాలోని దొమ్మరనంద్యాల, వేపరాల, మాధవరం, అప్పనపల్లె వంటి పేరుగాంచిన పల్లెలు, పట్టణాల్లో ఎక్కువగా నేతన్నలు వస్త్రాలు తయారుచేస్తున్నారు. ఏ ప్రభుత్వం చేయని విధంగా.. నేను పదో తరగతి వరకు చదువుకున్నా. ఆర్థిక ఇబ్బందులవల్ల పై చదువులకు వెళ్లలేకపోయా. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేత నేస్తూనే ఉన్నా. ఇప్పటివరకు చేనేత కార్మికులను ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. జగనన్న ఇచ్చిన మాట ప్రకారం ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద రూ.24వేలు ఆర్థిక సాయం అందించడం ఎంతో సంతోషం. దీంతో ఆధునిక పరికరాలు కొనుగోలుకు వెసులుబాటు కలుగుతుంది. – మరక షణ్ముఖరావు, పెడన, కృష్ణా జిల్లా -
‘పోచంపల్లి ఇకత్ మేళా’ షురూ
-
మరో పథకానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి : సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. చేనేత కార్మికులకు ఆపన్నహస్తం అందించడానికి ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం అమలుకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం కింద సొంత మగ్గం కలిగిన చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేలు అందిస్తారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వైఎస్సార్ నేతన్న నేస్తం అమలవుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా మగ్గం ఉన్న నేతన్నలకు ఈ సాయం అందనుంది. ఈ పథకంతో నేతన్నల మగ్గం ఆధునీకరణ, నూలు కొనుగోలుకు అవకాశం ఏర్పడుతుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబం ఈ పథకానికి అర్హులు. మగ్గం ఉన్న కుటుంబాన్నిఒక యూనిట్‌గా పరిగణిస్తారు. -
అనంతలో సినీతార పూనమ్‌కౌర్ సందడి
-
‘రాజకీయ జీవితం ఉన్నంతవరకూ ఇక్కడే’
సిరిసిల్ల: ఐటీ, పట్టణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం సిరిసిల్ల అభివృద్ధిపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిరిసిల్లను కేటీఆర్ విడిచి వెళ్లడం జరగదని, రాజకీయ జీవితం ఉన్నంతవరకూ ఇక్కడ ప్రజలతోనే ఉంటానని అన్నారు. చేనేత కార్మికులు గౌరవంగా బతికే ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం నేత కార్మికుల సంక్షేమానికి రూ.200 కోట్లు ఇచ్చామని కేటీఆర్ తెలిపారు. వచ్చే దసరా నాటికి 400 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ వర్షాకాలంలో మిడ్మనేర్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని నిల్వ చేస్తామన్నారు. ఆరు నెలల్లో ఇంటింటికి నల్లా నీరు వచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ అనేక కార్యక్రమాల్లో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కాగా కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. -
చేనేత పరిస్థితిపై సర్వే
ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: చేనేత కార్మికుల వివరాలను గ్రామాలవారీగా సేకరించి, చేతిమగ్గాల పరిస్థితిని తెలుసుకోవడానికి ప్రత్యేక బృందాలతో సర్వే చేయించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్ ఆదేశించారు. దీనిపై 14 అంశాలతో ప్రొఫార్మా పంపామని, మార్చి 5లోగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ చేయించనున్నట్లు తెలిపారు. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణంలో 2015–16కు సంబంధించి నియో జకవర్గానికి 1,000 ఇళ్లను మంజూరు చేసినందున వాటికి అవసరమైన ల్యాండ్ బ్యాంక్ ను సిద్ధం చేసి 25 ఫిబ్రవరిలోగా సమర్పించాలని ఆదేశించారు. బుధవారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరా ఆవాస్ యోజన కింద చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేస్తామన్నారు. గృహ నిర్మాణ టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. బీడీ కార్మికుల వివరాలు పంపాలి బీడీ కార్మికులకు గతంలో కేంద్రం ద్వారా మంజూ రు చేసిన వివరాలు, డబుల్ బెడ్ రూమ్ గృహాలకు సంబంధించిన వివరాలను ఈ నెల 25లోగా సమర్పించాలని సీఎస్ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న గొర్రెల యూనిట్లకు సంబంధించి జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా అందుబాటులో ఉన్న వివరాలు, డిమాండ్ సర్వే ఈ నెల 27 లోగా సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. సాదా బైనామాల రెగ్యులరైజేషన్, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాల దరఖాస్తుల వెరిఫికేషన్‌ను వేగవంతం చేసి లబ్ధిదారులకు డబ్బులు అందేలా చూడాలని ఆదేశించారు. పరిహారం చెల్లింపులో పెండింగ్ వద్దు అత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులు పెండింగ్‌లో లేకుండా చూడడంతోపాటు అవసరమైన నిధుల వివరాలను సమర్పించాలని జిల్లా కలెక్టర్లను సూచించారు. మిషన్ భగీరథ ట్రంక్ వర్క్స్‌తోపాటు ఇంట్రా విలేజ్ పనులు వేగవంతం చేయాలన్నారు. గ్రామా ల్లో హరిత రక్షణ కమిటీల ద్వారా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. -
సోమవారం.. చేనేత వారం
ప్రభుత్వ ఉద్యోగులు ధరించేలా ప్రోత్సాహం కలెక్టరేట్లో ‘టెస్కో’ ఆధ్వర్యాన స్టాల్ వచ్చే వారం నర్సంపేట.. ఆపై వర్ధన్నపేట, పరకాలలో... చేనేత రంగం పరిరక్షణకు కలెక్టర్ చొరవ హన్మకొండ : చేతి నిండా పని.. మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ బతికిన చేనేత కార్మికులు ఇప్పుడు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కార్మికులకు నేసిన వస్త్రాన్ని కొనుగోలు చేసే వారు లేక.. మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో తెలియక.. పని కరువై పొట్ట కూటి కోసం తిప్పలు పడిన నేతన్నకు మంచి రోజులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. చేనేత వస్త్రాలు ధరించడంపై అవగాహన కల్పించడమే కాకుండా రాష్ట్ర మంత్రి మొదలు జిల్లా కలెక్టర్ వరకు వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించాలని నిర్ణయించడం.. దీనిపై ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండడంతో వస్త్రాల అమ్మకాలు పెరిగేందుకు ఆస్కారం ఉంది. ఇదేకాకుండా వరంగల్ రూరల్ జిల్లాలోని శాయంపేటలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కిందమంజూరైన డైయింగ్, హ్యాండ్లూమ్ యూనిట్ ఏర్పాటుతో చేనేత కార్మికులు నూతన డిజైన్లలో వస్త్రాలను రూపొందించడం ద్వారా మార్కెట్ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆచరణలోనూ చూపించిన కలెక్టర్ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సూచన మేరకు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రతీ సోమవారం చేనేత వస్త్రాలు ధరించాలని కోరిన వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆచరణలోనూ చేసి చూపిస్తున్నారు. అందరిలో స్ఫూర్తి నింపేలా ఆయన కూడా సోమవారం చేనేత వస్త్రాలు ధరించడమే కాకుండా ఉద్యోగులందరికీ అందుబాటులో చేనేత వస్త్రాలు ఉండేలా ఏకంగా కలెక్టరేట్లో ‘టెస్కో’ ఆధ్వర్యాన అమ్మకాల కోసం స్టాల్ ఏర్పాటుచేయించడం విశేషం. రెండు రోజుల పాటు కొనసాగిన ఈ స్టాల్ మంగళవారం ముగిసింది. అంతేకాకుండా ప్రతీ వారం జిల్లాలోని ఓ ప్రాంతంలో స్టాల్ ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్ ఈ సందర్భంగా ప్రకటించారు. 16వేల మంది ఉద్యోగులు జిల్లాలో ఉన్న 16వేల మంది ఉద్యోగులు ప్రతీ సోమవారం ధరించేందుకు చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తే కార్మికులకు ఉపాధి చూపించినట్లవుతుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ చెబుతున్నారు. అంతేకాకుండా వారంవారం గ్రీవెన్ససెల్ జరిగే రోజుల్లో ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించడం ద్వారా.. వినతిపత్రాలు, ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు చేనేత ఆవశ్యకతను చాటిచెప్పినట్లవుతుందనేది కలెక్టర్ భావన. అంతేకాకుండా చేనేత వస్త్రాలు కొనుగోలు చేయాలనుకునే ఉద్యోగుల కోసం ప్రత్యేక పథకం ప్రకటించారు. ఈ పథకం ద్వారా ప్రతి ఉద్యోగి నెలకు రూ.వెయ్యి చొప్పున తొమ్మిది నెలల పాటు చేనేత సహకార సంఘంలో చెల్లిస్తే.. తర్వాత వారు రూ.16,500 విలువైన వస్త్రాలు కొనుగోలు చేసేలా అవకాశం కల్పించనున్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరుతున్నారు. అటు కలెక్టర్ చొరవ.. ఇటు ప్రభుత్వ పథకాలు అమలైతే చేనేత రంగానికి మంచి రోజులు వచ్చేందుకు ఇంకా ఎన్నో రోజులు పట్టదని చెప్పొచ్చు. -
‘చేనేత’ను ఆదుకోవడంలో సర్కార్ విఫలం: తమ్మినేని
వర్ని: చేనేత కార్మికులను ఆదు కోవడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మహాజ న పాదయాత్రలో భాగంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో బుధవారం చేనేత కార్మికుల కుటుంబాలను ఆయన పరామర్శిం చారు. చేనేత వృత్తి గిట్టుబాటు కాక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుం టున్నారని, ప్రభుత్వమే వారు నేసిన బట్టలను కొని ప్రభుత్వ ఉద్యోగులకు యూనిఫా రంగా అందజేయాలన్నారు. ఇటీవల పాముకాటుతో మృతిచెందిన చిన్నారి దీక్షిత కుటుంబాన్ని వీరభద్రం పరామర్శించారు. రుద్రూర్ బ్యాంకు వద్ద పెద్ద నోట్ల రద్దు వల్ల పడుతున్న ఇబ్బందులపై స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. బీడీ, గీత కార్మికుల సమ స్యలు పట్టించుకోని ప్రభుత్వం.. సమస్యలున్నాయని గళమెత్తితే లాఠీ చూపిస్తోందన్నారు. బోధన్‌లో పర్య టిస్తూ ఎస్సీ కార్పొ రేషన్ ద్వారా సబ్సిడీ రుణాలకు ఎంపికైన లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులను కార్పొరేషన్ చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. -
చేనేతకు గోకూప్ చేయూత..!
ఆన్లైన్లో చేనేత ఉత్పత్తుల విక్రయం • 10 రాష్ట్రాల్లోని 275 సంఘాలతో ఒప్పందం • చీరలు, బ్యాగులు, నగల వంటి 20 వేలకుపైగా ఉత్పత్తులు • నెలకు 5 వేల ఆర్డర్లు; 30 శాతం విదేశాల నుంచే • 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ • గుజరాత్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తరణ కూడా.. • ‘స్టార్టప్ డైరీ’తో గోకూప్ ఫౌండర్ అండ్ సీఈఓ శివ దేవిరెడ్డి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చేనేత కార్మికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాల్లో చాటిచెప్పే చీరలను నేసేదీ వీళ్లే! మరి, నిజంగా దేశంలో నేత కార్మికులకు అంతటి గౌరవం దక్కుతోందా..? సమాధానం కష్టమే! గౌరవం సంగతి పక్కన పెడితే కనీసం వారి కష్టానికి తగిన ప్రతిఫలమూ దక్కట్లేదు. ఒక్క చీరలే కాదు! నేత కార్మికులు తయారు చేసే ప్రతి ఉత్పత్తీ ప్రజాదరణ ఉన్నదే. కాకపోతే వారికి తెలియం దల్లా... ఆయా ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేసుకోవాలని!! ఇదిగో.. అలాంటి కష్టాలకు చెక్ చెబుతోంది ‘గోకూప్’! రూ.80 లక్షల పెట్టుబడితో 2011లో బెంగళూరు కేంద్రంగా ప్రారంభమైన గోకూప్ సొల్యూషన్స అండ్ సర్వీసెస్ సేవలు, విస్తరణ ప్రణాళికల గురించి సంస్థ వ్యవస్థాపక సీఈఓ శివ దేవిరెడ్డి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ‘‘గోకూప్ అంటే ‘గో’ అంటే విశ్వమంతా(గ్లోబల్); ‘కూప్’ అంటే నలుగురం కలిసి (కో-ఆపరేటివ్) అని అర్థం. మొత్తంగా కలిపితే.. విశ్వమంతా నలుగురం కలిసి ముందుకెళదామని దానర్థం. దేశంలోని అన్ని చేనేత సంఘాలు, కార్మికుల దగ్గరకు స్వయంగా గోకూప్ వెళుతుంది. వారి ఉత్పత్తులను ఆన్లైన్ వేదికగా విక్రరుుంచేందుకు వారితో ఒప్పందం చేసుకుంటుంది. తయారైన ఉత్పత్తులను ఫొటోలు తీసి.. ధరలను నిర్ణరుుంచి.. ఆన్లైన్లో అప్లోడ్ చేస్తుంది. కస్టమర్ నుంచి ఆర్డర్ రాగానే గోకూప్ ఉద్యోగి ఆయా ఉత్పత్తులుండే ప్రాంతానికి వెళ్లి ఉత్పత్తిని పరీక్షించి, ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాడు’’ అని. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే. 10 రాష్ట్రాలు.. 275 సంఘాలు..: ప్రస్తుతం గోకూప్ 10 రాష్ట్రాల్లోని 275 చేనేత సంఘాలతో ఒప్పందం చేసుకుంది. ఆప్కో, బోయంక, కేహెచ్డీసీ, ఇంద్రయాని, పోచంపల్లి, కోయల్గూడెం, ఉత్కళ్ వంటి దేశంలోని ప్రముఖ సంఘాలన్నీ ఒప్పందాలు చేసుకున్నారుు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒరిస్సా, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని సుమారు 60 వేల మంది చేనేత కార్మికులు ఉత్పత్తులను తయారు చేస్తుంటారు. ఆయా ఉత్పత్తులను గోకూప్ వేదికగా ఆన్లైన్లో విక్రరుుంచడమే మా వ్యాపారం. ఒక్కో ఆర్డర్‌పై కొనుగోలుదారు నుంచే 5-10 శాతం కమిషన్ రూపంలో తీసుకుంటాం. 30 శాతం ఆర్డర్లు విదేశాల నుంచే.. మహిళలు, పురుషుల విభాగంలో అన్ని రకాల చేనేత దుస్తులు, బ్యాగులు, పర్సులు, నగలు, హోం ఫర్నిచర్, హస్త కళలు వంటి ఉత్పత్తులున్నారుు. సుమారు 20 వేలకు పైగా ఉత్పత్తులు నమోదయ్యారుు. ప్రస్తుతం నెలకు 4-5 వేల ఆర్డర్లొస్తున్నారుు. ఇందులో 30% ఆర్డర్లు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల నుంచి వస్తున్నవే. మా మొత్తం వ్యాపారంలో 60 శాతం వాటా చీరల విభాగానిదే. పోచంపల్లి, మంగళగిరి, సంబల్పురి, ఇక్కల్, తుస్సార్ వంటి అన్ని రకాల సంప్రదాయ చేనేత చీరలున్నారుు. ఉత్పత్తుల డెలివరీ కోసం ఇండియా పోస్ట్, ఫెడెక్స్, డీటీసీపీ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. మరో 3 రాష్ట్రాలకు విస్తరణ.. ప్రస్తుతం గోకూప్లో 50 మంది ఉద్యోగులున్నారు. ప్రతి ఏటా 100 శాతం వ్యాపారం వృద్ధి చెందుతోంది. ఇప్పటివరకు ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ క్రిస్ గోపాలకృష్ణన్, ఇండియన్ ఏంజిల్స్, సాహా ఫండ్స, మరో ఇద్దరు ఇన్వెస్టర్లు గోకూప్లో పెద్ద మొత్తంలోనే పెట్టుబడులు పెట్టారు. 2017 ముగింపు నాటికి రెండో విడత నిధుల సమీకరణ చేయాలని నిర్ణరుుంచాం. వీసీ ఫండ్స కోసం చూస్తున్నాం. వీటి సహాయంతో గుజరాత్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ విస్తరించాలని లక్ష్యించాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
చేనేత ప్రదర్శనలో ఆకలి కేకలు
శ్రీకాకుళం టౌన్: చేనేత వస్త్రాల విక్రయానికి ఏర్పాటు చేసిన ప్రదర్శనలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన దుకాణదారులకు ఆకలిదప్పులు తప్పలేదు. రెండు దశాబ్దాలుగా ప్రదర్శన నిర్వహణ వ్యయాన్ని చేనేత జౌళిశాఖ పెంచకపోవడంతో అమ్మకందారులకు భోజనం కూడా పెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటామని వేదికలపై చెప్పడం తప్ప క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. చేనేత వస్త్రాలను నేతకార్మికుల నుంచి సొసైటీల ద్వారా సేకరిస్తారు. వాటిని మార్కెట్లో విక్రయించి వచ్చిన లాభాలను జీతాలుగా పంచుకోవడం ఎన్నోఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. ఏడాదికొకసారి ప్రతి జిల్లాలో చేనేత వస్త్రాల విక్రయ ప్రదర్శన తప్పనిసరి. విక్రయ ప్రదర్శనకు చేనేత జౌళిశాఖ జిల్లా శాఖలకు అనుమతిస్తుంది. ఈ అనుమతి మేరకు ప్రదర్శన నిర్వహణకు ఆశాఖ ఉన్నతాధికారులు రూ. 2 లక్షల నిధులు చెల్లిస్తారు. 1994లో నిర్ణయించిన మేరకు ప్రదర్శన పది రోజుల పాటు ఉండాలి. అయితే రెండు దశాబ్దాలు దాటినా నిర్వహణ వ్యయం పెంచకపోవడంతో వచ్చిన అమ్మకందార్లకు భోజనాలు కూడా పెట్టుకోలేని స్థితిలో చేనేత జౌళిశాఖ ఉంది. గతంలో ప్రదర్శనకు 10 రోజులు అవకాశం ఉండేది. నిర్వహణ వ్యయం పెంచని అధికారులు ప్రదర్శనను ఎనిమిది రోజులకు తగ్గించారు. దీంతో అమ్మకాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయని అమ్మకందారులు వాపోతున్నారు. ఈ నెల 16 నుంచి 24 వరకు ప్రదర్శన జిల్లా కేంద్రంలో ఈ నెల 16 నుంచి 24వ తేదీ వరకు రైస్ మిల్లర్స్ హాల్ వరండాలో చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించారు. ఆరు జిల్లాల నుంచి చేనేత వస్త్రాలతో దుకాణదారులు హాజరయ్యారు. చేనేత వస్త్రాలను విక్రయించేందుకు వచ్చిన వారు సొసైటీ సభ్యులే కావడంతో వారికి భోజన వసతి సౌకర్యాలు సొసైటీలే సమకూర్చుకోవాల్సి వస్తోంది. రోజూ ఒక్కో దుకాణంలో రూ. 5వేల వరకు విక్రయాలు జరుగుతున్నాయని, అందులోనే 12 శాతం నిధులు దుకాణంలో వినియోగించుకుంటున్నామని అమ్మకందారులు వాపోతున్నారు. చేనేత జౌళిశాఖ ఏడీ రాజారావు ఏమన్నారంటే... ఈ ఏడాది అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శన వల్ల అమ్మకాల్లో గిరాకీ గుర్తించాం. అందువల్లే మూడు నెలల్లో మళ్లీ చేనేత ప్రదర్శన ఏర్పాటు చేశాం. రాష్ట్ర స్థాయిలో ప్రదర్శన నిర్వహణకు రూ. 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు. వాటితోనే ప్రచారం, ప్రారంభోత్సవ కార్యక్రమం, ప్రదర్శన వద్ద మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. పెరిగిన ధరలకు తగ్గట్టు నిర్వహణ వ్యయం పెంచాల్సి ఉంది. ఉన్నతస్థాయిలో అనేకమార్లు అడినప్పటికీ నిధులు పెంచక పోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. -
మురుగులమ్మకు 365 గజాల చీర!
తూర్పు గోదావరి జిల్లా బండార్లంకలోని చేనేత కార్మికులు ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా 365 గజాల చీరను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన అతి పెద్ద పడుగు (చీర తయూరీకి అవసరమైన నూలును కర్రలపై పరిచి సాఫు చేసే ప్రక్రియ)తో పట్టిన అల్లు (నూలును నేసేందుకు వీలుగా చుట్టే పనిముట్టు) చూసేందుకు జనం తరలివచ్చారు. గురువారం నుంచి బండార్లంకలోని చేనేత సహకార సంఘం మగ్గంపై నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు ఈ చీరను నేస్తారు. ఈ చీరను గ్రామదేవత గంగాదేవి మురుగులమ్మవారికి సమర్పిస్తామని వరదరాజులు చెప్పారు. - అమలాపురం రూరల్ -
'అర్హులైన చేనేత కార్మికులకు పింఛన్లు'
కొండపాక (మెదక్ జిల్లా) : అర్హులైన చేనేత కార్మికులందరికీ పెన్షన్లు మంజూరు చేయించే బాధ్యత తమదేనని కార్మిక కుటుంబాలకు మంత్రి తన్నీరు హరీష్‌రావు భరోసా ఇచ్చారు. మండల పరిధిలోని దుద్దెడ గ్రామ చేనేత కార్మిక కుటుంబాలకు ఆసరాగా నిలిచేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.25 లక్షలతో వర్కు షెడ్ నిర్మాణానికి మంగళవారం గ్రామ చేనేత సహకార సంఘం అధ్యక్షులు రాజగిరి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో మంత్రి హరీష్‌రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చేనేత సహకార సంఘాల్లో కార్మికులు నేసిన బట్టలను ఆప్కో వారు కొనుగోలు చేసేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుందన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఇదివరకు ఉన్న అంత్యోదయ కార్డులు రద్దవ్వడానికి కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్రంలో 50 వేల అంత్యోదయ కార్డులకు గాను 20 వేల పైచిలుకు అంత్యోదయ కార్డులకు కేంద్ర ప్రభుత్వం కోతవిధించిదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఒక్కొక్కరికి ఇచ్చే 4 కిలోల బియాన్ని 6 కిలోల వరకు ఇచ్చేలా నిర్ణయం తీసుకొని రేషన్ దుకాణాల నుంచి సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన సంఘ భవనాన్ని పూర్తి చేసేందుకు నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తామన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో ప్రతీ ఇంటికి వాటర్‌గ్రిడ్ పథకంలో నల్లా కనెక్షన్ ద్వారా నీరు వచ్చేలా చూసేందుకు ప్రభుత్వం రూ. కోటీ 30లక్షలను మంజూరు చేసిందన్నారు. మూడునాలుగు నెలల్లో ఈ పనులు పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. తెలంగాణా కోసం జరుగుతున్న మలిదశ ఉద్యమంలో దుద్దెడ గ్రామ చేనేత కార్మికులు దుద్దెడ నుంచి హైదరాబాద్‌లోని తెలంగాణా భవన్ వరకు మగ్గంపై చీరను నేసుకుంటూ వెళ్ళారని.. దీంతో గ్రామ ప్రజల ఉద్యమ స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. దుద్దెడ గ్రామ ప్రజల పట్ల సీఎం కేసీఆర్ ఒక ప్రత్యేకతను కనబరుస్తున్నారని గుర్తు చేశారు. దేవాదుల నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా మండలంలోని 11 గ్రామాలకు కాలువల ద్వారా నీటిని మళ్ళించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల రూ. 40 కోట్లు మంజూరు చేశారని మంత్రి చెప్పారు. ఫలితంగా 15వేల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో గఢా అధికారి హన్మంతరావు, ఎంపీపీ అనంతుల పద్మా-నరేందర్, సర్పంచ్ పెద్దంకుల శ్రీనివాస్, ఉపసర్పంచ్ బాల్నర్సు, ఎంపీటీసీ బాకీ భూమవ్వ, సర్పంచ్‌లు ఏర్పుల యాదయ్య, కనకారెడ్డి,ఎంపీపీ ఉపాధ్యక్షులు రాధాకిషన్‌రెడ్డి, నియోజక వర్గ ఇంచార్జి మడుపు భూంరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ర్యాగల దుర్గయ్య, యూత్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, నాయకులు బొద్దుల కనుకయ్య, దేశాయిరెడ్డి, వడ్లకొండ శ్రీనివాస్, చేనేత కార్మిక సంఘం నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు. -
చితికిపోతున్న చేనేత బతుకులు
- ముడి సరుకు పంపిణీని నిలిపేసిన పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ - పనిలేక వలసపోతున్న చేనేత కార్మికులు - ఆదుకునేవారే కరువయ్యారంటూ ఆవేదన సంతకవిటి: చేనేత బతుకులు చితికిపోతున్నాయి. మొన్నటి వరకు దర్జాగా బతికినవారు నేడు పనులు లేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నారు. మరికొందరు పొట్టచేతపట్టుకుని వలసపోతున్నారు. దీనికి సంతకవిటి మండలంలోని సురవరం, మందరాడ, మామిడిపల్లి, కాకరాపల్లి, మండాకురిటి తదితర గ్రామాల్లోని వందలాది చేనేత కార్మిక కుటుంబాల జీవనకష్టాలే సజీవసాక్ష్యం. ఈ గ్రామాల్లోని చేనేత కార్మికులు పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ కార్మికాభివృద్ధి సంస్థలో సభ్యులుగా ఉండేవారు. దీంతో సంస్థ ముడిసరుకును అందజేస్తే వాటిని మగ్గాలపై నూలువడికి తిరిగి సరఫరా చేసేవారు. దీంతో మహిళలకు కూడా చేతినిండా పని ఉండేది. సీజన్‌తో సంబంధం లేకుండా పనిదొరికేది. ఇంటిదగ్గరే ఉంటూ రోజుకు రూ.60 నుంచి రూ.70వరకు ఆదాయం పొందేవారు. పురుషులు వస్త్రాలను నేసి డబ్బులు సంపాదించేవారు. దీంతో జీవనం సాఫీగా సాగిపోయేది. ఏడాదిగా ఆంధ్రాఫైన్ కార్మికాభివృద్ధి సంస్థ వీరి బాగోగులను పక్కనపెట్టింది. ముడిసరుకైన పత్తిని ఇవ్వడం నిలుపుదలచేసింది. ఫలితంగా వీరికి పనిలేక రోడ్డున పడ్డారు. ఈ గ్రామాల్లోని సుమారు 300 కుటుం బాల జీవనం దుర్భరంగా మారింది. చాలామంది గుంటూరు, చీరాల ప్రాంతాలకు వలసవెళ్తున్నారు. మరికొంత మంది తమ కుటుంబ సభ్యులను విడిచిపెట్టి విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు చేనేత కార్మికులు పనిలేక పస్తులతో కాలం వెల్లదీస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యార ని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు, ప్రోత్సాహకాలు అందజేయడం లేదని, అర్హులకు కొత్తగా పింఛన్లు కూడా మంజూరు చేయడంలేదంటూ వాపోతున్నారు. ముడిసరుకు లభించడంలేదు... గతంలో జిల్లాలో పత్తి విరివిగా లభించేంది. చౌకగా కొనుగోలుచేసి సురవరంలోని చేనేత కార్మికులుకు అందించేవాళ్లం. వారు వాటిని ఒడికి నూలు తయారుచేసి మాకు ఇచ్చేవారు. గతేడాది నుంచి పంటలు పండక పత్తి దొరకడం లేదు. అందుకే ముడిసరుకు అందించలేకపోతున్నాం. - కె.సుధాకర్, పొందూరు ఆంధ్రాఫైన్ ఖాదీ సంస్థ ప్రతినిధి ఇబ్బందులు పడుతున్నాం... ముడిసరుకు ఇవ్వకపోవడంతో మాకు పనులులేవు. ఉపాధిపనులు కూడా వేసవిలో తూతూ మంత్రంగా ఉంటున్నాయి. మరోవైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి పోతున్నాయి. బతకడం కష్టంగా మారింది. - దువ్వాకుల సుశీల, చేనేతకార్మికరాలు, సురవరం వలసలే గతి.. స్థానికంగా పనిలేక గ్రామంలో పురుషులంతా పట్టణాలకు వలసబాటపడుతున్నారు.అక్కడ కష్టంగా ఉండడంతో మహిళలను తీసుకెళ్లడంలేదు. మేం ఇంటివద్దే ఉంటున్నాం. -ఎ.వరలక్ష్మి, చేనేత కార్మికరాలు, సురవరం -
సార్.. మమ్మల్నీ చంపేస్తారేమో..!
ధర్మవరంలో నరకం అనుభవించాం.. బాకీ తీరిస్తేనే మగ్గాల నుంచి బయటకు.. ఇక్కడికి వచ్చినా వెంటాడి వేటాడారు.. భయాందోళనకు గురవుతున్న బాధితులు, వలస చేనేత కార్మికులు కురబలకోట : ‘సార్.. మా వాడు రవి వీవర్స్ దారుణనానికి బలయ్యాడు.. మమ్మల్ని కూడా చంపేస్తారేమో.. భయమేస్తోంది..’ అంటూ ధర్మవరం నుంచి మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వలస వచ్చిన చేనేత కార్మికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలల క్రితం ధర్మవరం నుంచి వచ్చిన ఏ.రవి దారుణ హత్యకు గురికాగా, ఆదివారం అమ్మచెరువు మిట్ట వినాయక చేనేతనగర్ వద్ద మృతదేహాన్ని కనుగొన్న విషయం విదితమే. మద నపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం సోమవారం బాధిత కుటుం బీకులను రూరల్ సీఐ మురళి విచారించారు. ధర్మవరంలో మాస్టర్ వీవర్స్ సొసైటీని నాగరాజు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడని, ఇతనికి వందలాది మగ్గాలు కూడా ఉన్నాయని బాధితులు వివిరించారు. ఇతని వద్ద పనిచేసే వారికి అప్పు ఇస్తాడని, ఆ తర్వాత తీర్చకపోతే బయటకు వదలడని.. దీంతో నరకం అనుభవించాల్సిందేనని వాపోయారు. బాకీ తీరే వరకు వెట్టి చాకిరీ చేయాల్సిందేనన్నారు. కార్మిక, చేనేత, జౌళి శాఖల అధికారులు విచారణ జరిపినా తూతూమంత్రంగానే ఉంటాయని చెప్పారు. అతనంటే అందరికీ భయమేనన్నారు. ఎదు రు తిరిగితే శాల్తీలు గల్లంతవుతాయని హెచ్చరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఇతని బారి నుంచి తప్పించుకునేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రజాప్రతినిధికి మద్దతు పలకగా అద ృష్టవశాత్తు గెలిచాడన్నారు. ఆయన చొరవతో 500 మంది దాకా వీవర్స్ నిర్వాహకుడి వెట్టి నుంచి బయటపడ్డారన్నారు. తర్వా త తలో దిక్కుకు వెళ్లి బతుకు జీవుడా.. అంటూ కాలం వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కూడా 20 కుటుంబాల వాళ్లం రెండు నెలల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు వచ్చామన్నారు. ఇక్కడ ఇంకా సరిగ్గా కుదురుకోకనే ధర్మవరం వీవర్స్ సొసైటీ వారు ఓర్వలేక పోయారని, వెంటాడి రవిని హత్య చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. అంత దూరం నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా బతకనీయకుండా చే స్తే ఇక మేమెక్కడ బతకాలని వేదన పడ్డారు. స్పందించిన సీఐ.. ఎలాంటి దౌర్జన్యాలు జరక్కుండా చూస్తామని ధైర్యం చె ప్పారు. రవి హత్యకు ధర్మవరంలోని వీవర్స్ సొసైటీ నిర్వాహకులే కారణమని విచారణలో తేలిందన్నారు. రెండు, మూడు రోజుల్లో హంతకులు ఎవరన్నది తెలుస్తుందన్నారు. త్వరలోనే ఈ హత్య కేసును ఛేదిస్తామన్నారు. ఎన్నాళ్లున్నా గొర్రె తోక చందమే.. చేనేత కార్మికుడికి చచ్చే వరకు సగం గుంత.. చచ్చాక నిండు గుంతన్నది.. నానుడిగా ఉంది. వారి జీవితాల్లో అక్షర సత్యంగా ఉంటోంది. చేనేత కార్మికులు సగం గుంతలోనే మగ్గాలు వేయాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి చేస్తున్నా గొర్రె తోక చందంగా ఎదుగుబొదుగూ లేదని కార్మికులు వాపోయారు. -
ఇదెక్కడి న్యాయం?
►రుణవిముక్తి చేయలేనన్న ఎమ్మెల్యే సూరి ►ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్మికుల నినాదాలు ►నోర్మూయ్ అంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సూరి ధర్మవరం అర్బన్ : చలిచీమలు ఏకమయ్యాయి... బానిస సంకెళ్ళ నుండి విముక్తి అయ్యేందుకు వేలాదిమంది కార్మికులు ఒక్కటౌతున్నారు. తమ బతుకులు నాశనమయ్యాయని, రుణ విముక్తి కల్పించాలని ఏకంగా స్థానిక ఎమ్మెల్యేను కూడా నిలదీసే స్థితికి చేరుకున్నారు. వివరాలలోకి వెళితే... ధర్మవరం పట్టణంలోని చేనేత యజమాని గడ్డం సాయి అరాచకాలను ఎండగట్టాలని, వారి నుండి తమకు విముక్తి ప్రసాదించాలని కోరుతూ... సుమారు 250 చేనేత కుటుంబాలు ఆందోళన బాట పట్టాయి. బుధవారం రాత్రి ఎమ్మెల్యే సూర్యనారాయణ ఇంటి వద్ద ధర్నా చేసిన కార్మికులు గురువారం కూడా తమ ఆందోళనలను కొనసాగించారు. ఉదయం 10గంటలకే ఆర్డిఓ కార్యాలయం వద్దకు చేరుకుని ఎమ్మెల్యేకు, ఆర్డిఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ రక్షణ కల్పించాలని, బానిస సంకెళ్ళ నుండి విముక్తి ప్రసాదించాలని వేడుకున్నారు. ఈ విషయంపై ఆర్డిఓ నాగరాజు సరైన వివరణ ఇవ్వకపోవడంతో మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఆర్డిఓ కారును అడ్డుకున్నారు. దీంతో దిగివచ్చిన ఆర్డిఓ మీకు జరిగిన అన్యాయంపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరారు. వీటిపై తమకు జరిగిన అన్యాయాలని లేఖలో రాసి ఆర్డిఓ కార్యాలయ అధికారికి అందజేశారు. కార్మికుల ప్రాణాలను దోచుకు తింటున్న గడ్డం సాయిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులు అక్కడి నుండి తిరిగి వెళ్ళే సమయంలో అదే మార్గంలో ఎమ్మెల్యే రావడంతో ఆయన కారును అడ్డుకున్నారు. అయినా కూడా కారు డ్రైవర్ నిలపకుండా వెళ్ళడంతో కార్మికులు ఎమ్మెల్యే డౌన్... డౌన్... అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారును వెంబడించారు. అక్కడి నుండి ఎమ్మెల్యే మినీ మహానాడు కార్యక్రమాలను పరిశీలించేందుకు రావడంతో అక్కడికి చేరుకున్న కార్మికులు గడ్డం సాయి ఆగడాలను అరికట్టాలని తమను బంధ విముక్తులను చేయాలని ప్రాధేయపడ్డారు. ఈ విషయంపై యజమానితో చర్చించి న్యాయం చేస్తానని చెప్పినా ఆందోళనకారులు ఏ మాత్రం వినలేదు. దీంతో చేసేది లేక ఎమ్మెల్యే సరాసరి గడ్డంసాయి ఇంటి వద్దకే వెళ్ళారు. అక్కడికి చేనేత కార్మికులు చేరుకోవడంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. రూరల్ ఎస్ఐ సుబ్బరాయుడు, కార్మికులకు మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నారు. గడ్డం సాయితో చర్చించిన అనంతరం బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఆందోళనకారులతో మాట్లాడుతూ... గడ్డం సాయి వద్ద పనిచేస్తున్న కార్మికులకు రుణమాఫీ చేయలేమన్నారు. కార్మికులకు అవసరమైతే యజమానికి బాకీ ఉన్న వడ్డీను తగ్గిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను అందించేందుకు ప్రయత్నం చేస్తామని పేర్కొనడంతో కార్మికులు ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఇదే విషయంపై మహిళా కార్మికులు ఎమ్మెల్యేతో గొడవకు దిగారు. మాదవ నాగరాజు నిర్వహిస్తున్న మగ్గాలకు ఒక న్యాయం మాకు ఒక న్యాయం ఎలా చేస్తామని ప్రశ్నించారు. వారందరూ రుణ విముక్తికి అర్హులైనప్పుడు మేమేందుకు అవమని ప్రశ్నించారు. ఈ విషయంపై తడబడిన ఎమ్మెల్యే గతంలో ఎన్నికలప్పుడు తనకు సహకరించలేదని పేర్కొనడం కొసమెరుపు. మాదవ నాగరాజు విషయంలో జరిగినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించి తీరాలన్నారు. ఈ వాదులాట చోటు చేసుకుంటున్న తరుణంలో మహిళలపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏయ్... నోర్మూసుకుని కూర్చో..!! రౌడీయిజం చేస్తున్నారా..? అంటూ మాట్లాడడం విశేషం. -
విముక్తి కల్పించండి
గడ్డం సాయి ఆగడాలపై ధ్వజమెత్తిన చేనేత కార్మికులు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నాకు దిగిన వైనం విముక్తి కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యం ధర్మవరం అర్బన్ : బానిస సంకెళ్ల నుండి తమకు పూర్తిగా విముక్తి కల్పించాలని, గడ్డం సాయి నుంచి తమకు ప్రాణ రక్షణ కల్పించాలని 250 కుటుంబాలు రోడ్డెక్కాయి. రాత్రి 8గంటల సమయంలో ఏకంగా స్థానిక ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇంటినే ముట్టడించాయి.ధర్మవరం పట్టణంలో చేనేత పరిశ్రమను నడుపుతున్న గడ్డం సాయి తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని వారి ఆగడాలకు ప్రత్యక్ష నరకం చూస్తున్నామని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. రెండు రోజుల క్రితం చేనేత కార్మికులకు కల్పించినట్లుగానే మాకు కూడా విముక్తి కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటల పాటు ఎమ్మెల్యే ఇంటిని చుట్టు ముట్టినా కూడా ఒక్క అధికారి కానీ, పోలీసులు కానీ వారిని పట్టించుకోలేదు. దీంతో అక్కడి నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడ ధర్నా చేశారు. స్పందించిన ఆర్డీవో తప్పకుండా రుణ విముక్తి కల్పిస్తానని హామీ ఇచ్చారు. గడ్డం సాయి చేస్తున్న అరాచకాలపై కార్మికులు చెప్పిన మాటలు ఇవి. భర్త పారిపోయాడని కొడుకును కట్టేసుకున్నారు సాయి వేధింపులకు తాళలేక నా భర్త పారిపోయాడు. అయినా కూడా అప్పు తీర్చాలని ఇష్టం వచ్చినట్లు నన్ను కొట్టారు. పదవ తరగతి చదివే నా కుమారుడిని ఏకంగా కట్టేశారు. కాళ్లావేళ్లా పడినా కూడా కనికరించలేదు. ఉదయం 5 గంటలకే లేవాలి, లేదంటే కట్టెలతో కూడా కొడతారు. పదవ తరగతి చదువుతున్న నా కుమారుడితో ఇప్పుడు మగ్గం వేయిస్తున్నారు. - అంజనాదేవి, చేనేత కార్మికురాలు అల్లుడికి బాగలేకపోతే రూపాయి ఇవ్వలేదు నా అల్లుడు కరెంట్ షాక్‌కు గురై ప్రమాదానికి లోనైతే వైద్యం చేయించుకోవడానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గడ్డం సాయి కాళ్లు పట్టుకున్నా కూడా కనికరించలేదు. చివరికి రూ.500 అడిగినా కూడా మీకేమన్న బాకీ ఉన్నామా అంటూ మాపై దాడి చేశారు. - వెంకట నారాయణమ్మ వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేశాను గడ్డం సాయి రాక్షసుడి లా ప్రవర్తిస్తారు. ఇష్టం వచ్చినట్లు మాపై గు మాస్తాలతో దాడులు చేయిస్తారు. కాళ్లు ప ట్టుకున్నా కనికరించరు. ఇదెక్కడి న్యాయం మేము బానిసలు అనుకున్నారా? ఆయన వేధింపులు తాళలేక రెండు సార్లు ఆత్మహత్యాయత్నం చేసినా అయినా కూడా వదల్లేదు. మా గోడు పట్టించుకునేవారే లేరు. - పెద్దన్న, చేనేత కార్మికుడు -
చేయూత ఏదీ?
ధర్మవరం : చేనేత కార్మికునికి చచే ్చదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. మగ్గం గుంతల్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఎదుగూ బొదుగూ లేని జీవితాలతో కార్మికులు అవస్థ పడుతున్నారు. పవర్‌లూమ్స్‌పై విరివిగా తయారవుతున్న వస్త్రాలు చేనేత రంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, సిండికేట్‌నగర్, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో 80 వేల కుటుంబాలకు పైగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 5లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌పై పలు డిజైన్లలో చీరలు తయారవుతుండడం, వాటినే చేనేత చీరలుగా తక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తుండడంతో చేనేత చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏడాదికి రూ. కోటి విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉన్నత చదువులకు దూరం చేనేతల పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు. కుటుంబం గడవటమే కష్టంగాఉన్న నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి 10వ తరగతితో సరిపెడుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత సహకార సంఘాలున్నా అధిక శాతం మంది కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్దనే పనిచేయాల్సి వస్తోంది. వారు నిర్ణయించిందే ధర. ఇచ్చేదే కూలి. పాలకులకు పట్టనిహెల్త్ కార్డులు నిత్యం మగ్గం గుంతలో గడిపే చేనేత కార్మికులకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో పైసా ఉండని పరిస్థితి. 2012 ఆగస్టు15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్వచ్చత బీమా యోజన పేరిట ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక చేనేత కుటుంబంలో ఐదుగురు సభ్యులకు రూ. 37,500 కేటాయించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా వాడుకోవచ్చునని సూచించారు. అయితే.. ఆ హెల్త్ కార్డుల కాలపరిమితి ముగుస్తోందని కార్మికులు చెప్పడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరునెలల గడువును పెంచారు. ఆ గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కార్మికులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాల్లోనూ మొండిచేయే.. ఎలాంటి హామీ లేకుండా ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలవరకు రుణాలను మంజూరు చేసేవారు. వీటిపై ప్రభుత్వమే 84 శాతం గ్యారంటీ ఇచ్చేది. అయితే.. ఈ నిధులను రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదని చేనేత నాయకులు చెబుతున్నారు. జిల్లాలో ఈ రుణాలను పొందినవారు వందల్లో ఉంటారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.46 కోట్లతోనే సరిపెట్టారు. ఇందులో ఖర్చులు, చేనేతశాఖ సిబ్బంది వేతనాలు పోను ఎంత మేర కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేనేత ఆత్మహత్యలు పెరుగుతాయి ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో ఊతమివ్వాల్సిన ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం పట్టించుకోకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చీరలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందే. లేకపోతే చేనేతల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం. -పోలా రామాంజినేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేనేత రంగాన్ని విస్మరించారు బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రంగమే మనుగడ కష్టం. అదీకాక చేనేత రంగానికి చేయూతగా ఉన్న పథకాలన్నింటినీ ఒకేగాటన కట్టారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. -జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గతంతో పోల్చితే చాలా తక్కువ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.48 కోట్లు కేవలం అధికారులకు సంబంధించిన వేతనాలు, ఇతరత్రా వాటికే సరిపోతాయి. ఇక కార్మికులకు ఏమి ప్రయోజనం? అసలే గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న చేనేత రంగానికి ఇది అశనిపాతమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. చేనేతలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు. -రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్‌నాయకుడు 18డిఎంఎం02ఎ- మగ్గం నేస్తున్న చేనేత కార్మికుడు 18డిఎంఎంఎ02బి- పోలా రామాంజినేయులు 18డిఎంఎం012స- జింకాచలపతి 18డిఎంఎం02డి- రంగన అశ్వర్థనారాయణ -
చేయూత ఏదీ?
ధర్మవరం : చేనేత కార్మికునికి చచే ్చదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. మగ్గం గుంతల్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఎదుగూ బొదుగూ లేని జీవితాలతో కార్మికులు అవస్థ పడుతున్నారు. పవర్‌లూమ్స్‌పై విరివిగా తయారవుతున్న వస్త్రాలు చేనేత రంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, సిండికేట్‌నగర్, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో 80 వేల కుటుంబాలకు పైగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 5లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌పై పలు డిజైన్లలో చీరలు తయారవుతుండడం, వాటినే చేనేత చీరలుగా తక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తుండడంతో చేనేత చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏడాదికి రూ. కోటి విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉన్నత చదువులకు దూరం చేనేతల పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు. కుటుంబం గడవటమే కష్టంగాఉన్న నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి 10వ తరగతితో సరిపెడుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత సహకార సంఘాలున్నా అధిక శాతం మంది కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్దనే పనిచేయాల్సి వస్తోంది. వారు నిర్ణయించిందే ధర. ఇచ్చేదే కూలి. పాలకులకు పట్టనిహెల్త్ కార్డులు నిత్యం మగ్గం గుంతలో గడిపే చేనేత కార్మికులకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో పైసా ఉండని పరిస్థితి. 2012 ఆగస్టు15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్వచ్చత బీమా యోజన పేరిట ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక చేనేత కుటుంబంలో ఐదుగురు సభ్యులకు రూ. 37,500 కేటాయించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా వాడుకోవచ్చునని సూచించారు. అయితే.. ఆ హెల్త్ కార్డుల కాలపరిమితి ముగుస్తోందని కార్మికులు చెప్పడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరునెలల గడువును పెంచారు. ఆ గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కార్మికులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాల్లోనూ మొండిచేయే.. ఎలాంటి హామీ లేకుండా ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలవరకు రుణాలను మంజూరు చేసేవారు. వీటిపై ప్రభుత్వమే 84 శాతం గ్యారంటీ ఇచ్చేది. అయితే.. ఈ నిధులను రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదని చేనేత నాయకులు చెబుతున్నారు. జిల్లాలో ఈ రుణాలను పొందినవారు వందల్లో ఉంటారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.46 కోట్లతోనే సరిపెట్టారు. ఇందులో ఖర్చులు, చేనేతశాఖ సిబ్బంది వేతనాలు పోను ఎంత మేర కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేనేత ఆత్మహత్యలు పెరుగుతాయి ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో ఊతమివ్వాల్సిన ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం పట్టించుకోకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చీరలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందే. లేకపోతే చేనేతల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం. -పోలా రామాంజినేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేనేత రంగాన్ని విస్మరించారు బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రంగమే మనుగడ కష్టం. అదీకాక చేనేత రంగానికి చేయూతగా ఉన్న పథకాలన్నింటినీ ఒకేగాటన కట్టారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. -జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గతంతో పోల్చితే చాలా తక్కువ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.48 కోట్లు కేవలం అధికారులకు సంబంధించిన వేతనాలు, ఇతరత్రా వాటికే సరిపోతాయి. ఇక కార్మికులకు ఏమి ప్రయోజనం? అసలే గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న చేనేత రంగానికి ఇది అశనిపాతమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. చేనేతలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు. -రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్‌నాయకుడు -
నేతన్నకు చేయూత
కృష్ణమ్మ చెంతన మంగళాద్రిపై కొలువైన ఉగ్ర నరసింహుడు.. అగ్గిపెట్టెలో చీరను ఇమడ్చగల నేతన్నలు.. భూమికి పచ్చని రంగేసినట్టు ఉండే పంట పొలాలు.. ఆసియాలోనే అతి పెద్దదైన దుగ్గిరాల పసుపు మార్కెట్.. మంగళగిరి నియోజకవర్గానికే తలమానికాలు. అయినా ఈ ప్రాంతంలోనూ సామాన్యులు సమస్యలతో సతమతమవుతున్నారు. రోజంతా శ్రమించినా కడుపు నిండని చేనేత కార్మికులు.. ఆరుగాలం కష్టపడినా పంటకు గిట్టుబాటు ధర లేక అవస్థ పడుతున్న పసుపు రైతులు. బంగారం పండే భూములను ఎక్కడ లాగేసుకుంటారోనని నిద్రలేని రాత్రులు గడుపుతున్న రాజధాని ప్రాంతవాసులు.. ఇన్ని సమస్యల నేపథ్యంలో వారికి అండగా ఉన్నానంటూ భరోసా ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే). సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా నియోజకవర్గంలో పర్యటించిన ఆర్కే సామాన్యుడి సమస్యల్ని తనవిగా భావించి పరిష్కారానికి కృషి చేస్తాన న్నారు. ఆర్కే : నమస్కారం. మనమిప్పుడు ఆసియాలోనే అతి పెద్దదైన దుగ్గిరాల పసుపు మార్కెట్లో ఉన్నాం. ఇక్కడి సమస్యలేమిటో పసుపు రైతులను అడిగి తెలుసుకుందాం. ఆర్కే : నమస్తే... రైతన్నా..! ఏ ఊరన్నా? కోటేశ్వరరావు: అత్తోట యాదవపాలెం. ఆర్కే : పసుపు రైతుగా నీకేమైనా సమస్యలుంటే చెప్పన్నా? కోటేశ్వరరావు : ఏం చెప్పమంటారు సార్. ఏడాది పొడవునా కష్టపడి పండించి యార్డుకు పసుపు కొమ్ములు తెస్తే పెట్టుబడి తప్ప మరింకేమీ మిగలడం లేదు. గతంలో దర్జాగా బతికాం.కనీసం పది వేలన్నా ఉంటే కానీ గిట్టుబాటు కాదు సార్. ఆరువేలు, ఏడు వేలకు మించి ధర రానే రావడం లేదు. దాసరి సుజాత : మాది తెనాలి సార్. మూడెకరాలలో గతేడాది పసుపు సాగు చేశాను. వ్యవసాయ ఖర్చులు పెరగడంతో పసుపుకు పదివేలు కనీస మద్ధతు ధర ఉంటే కానీ గిట్టుబాటు కాదు. ఆర్కే: నీ పేరేంటి తల్లీ? మహిళ: కంచర్ల వెంకటసుబ్బమ్మండీ.. ఆర్కే: ఇక్కడ ఎంత మంది మహిళలు పని చేస్తున్నారు? రోజుకు ఎంత సంపాదిస్తున్నారు? మహిళ: 40 మందిమి ఇక్కడ పని చేస్తున్నామయ్యా. ఇక్కడ జరిగే కొనుగోళ్లను బట్టి వందో...నూటాయాభయ్యో సంపాదిస్తాం. ఆర్కే: ఇక్కడ బాగా దుమ్మూ, ధూళి పేరుకుపోయి ఉంది కదా.. మీకు దీని ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటి? మహిళ: మా తిప్పలు మేము పడాల్సిందే. మాలో ఓపికుంటే పని చేయించుకుంటారు. లేకపోతే పక్కకు నెట్టేస్తారు కానీ మా ఆరోగ్యం గురించి ఆలోచించేదెవరయ్యా? ఆర్కే: ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాను. (తుమ్మపూడి-మోరంపూడి ప్రాంతం బకింగ్‌హామ్ కెనాల్ ఉరవడిగా పారుతూ ఉంటుంది. రోడ్డుకూ దీనికీ మధ్య రక్షణ గోడ లేకపోవడంతో ఇక్కడ ప్రమాదాలు నిత్య కృత్యమైపోయాయి. తాజాగా ఒక పత్తిలారీ ఇక్కడ ప్రమాదవశాత్తూ రోడ్డు పక్కకు జారి కెనాల్లోకి దూసుకెళ్లింది. ఈ రూట్లో భార్యాబిడ్డలతో కలసి ట్రాక్టర్‌పై వస్తున్న కొలకలూరు వాసి సుధాకర్‌ను ఆపి..) ఆర్కే - అన్నా ఇక్కడ తరచుగా ప్రమాదాలు జరుగుతాయన్న సంగతి తెలిసి కూడా ఇలా ఏ మాత్రం రక్షణ లేకుండా భార్యాబిడ్డలతో ఎలా ప్రయాణిస్తున్నావ్? సుధాకర్ - ఈ ట్రాక్టర్‌తో సిమెంట్ రాయిని సరఫరా చేస్తాను సార్. ప్రమాదం కదాని ప్రయాణం మానుకుంటే మా నోట్లోకి ముద్దపోయేదెట్టా సార్? జడ్పీటీసీ యాల్ల జయలక్ష్మి - రేవేంద్రపాడు వంతెన కూడా శిథిలావస్థకు చేరుకుంది సార్. అయినా ఇది తప్ప ఇక్కడి వారికి మరో మార్గం లేదు. దీని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలి. తాడేపల్లి క్రిస్టియన్ పేటలో మగ్గం నేసే కార్మికులతో ఆర్కే: నేతన్నా నీ పేరేంటి? నేతన్న: తాటిపాముల సాంబశివరావు అయ్యా. ఆర్కే: చేనేత కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. మీరు నేస్తున్న చీరలకు గిరాకీ ఉంటుందా? సాంబశివరావు : అయ్యా తమరికి తెలియనిది కాదు. ఇప్పుడు మేము నేసే వస్త్రాలకు గిరాకీ ఎక్కడుంది? ఫ్యాషన్ల మోజులో పడి మమ్మల్నీ, మా దుస్తుల్నీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే ఒకప్పుడు 16వేల మగ్గాలుండే ఈ ప్రాంతంలో ఇప్పుడు 1100మగ్గాలే ఆడుతున్నాయి. మాకు ఇంకో పని చేతగాక వీటినే ఆడించుకుని రోజుకు అరవయ్యో, డెబ్బయ్యో సంపాదించుకుంటున్నాం. ఒక మనిషి నిండుగా టిఫిన్ చేస్తే 50 రూపాయలు ఖర్చయ్యే నేటి రోజుల్లో మా సంపాదన ఏ మూల కబురయ్యా. ఆర్కే : తెలుగుదేశం ఎన్నికల మేనిఫెస్టోలో మీ సంక్షేమానికి ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతానని చంద్రబాబు చెప్పారు కదా? సాంబశివరావు : పేరుకే సార్ ఏ పథకమైనా. మా బోటి పేదోళ్లకు కాదు. ఆర్కే : మరి రుణమాఫీ మాటేంటి? సాంబశివరావు : ఘనంగా చెప్పుకున్న రైతులకే ఆయన చేసింది శూన్యం. ఇక మాకు చేస్తాడన్న నమ్మకం లేదు. మరోవైపు బ్యాంకులవాళ్లేమో మాపై ఒత్తిడి పెంచుతున్నారు. ఇక మేం కూడా ఈ మగ్గాలను మూలనేసి ఈ గొయ్యిలోనే తలదూర్చాల్సిందే. ఆర్కే : ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. చేనేతకు నేను చేయూతనందిస్తా. గత వైభవం సాధించే దిశగా అండగా నిలుస్తాను. పెనుమాకలో మహిళా రైతుల సమక్షంలో... ఆర్కే: రాజధాని నిర్మాణం గురించి మీరేమంటారు.. కౌలురైతు ఆదిలక్ష్మి : మాకు రాజధానీ వద్దు గీజధానీ వద్దు. పార్టీలు గీర్టీలు అసలే వద్దు. మా మానాన మమ్మల్ని బతకనిస్తే చాలు. బంగారం లాంటి భూములు ఈ ప్రాంతంలోవి. వాటిని రాజధాని పేరుతో లాక్కుంటే నేనూరుకోను. శివకుమారి : నాకు ఎకరం పొలం ఉంది. మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మరీ సేద్యం చేస్తున్నాను. దర్జాగా బతుకుతున్నాం. బంగారం లాంటి మా బతుకులను రాజధాని పేరుతో ఛిద్రం చేయాలని చూస్తారా? ఉన్న ఎకరం కూడా ఊడబెరుక్కుని వీధుల్లోకి నెడతారా? తాడేపల్లి ఎంపీపీ రాజ్యలక్ష్మి : ఉండవల్లి, పెనుమాక పొలాలు మూడు పంటలు పండే జరీబు భూములు. రాజధానికి భూములు ఇవ్వకూడదని రెండు గ్రామాల రైతులు ఇప్పటికే తీర్మానించారు. బలవంతంగా తీసుకోవాలని చూస్తే సహించేది లేదు. (పెనుమాక పొలాల్లోకి వెళ్లి ఉల్లి పంట కోస్తున్న మహిళా కూలీలను పరామర్శించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.) ఆర్కే: పెనుమాక మొత్తం జనాభా 14వేల మందిలో 7580మంది కూలీలేనని తెలిసింది. అందులోనూ నాలుగువేల మంది అచ్చంగా పొలం పనులు చేసుకుని జీవించే వారే. రైతులకు, కౌలు రైతులు, కూలీలకు ఇష్టం లేకుండా ఈ భూములపై చెయ్యేస్తే సహించేది లేదు. కూలీలకు అండగా ఉంటా. వారి జీవనోపాధికి ఊతంగా నిలిచిన పంటల జోలికొస్తే అడ్డుకుంటాం. ఆళ్ల రామకృష్ణారెడ్డి, సాక్షి వీఐపీ రిపోర్టర్, చేనేత కార్మికులు, Alla Ramakrishna, the witness viaipi Reporter, handloom weavers