భూత్పూర్ : మండలంలోని అమిస్తాపూర్‌కు చెందిన బక్కా జగదీశ్ (60) కు సమీపంలో రెండెకరాల పొలం ఉంది. పదేళ్లుగా అందులో వివిధ రకాల పంటలు సాగుచేయడమేగాక ఓ కోళ్లఫారం ఏర్పాటుచేసుకున్నా ఆశించిన ఫలితం దక్కలేదు. వీటికోసం గతంలో చేసిన సుమారు మూడు లక్షలు తీర్చలేకపోయాడు. దీంతో వాటిని వదులుకుని ఏడాది కాలంగా స్థానికంగా ఉన్ని సంఘంలో చేనేత కార్మికుడిగా పనిచేసినా కుటుంబాన్ని ఎలాగోలా నెట్టుకొచ్చాడు. ఈయనకు భార్య మణెమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు.
గతంలోనే ఇద్దరు కుమారులు హైదరాబాద్‌కు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు. భర్త వదిలిపెట్టడంతో రెండేళ్లుగా చిన్న కుమార్తె పుట్టింట్లోనే ఉంటోంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అందరినీ పోషించలేక పోయాడు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి తమ పొలంలో ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారమివ్వడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మారెడ్డి పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
Published Mon, Sep 29 2014 1:39 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement
Advertisement