గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు పుష్య మాసం, తిథి: శు.దశమి ఉ.11.54 వరకు, తదుపరి ఏకాదశి,నక్షత్రం: భరణి ప.3.08 వరకు, తదుపరి కృత్తిక,వర్జ్యం: రా.2.25 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.16 నుండి 11.02 వరకు, తదుపరి ప.2.42 నుండి 3.26 వరకు,అమృతఘడియలు: ఉ10.40 నుండి 12.10 వరకు.
సూర్యోదయం : 6.37
సూర్యాస్తమయం : 5.37
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం...ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం...వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మిథునం....కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. చర్చలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతన మార్పులు.
కర్కాటకం...కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి.
సింహం....సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
కన్య....ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. అనారోగ్యం. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.
తుల...వ్యవహారాలలో పురోగతి. ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం...పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ధనలాభం. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
ధనుస్సు...కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం....వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆలోచనలు పరిపరివి«ధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కుంభం..సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు.
మీనం..మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
Comments
Please login to add a commentAdd a comment