హ్యాండ్‌లూమ్స్ ఆల్వేస్ ఎవర్‌గ్రీన్..
వైవిధ్యం
చేనేత పరిశ్రమ అనగానే మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అనే మాట గుర్తుకు వస్తుంది. దీన్ని రివర్స్ చేస్తూ ట్రెండ్‌కు తగ్గట్టుగా మార్కెట్లో దూసుకుపోతున్నారు చేనేత వీవర్స్. హ్యాండ్‌లూమ్స్ ఆల్వేస్ ఎవర్‌గ్రీన్ అంటూ కొత్తకొత్త డిజైన్స్‌ని మార్కెట్‌కు పరిచయం చేస్తున్నారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ‘చేనేత కలర్ వీవ్స్’లో. సౌత్ ఇండియాలో స్వయంగా చేనేత కార్మికులు నిర్వహించేసంస్థ ఇదొక్కటే.
నల్లగొండ జిల్లా చౌటుప్పల్, నారాయణపురం, సిరిపురం, చిట్యాలతదితర 17 గ్రామాలకు చెందిన 120 మంది చేనేత కార్మికులు సెర్ప్ సహకారంతో ‘చేనేత కలర్ వీవ్స్’ను ప్రారంభించారు. ‘ఎంతోమంది రాజకీయు నాయకులు, సినిమావాళ్లు మేం తయారుచేసిన వాటిని ఇష్టంగా తీసుకుంటున్నార’ని మహిళా చేనేత కార్మికులు చెబుతున్నారు.
విజయారెడ్డి