చేనేతను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్న స్వాతి గుప్తా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు.
భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment