Pattu Sarees
-
కళింగలో పట్టు ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. -
పట్టు చీరలకు కేరాఫ్ అడ్రస్ ఆ ఊరు..!
మగువలు మెచ్చే పట్టు చీరలు.. వెడ్డింగ్ శారీలు.. ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు చేయడంలో నారాయణవనం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాలపైనే తమ నైపుణ్యాన్నంతా రంగరించి రకరకాల పట్టు చీరలు తయారు చేస్తుంటారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు డ్రాబీ, జాకాడ్ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి ఆకట్టుకుంటున్నారు. ఇక్కడ తయారయ్యే చీరలు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ బ్రాండెడ్ షాపులకు ఎగుమతి చేస్తుంటారు. కంచి, ఆరణి, ధర్మవరం పట్టు చీరలను కలగలిపి ఒకే పట్టు.. ఒకే బ్రాండ్ చీరలుగా నేయడం వీరి ప్రత్యేకత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా నారాయణవనం పట్టు చీరలపై ప్రత్యేక కథనం.. పూర్వీకుల కాలం నుంచి నారాయణవనం పట్టువ్రస్తాలకు పెట్టింది పేరు. ఇక్కడ గతంలో 600 కుటుంబాలకుపైగా మగ్గాలు పెట్టుకుని పట్టువ్రస్తాలు నేసేవారు. ప్రస్తుతం వందకుపైగా కుటుంబాల వారు తమ కులవృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వీరు నేసే పట్టు చీరలు దక్షిణ భారతదేశంలోని ప్రముఖ వస్త్ర దుకాణదారులు కొనుగోలు చేసి వివిధ బ్రాండ్ల పేరుతో విక్రయిస్తుంటారు. మరికొందరు సొంతంగా షాపులు పెట్టుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. సాధారణంగా వెండి, బంగారు జరీ పట్టు చీరలను తమదైన శైలిలో నేసి మగువుల మనసు దోచుకుంటున్నారు. ఒక్కో చీర రూ.5 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తుంటారు. ఒకే బ్రాండ్.. ఒకే పట్టు పట్టుతో నేసే చీర ఒకటే. కానీ జాకాడ్, డ్రాబీలపై వివిధ డిజైన్లతో తయారయ్యే చీరలు కొత్తకొత్త పేర్లతో మార్కెట్లోకి వస్తుంటాయి. కొత్త రకం చీరకు కొత్తపేరుతో మార్కెట్లోకి తెచ్చి విక్రయిస్తుంటారు. పట్టులో వెండిని, బంగారాన్ని స్వల్పంగా కలిపి జరీ చీరలను నేస్తుంటారు. నారాయణవనంలో సాధారణ, బంగారు జరీ చీరలు పోస్టర్ డిజైన్లతో జాకాడ్, డ్రాబీలతో తయారు చేస్తున్నారు. పేర్లు ఎన్నైనా వాడే పట్టు నాణ్యత, పోగుల సంఖ్య, వెండి, బంగారం, డిజైన్ల ఆధారంగానే బరువు ఉంటుంది. చేయూత కోసం ఎదురుచూపు గతంలో పట్టు కొనుగోలుకు కిలోకు రూ.150 చొప్పున నెలకు గరిష్టంగా రూ.600ను ప్రభుత్వం నేరుగా నేతన్నల బ్యాంక్ ఖాతాకు జమచేసేది. వైఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వైఎస్సార్ నేతన్న నేస్తంతో ఐదేళ్లు వరుసగా ఏడాదికి ఒకేసారి రూ.24 వేలు బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం హామీతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అండగా నిలిస్తే పెట్టుబడి భారం తగ్గించుకునే ఆస్కారం ఉంటుందని నేతన్నలు చెబుతున్నారు. చేనేతపైనే మగువులకు మక్కువ చేనేత మగ్గాలపై తయారయ్యే పట్టు చీరల నాణ్య త, డిజైన్, సున్నితత్వంపైనే స్త్రీలు మక్కువ చూపు తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణవనంలోని నేతన్నలు వారి మనసుకు నచ్చేవిధంగా డిజైన్లు తయారు చేస్తున్నారు. మాస్టర్ వీవర్లు కంచి, ధర్మ వరం నుంచి ముడిపట్టును తెప్పించుకుని స్థానికంగా రంగులు అద్ది సొంత డిజైన్లతో డ్రాబీ, జాకాడ్పై తయారైన చీరలను చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ వస్త్ర దుకాణాలకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ వీటిని వివిధ బ్రాండ్లుగా విభజించి వ్యాపారులు విక్రయాలు సాగిస్తున్నారు.ధరలో భారీ వ్యత్యాసం బ్రాండెడ్ షాపుల్లో అమ్మే పట్టుచీరల ధరలతో పోల్చుకుంటే ఇక్కడ ఉత్పత్తిదారుల వద్ద దొరికే పట్టుచీరలు 30 శాతం తక్కువకే దొరుకుతాయి. డైలీ వేర్ సింగిల్ త్రెడ్ పట్టు చీర 3000 గ్రాముల బరువుతో రూ.5 వేల నుంచి విక్రయిస్తున్నారు. డబుల్ త్రెడ్ పార్టీ వేర్ చీరలైతే రూ.7 వేల నుంచి రూ.25 వేల వరకు దొరుకుతాయి. రెండు గ్రాముల బంగారంతో అత్యధికంగా 700 గ్రాముల బరువు తో స్పెషల్ వెడ్డింగ్ శారీ రూ.65 వేలకే నేస్తున్నారు. ఆర్డర్లపై నచ్చిన డిజైన్, రంగులతోనూ 20 రోజులకే పట్టుచీరలను నేతన్నలు అందిస్తున్నారు. మాయ చేస్తున్న ఇమిటేట్ పట్టు ఇమిటేట్ పట్టు మార్కెను ఆకట్టుకుంటోంది. బంగారం, వెండి జరీతో పట్టుచీరలకు పోటీగా రాగి జరీతో ఇమిటేట్ పట్టు చీరలు తయారవుతున్నాయి. జరీ, డిజైన్, కొంగు రాగి రంగుతో పట్టుచీరలకు దీటుగా తక్కు వ ధరకే అంటే రూ.500కే మార్కెట్లో దొరు కుతున్నాయి. ఇమిటేట్ పట్టు(కాపర్ పట్టు) చీరను ఉతికితే జరీ ముడతలతో కుంచించుకుపోవడంతో పాటు మెత్తదనం కోల్పోతుంది. నారాయణవనంలో తయారయ్యే వెండి, బంగారంతో కలిసిన నాణ్యమైన పట్టు చీరలను డ్రైక్లీనింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎన్ని సార్లు డ్రైక్లీనింగ్ చేసినా చీరలో జరీ, డిజైన్, కొంగులో నాజూకుతనం అలాగే ఉంటుంది. ఇమిటేట్తో ఇబ్బంది చౌకగా లభించే ఇమిటేట్ కాపర్ జరీ పట్టుచీరలతో ఇబ్బందులెదురవుతున్నాయి. పట్టుచీర తక్కువ బరువుతో సున్నితంగా ఉంటుంది. 300 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు బరువుండే పట్టుచీరల్లో పోస్టర్ డిజైన్ జాకాడ్ స్పెషల్ వెడ్డింగ్ శారీలు అందుబాటులో ఉన్నాయి. 2 గ్రాముల బంగారంతో జరీ చీరలను రూ.40 వేల నుంచి రూ.65 వేల వరకు విక్రయిస్తున్నాం. వెండి జరీ చీరలను స్పెషల్ లుక్‌తో పార్టీ వేర్‌గా అందిస్తున్నాం. ఆర్డర్లపై నచ్చిన రంగులు, డిజైన్లతో 20 రోజుల్లో చీరను తయారు చేస్తాం. – మునస్వామి, మాస్టర్ వీవర్, నారాయణవనం మెచ్చుకుంటే చాలు! పెద్దల నుంచి నేర్చుకున్న వృత్తిని నమ్ముకుని బతుకుతున్నా. నేను తయారు చేసిన చీర బాగుందని మెచ్చుకుంటే చాలు ఆ తృప్తే వేరు. కూలీ గిట్టకపోయినా.. పట్టుచీర తయారీతో కలిగే తృప్తితో పడిన కష్టాన్ని మరిచిపోతున్నాం. రోజుకు ఐదు గంటలు పనిచేస్తే వారానికి ఒక చీర తయారవుతుంది. భారీ చీరకు 20 రోజులు పడుతుంది. తమిళనాడు తరహాలో 200 యూనిట్ల విద్యుత్ రాయితీ, మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తే పట్టు పరిశ్రమకు ప్రోత్సహం లభిస్తుంది. – మునీశ్వరయ్య, కార్మికుడు, నారాయణవనం ప్రభుత్వం ఆదుకోవాలి గతంలో నెలకు 4 కిలోల ముడిపట్టు కొనుగోలుకు రూ.600 అందేది. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే నేతన్న నేస్తం పథకంతో ఐదేళ్ల పాటు రూ.24 వేల చొప్పున అందించి ఆదుకున్నారు. చేనేతకు మరమగ్గాల ఉత్పత్తులు పోటీ రావడంతో చీరలను అమ్ముకోలేని పరిస్థితి ఎదురవుతోంది. మార్కెటింగ్ సదుపాయంతో పాటు విద్యుత్, పట్టుపై సబ్సిడీని ప్రభుత్వం అందించాలి. –పరంధామయ్య, పాలమంగళం నార్త్ (చదవండి: 'డబ్బు చేసే మాయ'..! 34 ఏళ్ల ఎడబాటుని అమాంతం..!) -
ఎన్నికల సిత్రాలు: రెండు లారీల పట్టు చీరలు స్వాధీనం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు కోట్ల కొద్దీ నగలు, నగదు పట్టుబడుతోంది. తాజాగా కోట్ల విలువ చేసే పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటికి పైమాటేనని అంచనా. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లి(bachupally) ప్రగతినగర్ లో పోలీసులు తనిఖీల చేపట్టారు. పంచవటి అపార్ట్మెంట్ నిర్వహించిన దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున చీరలు పట్టుబడ్డాయి. ఏకంగా రెండు లారీల పట్టుచీరల లోడ్ అపార్ట్మెట్లో డంప్ చేస్తుండగా పోలీసులుకు చిక్కాయి. ఈ లారీలను సీజ్ చేసి పోలీసులు స్టేషన్ కి తరలించారు. వరంగల్ కాశంపుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుండి వీటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్‌లోని మరికొన్ని చోట్ల జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున మిక్సీలు, రైస్ కుక్కర్లు, మియాపూర్‌లో వెండి, గోల్డ్ అభరణాలు భారీగా పట్టుబడిన సంగతి తెలిసిందే. -
పండుగను ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!
బామ్మల కాలం నాటి పట్టు చీరల గొప్పతనం ఇప్పుడూ కళ్లకు కట్టాలంటే ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కంచిపట్టును పట్టుకోవాల్సిందే! నాటి లుక్‌తో.. నేటి ఫ్యాటర్న్స్తో ఆకట్టుకునే మనదైన వైభవం సంప్రదాయ వేడుకల వేళ నిండుగా, మెండుగా వెలిగిపోవాలంటే కంచిపట్టును కమనీయంగా కట్టుకోవాల్సిందే! రాయల్ స్ఫూర్తిని రాబోయే తరాలకు మరింత భద్రంగా అందించాల్సిందే!! ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఎన్నో ఫ్యాషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మన దక్షిణ భారతాన మాత్రం ఎప్పుడైనా వేడుక అనగానే కంజీవరం చీరలు మైండ్‌లో మెదులుతాయి. దేవాలయాలకు వెళ్లినప్పుడు, ఇంట్లో పూజల వేళ, ఇతర శుభకార్యాలకు పట్టు చీర కట్టుకోవడం సంప్రదాయంగా భావిస్తుంటాం. వేడుకల సమయాల్లో వృద్ధి చెందే పాజిటివ్‌నెస్‌ను మన శరీరం–మైండ్ గ్రహిస్తుంది. వేడుకను మరింత కళగా మార్చేస్తుంది. నాణ్యమైన జరీతో డిజైన్ చేసిన ఈ చీరలు మన బామ్మల కాలం నాటి లుక్‌లో కనిపిస్తుంటాయి. రంగుల కాంబినేషన్స్, పల్లూ, అంచు డిజైన్లలో నేటి కాలానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు జత చేశారు. పట్టు కట్టుకుంటే... కట్టుకున్న చీర మనల్ని డామినేట్ చేయకూడదు. ఆ చీరలో మనం మరింత అందంగా వెలిగిపోవాలి. అందుకు బ్లౌజ్ డిజైన్ కూడా దోహదం చేస్తుంది∙ టీనేజ్, యంగ్ అమ్మాయిలు బరువుగా ఉండే చీరలను ఇష్టపడరు. లైట్‌వెయిట్ చీరలు వారికి బాగా నప్పుతాయి∙ ఏ పని అయినా చేతితో చేసిన దానికి మైండ్‌తో కనెక్షన్ ఉంటుంది. చేనేత చీరకు కూడా అంతే. చేనేత చీర పట్టుకున్నా, కట్టుకున్నా కలిగే ఆ ఫీల్‌ని ఆస్వాదించాల్సిందే∙ రాబోయే తరాలకు మన సంప్రదాయాలను అందించాలంటే మన చేనేతలను కానుకగా ఇవ్వాలి. అప్పుడే మన చేనేతలు బతుకుతాయి ∙పట్టు చీరలమీదకు ఉన్న ఆభరణాలన్నీ వేసుకోవాలనుకోకూడదు. ఏ అమ్మాయికైనా ఆమెలోని ఆత్మవిశ్వాసంతో ఉండే చిరునవ్వే సరైన జ్యువెలరీ. మనకు మనం ఎంత ప్రాముఖ్యం ఇచ్చుకుంటామో అదే ఆభరణం అవుతుంది. ఇక మెటల్ విషయానికి వస్తే.. బంగారు, కుందన్, టెంపుల్ జ్యువెలరీ కంచిపట్టు చీరల మీదకు బాగా నప్పుతాయి. అయితే, మెడ మీదుగా కూడా క్లోజ్డ్గా ఉండే జ్యువెలరీ ధరిస్తే లుక్ మరింత బాగా కనిపిస్తుంది. – భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
ఒకేచోట... వెయ్యి ఇంద్రధనుస్సుల పాట!
పట్టుచీర కట్టుబడికి పట్టుపురుగు జన్మ ధన్యమైందో లేదోగానీ... ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఉత్సవంలో చీరలు ధరించి వచ్చిన మహిళల మనోహర దృశ్యం ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. భారతీయ నేతకళలలోని గొప్పతనాన్ని ఘనంగా, సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది... ఇంగ్లాండ్‌లో ‘రాయల్ ఎస్కాట్’ అనేది చారిత్రకంగా ప్రసిద్ధిపొందిన అయిదురోజుల ఉత్సవం. ఈ ఉత్సవానికి రాజకుటుంబీకులు హాజరవుతారు. ‘రాయల్ ఎస్కాట్ 2022’ (బెర్క్‌షైర్)లో లేడిస్ డే కార్యక్రమం ఈసారి చరిత్రను సృష్టించింది. దీనికి కారణం... ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ మూలాలు ఉన్న వెయ్యిమంది మహిళలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చీరలను ధరించి వచ్చారు. భారతీయ సంస్కృతిని ఘనంగా, సగౌరవంగా ప్రతిబింబించారు. కోల్కత్తా నుంచి వచ్చి లండన్‌లో స్థిరపడిన దీప్తి జైన్ మొదట ఈ చీరల ప్రతిపాదన చేశారు. ఆమె ప్రతిపాదనకు అందరూ సంతోషంగా ఓకే చెప్పి, భారత్‌లోని తమ ప్రాంత ప్రసిద్ధ చీరలతో ఉత్సవానికి వచ్చారు. దీప్తి జైన్ పశ్చిమబెంగాల్లో ప్రసిద్ధమైన ‘కాంతా వర్క్’ చీర ధరించి వచ్చారు. ఆకట్టుకునే ఎంబ్రాయిడరీతో కూడిన సిల్క్ చీర అది. ఈ చీరను వినూత్నంగా డిజైన్ చేసిన రూపా ఖాతున్‌కు ‘రాయల్ ఎస్కాట్’ గురించి ఏమీ తెలియదు. అయితే ఆమె ప్రతిభ గురించి మాత్రం ఇక్కడ గొప్పగా మాట్లాడుకున్నారు. మీడియా ప్రొఫెషన్లో ఉన్న సంచిత భట్టాచార్య మధుబని చీర ధరించి వచ్చారు. ఈ పెయింటింగ్ చీర ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇంజనీర్ చీనూ కిశోర్ అస్సామీ సంప్రదాయ చీర ‘మెఖల చాదర్’తో వచ్చారు.తాను డిజైన్ చేసిన ‘కాంతా వర్క్’ చీరకు మంచి పేరు రావడంతో ఆనందంలో మునిగిపోయింది పశ్చిమబెంగాల్లోని ననూర్ గ్రామానికి చెందిన రూప ఖాతున్. ఈ చీరల డిజైనింగ్, తయారీల గురించి ఆమె ప్రత్యేకంగా ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. అమ్మమ్మ, అమ్మల దగ్గర నుంచి ఆ విద్యను నేర్చుకుంది. ‘ఈ చీర తయారీ కోసం నాలుగు నెలల పాటు కష్టపడ్డాను. ఇతర మహిళల సహాయం తీసుకున్నాను. మా పనికి అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడం గర్వంగా అనిపిస్తుంది’ అంటుంది రూప. మధుబని చీరను డిజైన్ చేసిన బిహార్‌లోని దర్భంగ ప్రాంతానికి చెందిన ఛోటీ ఠాకూర్‌పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ‘ఇందులో నేను కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. ఇదంతా మధుబనీ కళలోని గొప్పతనం’ వినమ్రంగా అంటుంది చోటి. నిజానికి ఈ ఉత్సవంలో ప్రతి చీర ఒక కథను చెప్పింది. ఆ కథలో రూప, ఛోటీలాంటి అసాధారణమైన ప్రతిభ ఉన్న సామాన్య కళాకారులు ఎందరో ఉన్నారు. వారి సృజన ఉంది. స్థూలంగా చెప్పాలంటే విభిన్నమైన అందాలతో వెలిగిపోయే భారతీయ సంస్కృతి ఉంది. ఈ ఉత్సావానికి హాజరైన ఒకరు కవితాత్మకంగా అన్నారు ఇలా: ‘వెయ్యి ఇంద్రధనుసులు మధురమైన సంగీత కచేరి చేసినట్లుగా ఉంది’ వాహ్! -
చేనేత కార్మికుడి నుంచి ప్రముఖ డిజైనర్‌గా..
ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ దాగి ఉంటుంది. అయితే అది వెలుగులోకి రావాలంటే పట్టుదల ఉండాలి. ఆ పట్టుదలే ధర్మవరానికి చెందిన చేనేత కార్మికుడు జూజారు నాగరాజును ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు వచ్చేలా చేసింది. సాధారణ చీరలు నేసే స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అద్భుతమైన డిజైనర్ పట్టు చీరల సృష్టికర్తగా ఎదిగారు. రొటీన్‌కు భిన్నంగా చీరలపై డిజైన్ చేయడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రత్యేక డిజైన్లు రూపకల్పన చేసి తన శక్తి ఏమిటో నిరూపించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకుంటూ వచ్చిన నాగరాజు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సాక్షి, ధర్మవరం టౌన్: పట్టణానికి చెందిన జూజారు నాగరాజు మగ్గం నేసుకుంటూ డిగ్రీ చదివారు. డిజైనింగ్ మీద మక్కువతో బెంగుళూరు, హైదరాబాద్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి, ధర్మవరానికి చేరుకున్నారు. అప్పటి నుంచి సరికొత్త డిజైన్లతో పట్టుచీరలు నేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. పేదరికాన్ని సవాల్ చేస్తూ.. నాగరాజు తండ్రి జూజారు లక్ష్మణరావు సాధారణ చేనేత కార్మికుడు. నిరుపపేద కుటుంబం కావడంతో ఇంటిల్లిపాది మగ్గం నేస్తేనే జీవనం సాగేది. తండ్రి పడుతున్న కష్టం నాగరాజును కదిలించింది. అందరిలా కాకుండా కొత్తదనాన్ని చూపినప్పుడే తమ ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ నెలకొంటుందని భావించిన అతను.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేశారు. అప్పట్లో పట్టుచీరలంటే తమిళనాడులోని కాంచీపురం ప్రసిద్ధి. కంచి పట్టు చీర అంటే అంత గొప్పగా భావించేవారు. అదే స్థాయిలో ధర్మవరానికి పేరు తీసుకురావాలని భావించిన నాగరాజు... రేయింబవళ్లూ కొత్త డిజైన్ల రూపకల్పనపైనే దృష్టి సారించేవారు. నెమలి పళ్లూ, బ్రోకెట్, కళాంజలి వంటి డిజైన్లను ఆధునీకరించి కంచి కంటే విభిన్నమైన 240 డిజైన్లతో జాకార్డులను సిద్ధం చేశారు. ఒక్కో డిజైన్ రూపకల్పనకు రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు పెట్టారు. క్రమేణ ఈ డిజైన్లతో వచ్చిన పట్టుచీరలు ప్రతి ఒక్కరి దృష్టిని విశేషంగా ఆకట్టుకుంటూ వచ్చాయి. దీంతో కొంతమంది పట్టు చీరల వ్యాపారులు నాగరాజుకు ఖర్చులు పోనూ అదనంగా రూ.3 వేలు చెల్లించి కొత్త డిజైన్లను కొనుగోలు చేస్తూవచ్చారు. 2009లో ఔట్సోర్సింగ్ ద్వారా హ్యాండ్లూమ్లో డిజైనర్ ఉద్యోగాలను భర్తీ చేయడంతో ధర్మవరం హ్యాడ్లూమ్ క్లస్టర్ డిజైనర్‌గా నాగరాజుకు ఉద్యోగం దక్కింది. విధుల నిర్వహణలో భాగంగా ధర్మవరంతో పాటు ముదిరెడ్డిపల్లి, మంగళగిరి తదితర ప్రాంతాల్లో చేనేతకార్మికులకు డిజైనింగ్ రంగంలో శిక్షణ ఇచ్చారు. నాగరాజు చేసిన వెరైటీ డిజైన్లు ► సాంబ చిత్రంలోని శంఖు, చక్రం, నామాలు కలిగిన డిజైన్‌తో 2004లో నాగరాజు ఓ పట్టు వస్త్రం సిద్ధం చేశారు. ఈ శ్రమకు ఫలితంగా సినిమా నిర్మాతలు నాగరాజును అభినందిస్తూ రూ.లక్ష పారితోషకాన్ని అందజేశారు. ► ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో పట్టు వస్త్రాలపై నేసిన తాజ్‌మహల్ చిత్రాలను ప్రదర్శించి, అందరినీ ఆకట్టుకున్నారు. ► 2016లో లేపాక్షి ఆలయంలోని శిల్పకళా నమూనాలతో పట్టు వస్త్రాన్ని చేనేత మగ్గంపై నేసి అబ్బురపరిచారు. ► 2017 ఫిబ్రవరిలో ఇస్రో రాకెట్ ప్రయోగాల విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇస్రో శాటిలైట్లు, రాకెట్ చిత్రాలతో పట్టు వస్త్రం తయారు చేసి విజయవాడలో ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ► గుంటూరులో ప్రముఖ పుణ్యక్షేత్రం పానకాల లక్ష్మీనరసింహస్వామి ముఖచిత్రం, గాలిగోపురం తెలుగు అక్షరాలతో కూడిన డిజైన్‌ను తయారు చేసి ఆలయానికి బహూకరించారు. ► మహాత్ముని దండియాత్రను పట్టు వస్త్రంపై రూపొందించి 2019లో గాంధీ జయంతి రోజున ఢిల్లీలో జరిగిన నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ► సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని 2019 డిసెంబర్లో పట్టు వస్త్రంపై సీఎం జగన్ చిత్రపటాన్ని రూపొందించి హ్యాండ్లూమ్ కార్యాలయం తరఫున నేతన్న నేస్తం పథకం ప్రారంభంలో ధర్మవరంలో జగనన్నకు బహూకరించారు. ► ఆరీటీ వ్యవస్థాపకుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ చిత్రాన్ని పట్టు వస్త్రంపై నేసి అందజేశారు. అందుకున్న అవార్డులు.. ► 2006లో ఉమ్మడి రాష్ట్రంలో డిజైన్ డెవలప్మెంట్కు గాను రాష్ట్ర స్థాయి అవార్డును ప్రభుత్వం అందజేసింది. ► 2020 మార్చి నెలలో ఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డెవల్మెంట్ కార్పొరేషన్ వారు నాగరాజుకు జాతీయ అవార్డును అందజేశారు. దండియాత్రను గుర్తుకు చేస్తూ పట్టువస్త్రం నేసినందుకు ఈ పురస్కారం దక్కింది. వైఎస్సార్ హయాంలోనే ప్రతిభకు గుర్తింపు దక్కింది మగ్గం నేస్తూ డిగ్రీ వరకు చదువుకున్నా. సాంబ సినిమాలో నేను వేసిన డిజైన్ ప్రాచుర్యం పొందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలో ప్రతిభను గుర్తించి, డిజైనర్‌గా హ్యాండ్లూమ్ కార్యాలయంలో ఉద్యోగ అవకాశం ఇచ్చారు. ఆ మహానేత గుర్తింపు వల్లనే ఎన్నో డిజైన్లను చేయగలిగాను. ఎందరో కార్మికులకు డిజైనింగ్‌లో శిక్షణ ఇస్తున్నా. – జూజారు నాగరాజు, చేనేత కార్మికుడు, ధర్మవరం -
విజయాల పట్టు
సోదరీ.. ఎక్కు తొలి మెట్టు. అవరోధాలను వెనక్కు నెట్టు. నీపై నువ్వు నమ్మకం పెట్టు... లక్ష్యాలను అందుకునేట్టు! కట్టు.. విజయాల పట్టు. పెట్టు.. తిలకం బొట్టు. ►ఈ కంచి పట్టు చీరలు ఏ వేడుకలోనైనా హైలైట్‌గా నిలుస్తాయి. ఏ వయసు వారినైనా అందంగా, హుందాగా చూపుతాయి. వీటికి హైనెక్, లోనెక్, బోట్‌నెక్... బ్లౌజ్‌లతో మోడ్రన్ లుక్‌ని తెప్పించవచ్చు. ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ ధరిస్తే లుక్ మరింత గ్రాండ్‌గా, సంప్రదాయంగా మారిపోతుంది. ►ఆర్గంజా చీరలకు బెనారస్ అంచులు ఓ కొత్త లుక్‌ని తీసుకువచ్చాయి. ఈ చీరలు కొంత ట్రాన్సప రెంట్గా, లైట్ వెయిట్‌తో ఉంటాయి. వీటికి చీరలోని ఏదైనా రంగు డిజైనర్ బ్లౌజ్ ధరిస్తే పండగరోజున కొత్తకళతో మెరిసిపోతారు. స్టైలిష్‌గానూ కనపడతారు. ►టిష్యూ కోట శారీస్ ధరిస్తే క్లాసీ లుక్‌తో చూపులను కట్టి పడేస్తారు. పాతకాలపు స్టైల్.. లాంగ్ స్లీవ్స్, బోట్‌నెక్ బ్లౌజ్‌లు ధరిస్తే వేడుకలో వైవిధ్యంగా కనిపిస్తారు. ►కంచిపట్టు చీర ధరించినప్పుడు లెటెస్ట్ ఆభరణాలను ధరిస్తే మోడ్రన్ లుక్‌తో ఆకట్టుకుంటారు. సంప్రదాయ కట్టుతో బంగారానికే వన్నె తెస్తారు. ►పసుపు–ఎరుపు రంగు కాంబినేషన్ కంచిపట్టు పండగలకు ప్రత్యేక ఆకర్షణ. ఇలాంటి చీరల మీదకు టెంపుల్ జువెలరీ ధరిస్తే పండగకళ వచ్చేసినట్టే! -
పట్టుచీరల దొంగ.. ఉన్నతాధికారి భార్య?
వస్త్రాల దుకాణంలో చోరీకి పాల్పడ్డ ఇద్దరు నిందితులను పంజగుట్ట పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే... పంజగుట్ట వెంకటరమణ కాలనీలో వసుధ శారీస్‌ను వాణికుమారి నిర్వహిస్తోంది. ఈమె దుకాణంలోకి శనివారం రాత్రి ఇద్దరు మహిళలు వచ్చి చీరలు కొనుగోలు చేస్తున్నట్లు నటించి ఒక్కో చీర రూ. 40 వేల విలువ చేసే మొత్తం ఆరు చీరలను దొంగలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా పుటేజీల ఆధారంగా దొంగతనం చేసింది ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి భార్య అని గుర్తించి... ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈమెతో పాటు ఆమెకు సహకరించిన మరో యువతిని కూడా అరెస్టు చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై పోలీసులు తాము ఎవరిని అరెస్టు చేయలేదని చెబుతున్నారు.