
సాక్షి,హైదరాబాద్: తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు కోట్ల కొద్దీ నగలు, నగదు పట్టుబడుతోంది. తాజాగా కోట్ల విలువ చేసే పట్టుచీరలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ కోటికి పైమాటేనని అంచనా. కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పరిధిలోని బాచుపల్లి(bachupally) ప్రగతినగర్ లో పోలీసులు తనిఖీల చేపట్టారు. పంచవటి అపార్ట్మెంట్ నిర్వహించిన దాడి నేపథ్యంలో పెద్ద ఎత్తున చీరలు పట్టుబడ్డాయి. ఏకంగా రెండు లారీల పట్టుచీరల లోడ్ అపార్ట్మెట్లో డంప్ చేస్తుండగా పోలీసులుకు చిక్కాయి. ఈ లారీలను సీజ్ చేసి పోలీసులు స్టేషన్ కి తరలించారు. వరంగల్ కాశంపుల్లయ్య, మాంగల్య షాపింగ్ మాల్స్ నుండి వీటిని కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇప్పటికే హైదరాబాద్లోని మరికొన్ని చోట్ల జరిపిన తనిఖీల్లో పెద్ద ఎత్తున మిక్సీలు, రైస్ కుక్కర్లు, మియాపూర్లో వెండి, గోల్డ్ అభరణాలు భారీగా పట్టుబడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment