బామ్మల కాలం నాటి పట్టు చీరల గొప్పతనం ఇప్పుడూ కళ్లకు కట్టాలంటే ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కంచిపట్టును పట్టుకోవాల్సిందే! నాటి లుక్‌తో.. నేటి ఫ్యాటర్న్స్‌తో ఆకట్టుకునే మనదైన వైభవం సంప్రదాయ వేడుకల వేళ నిండుగా, మెండుగా వెలిగిపోవాలంటే కంచిపట్టును కమనీయంగా కట్టుకోవాల్సిందే! రాయల్ స్ఫూర్తిని రాబోయే తరాలకు మరింత భద్రంగా అందించాల్సిందే!!
ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఎన్నో ఫ్యాషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మన దక్షిణ భారతాన మాత్రం ఎప్పుడైనా వేడుక అనగానే కంజీవరం చీరలు మైండ్‌లో మెదులుతాయి. దేవాలయాలకు వెళ్లినప్పుడు, ఇంట్లో పూజల వేళ, ఇతర శుభకార్యాలకు పట్టు చీర కట్టుకోవడం సంప్రదాయంగా భావిస్తుంటాం. వేడుకల సమయాల్లో వృద్ధి చెందే పాజిటివ్‌నెస్‌ను మన శరీరం–మైండ్ గ్రహిస్తుంది. వేడుకను మరింత కళగా మార్చేస్తుంది. నాణ్యమైన జరీతో డిజైన్ చేసిన ఈ చీరలు మన బామ్మల కాలం నాటి లుక్‌లో కనిపిస్తుంటాయి. రంగుల కాంబినేషన్స్, పల్లూ, అంచు డిజైన్లలో నేటి కాలానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు జత చేశారు.
పట్టు కట్టుకుంటే...
కట్టుకున్న చీర మనల్ని డామినేట్ చేయకూడదు. ఆ చీరలో మనం మరింత అందంగా వెలిగిపోవాలి. అందుకు బ్లౌజ్ డిజైన్ కూడా దోహదం చేస్తుంది∙ టీనేజ్, యంగ్ అమ్మాయిలు బరువుగా ఉండే చీరలను ఇష్టపడరు. లైట్‌వెయిట్ చీరలు వారికి బాగా నప్పుతాయి∙ ఏ పని అయినా చేతితో చేసిన దానికి మైండ్‌తో కనెక్షన్ ఉంటుంది. చేనేత చీరకు కూడా అంతే. చేనేత చీర పట్టుకున్నా, కట్టుకున్నా కలిగే ఆ ఫీల్‌ని ఆస్వాదించాల్సిందే∙
రాబోయే తరాలకు మన సంప్రదాయాలను అందించాలంటే మన చేనేతలను కానుకగా ఇవ్వాలి. అప్పుడే మన చేనేతలు బతుకుతాయి ∙పట్టు చీరలమీదకు ఉన్న ఆభరణాలన్నీ వేసుకోవాలనుకోకూడదు. ఏ అమ్మాయికైనా ఆమెలోని ఆత్మవిశ్వాసంతో ఉండే చిరునవ్వే సరైన జ్యువెలరీ. మనకు మనం ఎంత ప్రాముఖ్యం ఇచ్చుకుంటామో అదే ఆభరణం అవుతుంది. ఇక మెటల్ విషయానికి వస్తే.. బంగారు, కుందన్, టెంపుల్ జ్యువెలరీ కంచిపట్టు చీరల మీదకు బాగా నప్పుతాయి. అయితే, మెడ మీదుగా కూడా క్లోజ్డ్‌గా ఉండే జ్యువెలరీ ధరిస్తే లుక్ మరింత బాగా కనిపిస్తుంది.
– భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్
(చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు)
Comments
Please login to add a commentAdd a comment