kanchi
-
అయోధ్యలో పర్యటించిన విజయేంద్ర సరస్వతి స్వామి
కంచి కామకోటి మూలామ్నాయ సర్వజ్ఞ పీఠాధిపతి శంకరాచార్య విజయేంద్ర సరస్వతి స్వామి అయోధ్యలో పర్యటించి యాగశాలలో హోమాలను, రామ మందిరంలో ప్రాణ ప్రతిస్టకు సంబంధించిన క్రతువులను పర్యవేక్షించి ఆశీర్వదించారు. అయోధ్య చేరుకున్న స్వామీజీ నేరుగా శ్రీరాముని కులదేవత అయిన దేవకాళి మందిరాన్ని సందర్శించి పూజలు నిర్వహించి, అనంతరం శంకర మఠాన్ని చేరుకున్నారు. అక్కడ ఆయనకు భయ్యా జోషి ఆహ్వానం పలికారు. అక్కడ రామ షడాక్షరి హోమాలు జరిగిన రామ సన్నిధిలో ఆయన కలశాభిషేకాన్ని నిర్వహించారు. శంకర మఠంలో రామసన్నిధిని శ్రీ జయేంద్ర సరస్వతీ మహాస్వామి ప్రతిష్ఠించారు. అనంతరం విజయేంద్ర సరస్వతీ స్వామి అయోధ్య శంకర మఠం వెబ్సైట్ www.kanchimuttayodhya.in ప్రారంభించారు. రామజన్మ భూమికి వెళ్ళిన స్వామివారికి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కోశాధికారి శ్రీ గోవింద్ దేవ్ జీ మహారాజ్, శ్రీ జ్ఞానేశ్వర్ ద్రావిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్, ఇతర వైదిక పండితులతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. యజ్ఞశాలలో కలయదిరిగిన స్వామి అన్ని కలశాలకు పూలను సమర్పించారు. తర్వాత ప్రధాన కలశానికి మంత్రోచ్ఛారణలతో పూలను సమర్పించి హారతి ఇచ్చారు. శ్రీరాముడిపై ప్రత్యేక మంత్రాలను పూజ్యశ్రీ స్వామివారు ఉచ్ఛరించి కలశపూజ పూర్తి చేశారు. అనంతరం మందిరానికి బయలుదేరిన స్వామివారు ఈ సందర్భంగా శ్రీ జ్ఞానేశ్వర్ శాస్త్రి ద్రావిడ్, శ్రీ లక్ష్మీకాంత్ దీక్షిత్ లు, జరుగనున్న ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు, పూజా విధి విధానాల గురించి వివరించారు. మందిరంలోకి ప్రవేశించే మొదటి మెట్టుకు కొబ్బరికాయను కొట్టి, అనంతరం గణేశుని చెక్కిన మొదటి రెండు స్తంభాలకు కొబ్బరికాయలను సమర్పించారు. అనంతరం పూజ్య శ్రీ స్వామివారు మహామంటపం, అర్ధ మంటపం సందర్శించి, తర్వాత గర్భగృహానికి వెళ్లారు. అక్కడ ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ జీ మహారాజ్, కార్యదర్శి చంపత్‌రాయ్ ఆయనకు ఆహ్వానం పలికారు. నేత్రోన్మీలనం : గర్భగుడిలో నేత్రోన్మీలనం క్రతువును ప్రారంభించి, విగ్రహానికి న్యాసంతో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీరాముడికి ప్రత్యేక ఆభరణాలను సమర్పించారు. స్వామివారికి అర్థమంటపంలో వైదిక మంత్రోచ్ఛారణల నడుమ శాలువను బహుకరించారు. స్వామివారు తిరిగి యజ్ఞశాలకు వెళ్ళారు. ఈ సందర్భంగా దేశానికి సురక్ష, సుభిక్ష, ప్రజలకు సువిద్య కలగాలని ఆశీర్వదించారు. -
పండుగను ..కంచిపట్టు చీరతో మరింత కళగా మార్చేయండి!
బామ్మల కాలం నాటి పట్టు చీరల గొప్పతనం ఇప్పుడూ కళ్లకు కట్టాలంటే ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కంచిపట్టును పట్టుకోవాల్సిందే! నాటి లుక్‌తో.. నేటి ఫ్యాటర్న్స్తో ఆకట్టుకునే మనదైన వైభవం సంప్రదాయ వేడుకల వేళ నిండుగా, మెండుగా వెలిగిపోవాలంటే కంచిపట్టును కమనీయంగా కట్టుకోవాల్సిందే! రాయల్ స్ఫూర్తిని రాబోయే తరాలకు మరింత భద్రంగా అందించాల్సిందే!! ఫాస్ట్ ఫ్యాషన్‌లో ఎన్నో ఫ్యాషన్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ, మన దక్షిణ భారతాన మాత్రం ఎప్పుడైనా వేడుక అనగానే కంజీవరం చీరలు మైండ్‌లో మెదులుతాయి. దేవాలయాలకు వెళ్లినప్పుడు, ఇంట్లో పూజల వేళ, ఇతర శుభకార్యాలకు పట్టు చీర కట్టుకోవడం సంప్రదాయంగా భావిస్తుంటాం. వేడుకల సమయాల్లో వృద్ధి చెందే పాజిటివ్‌నెస్‌ను మన శరీరం–మైండ్ గ్రహిస్తుంది. వేడుకను మరింత కళగా మార్చేస్తుంది. నాణ్యమైన జరీతో డిజైన్ చేసిన ఈ చీరలు మన బామ్మల కాలం నాటి లుక్‌లో కనిపిస్తుంటాయి. రంగుల కాంబినేషన్స్, పల్లూ, అంచు డిజైన్లలో నేటి కాలానికి అనుగుణంగా చిన్న చిన్న మార్పులు జత చేశారు. పట్టు కట్టుకుంటే... కట్టుకున్న చీర మనల్ని డామినేట్ చేయకూడదు. ఆ చీరలో మనం మరింత అందంగా వెలిగిపోవాలి. అందుకు బ్లౌజ్ డిజైన్ కూడా దోహదం చేస్తుంది∙ టీనేజ్, యంగ్ అమ్మాయిలు బరువుగా ఉండే చీరలను ఇష్టపడరు. లైట్‌వెయిట్ చీరలు వారికి బాగా నప్పుతాయి∙ ఏ పని అయినా చేతితో చేసిన దానికి మైండ్‌తో కనెక్షన్ ఉంటుంది. చేనేత చీరకు కూడా అంతే. చేనేత చీర పట్టుకున్నా, కట్టుకున్నా కలిగే ఆ ఫీల్‌ని ఆస్వాదించాల్సిందే∙ రాబోయే తరాలకు మన సంప్రదాయాలను అందించాలంటే మన చేనేతలను కానుకగా ఇవ్వాలి. అప్పుడే మన చేనేతలు బతుకుతాయి ∙పట్టు చీరలమీదకు ఉన్న ఆభరణాలన్నీ వేసుకోవాలనుకోకూడదు. ఏ అమ్మాయికైనా ఆమెలోని ఆత్మవిశ్వాసంతో ఉండే చిరునవ్వే సరైన జ్యువెలరీ. మనకు మనం ఎంత ప్రాముఖ్యం ఇచ్చుకుంటామో అదే ఆభరణం అవుతుంది. ఇక మెటల్ విషయానికి వస్తే.. బంగారు, కుందన్, టెంపుల్ జ్యువెలరీ కంచిపట్టు చీరల మీదకు బాగా నప్పుతాయి. అయితే, మెడ మీదుగా కూడా క్లోజ్డ్గా ఉండే జ్యువెలరీ ధరిస్తే లుక్ మరింత బాగా కనిపిస్తుంది. – భార్గవి కూనమ్, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ (చదవండి: పొల్యూషన్‌కి చెక్ పెట్టేలా.. వేగన్ ఫ్యాషన్ బ్రాండ్స్! అరటిచెట్టు బెరడుతో బ్యాగ్‌లు, ఆభరణాలు) -
మహాస్వామి వారి మౌన బోధనం
జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు. ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు. స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి! మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి.. దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు. ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు. సూక్తి సుధ ► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే. ► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు. ► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి. ► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది. – ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్. -
నల్లగొండలో అద్భుతం: ‘కంచి’ శాసనచిహ్నాలు
రామగిరి (నల్లగొండ): తమిళనాడులోని కంచి పాలకుడైన 3వ వీరభల్లాలుడి శాసన చిహ్నాలు నల్లగొండలో వెలుగు చూశాయి. కొత్త చరిత్ర బృందం సభ్యుడు చిక్కుళ్ల యాదగిరి ఇటీవల నల్లగొండ పాతబస్తీలో ఉన్న కోట మైసమ్మ ఆలయంలోని ఏకశిల రాతిపలకను శుభ్రం చేసి పరిశీలించగా భైరవుడు, గండభేరుండం, పులి శిల్పాలు చెక్కి ఉన్నాయి. ఈ రాతిపలకం ఫొటోలను ప్రముఖ చరిత్రకారుడు రామోజు హరగోపాల్‌కు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు యాదగిరి, సత్తయ్య, సట్టు నారాయణ, ఆమనగంటి వెంకన్న, నాగిళ్ల చక్రపాణి పంపగా భైరవుడు శైవమతానికి గుర్తయితే, గండభేరుండం వైష్ణవ మతచిహ్నమని, పులి రాజరికానికి, వీరత్వానికి ప్రతీక అని ఆయన వివరించారు. కంచి పాలకుడైన 3వ హోయసల వీరభల్లాలుడి శాసనాల మీద గండభేరుండం, పులి బొమ్మలు కనిపిస్తుంటాయని హరగోపాల్ తెలిపారు. తమిళనాడులోని భల్లాలుడి రాజ్యానికి తెలంగాణలోని నల్లగొండ పట్టణానికి 500 నుంచి 600 కిలోమీటర్ల దూరం ఉందని, ఇక్కడ కూడా ఆయన ప్రాతినిధ్యం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీరభల్లాలుడిని, అతని మిత్రులు శాంబువరాయుణ్ణి, చంద్రగిరి యాదవరాయుడిని కాకతీయ సేనాని రుద్రుడు ఓడించి కంచిని కాకతీయ సామ్రాజ్యంలో కలిపాడని పేర్కొన్నారు. ఇవి నల్లగొండ జిల్లా కేంద్రంలోని కాపురాలగుట్ట ముందు కనిపించాయని పేర్కొన్నారు. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం వీరభల్లాలుడు కాపయనాయకుడితో కలసి యుద్ధా ల్లో పాల్గొన్నట్లు ఆధారాలున్నాయని చెప్పారు. -
రామ మందిరానికి రూ.6 కోట్ల విరాళం
సాక్షి, చెన్నై: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కంచి మఠం ద్వారా రూ.6 కోట్లు విరాళంగా లభించింది. ఈ మొత్తాన్ని తమిళనాడు గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ చేతుల మీదుగా కంచి మఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అందజేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కంచి మఠంలో ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేశారు. తద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.6 కోట్లు విరాళాల రూపంలో వచ్చింది.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్) ఈ మొత్తాన్ని సోమ వారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు గవర్నర్ చేతుల మీదుగా శంకర విజయేంద్ర సరస్వతిస్వామి అందజేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ, కంచి, అయోధ్యల మధ్య ఆధ్యాత్మికపరంగా సంబంధాలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. కంచి మఠం ఏ పనిచేసినా వంద శాతం విజయవంతం అవుతుందని, అయోధ్యలో రామాలయం వంద శాతం పూర్తి కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. -
బంగారు బల్లి.. మళ్లీ దర్శనమిచ్చింది
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అలాంటిది నిజమైన బంగారు బల్లిని దర్శించే భాగ్యం తిరుమల కొండల్లో మాత్రమే కలుగుతుంది. అంతరించే జాతుల్లో చేరిన ఈ బంగారు బల్లి కొన్నేళ్లుగా కనిపించడం లేదు. అయితే శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన ఈ బంగారు బల్లి తిరుమలలోని శ్రీవారి ఆలయానికి వెనుకనున్న శిలాతోరణంపై దర్శనమిచ్చింది. కాగా, మునుపు ఒకసారి మహాశివరాత్రి నాడే (2016లో) ఈ బంగారు బల్లి తిరుమల చక్రతీర్థం వద్ద మహాశివలింగానికి అభిషేకం చేసే శుభ సమయంలో భక్తుల కంటపడటం విశేషం. (రాయంచపై సోమస్కంధుడి రాజసం ) -
అత్తివరదరాజు స్వామిని దర్శించుకున్న కేసీఆర్
సాక్షి, చెన్నై/చిత్తూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం తమిళనాడు కంచిలోని అత్తివరదరాజు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేదపండితులు ఆశీర్వచనాలతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. కేసీఆర్ వెంట ఆయన సతీమణి శోభ, కూతురు కవిత, ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా ఉన్నారు. నగరిలో కేసీఆర్‌కు రోజా ఘనస్వాగతం అంతకుముందు కంచి పర్యటన కోసం ఈ రోజు ఉదయం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కంచికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. మార్గమధ్యలో కేసీఆర్ నగరి చేరుకోగానే రోజా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రోజాతో కేసీఆర్ కాసేపు ముచ్చటించారు. -
కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం
-
కంచిలో విషాదం
సాక్షి, చెన్నై: కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు. బుధవారం వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్ ఆలయంలో ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసుల తీరుతో ఆటోడ్రైవర్ ఆత్మాహుతి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కాంచీపురంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కాంచీపురం కరుసపేటకు చెందిన కుమార్ అనే ఆటో డ్రైవర్ పాస్ తీసుకుని భక్తులను ఆలయానికి తరలిస్తున్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆటోను ఆలయం వద్దకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, ఆటోడ్రైవర్ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. అతడు మంటల్లో కాలిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. -
రంజాన్ స్పెషల్.. ఆలయానికి సింగర్!
ప్రముఖ గాయకుడు మనో (నాగూర్ బాబు) పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సమేతంగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాల్ ఆలయాన్ని దర్శించారు. ఆలయంలోని స్వామివారి ముందు ‘అదిగో అల్లదిగో శ్రీ హరివాసమూ’ అంటూ గానాలాపన చేసి భక్తి పారవశ్యం చెందారు. తన శ్రీమతి జమీలా బాబుతో కలిసి మతసామరస్యానికి ప్రతీకగా ఆయన వరదరాజ స్వామివారిని దర్శించుకోవటం గమనార్హం. ప్రతి ఏడాది రంజాన్ పండుగను తన నివాసంలో ఎంతో వేడుకగా జరుపుకునే సింగర్ మనో ఈసారి ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారి ముందు వేంకటేశ్వరుని భక్తిపారవశ్యంతో కీర్తించటం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి అస్వస్థత
చెన్నై : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న జయేంద్ర సరస్వతిని చెన్నైలోని పోరూరులో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
రేపు కంచికి రాష్ట్రపతి
సాక్షి, చెన్నై: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం దైవ దర్శనార్థం తమిళనాడులోని కంచికి రానున్నారు. ఒకే రోజు అక్కడున్న అన్ని ఆలయాల్ని సందర్శించనున్నారు. గత నెల కాంచీపురానికి రావాల్సి ఉన్నా, చివరి క్షణంలో రాష్ట్రపతి పర్యట న రద్దయింది. ఈ పరిస్థితుల్లో మంగళవారం కాంచీపురం పర్యటనకు ప్రణబ్ రానున్నారు. -
గురుమార్గం ఉత్తమం
అయిభీమవరం (ఆకివీడు) : గురుమార్గం మానవుడికి సన్మార్గమని కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి అన్నారు. అయిభీమవరంలోని టీటీడీ బోర్డు మాజీ చైర్మ¯ŒS కనుమూరి బాపిరాజు నివాసంలో సోమవారం ఆయన బస చేశారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు అయిభీమవరం గ్రామం సందర్శించినప్పటి చిత్రాలను బాపిరాజు ఆయనకు చూపించారు. గురుపూజ చేయడం ద్వారా ప్రతి మనిషి సన్మార్గంలో నడుస్తాడని స్వామీజీ అన్నారు. షష్ఠి పండగను అమృత లింగేశ్వరస్వామి ఆలయంలో జరుపుకునే భాగ్యం దక్కిందన్నారు. పురాతన ఆలయాల్ని తక్షణం పునర్నిర్మించాలని సూచించారు. ఆలయాలు వైభవంగా ఉంటేనే గ్రామం సుభీక్షంగా ఉంటుందని చెప్పారు. -
శ్రీవారి సేవలో కంచిపీఠాధిపతి
తిరుమల:కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. పీఠాధిపతి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. -
కథ కంచికి!
హ్యూమర్ ఫ్లస్ కంచిలో చీరలమ్మే ఒక కుర్రాడికి ఎలాగో కథలతో దోస్తీ కుదిరింది. ఊరూరూ తిరిగి ఒక సత్రంలో విశ్రాంతి తీసుకుంటున్న కథలతో మాటామాటా కలిపి అన్నింటినీ కట్టగట్టి మూటలో వేసి కృష్ణానగర్ చేరుకున్నాడు. అక్కడ అడ్డాలో కొంతమంది రైటర్లు ఫైటర్లుగా మారి పెన్నులతో పొడుచుకుంటున్నారు. ‘ఎందుకు కొట్టుకుంటున్నారు’ అక్కడున్న ఒకాయన్ని భయంగా అడిగాడు కుర్రాడు. ‘కత్తి కంటే కలం గొప్పదని నిరూపించటానికి. ఇంతకూ నువ్వెవరు?’ అని అడిగాడు. నేనో రచయితని’ ‘అయితే పారిపో. లేదంటే పెన్నుపోటే. వెన్నుపోటు కంటే అది ప్రమాదకరం’ అని సలహా చెబితే కుర్రాడు కథల మూటతో పారిపోయి చీరలమ్మే అలవాటు కొద్దీ ఫిల్మ్‌నగర్ వీధుల్లో ‘కంచి కథలు’ అని అరుస్తూ తిరగసాగాడు. ఒక పెద్దమనిషి పిలిచి ‘ఏం కథలు బాబూ’ అని అడిగాడు. ‘సినిమా కథలండి’ ‘సినిమాకి కథెందుకు నాయనా’ ‘కథ లేకుండా సినిమా ఎలా తీస్తారు సార్’ ‘పిండి లేకుండా రొట్టె, చెట్టు లేకుండా కట్టెను సృష్టించడమే సినిమా. ఎలాగూ మూట దించావు కాబట్టి కథ చెప్పు’ ‘ఓపెనింగ్ సీన్లోనే హీరో వయొలిన్ వాయిస్తుంటాడు’ ‘విలన్లని వాయించాలిగానీ వీణా, వయెలిన్, తబలా వాయిస్తే ఎవరు చూస్తారు నాయనా. వయొలిన్ వయెలెన్స్గా మార్చు’ ‘కథ చెడిపోతుందండి’ ‘కథుంటే సినిమా చెడిపోతుంది. సరే ఓపెనింగ్ నేను చెబుతా విను. విశాలమైన మైదానంలో సీన్ ఓపెన్. అరుపులు, కేకలు. రెండొందల మంది రౌడీలు కత్తులు కర్రలతో పరిగెత్తుతూ ఉంటారు. వాళ్ల వెనక హీరో. అంటే హీరోని చూసి భయంతో పారిపోతున్నారన్నమాట’’ ‘కత్తులు ఉండి కూడా రెండొందల మంది ఎందుకు పారిపోతారు సార్’ ‘ఎందుకంటే హీరో చేతిలో ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది కాబట్టి’ ‘పోల్‌లో పవర్ ఉండదా?’ ‘ఆ టైమ్‌లో పవర్ కట్’ ‘పోల్ మోయడం కష్టం కదా’ ‘పోలే మోయలేని వాడు ఇక సినిమానేం మోస్తాడు. హీరో పోల్ గిరగిరా తిప్పగానే రౌడీలు పోల్కి తగులుకుని మెరుపులు, మంటలు’’ ‘పవర్ లేదన్నారు’ ‘కొడితే వచ్చింది’ ‘మరి హీరోకేం కదా?’‘ఆయన షాక్ ప్రూఫ్. దేవుని గుడిలో కర్ర. సినిమా హాల్లో బుర్ర వాడడం మర్యాద కాదు. ఫైటింగ్ టైంలో హీరోయిన్ ఎంట్రీ. చంపు బావా... కనీసం యాభైమందిని చంపు అని ఎంకరేజ్ చేస్తుంది’ ‘అమ్మాయిలు సెన్సిటివ్ కదా, మరీ అంత అన్యాయంగా మాట్లాడుతారా?’ ‘సెన్స్, నాన్సెన్స్, న్యూసెన్స్, ఈ మూడు పదాలకు సినిమాలో అర్థం ఒకటే. ఏ లాంగ్వేజి సినిమాకైనా బాడీ లాంగ్వేజి ఒకటే. రక్తం చూసిన హీరోయిన్ రెచ్చిపోయి బ్లడ్ ఈజ్ వెరీగుడ్ అని పోల్ డాన్స్ పాట కలగంటుంది’ ‘రక్తం చూసి కళ్లు తిరిగి పడిపోతారు కానీ కలలు కంటారా?’ ‘వాళ్ల కల వాళ్లిష్టం. రియల్ లైఫ్‌లో ఎలాగూ కలలు లేవు. సినిమాల్లో కూడా లేకపోతే ఎలా?’ ఆ తరువాత హీరో ఎలక్ట్రిక్ పోల్‌ని గాల్లోకి విసిరి... ‘‘నేనెవరో తెలుసా? కరెంట్‌ని. మంచివాళ్లకు వెలుగునిస్తా, లేనివాళ్లకు షాక్ కొడతా. చూపుకి కనబడను. తాకితే చూపిస్తా సత్తా. దోస్తీకి లైటింగ్‌ని, దుష్మనీకి లైట్నింగ్ని’ అంటాడు. ‘ఇదేం కథ సార్ ఇందులో లైఫే లేదు’ ‘లైఫ్ నైఫ్ లాంటిది. సినిమాల్లో దానిజోలికెళితే పీక తెగిపోతుంది. చీరలకు డిస్కౌంట్ ఇచ్చినంత సులభం కాదు, సినిమా ప్రేక్షకుల పల్స్‌ని కౌంట్ చేయడం’ ‘ఇంతకూ మీరెవరు సార్?’ ‘స్టోరీని నమ్మి కోల్డ్‌స్టోరేజ్‌కి చేరుకున్న వోల్డ్ ప్రొడ్యూసర్ని’ - జి.ఆర్. మహర్షి -
నగ్న దృశ్యం
-
కంచి యూనివర్సిటీ తీరిదీ!
-
కంచి కామాంధులు
-
కత్తులూ కఠార్లూ నూరుతున్న మిఠాయి!
ఏప్రిల్ 25న దేశం ఒక కొత్త అమ్మాయిని చూడబోతోంది. 21 ఏళ్ల ఆ అందమైన బెంగాలీ అమ్మాయి ‘మిష్తీ’ని వెండితెరపై ‘కాంచీ’గా చూపించబోతున్నది సుప్రసిద్ధ దర్శకుడు సుభాష్ ఘాయ్. అయితే కాంచీని ఆయన అందంగా మాత్రమే చూపించబోవడం లేదు! పరిస్థితులతో పోరాడి గెలిచిన ఒక యువతిగా తీర్చిదిద్దుతున్నారు. షూటింగ్ ఫిబ్రవరి 18న మొదలైంది. ఉత్తరాఖండ్‌లో ఓ కుటుంబం. ఆ కుటుంబంలోని అమ్మాయి కాంచీ. మాజీ సైనికోద్యోగి అయిన ఆమె తండ్రిని దుండగులు కాల్చి చంపుతారు. దాంతో కాంచీ జీవితం తలకిందులవుతుంది. ఒక దశలో ఆమె ధైర్యం సన్నగిల్లుతుంది. తిరిగి ఆత్మవిశ్వాసంతో నిలబడుతుంది. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తుంది. ఇదీ కథ. దాదాపు 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ‘కాంచీ’ చిత్రంలో కథానాయిక పాత్ర కోసం ఘాయ్ ఏడాది పాటు దేశమంతా గాలించారు. 350 మందికి పైగా అమ్మాయిల్ని ఇంటర్వ్యూ చేశారు. చివరికి కోల్‌కతా అమ్మాయి మిష్తీని ఎంపిక చేసుకున్నారు. ఇది ఘాయ్ అదృష్టమా? మిష్తీ అదృష్టమా అనేది చెప్పడం కష్టం. ఒకటి మాత్రం వాస్తవం. కొత్త ముఖాలను కోరుకుంటున్న ప్రేక్షకులకు మిష్తీ విపరీతంగా నచ్చుతుంది అని ఘాయ్ అంటున్నారు. మిష్తీ ప్రస్తుతం సినిమా కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. నిజానికి దీనిని కఠోర శిక్షణ అని అనాలి. ‘‘స్త్రీలోని అంతశ్శక్తికి ప్రతీకగా కాంచీ పాత్రను మలిచేందుకే ఈ కాఠిన్యం’’ అని ఘాయ్ అంటారు. ‘ప్యార్ కా పంచ్‌నామా’ చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన కార్తీక్ తివారీ ‘కాంచీ’లో మిష్తీ పక్కన నటిస్తున్నారు. మిష్తీ అసలు పేరు ఇంద్రాణీ చక్రవర్తి. మిష్తీ అన్నది ఆమె ముద్దుపేరు. బెంగాలీలో మిష్తీ అంటే ‘మిఠాయి’ అని అర్థమట. ఈ మిఠాయి చేత సుభాష్ ఘాయ్ కత్తులూ కటార్లూ నూరిస్తున్నారన్నమాట!