రామ మందిరానికి రూ.6 కోట్ల విరాళం  | Kanchi Matham Donates Rs 6 Cr For Ayodhya Ram Mandir Temple | Sakshi
Sakshi News home page

రామ మందిరానికి రూ.6 కోట్ల విరాళం 

Published Wed, Feb 3 2021 5:21 PM | Last Updated on Wed, Feb 3 2021 8:55 PM

Kanchi Matham Donates Rs 6 Cr For Ayodhya Ram Mandir Temple - Sakshi

సాక్షి, చెన్నై: అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి కంచి మఠం ద్వారా రూ.6 కోట్లు విరాళంగా లభించింది. ఈ మొత్తాన్ని తమిళనాడు గవర్నర్‌ బన్వర్‌లాల్‌ పురోహిత్‌ చేతుల మీదుగా కంచి మఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి అందజేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం కంచి మఠంలో ప్రత్యేకంగా హుండీలను ఏర్పాటు చేశారు. తద్వారా భక్తులు పెద్ద సంఖ్యలో విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు రూ.6 కోట్లు విరాళాల రూపంలో వచ్చింది.(చదవండి: రూ. కోటి విరాళం ఇచ్చిన గంభీర్‌)

ఈ మొత్తాన్ని సోమ వారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు గవర్నర్‌ చేతుల మీదుగా శంకర విజయేంద్ర సరస్వతిస్వామి అందజేశారు. గవర్నర్‌ ప్రసంగిస్తూ, కంచి, అయోధ్యల మధ్య ఆధ్యాత్మికపరంగా సంబంధాలు ఉన్నట్టు పురాణాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. కంచి మఠం ఏ పనిచేసినా వంద శాతం విజయవంతం అవుతుందని, అయోధ్యలో రామాలయం వంద శాతం పూర్తి కావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement