
అయోధ్యలోని నూతన రామాలయంలో తొలిసారిగా కృష్ణాష్టమి వేడుకలు జరగనున్నాయి. ఇందుకు ఘనంగా సన్నాహాలు జరుగుతున్నాయి. రామనగరిలోని మఠాలు, ఆలయాల్లో ఉత్సవశోభ నెలకొంది. నూతన రామాలయంలో బాలరాముని ప్రతిష్ఠ తరువాత జరుగుతున్న తొలి జన్మాష్టమి వేడుకలు ఇవి.
జన్మాష్టమి నాడు రామ్‌లల్లాకు 50 కిలోల పంచామృతంతో అభిషేకం చేయనున్నారు. సాయంత్ర వేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రామనగరి అయోధ్యలో కృష్ణభక్తి కూడా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో పురాతన కృష్ణ దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలన్నింటిలో కూడా జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు.
అయోధ్యలో రెండు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. బాలరాముని ఆస్థానంలో ఆగస్టు 26న జన్మాష్టమి వేడుకలు జరుపుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలోని గోకుల్ భవన్, బ్రిజ్మోహన్ కుంజ్, రాధా బ్రిజ్‌రాజ్ ఆలయం, రాజ్ సదన్ వద్ద ఉన్న రాధా మాధవ్ ఆలయం, గురుధామ్, ఇస్కాన్ ఆలయాల్లో జన్మాష్టమి వేడుకలకు సన్నాహాలు పూర్తయ్యాయి.