నాడు కసబ్‌ కోసం పెట్టిన ఖర్చు ఇదే.. ఇప్పుడు రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాలో? | Behind the Budget, How Much to Make Tahawwur Rana | Sakshi
Sakshi News home page

నాడు కసబ్‌ కోసం పెట్టిన ఖర్చు ఇదే, ఇప్పుడు తహవూర్‌ రాణా కోసం ఇంకెంత ఖర్చు చేయాలో?

Published Fri, Apr 11 2025 1:47 PM | Last Updated on Fri, Apr 11 2025 3:31 PM

Behind the Budget, How Much to Make Tahawwur Rana

ముంబై: దేశ చరిత్రలో అతి కిరాతక ఘటనగా నిలిచిపోయిన ముంబై ఉగ్రదాడి జరిగి 16 సంవత్సరాలు గడిచాయి. నాడు మారణ హోమానికి తెగబడిన ఉగ్రవాదులను తెరవెనక నుంచి నడిపించిన కుట్రదారుల్లో ఒకడైన తహవూర్‌ హుస్సేన్‌  రాణాను 18 రోజుల ఎన్‌ఐఏ కస్టడీకి ఢిల్లీలోని పటియాలా హౌస్‌ కోర్టుకు అనుమతి ఇచ్చింది.

ఈ తరుణంలో నాటి 2008, నవంబర్ 26న పాకిస్తాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ తోటి ఉగ్రవాదులతో కలిసి మారణ హోమం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముంబై ఉగ్రవాద దాడిలో ప్రాణాలతో బయటపడిన ఏకైక నిందితుడు అజ్మల్ కసబ్ ఉరితీయడానికి సుదీర్ఘ సమయం పట్టగా..  జైల్లో వీఐపీ ట్రీట్మెంట్‌ అందించారనే ఆరోపణలు ఉన్నాయి. అజ్మల్‌ కసబ్‌ తరహాలో కాకుండా తహవూర్‌ హుస్సేన్‌  రాణాకు వీఐపీ ట్రీట్మెంట్‌ ఇవ్వొద్దని ముంబై ఉగ్రదాడి బాధితులతో పాటు యావత్‌ భారతీయులు డిమాండ్‌ చేస్తున్నారు.  

ఈ సందర్భంగా నాడు పట్టుబడ్డ సమయం నుంచి ఉరిశిక్ష వేసే వరకు  అజ్మల్‌ కసబ్‌పై పెట్టిన ఖర్చు ఎంత అనే వివరాల్ని  సమాచార హక్కు చట్టం ద్వారా  అథక్ సేవా సంఘ్ ఛైర్మన్ అనిల్ గాల్గాలీ సేకరించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 

వాటి ఆధారంగా.. ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు అజ్మల్ కసబ్‌పై మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కలిపి రూ. 28.46 కోట్లు ఖర్చు చేశాయి. ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైలులో, పుణెలోని యరవాడ జైలులో కసబ్‌పై కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ఖర్చు పెట్టాయి.  వీటితో పాటు కసబ్‌కు ఉరిశిక్ష విధించే రోజు భోజనం కోసం రూ. 33.75, దుస్తుల కోసం రూ. 169 ఖర్చు కాగా,అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ. 9,573 ఖర్చు పెట్టినట్లు ఆర్టీఐ తేలింది.  

కసబ్‌పై పెట్టిన మొత్తం ఖర్చు వివరాలను మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.  

ఆహారం: రూ. 43,417.67

భద్రత: రూ. 1,50,57,774.90

మెడిసిన్‌: రూ. 32,097

దుస్తులు: రూ. 2,047

సెక్యూరిటీ: రూ. 5,25,16,542

అంత్యక్రియలు: రూ. 9,573

మొత్తం ఖర్చు: రూ. 6,76,49,676.82

ప్రస్తుతం, ఎన్‌ఐఏ రిమాండ్‌లో ఉన్న తహవూర్‌ రాణాకు సైతం విచారణ సుదీర్ఘ కాలం జరిగితే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాటి కసబ్‌ పెట్టిన ఖర్చుతో పోలిస్తే తహవూర్‌ రాణాకు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది.

కసబ్‌కు ఉరిశిక్ష పడిన తేదీ, సమయం
ఉరిశిక్ష తేదీ, సమయం: కసబ్‌ను నవంబర్ 21, 2012న ఉదయం 7:30 గంటలకు ఉరితీశారు.
ఎక్కడ ఉరితీశారు: మహారాష్ట్రలోని పూణేలోని ఎరవాడ సెంట్రల్ జైలులో ఉరితీశారు. 
మెర్సీ పిటిషన్: ఉరిశిక్షకు రెండు వారాల ముందు, నవంబర్ 5, 2012న కసబ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement